పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 09, 2015

వాస్తు ప్రకారం పడకగదిలో చేయవలసినవి, చేయకూడనివి మీకు తెలుసా ? సంపదను పెంచే వాస్తు నియమాలు తెలుసుకోండి - వాస్తు శాస్త్రం


వాస్తు దోషాలు ఏ కారణాలవల్ల ఏర్పడతాయి? 

మనలో చాలామంది ఇల్లు కట్టుకున్న తర్వాతో, ఫ్లాట్ కొనుక్కున్న తర్వాతో వాస్తు దోషాలున్నాయేమోనని వాస్తు శాస్త్రజ్ఞుల్ని సంప్రదిస్తాము.  అది సరికాదు.  అసలు వాస్తు దోషాలు ఏర్పడటానికి ముఖ్యంగా మూడు కారణాలు చెప్తారు.

                            

మొదటిది భూమి కొనే ముందే అన్ని కోణాలలో భూమి పరీక్ష చేయించాలి. ఎందుకంటే లూజ్ సాయిల్  అయితే ఇల్లు కట్టుకోవటానికి అనువైందికాదు. కట్టడం బలంగా వుండదు.  అలాగే నేల అడుగున దేవాలయాలు, జల నాడులు, శల్యాలు, దుష్ట శక్తుల ఆవాహన వున్న ప్రదేశాలలో కూడ ఇల్లు కడితే సుఖంగా వుండలేరు.  అలాగే చుట్టుపక్కల ఎలా వుంది, ఇరుగూ, పొరుగూ కూడా చూసుకోవాలి.

                            


రెండవది యజమాని నామ నక్షత్రాన్ని బట్టి ఇంటికి సింహ ద్వారాలు ఎక్కడ వుండాలి, ఎన్ని గుమ్మాలు వుండాలి, ఎక్కడెక్కడ వుండాలి, కిటికీలు ఎక్కడ వుండాలి వగైరాలన్నీ ముందే వాస్తు శాస్త్రజ్ఞులను సంప్రదించి నిర్ణయించుకోవాలి.  ఆ నమ్మకం లేనివారు  శాస్త్రజ్ఞులను సంప్రదించాలి.

ఇంటికి గుమ్మాలు, కిటికీలు ఎన్ని వుండాలి?
 వాస్తు శాస్త్రం ప్రకారం గుమ్మాలు, కిటికీలు సరి సంఖ్యలో వుండాలి.   చివర సున్నా వుండే సంఖ్య 10, 20 అలా వుండకూడదని  చాలా మంది అపోహ పడతారు.  వాస్తు శాస్త్రం  ప్రకారం సరి సంఖ్యలో వుండాలంటారు తప్ప ఈ చివర సున్నా వుండే సంఖ్య వుండకూడదని ఎక్కడా లేదు.

                  

              

 సింహ ద్వారం ఎక్కడ పెట్టాలి అనే సందేహం  కొందరికి వస్తుంది.  మనం ఇల్లు  కట్టుకునే ప్రదేశాన్ని 9 సమ భాగాలు చేసి అందులో 4, 5, 6 భాగాలలో సింహ  ద్వారం పెట్టవచ్చు.   ఒకటే సింహద్వారం అయితే 5వ భాగంలో పెట్టాలి.  అందులో కూడా ఆ భాగమెంతవుంటే అంతా కాకుండా, కొంతమేర, అంగుళం  రెండంగుళాలయినా తగ్గించి పెట్టాలి.  రెండు సింహ ద్వారాలు పెట్టవలసి వస్తే 4,  6 భాగాలలో పెట్టాలి. 
                    

 సింహ ద్వారం  ఎదురుగా మరో గుమ్మం లోపల వుండాలి    సింహ ద్వారం వీధికి ఎదురుగా వుండకూడదు.  వీధిశూల అంటారు.  సింహ ద్వారానికి రెండు వైపులా కిటికీలుండాలి.  ముఖంలో కళ్ళలాగా.  లేకపోతే అంధశూల అంటారు. కిటికీలు సరిగ్గాలేకపోతే ఇంట్లోకి వెలుతురు బాగా రావాలి కదండీ.

వెంకన్న ఆలయం వాస్తుకు అతీతమా?

     
 వెంకన్న ఆలయం వాస్తుకు అతీతమా?   
 స్వయం వ్యక్త క్షేత్రమైన తిరుమలకు వాస్తు వర్తించదా? భారతీయ వాస్తు శాస్త్రం ప్రకారమే తిరుమలేశుని ఆలయం నిర్మాణం సాగిందా? పరస్పర విరుద్ధమెన ఈ రెండు ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వయంవ్యక్త శిలామూర్తిగా తిరుమల క్షేత్రంలో వెలిశారు. తిరుమల ఆలయానికి ఎనభై యోజనాల వరకు వాస్తును పరిగణనలోకి తీసుకోకూడదని వైఖానస ఆగమ పండితులు చెబుతున్నారు. అయితే, తిరుమలేశుని ఆలయ నిర్మాణం  పూర్తిగా వాస్తు నిబంధనలకు లోబడే సాగిందని వాస్తు నిపుణులు చెబుతుండటం గమనార్హం.   

  క్రీ.శ.1వ శతాబ్దంలో తమిళభాషలో రాసిన ‘తులక్కాపియం’లో తమిళదేశానికి ఎల్లలుగా నిర్ణయిస్తూ దక్షిణాన కన్యాకుమారి, ఉత్తర దిశలో వేంకటాచల పర్వతాలు, అందులోని ‘తెన్‌కుమారి వడ వేంగడం’ అని శేషాచల పర్వతాల్లోని జలపాతాలు, జంతుజాలాలతో కూడిన దట్టమైన అడవిని వర్ణించి, ఇక్కడే పొడవైన మహావిష్ణువు స్వయంవ్యక్తంగా కొలువై వున్నాడని పేర్కొంది. అప్పట్లో ధృవబేరంగా పిలిచే మూలమూర్తిని నాలుగు వైపులా దర్శించేలా పైకప్పుతో మాత్రమే నిర్మించబడిందని ఆ గ్రంథం పేర్కొంది.

   ఆలయంలో మొదటగా నిర్మించింది ఆనంద నిలయ ప్రాకారమే. తర్వాత గర్భాలయం, అంతరాళం వరకు నిర్మించారు. ఇప్పుడున్న వైకుంఠ ద్వారం అప్పట్లో మహాప్రదక్షిణగా నిర్మించబడింది. 12.9 అడుగుల లోపలి కొలతతో చతురస్రాకారంలో గర్భాలయం, 13.5 అడుగుల కొలతతో శయన మండపం, 12కి 10 అడుగుల కొలతతో రాములవారిమేడ, 27 అడుగుల చతురస్రాకారంలో స్నపన మండపం, ఆరడుగుల వెడల్పుతో  బంగారు వాకిలి నిర్మించారు.

మొదట్లో గరుడాళ్వార్ సన్నిధి వెనుక వైపునే ధ్వజస్తంభం, బలిపీఠం ఉండేవి.  
1150 తర్వాత ఆనంద నిలయాన్ని ఆధునీకరించారు. ఆనంద నిలయం బరువును తట్టుకునేందుకు వీలుగా గర్భాలయ రాతిగోడలను వెడల్పు చేశారు. తర్వాత ప్రత్యేకంగా వైకుంఠ ద్వారం ఏర్పాటు చేశారు. పక్కనే ఉత్తరదిశలో వైఖానస ఆగమోక్తంగా విష్వక్సేనుడిని ప్రతిష్టించారు.తర్వాత ఆగ్నేయంలో వర దరాజస్వామి, ఉత్తరదశలో పశ్చిమ ముఖంలో నృసింహస్వామిని ప్రతిష్టించారు. ఉత్తరాన స్వామి ఆభరాణాలు, పట్టువస్త్రాలు భద్ర పరిచే సబేరా అర ఏర్పాటు చేశారు.

   12శతాబ్దంలో నిర్మించిన లోపలి ప్రాకారాన్ని సంపంగి ప్రాకారం లేదా సంపంగి ప్రదక్షిణం అంటారు. ఇది తూర్పు, పడమరకు 250 అడుగులు, ఉత్తర- దక్షిణం వరకు 160 అడుగులతో నిర్మించారు.

  క్రీ.శ.13వ శతాబ్దంలో వెలుపల మహా ప్రాకారం నిర్మించారు. తూర్పు, పడమరగా 414 అడుగుల పొడవు, ఉత్తర, దక్షిణాలుగా 263 అడుగుల వెడల్పుతో నాలుగు అడుగుల మందం, 30 అడుగుల ఎత్తులో ఇది కట్టారు. ఆలయ అవసరాల కోసం ఆయా కాలాల్లో రంగనాయక మండపం, అద్దాల మండపం, తిరుమల రాయ మండపం, సంపంగి ప్రాకారంలో నాలుగు వైపులా నాలుగు రాతి స్తంభాలతో మండపాలు, దక్షిణ దిశలో యాగశాల, కల్యాణ మండపం.. మరెన్నో నిర్మాణమైనాయి.

 వెంకన్న ఆలయం వాస్తుకు అతీతం..
  తిరుమల శేషాచల కొండలపై కొలువైన ఆలయం సముద్ర మట్టానికి 2800 అడుగుల మొదలు  3600 అడుగుల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఆలయ విస్తీర్ణం 2.20 ఎకరాలు. మూడు ప్రాకార ప్రదక్షిణలు, రెండు గోపురాలతో నిర్మించారు. ప్రాకారాలు దీర్ఘ చతురస్రాకారంలోనే  ఉన్నాయి.

                              


  ఆలయానికి ఒక్క ఈశాన్యం మినహా మిగిలిన మూడు వైపులా శేషాచల పర్వత శ్రేణులు విస్తరించి ఉన్నాయి. ఈశాన్యం దిశలో మైదాన ప్రాంతంతోపాటు పల్లపు ప్రాంతం ఉంది.

