పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 02, 2015

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణాభివృద్ధి పథకాలు


            1985కు ముందు అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖలో గ్రామీణాభివృద్ధి అంతర్భాగంగా ఉండేది. 1985 అక్టోబరులో గ్రామీణాభివృద్ధి విభాగాన్ని సచివాలయం నుంచి నూతనంగా ఏర్పరచిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనరేట్‌కు బదిలీ చేశారు. 1994లో ఈ శాఖకు ప్రత్యేక కమిషనర్‌ను నియమించారు. గ్రామీణాభివృద్ధి శాఖలో ప్రధానంగా రెండు విభాగాలు ఉన్నాయి. 
అవి                   1) డి.పి.ఎ.పి., వేజ్ ఎంప్లాయిమెంట్
                        2) స్వయం సహాయక బృందాల విభాగం

డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రాం (డీపీఏపీ/ డీడీపీ)
¤ 1998 - 99 వరకు ఈ కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 : 50 నిధులతో నిర్వహించాయి.                         

¤ 1999 - 2000 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75 : 25 నిష్పత్తిలో నిధులను సమకూరుస్తున్నాయి.

¤ కరవు పీడిత ప్రాంతాలను అభివృద్ధి చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. దీని కోసం సమగ్ర మైక్రో వాటర్‌షెడ్ ప్రాతిపదికన భూసార సంరక్షణ, తేమను కాపాడటం, నీటి సంరక్షణ కట్టడాలు, అటవీ విస్తీర్ణాన్ని పెంచడం, పండ్ల తోటల పెంపకం లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు.

¤ డీపీఏపీ/ డీడీపీ కింద 12 జిల్లాల్లోని 110 బ్లాకుల్లో 26.48 లక్షల ఎకరాల పరిధిలో 5,296 వాటర్‌షెడ్లను చేపట్టారు.

ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ల్యాండ్ డెవలప్‌మెంట్ (IWDP)
¤ ఈ కార్యక్రమాన్ని 1992 నుంచి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో చేపడుతున్నారు.
                     

¤ 2003-04లో వాటర్‌షెడ్లలో అమలు చేయడానికి 'హరియాలి' పేరుతో భారత ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను రూపొందించింది.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (2005) కింద ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఉపాధి హామీ పథకం

¤ ఈ పథకం కింద ప్రతి కుటుంబంలో మాన్యువల్ వర్క్ చేయడానికి ఇష్టపడిన వారికి 100 రోజుల వేతన ఉపాధి కల్పిస్తారు.

¤ ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఈ పథకాన్ని 22 జిల్లాల్లో అమలు చేస్తున్నారు.
ఇందిరా క్రాంతి పథం

¤ పేదలందరినీ దారిద్య్రరేఖకు ఎగువన తీసుకొచ్చేందుకు ఈ పథకం కింద కొంతమందిని స్వయం సహాయక బృందాలుగా ఏర్పాటు చేస్తారు. దీనివల్ల సామాజిక మానవ మూల నిధి ఏర్పడుతుంది.

¤ ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 2008 నాటికి సుమారు 7 లక్షలకు పైగా బృందాలు ఏర్పడ్డాయి.

స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన
¤ బ్యాంకు రుణం, ప్రభుత్వ సబ్సిడీ లాంటి పథకాల ద్వారా పేద కుటుంబాలను దారిద్య్రరేఖ ఎగువకు తీసుకొచ్చి, అభివృద్ధి చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.
మహిళా స్వయం సహాయక బృందాలు

¤ గ్రామీణ పేద మహిళలకు పొదుపు అలవాటు చేయడానికి దీన్ని రూపొందించారు.

¤ రాష్ట్రంలో 9.75 లక్షల బృందాల్లో 109.79 లక్షలమంది పేద మహిళలు సభ్యులుగా ఉన్నారు.

పావలా వడ్డీ
¤ స్వయం సహాయక బృందాలకు ఇచ్చే రుణాలపై సబ్సిడీ ఇచ్చే ఉద్దేశంతో 2005లో దీన్ని ప్రారంభించారు.

                      
                   

¤ 2010-11 సంవత్సరానికి 5,67,332 బృందాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా రూ.193.74 కోట్లు విడుదల చేశారు.

¤ 2004 జులై 1 తర్వాత తీసుకున్న రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.

ఇందిరమ్మ పథకం
¤ రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో విద్య, వైద్యం, రోడ్లు, డ్రైనేజీ, మంచి నీరు, విద్యుత్ సదుపాయాలు, అర్హులకు పింఛన్లు, ఇళ్లు లాంటి సౌకర్యాలను సమకూర్చడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఇందిర ప్రభ
¤ భూమిలేని పేదలకు భూపంపిణీ చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

¤ దశాబ్దాలుగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న ఎస్టీలు ఆ భూమిపై యాజమాన్య హక్కులను డబ్బు చెల్లించకుండా పొందవచ్చు.

అంబేద్కర్ జీవన్ ధార
¤ రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ పథకం కింద అన్ని షెడ్యూల్డ్ కులాల జనావాసాలకు మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తారు.

రాజీవ్ పల్లెబాట
¤ ఈ పథకాన్ని 2004 జూన్ 13న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రారంభించారు.

¤ గ్రామాల్లోని సమస్యలను ప్రజలు తమ ప్రజాప్రతినిధులకు తెలపడానికి ఉద్దేశించిన కార్యక్రమం.

¤ నాయకులు, ప్రజలు చర్చించుకునే అవకాశం కల్పించేందుకు దీన్ని ప్రారంభించారు.

¤ ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి 54,541 వినతులు అందాయి.

సంపూర్ణ పారిశుద్ధ్య ఉద్యమం
¤ ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి దశలవారీగా సంపూర్ణ పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పిస్తారు.

ఇందిర జలప్రభ
¤ 2011 అక్టోబరు 2న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం జంగాలపల్లి గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభించారు.

                                            

¤ రూ.1800 కోట్ల రూపాయల వ్యయంతో ఎస్సీ, ఎస్టీలకు చెందిన 10 లక్షల ఎకరాలను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం.

¤ ఈ పథకాన్ని హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోని 895 మండలాలు, 16,472 గ్రామ పంచాయతీల్లో అమలు చేస్తున్నారు.

¤ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 6 లక్షల కుటుంబాలను లబ్ధిదారులుగా గుర్తించారు.

రాజీవ్ ఇంటర్నెట్ విలేజ్
¤ ప్రతి గ్రామంలో ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం కోసం ఈ పథకాన్ని రూపొందించారు.

¤ 2004 ఆగస్టు 4న గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలం, చిలువూరు గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభించారు.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again