  ఆగ్నేయంలో పోటు/ వంటశాల ఉంది. దీనికి ముడి సరుకులు నిల్వ చేసే స్టోర్ నైరుతి నుంచి వాయవ్యం వరకు విస్తరించింది ఉంది. ఆలయానికి పడమర దిశలో బరువు ఉంది. దీనికి తోడు నైరుతి దిశలో బరువైన, ఎత్తై నారాయణగిరి పర్వత శ్రేణులు విస్తరించటం ఆలయ వాస్త్తుకు మరింత బలాన్ని చేకూర్చిందని పండితుల వాదన.

 ప్రకృతిసిద్ధ్దంగా ఉద్భవించిన పుష్కరిణి
  తిరుమలలో ప్రకృతిసిద్ధంగా స్వామి పుష్కరిణి ఈశాన్యంలోనే ఉద్భవించింది. వాస్తురీత్యా ఈశాన్య దిశలో నీటి ప్రవాహం ఉండటం వల్ల ఆ ప్రాంతం, ఆ దేవాలయం పేరు ప్రతిష్టల్ని గడిస్తాయని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం తిరుమల స్వామి పుణ్యతీర్థంలోకి  ముక్కోటి తీర్థాలు కలుస్తాయి. దేవతలు కూడా ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రసిద్ధి. పూర్వం కుమారస్వామి కూడా పుష్కరిణి గట్టుపై తపస్సుచేసినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఈ పుణ్యతీర్థం స్వామి పుష్కరిణిగా ప్రసిద్ధి పొందింది.


  
 ఆలయానికి సుదూర ఈశాన్యంలో మైదాన ప్రాంతంలో గోగర్భం తీర్థం ఉంది. ద్వాపర యుగంలో పాండవులు ఆది వరాహస్వామిని దర్శించడానికి ఇక్కడ యజ్ఞయాగాదులు చేశారట!  నేటికీ రాతి బండలపై చెక్కిన పాండవుల రూపాలు కనిపిస్తాయి.  పూర్వం నుంచే  ఇక్కడ నిరంతరం నీరు నిల్వ ఉంటూ కింద తూర్పు భాగానికి ప్రవహిస్తోంది. అక్కడ టీటీడీ 1963లో ప్రత్యేకంగా గోగర్భం జలాశయం పేరుతో భారీ డ్యాము నిర్మించారు.  అందుకే తిరుపతి లడ్డుకు అంత పవిత్రత, అంత రుచి

                        


 ఇళ్లల్లోనే కాదు, ఆలయాల్లో కూడా ఆగ్నేయంలోనే వంటశాల/ పోటు ఉండేలా పండితులు జాగ్రత్త పడుతుంటారు. తిరుమల ఆలయంలో స్వామికి ఆగ్నేయ దిశలో పోటు ఉంది. శ్రీనివాసుని తల్లి వకుళమాత కొలువైన ఈ పోటులోనే పూర్వం నుంచీ స్వామి నైవేద్యానికి అన్ని రకాల ప్రసాదాల్ని తయారు చేస్తున్నారు.

  వాస్తు రీత్యా ఇంటి నిర్మాణంలో చుట్టు నాలుగువైపులా ఖాళీస్థలం వదులుతారు. ఆలయాల నిర్మాణంలోనూ మాడ వీధుల కోసం ఖాళీ స్థలం వదులుతారు. నాలుగు మాడ వీధుల్లో ఆధ్యాత్మిక, భక్తి, ధార్మిక, ఉత్సవ ఊరేగింపులు నిరంతరం సాగినపుడే  ఆలయం దినదినాభివృద్ధి చెందుతుంది.  


                      

 గతంలో ఇరుకైన నాలుగు మాడ వీధుల్లోని ప్రైవేట్ ఇళ్లు, దుకాణాలను తొలగించి ఉత్సవాల నిర్వహణ కోసం నాలుగు మాడ వీధులను మాస్టర్‌ప్లాన్ పేరుతో టీటీడీ విస్తరించింది. ప్రస్తుతం సుమారు 2.20 లక్షల మంది నాలుగు మాడ వీధుల్లో హాయిగా కూర్చుని ఉత్సవాలను తిలకించే అవకాశం కలిగింది

.
 విమానార్చన కల్పమే ప్రామాణికం
     స్వయం వ్యక్త స్వరూప శిలామూర్తి అయిన శ్రీవేంకటేశ్వరస్వామి కాల దేశ వర్తమానాలకు అతీతుడు. ఆ స్వామికి వాస్తు వర్తించదు. సకల దేవతలు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, పంచభూతాలు, దేవతా గణాలు.. అన్నీ స్వామికి లోబడినవిగా ఉంటాయి. విష్ణువు దేవతా సార్వభౌముడుగా వర్ణించబడతారు.


      స్వామి ప్రపత్తి, వైభవం అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. వైకుంఠంలో ఉండే వైభవంతోనే కలియుగవైకుంఠం తిరుమలక్షేత్రంలోనూ వెలుగొందుతానని స్వామివారే సెలవిచ్చినట్లు వేంకటాచల మహాత్మ్యం ద్వారా తెలుస్తోంది.


  విఖనస మహర్షి ప్రథమ శిష్యుడు మరీచి మహర్షి విరచిత ‘విమానార్చన కల్పం’ ఆధారంగానే తిరుమల ఆలయాన్ని నిర్మించారు. ఆలయ వాస్తు, శిల్పశాస్త్రాల్లో మార్పు చేర్పులకు ఆ గ్రంథమే ప్రామాణికం


      గర్భాలయ ధృవబింబాన్ని ఒక ఆయం లేదా యూనిట్‌గా తీసుకుని, దాని ప్రకారం ప్రాకారాలు, విమానం, మహాద్వార గోపురం, మాడ వీధులు, రాజవీధులు నిర్మిస్తారు. ధ్వజస్తంభం ఎత్తు, బలిపీఠం, రాజగోపురం ఎత్తు, విమానం లక్షణాలు కూడా మూలబింబం ఆధారంగానే  నిర్ణయించబడతాయి.


      ఆలయ వాస్తు, శిల్పశాస్త్రం మహర్షులు ప్రసాదించారు. వైఖానస ఆగమోక్తంగా నిర్మించిందే తిరుమల  ఆలయం. ఆ స్వామికొలువైన ఈ క్షేత్రం ఉత్కృష్ట స్థానానికి చేరింది.


      స్వామి చుట్టూ ఎంతోమంది దేవతాగణాలు అరూపంగా  ఉంటారు. స్వయంవ్యక్త శిలామూర్తి ప్రతిష్టా సమయంలో ఎన్నో ఉపచారాలతో ఆవాహన చేసి ఉంటారు.


     సకల దేవతలు, నవావరణాలు, అష్టదిక్పాలకులు, శక్తి స్వరూపాలు, సప్తద్వారాలుగా ఆలయాన్ని అంటిపెట్టుకుని, భక్తులను కంటికి రెప్పలా కాపాడుతుంటారు.


      {బహ్మోత్సవానికి నాందిగా ధ్వజపటాన్ని ఊరేగించే సమయంలో, ఉత్సవ వర్ల ఊరేగింపులో ఆలయ ప్రధాన అర్చకుడు వైఖానస ఆగమం ప్రకారం అష్టదిక్పాలకులను ఆయా సూక్తాలతో అర్చించి ఉపచారాలు సమర్పించి బలి ఇస్తారు. ఉత్సవ ఊరేగింపుల్లో ఎలాంటి ఆటంకం లేకుండా నిర్ణీత మాడ వీధుల్లోనే ప్రదక్షిణ పరిధులు నిర్ణయిస్తారు.


      ఆలయం లోకకల్యాణం కోసం నిర్మించబడుతుంది. భక్తిలోపం, ద్రవ్యలోపం, సమయం లోపం, అకాలపూజలు... వంటి లోపాలు లేకుండా మరింత శ్రద్ధగా ఆగమ బద్ధంగా పూజాకైంకర్యాలు సాగిస్తే ప్రాంతం, రాష్ట్రం, దేశం ఎదుర్కొనే సమస్యలన్నీ తీరిపోతాయి. వాస్తు దోషం వున్నట్లు అనుభవంలో ఎలా తెలుసుకోవచ్చు?

 ఇల్లు చూస్తే వాస్తు శాస్త్ర ప్రకారం ఏ దోషం కనబడదు.  కానీ ఆ ఇంట్లోకి మారిన దగ్గరనుంచీ  అకారణ చికాకులూ,అనారోగ్యాలూ, లేనిపోని టెన్షన్లూ, యాక్సిడెంట్లూ ఇలా ఏదో ఒకటి జరుగుతూ వుండవచ్చు.  వారి జాతకం ప్రకారం ఏ దోషం లేని సమయంలో కూడా ఇలాంటివి జరుగుతూంటే ఆ ఇంటి వాస్తులో లోపం వున్నదని చెప్పుకోవచ్చు.  

 మన శరీరంలో అయస్కాంత శక్తి వుంటుంది. మనకి సరిపడని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రభావం మన శరీరం మీద పడి తల తిరగటం, తలనొప్పి, చికాకు మొదలయినవి బాధపెడతాయి.

 అలాగే పెంపుడు కుక్క అస్తమానం ఒకే దిశకి తిరిగి అరవటంకూడా ఒక సూచనే. ఇంట్లోకి పాములు, గబ్బిలాలు రావటం, కాకులు ఎక్కువగా వాలటం, ఆ ఇంటి చట్టూ మాత్రమే కాకులు ప్రదక్షణ చేయటం కూడా కనబడని వాస్తు లోపాలకి సూచనలు.

 కొన్ని ఇళ్ళు చూడటానికి కళావిహీనంగా కనబడతాయి.  అలాగే కొన్నిచోట్లకి వెళ్ళగానే అకారణ భయం వేస్తుంది. కొన్ని ఇళ్ళల్లో ఆత్మ హత్యలో, హత్యలో జరిగి వుండవచ్చు  అలాంటి సంఘటనలు జరిగినచోట కొన్ని ఇబ్బందులుపడవలసి రావచ్చు.  అంటే ఆ పిశాచాలు అక్కడ తిష్ట వేసుకు కూర్చున్నాయనికాదు, అవి లేకపోయినా కొన్ని చికాకులు వుంటాయి.  ఆ ఇంట్లో అంతకు ముందు జరిగిన సంఘటనలు మనకు తెలిసే అవకాశం వుండదు.  అయినా మనలో అంతర్లీనంగా వున్న శక్తులు కొన్ని మనకి సూచిస్తాయి.

 అయితే వంశపారంపర్యంగా వచ్చిన ఇళ్ళని ఇలాంటి చికాకులవల్ల వదిలి వెళ్ళలేము.  అందుకని శాస్త్రజ్ఞులకు చూపించి, లోపాలేమిటో తెలుసుకుని తగిన శాంతి చేయిస్తే సరిపోతుంది.  కొత్త ఇల్లు కట్టుకోబోతున్నా, కొనుక్కోబోతున్నా ముందే సరైన పరీక్షలు చేయిస్తే తర్వాత ఏ ఇబ్బందీ పడక్కరలేదు.

 అయితే మన దశ బాగా లేనప్పుడు ఎంత మంచి ఇంట్లోవున్నా మన జాతక దోషాలవల్ల వచ్చే చికాకులు మనమే అనుభవించాలి...వాస్తు శాస్త్రాన్ని నిందించి లాభం లేదు.

 మరికొన్ని వాస్తు విషయాలు

. ఇంటి ముఖ ద్వారానికి ఎదురుగా మరణించిన పెద్దల ఫోటోలు అమర్చరాదు. దేవుళ్ళ ఫోటోలను అమర్చాలి. వీలుంటే వినాయకుని ఫోటో అమర్చాలి.

 ఇంటి గోడలు కట్టేట్టపుడు తాపీ మేస్త్రీలు,పై పనులు చేయటం కోసం సపోర్టు కర్రలు వేసే సమయంలో గోడలకు కన్నాలు వేస్తువుంటారు.వాటిని అవసరం తీరగానే ఆకన్నాలు మూసెయ్యాలి.

 

 వాయువ్యం పెరిగిన,మూతపడిన ఇంకే వాయువ్య దోషాలు ఉన్న వాయువ్యంలో వాయు పుత్రుడైన హనుమంతుని ఉంచి పూజించిన ఆ దోషాల తీవ్రత తగ్గును.

. తూర్పు ఈశాన్యం,ఉత్తర ఈశాన్యం,పడమర వాయువ్యం,దక్షిణ ఆగ్నేయం ఈ నాలుగు వైపులా వీధి పోట్లు మంచిది. తూర్పు ఆగ్నేయం,ఉత్తర వాయువ్యం,పడమర నైరుతి,దక్షిణ నైరుతి వీధి పోట్లు మంచివి కావు దోషపూరితం.

. బీరువాలు నైరుతి యందుంచి, ఉత్తరమునకు తెరుచునట్లు ఉంచాలి.

                                        

 తూర్పు మరియు ఉత్తర ప్రహరి గోడలపై పూల చెట్లను పెంచరాదు.


 మూడు పసుపు కొమ్ములు,పసుపు దారంతో షాపు గుమ్మానికి వ్రేలాడదీయండి. దృష్టి దోషం పోతుంది మరియు వ్యాపారాభివృద్ధి ఉంటుంది.

. పడమట వైపు స్తలం కొనుక్కొన్న భార్యకు అనారోగ్యం,నష్టం కలుగును.

. ఈశాన్యంలో బరువు ఉంచరాదు. పడమర వైపు, దక్షిణం వైపు బరువులు ఉంచవచ్చును.

 దేవాలయాల నీడ, ధ్వజ స్థంభం నీడ పడే స్థలంలో ఇల్లు నిర్మించరాదు. ఉండరాదు.

 పాముల పుట్ట ఉన్న స్థలం కొనరాదు. కొని పుట్ట తొవ్వి తీసుకోవచ్చు అనుకొంటే, ఆ కుటుంభానికి తరతరాలుగా నాగ దోషం పట్టుకొంటుంది. దాని వలన సంతాన నష్టం జరగటం, కుంటి, గుడ్డి, మూగ, చెముడు పిల్లలు జన్మించుట, ఆ పిల్లలు ఆకాలంలో మరణించుటం జరుగుతుంది.

                           


 పాముల పుట్టలను తొలగించి ఆ ప్రదేశంలో ఇల్లు కట్టుకోవచ్చా?

 ఎక్కడో, ఎప్పుడో ఓ స్ధలం కొని కొంతకాలం అలాగే వదిలేసి వుంటారు.  ఇప్పుడు  ఆ స్ధలంలో ఇల్లు కట్టుకోవాలని చూస్తే అక్కడ పాముల పుట్టలు.  ఇప్పుడక్కడ ఆ పుట్టలు తొలగించి ఇల్లు కట్టుకోవచ్చా?  అలా కట్టుకుంటే ఆ పాములు పగబడతాయనీ, సుఖంగా వుండలేరనీ ఎవరో అన్నారు.  ఇప్పుడెలా? 

                   

 శాపాలూ, కోపాలూ పక్కన బెడితే ఇలాంటి పరిస్ధితుల్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు రెండు. 

 మొదటిది భూత దయ.  అన్ని పుట్టల్లోనూ  నాగు పాములుండవు.  కొన్ని పుట్టల్లో అసలు పాములే వుండవు.  కొన్నింటిలో వేరే జాతి పాములుండవచ్చు.  ఏవైనా  వాటిని చెదరగొట్టటంవలన అవి చనిపోవచ్చు, లేకపోతే జనావాసాల మధ్యకి వెళ్ళి వాళ్ళని కాటెయ్యవచ్చు.  మరి ఇంత డబ్బు పెట్టి ఏదో సొంత ఇల్లు కట్టుకుందామనే ఆశతో కొనుక్కున్న స్ధలాన్ని పాములకోసం వదిలేయలేము కదండీ అంటారా?  అదీ నిజమే.  అప్పుడేం చెయ్యాలి

 ఈ విషయంలో శాస్త్రం ఏం చెబుతోంది?  వాస్తు శాస్త్రం, జలార్కళ శాస్త్రం ప్రకారం ఎక్కడైతే నీరు ఎక్కువగా వుంటుందో, ఆ చల్లదనానికి అక్కడ చీమలు చేరి పుట్టలు పెడతాయి, ఆ పుట్టల్లోకి పాములుకూడా వస్తాయి.  అంటే పాములున్నచోట జలవనరులు అధికంగా వున్నాయన్నమాట.  తడి ఎక్కువగా వున్నచోట నేల గట్టిగా వుండదు.  ఆలాంటి నేలలో ఇల్లు కడితే బలంగా వుండదు.. భూమిలో జలనాడులు 8 రకాలుంటాయి.  వాటిలో కొన్ని పెద్ద ప్రవాహాలుంటాయి.

 కొన్ని చోట్ల 300 మీటర్లు అలా భూమి లోపల పెద్ద జల వనరులుంటాయి.  అలాంటివాటిమీద ఇల్లు కడితే ఏ చిన్న భూకంపం వచ్చినా ఆ ఇల్లు కూలిపోయే వ్రమాదముంది.  అందుకే అలాంటి ప్రదేశాలని ముందే శాస్త్రజ్ఞులకు చూపించి నేల గట్టితనాన్ని పరీక్షించి,  నేల ఇల్లు కట్టటానికి అనువుగా లేకపోతే కారణాలు తెలుసుకుని,  స్ధలాన్ని ఇంటి నిర్మాణానికి అనువుగా మలచుకుని తర్వాత ఇల్లు కట్టుకుంటే కలకాలం ఆ ఇంట్లో సుఖంగా వుండచ్చు.


 అనారోగ్యాలని ఆహ్వానించే ఇంటి వాస్తు
మనిషిని శాసించేవి, సృష్టికి మూలమైనటు వంటివి, పంచ భూతాలైన భూమి, నీరు, ఆకాశము, అగ్ని, గాలి. వీటిని సక్రమంగా ఉపయోగించటం ద్వారానే మానవుడు తన ఆరోగ్యకరమైన జీవితానికి బంగారు బాటలు వేసుకుంటున్నాడు. అలానే మనం ఒక స్ధలం కొన్నా, ఒక ఇల్లుకొన్నా సుఖమైన జీవితాన్ని ఆ ఇంట్లో సాగించాలంటే అవే పంచభూతాలు కొన్న ఆ ప్రదేశాలలో వాస్తు పరంగా వుండి తీరాలి. అలా వుంటేనే ఆ ప్రదేశాన్ని కచ్చితమైన వాస్తుతో వున్న స్థలం లేదా ఇల్లు అంటాం. అలాంటి చోట ఫలితాలు బ్రహ్మాండంగా వుంటాయ. ఒక్కో ప్రదేశాన్ని బట్టి ఈ పంచభూతాలు అన్నీ సరిగా లేకపోనూవచ్చు. ఆ ప్రభావం కారణంగా వాటిలో నివసించే వారికి రకరకాలైన అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అలాంటపుడు వాస్తు నిపుణులని కలిసి ఆయా ప్రదేశాలనిగాని, ఇళ్లనుగాని చూపించుకొని ఏవైతే సరిగాలేవో వాటిని శాస్త్రప్రకారం సమతుల్యంగా చేయంచుకొని సుఖమైన జీవితాన్ని గడపవచ్చు. ఎలాగంటే ఉదాహరణకి కొన్న స్థలంలోగాని, ఇంటిలోగాని ఏదైనా భాగం కోత ఏర్పడితే ఒక విధంగా, నీటి సమస్య అయతే మరో విధంగా, ఇంటి కప్పు దోషం అయతే ఇంకో విధంగా, వంటగదుల్లో ఫ్లాట్ ఫాంల అమరికలో దోషాలుంటే వేరే విధంగా, స్థలంలో గాలి, వెలుతురు సరిగా లేకుంటే ప్రమాద ఘంటికలు మోగుతుంటాయ. ఏవైనా దోషాలుంటే వాటిని చక్కగా వాస్తు ప్రకారం నూటికి నూరుశాతం సరిచేయవచ్చు.

 బెడ్‌రూంలు తెచ్చే అనారోగ్య సమస్యలు

 ఈశాన్యంలో పడక గదులుంటే వాటిలో సంసారం చేసే భార్యాభర్తలు జీవితాంతం అనారోగ్యాల బారిన పడుతుంటారు. 

 ఇంట్లో వుంటున్న గర్భవతులు పొరపాటున ఓ పదినిముషాలు కూడా ఈశాన్య బెడ్‌రూంలో రెస్ట్ తీసుకోకండి. ఇలా చేసిన రోజే గర్భం పోయే ప్రమాదం వుంది. 

 ఆగ్నేయంలో బెడ్‌రూం వాడటం వలన చికాకులు ఎక్కువై, ఫిట్స్‌తో మానసిక వ్యాధుల బారిన పడవచ్చు. 

 ఆగ్నేయ బెడ్ రూంలో వేసుకునే మంచం ఆ గదిలోని టాయ్‌లెట్ గోడకి తగిలే విధంగా కాని, లేదా టాయ్‌లెట్ గోడకి సమంగా కాని వేసుకోవద్దు. అలా చేయటం వలన మీ కుటుంబం మీద దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా పడుతుంది. రాత్రుళ్లు ఉలిక్కి పడటం, నిద్రలో భయాలు, చేతబడి చేశారనే అనుమానాలు మిమ్మల్ని పీక్కుతింటుంటాయ.

                    


 ఇంట్లో మీరు వాడే మంచాలు చెక్కతో చేసినవి అయతేనే బెస్ట్. వాటి క్రింద ఎటువంటి సామానులు పెట్టుకునే విధంగా చేయంచకండి. అలాంటి మంచాలని వాడటం వలన గుండె జబ్బులు, బ్రెయన్ ట్యూమర్, బ్రెయన్ హెమరేజ్ లాంటి అనారోగ్యాల బారిన పడతారు. 

 పడుకునే మంచాల క్రింద ఇనుప సామాన్లు, ఉప్పు, రోకలి, చీపురు, కిరోసిన్, పెట్రోల్, డీజిల్, ఇనుప డబ్బాలు, ఎటువంటి రసాయనిక పదార్ధాలు వుంచకండి. 

 బెడ్‌మీద పడుకున్నప్పుడు తలని ఎప్పుడూ దక్షిణ దిశగానే వుంచాలి. ఇలా వుంచటం వలన మంచి నిద్రతో ఆరోగ్యం చక్కగా వుంటుంది. 

 తూర్పు దిశ తల వుంచటం మంచిది, పడమర కాస్త బెటర్. పడుకున్న గది ద్వారానికి కాని, తలుపులకి కాని కాళ్లు తగిలే విధంగా లేదా వాటికి ఎదురుగా పడుకోవటం చేయకండి. ఇలా చేయటం వలన పాదాలు, కాళ్లలో నరాల సమస్యలు ఉత్పన్నం కావచ్చు. 

 బీమ్ క్రింద పడుకోవటం జీవితంలో ఒక్కసారి కూడా చేయకండి. అలా చేయటం వలన శరీరంలో అనారోగ్యానికి బీజం నాటుకున్నట్టే.

  వంట గదితో అనారోగ్యపు తంటా

 ఈశాన్యంలో వంటగది కనుక వుంటే అనారోగ్యపు ఆహారాన్ని వండుకుని తిన్నట్టే. ఇలా వంటగది వున్నట్టయతే ఆ ఇంట్లో నివసించే ఆడవారి మీద అనారోగ్యం ఏ క్షణానన్నా దాడి చేయవచ్చు. ప్రమా దాలు మీ ప్రక్కనే పొంచి వుండవచ్చు. 

 ఆగ్నేయంలో వంటగది వున్నా గ్యాస్ స్టౌ ఉత్తరం వైపుగాని, లేదా ఈశాన్యం వైపున గాని వున్నట్టయతే అనారోగ్య సమస్యలను కావాలని తెచ్చుకున్నట్టే. నైరుతి దిశచూసే విధంగా కాని, దక్షిణ దిశ చూసే విధంగా కాని నుంచోని వంటచేయటం, భోజనం చేయటం, నీరు త్రాగటం చేయకండి. 

 మీరు వంటగదిలో వంటకు గాని, తినేందుకు కాని చేసే ఏ పని అయనా సరే తూర్పు దిక్కులేదా, ఉత్తర దిక్కు చూసేలా వుండి చేయడం మంచిది. ఇలా చేయటం వలన మీలోని జీర్ణశక్తి పెరుగుతుంది. వండిన పదార్ధాలలో రుచి శాతం బావుంటుంది. 

 వంటగదిలో పొరపాటున కూడా మీ వీపు వెనుక భాగం వంటింటి తలుపువైపును చూసేలా నుంచోని వంట చేయకండి. ఇలా చేయటం వలన చాలా ప్రమాదకరమైన రోగాల బారిన పడే ప్రమాదం వుంది. కాళ్ల నొప్పులు, మోకాలు చిప్పల దగ్గర చెప్పలేనంత బాధ. వెన్ను నొప్పి, భుజాల నొప్పి, సర్వైకల్ స్పాండిలైటిస్ మొదలైన రుగ్మతలు మిమ్మల్ని వెన్నాడుతుంటాయ.


  డబ్బును నీళ్లలా ఖర్చుచేయంచే నీటి నిల్వలు

             


ఈశాన్యంలో నీటి నిల్వలు కరక్ట్‌గా చేస్తే అన్ని రకాలుగా బావుంటుంది. కాకపోతే తెలీకుండా చేసే పనుల వల్లే డబ్బును అనుకోకుండా వచ్చే అనారోగ్యాలకు మంచినీళ్లలా ఖర్చు చేయాల్సి వస్తుంటుంది. ఎలాగంటే, భూగర్భంలో కట్టించే సంప్‌లు, వాటర్ ట్యాంక్‌లు భూమిలో సహజసిద్ధంగా వుండే అయస్కాంత శక్తిని చెడగొట్టేదిలా వుండకూడదు. ఈ అయస్కాంత శక్తి నైరుతి దిశనుంచి ఈశాన్య దిశకు ఎదురుగా ప్రవహి స్తుంటుంది. అటువంటి దాన్ని ఈశాన్య బిందు కోణం దగ్గర కట్ చేయకూడదు. అలా చేస్తేనే ఈశాన్యంలో కోత వచ్చినట్టుగా భావించాలి. ఇలా చేసిన చోట పిల్లలలో మానసిక ఎదుగుదల వుండదు. ఇంట్లో వాళ్లు ఇరవైనాలుగ్గంటలూ డిప్రెషన్‌లో వుంటుంటారు. ఆర్థికంగా ఇబ్బందులు వుంటాయ. ఎప్పుడూ డాక్టర్ల చుట్టూ తిరగాల్సి వుంటుంది.


 మెట్లు - అనారోగ్యపు తూట్లు

                                

ఈశాన్యంలో మెట్లను నిర్మిస్తే హైటెన్షన్, హై బ్లడ్ ప్రెషర్ లాంటి అనారోగ్యాల పంచన చేరుతారు. ఈ మెట్లని కనుక ఇంటికి మధ్యభాగంలో కాని, ఇంటికి గర్భంలో కాని కడితే చాలా పెద్ద అనారోగ్యం మీ ఇంట్లో తిష్టవేస్తుంది. చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే మెట్లు కట్టిన తర్వాత వాటి క్రింద ఖాళీ స్థలాన్ని టాయ్‌లెట్స్, బాత్ రూంలు, ఇంట్లో వేస్ట్ సామాన్లు పడేసే చిన్న గదిలా వాడుతుంటారు. ఇలా చేస్తే గుండెకు ఆపరేషన్ జరగటం, నరాల జబ్బులు, లివర్ జబ్బులు తగులుకుంటాయ. ఇంట్లోని మగవారు సంతతిని కోల్పోతారు.
                    

 ఇంకా.. ఇంకా.. అనారోగ్యాన్ని తెచ్చే విషయాలు

 ఇంటి పై కప్పుకి వేసిన కలర్‌నే ఇంటి గోడలకి వేయవద్దు. 

 ఇంటి సింహద్వారానికి ఎదురు గా, ఈశాన్యంలోని కిటికీ దగ్గర ఎటువంటి చెట్టు వుండరాదు. ఇలా వుంటే నెగెటివ్ వైబ్రేషన్స్ విపరీతంగా పుడుతుంటాయ. 

 ఇంటి మొత్తానికి ఈశాన్యం మూల బిందువు దగ్గరగా చెత్త కుప్పలు వుండకూడదు. వీటి వల్ల శరీరంలో రక్త ప్రసరణ తగ్గిపోతుంది. 

 వాయవ్య బెడ్‌రూమ్‌లో దంపతులు సంసారం చేస్తే పుట్టే పిల్లలు శారీరక లోపంతో పుడతారు. 

 టాయలెట్‌లో కమోడ్ తూర్పు దిశగా వుండి, దాన్ని దంపతులు వాడుతుంటే మగవారికి శుక్ర కణాలు, ఆడవారికి అండాలు నశించిపోతాయ. 

 మలవిసర్జన దక్షిణ దిశగానే జరగాలి. ఆడవారు నెలసరి వ్యర్థపదార్ధాలను ఈశాన్య దిశలో, ఆగ్నేయ దిశలో, ఉత్తర దిశలో పారవేయకండి. సంతాన హీనులయ్యే ప్రమాదం వుంది.

 తెలిసో తెలీకో చేస్తున్న ఈ పొరపాట్లనుండీ కాస్తంత ఉపశమనం పొందాలంటే ప్రతిరోజూ ఆగ్నేయ దిశలోని తులసికోట దగ్గర ఓ దీపం వెలిగిస్తుండండి. బెస్ట్ ఆఫ్ లక్!


 తాపీ మేస్ర్తీలకూ వాస్తు... !
ఇళ్ళు, గుడి, బడి ఇలా ఏ నిర్మాణం చేపట్టినా.. భారతీయ సాంప్రదాయంలో వాస్తుకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఏ మూలలో ఏది ఉండాలనేది ముందుగానే నిర్ణయించి.. తదనగుణంగా నిర్మాణాన్ని పూర్తిచేయడం ఆనవాయితీ. అయితే.. వాస్తు అనేది గృహస్తులకు, నిర్మాణాలకేనా? ఆ నిర్మాణాల్లో పాలుపంచుకునే తాపీ మేస్ర్తీలకు వర్తించదా? అంటే.. కచ్చితంగా వర్తిస్తుంది అంటున్నాయి వాస్తు శాస్త్రాలు. మరి నిర్మాణాల్లో కీలకపాత్ర పోషించే తాపీ మేస్ర్తీలు ఎలాంటి వాస్తు సూచనలు పాటించాలో ఈవారం తెలుసుకుందాం..

 గృహ నిర్మాణాల్లో పాలుపంచుకునే తాపీ మేస్ర్తీలు మొదలుకొని.. ఇటుకలు, ఇసుక, కాంక్రీటు ఇలా ప్రతి పనిలో భాగస్వామ్యం పంచుకునే కూలీలకు సైతం వాస్తు సూచనలు తప్పనిసరి. 

 అయితే.. కూలీలకంటే గృహనిర్మాణంలో కీలకపాత్ర పోషించే.. తాపీ మేస్ర్తీలే ఎక్కువ నియమాలు పాటించాల్సివుంటుంది. వీరు గృహ నిర్మాణ సమయంలో జాగ్రత్తగా వ్యహరిస్తేనే నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తవడమే కాకుండా.. బిల్డర్‌ లేదా యజమాని ఆశించిన రీతిలో నిర్మాణం పూర్తవుతుంది.

 ఇంత ప్రాధాన్యత ఉన్న తాపీ మేస్ర్తీలకు వాస్తు శాస్త్రంలో కొన్ని సలహాలు పేర్కొనడం జరిగింది. వీరు గృహ నిర్మాణం చేపట్టే సమయంలో కొన్ని కీలక గుర్తులతో పాటు.. దిశలను ఏర్పాటు చేసుకోవాలి. 

 ముందుగా ప్లాన్‌ ప్రకారం గుర్తులు వేసుకోవాలి. అప్పుడు నైరుతి దిశ 90 డిగ్రీలు ఉండేలా చూసుకోవాలి.తాపీ మేస్ర్తీ నిర్మాణానికి దిగేముందు మూలమట్టాన్ని ముందుగా నైరుతి దిశలో ఉంచాలి. ఆ తరువాతే ఇతర దిక్కుల్లో దిశలను మార్క్‌ చేసుకోవాలి. ఈ మార్కులు చేసుకునేటప్పుడు ఇతర మూలల కంటే.. ఈశాన్యం కొద్దిగా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. 

 ఇంటి పునాదులు తీసేటప్పుడు ముందుగా ఈశాన్యం మూల నుంచి ప్రారంభించాలి. అయితే.. కట్టడం మాత్ర నైరుతి దిశ నుంచి ప్రారంభించాలి.

 హద్దులను బట్టి ముందుగా ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలి. పశ్చిమ-నైరుతి దిశలో కొంత ఎతె్తైన గోడను నిర్మించి, ఆ తరువాత ఇంటి నిర్మాణం చేపట్టాలి. 

 అలాగే. ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తు సామాగ్రిని నైరుతి, పశ్చిమ, దక్షిణ భాగాల్లో మాత్రమే జాగ్రత్త చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్య భాగంలో మాత్రం ఉంచకూడదు. 

 గోడల నిర్మాణంలో ఏ రోజుకారోజు.. దక్షిణ-పశ్చిమ గోడలు.. తూర్పు, ఉత్తర గోడల కంటే కొంచెం ఎత్తుగా ఉండేటట్లు చూసుకోవాలి. 

 అలాగే.. ఫ్లోరింగ్‌ వేసే సమయంలోను జాగ్రత్తగా చూసుకోవాలి. వీటితో పాటు మరికొన్ని జాగ్రత్తలను మేస్ర్తీ పాటించాలి. 


 పడకగది ఇలా...
 ప్రతి గృహంలో నిర్మాణానికి చాలా సూత్రాలు పాటిస్తూ వస్తుంటాం. అలాగే ఇంటి యజమాని సంతోషాన్ని రెట్టింపు చేసేది పడకగది. అటువంటి పడకగది నిర్మాణంలో నియమాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పడకగదిలో మంచాన్ని మన ఇష్టం వచ్చినట్లు వేసుకుంటే.. అది మన ఆరోగ్య, మానసిక విషయాలు మీద చెడు ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. పడకగది తలుపుకి ఎదురుగా మంచం ఉండకూడదు. మంచం తలుపులకి, కిటికీలకు ఎదురుగా ఉండరాదు. అందువల్ల వాటిద్వారా గదిలోకి వచ్చే వెలుతురువల్ల మన నిద్రకు భంగం కలుగుతుంది.

 అద్దాన్ని కాని, డ్రెస్సింగ్‌ టేబుల్‌ని కాని మంచానికి తలవైపు కాని, కాళ్లవైపు కాని ఉంచకూడదు. 

 మనిషి నిద్రించే సమయంలో ఆత్మ శరీరం నుండి విడివడి గదంతా తిరుగుతుందని చైనీయుల విశ్వాసం. శరీరం నుండి ఆత్మ బయటకు రాగానే అద్దంలో తన ప్రతిబింబం చూసుకుని కంగారు పడుతుంది. దానివలన లేనిపోని అనర్ధాలు కలుగుతాయి. నిద్రాసమయంలో ఆత్మ శరీరం నుండి బయట పడుతుందనే నమ్మకం మనదేశంలోనూ ఎక్కువగానే ఉంది.

 బుక్‌షెల్ఫ్‌, డ్రెస్సింగ్‌ టేబుల్‌ అంచుల నుండి వీచే సూటి గాలులు మనిషి ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. 

 బెడ్‌రూమ్‌లో అనవసరమైన చెత్త ఉంచకూడదు. పెట్టెలు, పుస్తకాలు, ఉపయోగపడని గృహోపకరణాలు ఉండకూడదు. టెలివిజన్‌, రేడియో, కంప్యూటర్‌ లాంటి ఎలక్ట్రానిక్‌ సాధనాలు పడకగదిలో ఏర్పాటు చేసుకోకపోవడమే మంచిది. తద్వారా నిద్రకు భంగం కలుగదు. 

 ఎట్టి పరిస్థితులోనూ మంచాన్ని ఏటవాలుగా ఉండే సీలింగ్‌ కిందకాని, స్థంబాల కిందకాని ఉండకూడదు. ఒకవేళ వీటికింద తప్పనిసరి పరిస్థితుల్లో మంచాన్ని వేసుకోవల్సి వస్తే రెండు వెదురు వేణువులను పైన వేలాడదీయండి.


 సింహద్వారం ఎటువైపు ?

                             


 ఇంటికి ప్రధాన ద్వారం.. సింహద్వారం. ఇల్లు నిర్మాణం మొదలు పెట్టాలని నిర్ణయించిన తరువాత అన్నింటికంటే.. ముందుగా చర్చించేది సింహద్వారం గురించే. ఎందుకంటే.. వాస్తు ప్రకారం సింహద్వారానిి ఉన్న ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. సింహద్వారం సరైన దిశలో అమరితే.. సగం వాస్తు కుదిరనట్టే...

 సింహ ద్వార గృహం ఏదైనప్పటికీ రహదారి ఉన్న వైపునకు ఉన్న దిశలో స్థలానికి ఉచ్ఛ స్థానంలో ప్రహరీ గేటును పెట్టుకోవాలి. 

 తూర్పు స్థలంలో నిర్మించిన గృహంలో తూర్పు ఈశాన్యం లేదా తూర్పు ఉచ్ఛంలో గేటు ఉండేలా చూసుకోవాలి. 

 విశాలమైన స్థలం కలిగి రెండు గేట్లు పెట్టదలచినపుడు తూర్పు ఈశాన్యంలో పెద్దగేటు, తూర్పు ఉచ్ఛంలో సింగద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి.

 విశాలమైన స్థలం కలిగి రెండుగేట్లు పెట్టదలచినవారు.. దక్షిణ ఆగ్నేయంలో పెద్ద గేటు, దక్షిణ ఉచ్ఛంలో చిన్న గేటు పెట్టాలి. నైరుతి స్థలంలో గేటు నైరుతిస్థలంలో నిర్మించిన గృహంలో దక్షిణ లేదా పశ్చిమ దిశలలో ఏదో ఒక దిశకు మాత్రమే సింహద్వారం, ఇతర వాస్తు విషయాలు దృష్టిలో పెట్టుకుని గేటు పెట్టాలి. దక్షిణం ఉచ్ఛం నుంచి దక్షిణ ఆగ్నేయం వరకు, పశ్చిమ ఉచ్ఛం నుంచి పశ్చిమ వాయువ్యంలో గేటు పెట్టాలి. దక్షిణంలో అయితే దక్షిణ ఆగ్నేయంలో పెద్ద గేటు, దక్షిణంలో చిన్న గేటు పెట్టాలి.

 ఆగ్నేయ స్థలంలో తూర్పు సింహద్వార గృహం కట్టడం శ్రేయస్కరం. కాబట్టి ప్రహరీ గేట్లు కూడా తూర్పు ఈశాన్యం, తూర్పు ఉచ్ఛంలో పెట్టుకోవడం మంచిది. 

 దక్షిణ స్థలంలో గేటు దక్షిణ స్థలంలో నిర్మించిన గృహంలో దక్షిణం ఉచ్ఛం నుంచి దక్షిణ ఆగ్నేయం వరకు ఉన్న స్థలంలో సింహద్వారం ఎదురుగా గేటు పెట్టాలి. పశ్చిమంలో అయితే పశ్చిమ వాయువ్యంలో పెద్దగేటు, పశ్చిమ సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి. అలాగే పశ్చిమ స్థలంలో గేటు ఉన్నప్పుడు.. పశ్చిమ స్థలంలో నిర్మించిన గృహంలో పశ్చిమ ఉచ్ఛం నుంచి పశ్చిమ వాయువ్యం వరకు ఉన్న స్థలంలో ఎక్కడైనా సింహ ద్వారం ఎదురుగా గేటు పెట్టాలి.

 విశాలమైన ఆవరణ కలిగి రెండు గేట్లు పెట్టదలచినపుడు పశ్చిమ వాయువ్యంలో పెద్దగేటు, పశ్చిమ ఉచ్ఛంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి. అలాగే.. వాయువ్య స్థలంలో గేటు వాయువ్య స్థలంలో నిర్మించిన గృహంలో అవసరాన్ని, సింహ ద్వారాన్ని బట్టి రెండు వైపులకు లేదా కేవలం ఒకవైపుకు పెట్టుకోవచ్చు. 

 ఉత్తర దిశను ఉత్తర ఉచ్ఛం ఈశాన్యం వరకు, పశ్చిమ ఉచ్ఛం నుంచి పశ్చిమ వాయువ్యం వరకు ఎక్కడైనా సింహ ద్వారం ఎదురుగా గేటు పెట్టుకోవాలి. 

 ఒకవేళ రెండేసి గేట్లు పెట్టదలచిన వాళ్లు ఉత్తర ఈశాన్యంలో పెద్దగేటు, ఉత్తర ఉచ్ఛంలో చిన్న గేటు, పశ్చిమ వాయువ్యంలో పెద్దగేటు, పశ్చిమలో చిన్న గేటు పెట్టాలి. ఉత్తర స్థలంలో గేటు పెట్టదలుచుకుంటే.. 

 ఉత్తర స్థలంలో నిర్మించిన గృహంలో ఉత్తర ఉచ్ఛం నుంచి ఉత్తర ఈశాన్యం వరకు ఎక్కడైనా, సింహ ద్వారం ఎదురుగా గేటు పెట్టాలి. విశాలమైన ఆవరణ ఉంటే రెండు గేట్లు పెట్టదలిస్తే ఉత్తర ఈశాన్యంలో పెద్ద గేటు, ఉత్తర ఉచ్చంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి. ఇకపోతే ఈశాన్య స్థలంలో గేటు పెట్టాలను కుంటే.. తూర్పు, ఉత్తరం రహదారి ఉన్న స్థలంలో నిర్మించిన గృహంలో తూర్పు, ఉత్త ర దిశల వైపు పెట్టాలి. తూర్పు దిశన రెండు గేట్లు పెట్టాలను కుంటే తూర్పు ఈశాన్యంలో పెద్దగేటు, తూర్పు ఉచ్ఛంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు, ఉత్తరం ఉచ్చంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి.


 ఏకాగ్రతకు వాస్తు


 చదువుకునే పిల్లల్లో పరీక్షలకు సంబంధిం చిన ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది. ఎంత తెలివైన పిల్లలైనా, రోజూ చదువుతూ ఉండేవారైనా పరీక్షలు అనగానే తెగ హైరానా పడిపోతుంటారు. దానితో వారి ఏకాగ్రత దెబ్బతిని చిరాకు పడిపోవడం కూడా కనిపిస్తుంది. ఈ ఒత్తిడి కారణంగా పుస్తకాలు తెరిచినా వారు దానిపై దృష్టి కేంద్రీకరించలేరు.వాస్తవానికి వారి ఒత్తిడికి ప్రధాన కారణం పాఠశాల, కళాశాలల్లో ఉపాధ్యాయులు, ఇంటివద్ద తల్లిదండ్రులే. పరీక్షలకు బాగా చదువుకోవాలని, ఇతరులకన్నా ముందుండాలనే మాటలతో వారిని హైరానాపెట్టేస్తారు. 

 సరిగ్గా చదవకపోతే ఒక సంవత్సరం వృధా అయిపోతుం దంటూ భయపెడుతుంటారు. ఇది పిల్లల్లో అ ధిక ఆందోళనను పెంచడమే కాదు పరీక్షలం టేనే ఒకరకమైన భయమేర్పడిపోతుంది. పిల్ల లు అటువంటి ఒత్తిడి లేకుండా రిలాక్స్‌డ్‌గా ఉండటమే కాక చదువుకోవడాన్ని శ్రమ అని భావించకుండా ఉండగలగాలి. అప్పుడే వారు చదివినదానిని ఎటువంటి ఒత్తిడికి లో నుకాకుండా ఆకళింపు చేసుకోగలుగుతారు. పదే పదే చెప్పడమనేది వారి లేత మెదడులపై ఒత్తి డి పెంచి హాని చేస్తుందే తప్ప సహాయపడదు.పిల్లల ఏకాగ్రతకు దోహదం చేసే వాస్తుపరమైన టిప్స్‌ కొన్ని ఉన్నాయి. అవి వారిలో ఒత్తిడిని తగ్గించేందుకు, పరీక్షలను నిర్భయంగా ఎదుర్కొనేందుకు సహాయపడతాయి. 

 పిల్లలకు  వాస్తు 

 తమ తలను ఉత్తర లేదా పడమర దిశగా తలపెట్టుకొని పడుకోనివ్వకండి.

 అబ్బాయి అయితే అతడు ఇంటికి వాయు వ్యంలో పడుకోవడం కానీ గదిలో వాయువ్య దిక్కున పడుకోవడం కాని మానివేయాలి.

 అలాగే అమ్మాయి అయితే ఇంటి ఆగ్నేయంలో లేదా గదిలో ఆగ్నేయదిక్కున పడుకోవడం మంచిది కాదు. 

 పడకగదికి అద్దాలను పెట్టకండి.

 అలాగే పిల్లలు చదువుకునే ప్రాంతంలో దక్షిణ, పశ్చిమ దిక్కులలో అద్దా లు లేకుండా చూడాలి.

 పిల్లలు తూర్పు లేదా ఉత్తర ది క్కువైపు కూచుని చదువుకోవాలి.

 పిల్లల స్టడీ టేబుల్‌, ఆ ప్రాంతం కూడా శుభ్రంగా ఉండాలి. బల్ల మీద, చుట్టూ పుస్తకాలు, కాగితాలు ఉండరాదు.

 స్టడీ ఏరియా ఇంటికి ఈశాన్య దిక్కులో ఉండాలి లేదా గదిలో ఈ శాన్యం దిక్కున ఉండాలి. 

 ఒత్తిడి అధికంగా ఉంటే నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. 

 కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూచునే ఇంటి డ్రాయింగ్‌ రూంలోని ఈశాన్యంలో అక్వేరియం, లేదా వాటర్‌ ఫౌంటెన్‌ లేదా వెదురు మొక్కలు పెట్టుకోవాలి. అయితే మూలలకి మాత్రం వద్దు. 

 పడక గదుల్లోనూ, స్టడీ ఏరియాలోనూ ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులను (ముదురు, లేత షేడ్లలో) వేసుకోవాలి. 

 గోడలకు రంగులుగా కాకపోతే కనీసం పక్కమీద దుప్పట్లు, స్టడీ టేబుల్‌ క్లాత్‌గా, కాళ్ళు తుడుచుకునే పట్టాలు, కర్టెన్లు, గలీబులు వగైరాలకు వాడవచ్చు. ఇన్‌డోర్‌ మొక్కలను కూడా విరివిగా వాడుకోవచ్చు. 

 తినేటప్పుడు ఆడపిల్లల అయితే తూర్పు ముఖంగా, మగపిల్లవాడు అయితే ఉత్తర ముఖంగా కూచొని భోంచేయాలి. 

 ప్రతి రోజూ ఒకే చోట, ఒకే దిక్కులో కూ చునేట్టు పిల్లలను ప్రోత్సహించాలి. దానివల్ల ఆ ప్రాంతంలో పిల్లల సానుకూల సానుకూల ఆరా బలపడేలా చేస్తుంది.
 పిల్లల స్టడీ, పడకను ఇతరులు ఉపయోగించడాన్ని అనుమతించరాదు.

 ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి ఆకులు తినడానికి ఇవ్వండి.

 పెద్దగా పాటలు, సంగీతం పెట్టి పిల్లల ఏకాగ్రత దెబ్బతిని, ఒత్తిడి పెరిగేందుకు దోహదం చేయకండి.

 ఒకవేళ సంగీతం పెట్టినా చాలా సున్నితంగా ఉండేది, తక్కువ వాల్యూమ్‌లో రాత్రి బెడ్‌రూమ్‌లో పెట్టవచ్చు. ఇది గాయత్రి మంత్రమైనా పర్వాలేదు.

 గోడలకు కోణంలో ఉండే తలుపు ఉన్న గదిలో చదవడం కానీ నిద్రపోవడం కానీ చేయరాదు. 

 పిల్లలకు ఎప్పుడూ తల్లిదండ్రులు సానుకూలమైన మాటలనే చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో నూ వారి వెంటే ఉంటామనే హామీ ఇవ్వడమే కాకుండా పిల్లల బలాల గురించి సానుకూల వ్యాఖ్యలు చేయాలి.

 ముఖ్యంగా పిల్లలు తినేటప్పుడు వారి బలహీనతల గురించి వైఫల్యాల గురించి మాట్లాడరాదు. మీరు వారిని ప్రేమిస్తున్నారనే భావన వారిలో కలగాలి.

 ఆటలు కానీ సంగీతం కానీ వింటూ రిలాక్స్‌ అయ్యేందుకు అనుమతించాలి.

 పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత అది కొనిస్తాం అని హామీలు ఇవ్వరాదు. అలాకాకుండా వారు పరీక్షలకు తయారవుతున్న సమయంలో వారికి చిన్న చిన్న కానుకలిచ్చి ప్రోత్సహించాలి. వారు కష్టపడుతున్నారని, తెలివైన వారని గుర్తించిన విషయాన్ని వారికి చెప్పాలి. సానుకూల, ప్రోత్సాహకర సూచనలు ఇస్తూ మీ మద్దతు వారికి ఎప్పుడూ ఉంటుందనే భావన వారిలో కలిగేలా చేయండి.

 వారు వ్యాయామం, ధ్యానం చేసి రిలాక్స్‌ అయ్యేలా ప్రోత్సహించండి కానీ బలవంతం చేయవదు. మీ పిల్లల దృష్టిని మరల్చే ఏ వస్తువునీ స్టడీ ఏరియాలో ఉంచరాదు. అది టేప్‌ రికార్డర్‌ అయినా టెలివిజన్‌ అయినా వెంటనే అక్కడ నుంచి తీసివేయాలి.

 సంపదలిచ్చే.. లాఫింగ్‌ బుద్ధా....

 ఫెంగ్‌షూయ్‌ వస్తువులలో అత్యంత ప్రాచుర్యం కలిగినది లాఫింగ్‌ బుద్ధా. అదృష్టం, సంపద కలిగేందుకు ఫెంగ్‌షూయ్‌ నిపుణులు ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోమని సూచిస్తుంటారు. లాఫింగ్‌ బుద్ధాను ‘హ్యాపీ బుద్ధ లేక మైత్రేయ’ అని కూడా అంటారు. హిందువులకు లక్ష్మీ దేవి వలె సంపదకు సంబంధించిన దేవునిగా ఆయనను కొలుస్తారు. ఇంట్లో ఈ విగ్రహాన్ని పెట్టుకుంటే సౌభాగ్యం, విజయం, ఆనందం కలుగుతాయని భావిస్తారు. వ్యాపారం చేసే వారు తమ కార్యాలయాల్లో పెట్టుకుంటే ఇది రాబడిని పెంచుతుందని భావిస్తారు. ఇది ప్రతికూల ప్రాణ శక్తిని హరించి సానుకూల శక్తి ప్రవహించేలా చేస్తుందని నమ్మకం. అందుకే ఇటీవలి కాలంలో ఈ విగ్రహం మనకు ప్రతి చోటా తారసపడుతోంది. 


                                   

 మనం ప్రేమించేవారికి మంచి బహుమతి ఇవ్వాలనుకుంటే లాఫింగ్‌ బుద్ధను కొనిస్తే సరి. పెద్ద పొట్టతో హాయిగా నవ్వుతూ ఉండే బుద్ధుడు ఆయన. కుండలు పట్టుకుని లేదా వెనుకాల గోతం వేసుకొని ఉన్నట్టుగా ఈ విగ్రహాలు ఉంటాయి. ఇవన్నీ సంపదతో నిండి ఉంటాయని విశ్వా సం. అనంతమైన ఆనందం, ఓర్పు, దయ కలిగిన వాడే బుద్ధుడు. అన్ని కష్టాలను, సమస్యలను ఓర్చి వాటిని ఆనందం గా రూపాంతరం చెందిస్తాడని నమ్మకం. పిల్ల లు, పేదలు, బలహీనుల పక్షాన ఉంటాడని కూడా భావిస్తారు. ఈ విగ్రహాలు లోహం, టెర్రకోట, క్రిస్టల్స్‌ వంటివాటితో తయారు చేస్తారు. ఇవి రకరకాల పోజులలో కూడా ఉంటాయి. కానీ ప్రతి దానికీ ఒక ప్రాముఖ్యత ఉంటుంది. 

 పూ తాయ్‌గా పిలుచుకునే ఈ బుద్ధుడు వెయ్యి సంవత్సరాల క్రితం చైనాలో జీవించాడని ఒక నమ్మ కం. జపనీయులు ఆయనను హోతీ అం టారు. ఈ బుద్ధుడు లియాంగ్‌ వంశం చైనాను పాలిస్తున్న కా లంలో పూతాయ్‌ అనే సన్యాసి జీవించాడని ఒక కథనం. లావుగా, ముడతలు పడ్డ నుదురుతో, బానలాంటి పొట్ట తో అతడు ఉన్నట్టు స్కాలర్లు చెపుతుంటారు. అతడిని చూడగానే వెం టనే దృష్టి పడే మరో లక్షణం అతను ఒక గోతంతో కనుపిస్తాడు. అందులో పిల్లల కో సం మిఠాయిలు తీసుకువెళ్ళేవాడని జానపదుల కథనం. అతని జపమాల అదృష్టానికి చిహ్నం కాగా, పొడవుగా వేళ్ళాడుతున్న చెవు లు జ్ఞానానికి చిహ్నం.ఇక సంచీ కోరికలు తీరడానికి చిహ్నం లేదాబుద్ధుని ఆశీస్సులకు. ఈ లాఫింగ్‌ బుద్ధా ఇచ్చే అతి గొప్ప బహుమతులలో ఆనందం ఒకటి. 

 ఈ ప్రపంచంలో మంచి జీవితాన్ని సాధించవచ్చనే బౌద్ధ సూత్రాలను ఇది ప్రతిఫలిస్తుంది. లాఫిం గ్‌ బుద్ధ లేక హాపీ హోతీ అనేక రూపాలలో దర్శనమిస్తాడు. లాఫింగ్‌ బుద్ధా పొట్టను రాయడం ఆనందాన్ని, అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని తెస్తుందని అనేకమంది భావన. చైనాలోని ఆలయాలలో ద్వారం వద్ద మన గణపతి విగ్ర హం వలెనే లాఫింగ్‌ బుద్ధా ప్రతిమ ను ప్రతిష్ఠిస్తారు. అదృష్టానికి, సౌ భాగ్యానికీ అధి దేవతగా పూజిస్తారు. తత్ఫలితంగానే ఫెంగ్‌షూయ్‌ లాఫింగ్‌ బుద్ధాను సంపదలకు, సౌభాగ్యాలకు ప్రతీకగా చెప్తుంది
 కాగా జపాన్‌లో అదృష్టాన్ని తెచ్చే ఏడుగురు షింటో దేవతలలో ఒకరిగా లాఫింగ్‌ బుద్ధాను పరిగణిస్తారు. 

 లాఫింగ్‌ బుద్ధ ఆఫ్‌ లవ్‌- ప్రేమ, దయ ఉట్టిపడేలా చూస్తూ కూచుని ఉన్న బుద్ధుడు.

 లాఫింగ్‌ బుద్ధ ఫర్‌ ప్రాస్పరిటీ (సంపద)- ఒక కుండను లేదా బౌల్‌ను ఆకాశంలోకి ఎత్తిపట్టుకుని ఈ విశ్వం నుంచి అనంతమైన సంపదను అందుకుంటున్నట్టుగా ఉంటుంది. 

 సురక్షిత ప్రయాణానికి- ప్రయాణం చేసే సమయంలో భుజం మీద గోతం వేసుకున్న లాఫింగ్‌ బుద్ధాను దగ్గర పెట్టుకుంటే సజావుగా సాగుతుందని ఫెంగ్‌ షూయ్‌ నిపుణులు అంటారు. 

 ఇంట్లో సంతోషానికి- బలమైన పునాదికి సంకేతంగా ఒక పెద్ద బంగారు తిన్నె మీద కూర్చుని, మరొకరికి ఇచ్చేందుకు చేతిలో బంగారు ముద్దను పట్టుకుని ఉంటాడు. 

 ఆధ్యాత్మిక ప్రయాణానికి- ప్రయాణానికి సిద్ధమై, అవగాహన కోసం చేతిలో విసనకర్ర, అంతర్గత భావనలు పోగు చేసుకునేందుకు భుజం మీద గోతంతో ఉంటాడు. 

 సుదీర్ఘ జీవితానికి: తన టోపీతో కూర్చుని, ఆనందంగా కనుపించే లాఫింగ్‌ బుద్ధా ప్రతిమ.

 లాఫింగ్‌ బుద్ధా ప్రతిమను కొనేటప్పుడు సా ద్యమైనంత పెద్దది కొనడం మంచిది. సంపద ను కోరుకునే వారు ఇతర ప్రతిమలను కాక కుండలో బంగారం ఉంచుకున్న లేదా భుజం పై సంచీ వేసుకున్న ప్రతిమను కొనుక్కోవడం మంచిది. కొన్న ప్రతిమను ద్వారానికి ఎదురు గా ముపె్ఫై అంగుళాల ఎత్తు మీద ఒక టేబుల్‌ మీద పెట్టుకోవాలి. ఆ విగ్రహాన్ని కింద పెట్టడమంటే అగౌరవపరచడమేననే భావన ఉంది. 

 విద్యార్ధులు మంచి ఫలితాల కోసం ఆ ప్రతిమను తమ టేబుల్‌పై ఉంచుకోవచ్చు. 

 ఆఫీసులో లేదా రిసెప్షన్‌ టేబుల్‌ మీద ఉంచడం వల్ల ఆదాయం బాగా ఉంటుంది. ఈ విగ్రహాలను దేవతా విగ్రహం వలే పూజించనవసరం లేదు. దాన్ని సరైన స్థలం లో ఉంచితే సరిపోతుంది. అయితే ఈ విగ్రహాలను బెడ్‌రూంలలోనూ, బాత్‌రూంలలో నూ, డైనింగ్‌ రూంలలోనూ పెట్టకపోవడమే మంచిదని ఫెంగ్‌షూయ్‌ నిపుణులు సూచిస్తున్నారు.


 గృహ నిర్మాణం మధ్యలో ఆగిపోతే శ్రేయస్కరమా ?

 ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్నిసార్లు గృహ నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు వాస్తు రీత్యా ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఇలాంటి సమయంలో తప్పకుండా పూర్తి చేయాల్సిన పనులేమిటి? పూర్తి చేయాల్సివస్తే.. ఏఏ నిర్మాణాలను పూర్తి చేయాలి ఇత్యాది విషయాలపై ఈవారం తూర్పు-పడమర.

 కొత్త ఇంటి నిర్మాణం మధ్యలో ఆగిపోతే చాలామంది.. నిర్మాణాన్నంతటినీ ఆపివేస్తారు. కొంతమందికి కొన్నింటిని పూర్తి చేయాలని తెలిసినా.. వేటిని పూర్తిచేయాలో, వేటిని వదిలేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు.ఇంటి నిర్మాణాన్ని మధ్యలో ఆపివేయడం వాస్తూ రీత్యా అనేక దోషాలకు కారణమవుతుంది. అందువల్ల ఇల్లు నిర్మించేటప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంటి పనులను ఆపవలసి వస్తే ప్రత్యేకించి కొన్నింటిని మాత్రమే వాయిదావేయాలి. మిగిలినవి తప్పకుండా పూర్తి చేయవలసి ఉంటుంది. అవేమిటో ఓసారి పరిశీలిస్తే...

 ఇల్లు కట్టేటప్పుడు ఇంటిలోపల ఫ్లోరింగ్‌ ఆపవచ్చు. కానీ వాస్తు రీత్యా ఆర్డినరీ గచ్చు వాటాన్ని వేయాలి. అంతేకాదు ఇంటి లోపలలో లెవల్‌ పెట్టకూడదు.

 లోపల గదులకు ద్వారాలు, కిటికీలు, కప్‌ బోర్డులు, షో కేసులు తదితర వాటికి సంబంధించిన చెక్కపని ఆపవచ్చు.

 ఇంటిలోపల టాయ్‌లెట్‌ కోసం గది నిర్మించినప్పటికీ లోపల పనిముట్లు పెట్టకుండా వాయిదా వేయవచ్చు.

 ఇంటి ఫ్లోరింగ్‌కు సంబంధించి అన్ని గదుల్లోనూ టైల్స్‌ పని ఆపవచ్చు.

 ఇంటి ఆవరణలో సిమెంట్‌ చేయించటం ఆపవచ్చు. కానీ వాస్తురీత్యా మట్టి వాటం వచ్చేటట్లు వేయించాలి.

 అలాగే ఇంటికి గచ్చు వేయించేదాకా మట్టి కొట్టుకుపోకుండా జాగ్రత్తపడాలి. పూజగది కట్టిన తర్వాత దానిలోని అలంకరణకు సంబంధించిన పని.. అనగా టైల్సు వేయటం వంటి మొదలైన పనులను వాయిదా వేసుకోవచ్చు.

 గ్రిల్‌కు సంబంధించిన ్వదారాలు, కాంపౌండ్‌ గేట్లు ఆపుచేసుకోవచ్చు. అదేవిధంగా మెట్లు కట్టకుండా వాయిదా వేసుకోవచ్చు.

 కిటకీలకు గుమ్మాలకు రంగులు వేయటం ఆపేయవచ్చు.

 ఇంటికి సంబంధించిన కాంపౌండ్‌ వాల్‌ను ఆపవచ్చు కానీ, గోడ కట్టు మాత్రం సరిగ్గా ఉండేటట్లు చూసుకోవాలి.

 పెద్ద ఇంటికి ప్లాను వేయించి అందులో కొంత ఇప్పుడు కట్టి భవిష్యత్తులో మిగిలిన దానిని కట్టుకోవచ్చు.

 శ్లాబు వాస్తురీత్యా వాటం సరిగా లేనప్పుడు శ్లాబుపై ప్లాస్టరింగ్‌లు, ఫినిషింగ్‌లు తప్పనిసరిగా చేయించాలి.

 ఇంటిలోపల ఉన్న టాయిలెట్లు వాడకంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా తలుపులు ఉండాలి.

 అదేవిధంగా గృహ ఆవరణలో మట్టి నింపే పని ఉన్నపుడు దానిని అసంపూర్ణంగా వదిపెట్టకూడదు.

 మేడ మీద, మెట్ల మీద పిట్ట గోడలు కట్టకుండా ఆపకూడదు. బయట ద్వారాలకు తలుపులు పెట్టకుండా ఆపనే కూడదు.

 గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత గృహప్రవేశం చేయకుండా ఉండకూడదు.

 గృహనిర్మాణం పూర్తయిన తరువాత గృహ ఆవరణలో ఆగ్నేయ, నైరుతి, పశ్చిమ, వాయవ్య దిశలలో పెద్ద వృక్షాలను పూర్తిగా తొలగించకూడదు.


 పడకగదిలో నెమలి పింఛమెందుకు?

                      

 పడకగదిలో అద్భుతమైన సీనరీలను ఉంచ డం ద్వారా మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని కలి గిస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు.

 అంతేకాదు.. రకరకాలైన పక్షులు జంటలుగా ఉంటే దృశ్యాలు పడకగదిలో ఉంచితే భార్యాభర్తల మధ్య అనురాగం పెంపొందుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

 అయితే బెడ్‌రూమ్‌లో నెమలి పింఛా న్ని కన బడేటట్లు పెట్టి తెల్లవారు జా మున లేవగానే దానిని చూడడం వల్ల రాహుగహ్ర దోషాల నుంచి నివారణ కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటు న్నారు. నెమలి పింఛంతో తయారైన చిత్ర పటాలను పడకగదిలో ఉంచడం ద్వారా శుభ ఫలితాలుంటాయని వారు చెబు తున్నారు.

 అలాగే.. పడకగదిలో కంటికి ఎదురుగా వికృతమైన పటాలు, చిలకకొయ్యలు, స్తంభాలు ఇతర అవరోధాలు లేకుండా జాగ్రత్తగా వహించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.


 పడకగదిలో చేయవలసినవి, చేయకూడనివి..  

 మీ పడక గదిలో సానుకూల శక్తి ప్రవహించేలా సర్దుకోవాలి. చక్కగా విశ్రాంతి పొందేందుకు సంసిద్ధంగా ఉండాలి.

 ఏ దిక్కు నుంచీ కూడా మీరు పడుకునే మంచం ప్రతిబింబించేలా గదిలో అద్దాన్ని పెట్టుకోరాదు. ఇది ప్రతికూల     వైబ్రేషన్లను పెంచి వైవాహిక విచ్ఛిన్నానికి దారి తీసే అవకాశం ఉంటుంది.

 అలాగే పడకగదిలో టివి పెట్టుకోవడం కూ డా మంచిది కాదు. ఇది కూడా అద్దం లాగే ప్రతికూల వస్తువు.

 మంచాన్ని కిటికీకి కిందా తలుపు కు ఎదురుగా ఉండకుండా చూసుకోవాలి. మూడు వైపుల నుంచి దిగేందుకు    వీలుగా మంచాన్ని వేసుకోవాలి.

 పడకగదికి బాత్‌రూమ్‌ అటాచ్డ్‌గా ఉంటే ఎప్పుడూ దాని తలుపు మూసే ఉంచాలి.

 పడకగదిలో మొక్కలు, అక్వేరియం పెట్టుకోవడం మంచిది కాదు. ఎదిగే మొక్కలు, చురుకుగా తిరిగే చేపలు బెడ్‌రూంలో విశ్రాంతి వాతావరణంతో విబేధిస్తాయి.

 మంచం కింద ఉండే అన్ని వస్తువులను తీసి వేయడం మంచిది. శక్తి నిరాటంకంగా ప్రవహించాలంటే ఆ ప్రదేశం  పరిశుభ్రంగా, ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండాలి. ఇది వైవాహిక సంబంధాలకు మంచిది.

 కిటికీ పక్కన పింక్‌ లేదా హృదయాకారం లో ఉన్న క్రిస్టల్స్‌ను తగిలించుకోవాలి లేదా ఒక పింక్‌ క్వార్ట్‌జ్‌ క్రిస్టల్‌ను  వెలుగు పడేలా బల్ల మీద ఉంచాలి. తద్వారా అది ప్రేమకు సంబంధించి సానుకూల శక్తిని పెంచుతుంది.

 వ్యాయామం చేసే పరికరాలు, కంప్యూటర్‌, పనికి సంబంధించిన ఇతర సామాగ్రిని పడక గదిలో నుంచి వేరే గదికి    తరలించాలి. వాటిని బెడ్‌రూంలో ఉంచడం వల్ల మీ మధ్య సంబం ధాలు కూడా పనికి సంబంధించిన వాటిలానే  అనిపిస్తాయి.

 అలాగే సూది మొనలు కలిగిన ఫర్నిచర్‌ను బెడ్‌రూంలో ఉంచుకోకపోవడం మంచిది. ఇవి విషపు బాణాలలా పని  చేస్తాయి. గుం డ్రటి అంచులు కలిగిన ఫర్నిచర్‌ ఉత్తమం.


సంపదను పెంచే వాస్తు నియమాలు తెలుసుకోండి 

 ఆధునిక కాలంలో అనేక సమస్యలకు కారణం డబ్బు అంటే అతిశయోక్తి కాదు. ఏ పని చేయాలన్నా ముందుగా కావలసింది డబ్బే అనే పరిస్థితి నేడు నెలకొని ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత డబ్బును ఆదా చేయాలనుకుంటారు. అయితే ఎంత సంపాదించినా ఒక్క రూపాయని కూడా నిలుపుకోలేని పరిస్థితి కొందరి ఇళ్ళల్లో కనుపిస్తుంటుంది. అందుకు కారణాలు అనేకం. ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టకపోవడం, అనవసర ఖర్చులు చేయడం వంటివే కాక ఇంటికి సరైన వాస్తు లేకపోవడం కూడా ఈ పరిస్థితికి దోహదం చేస్తుంది అంటున్నారు వాస్తు నిపుణులు. 


 సంపాదించిన డబ్బును పొదుపు చేయడం లేదా మరింత డబ్బు సంపాదించాలనుకోవడానికి వాస్తు పరమైన మార్పులను కొన్నింటి ని సూచిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం...ఇంటికి నైరుతి మూలను తమిళులు కుబేర స్థానమంటారు. ఇక్కడ ఎటువంటి సంప్‌ కా నీ, సెప్టిక్‌ టాంక్‌ కానీ బోర్‌వెల్‌ కానీ భూమిలోపల ఎటువంటి నిర్మాణం లేకుండా చూసుకోవడం వల్ల ఇంట్లో ధనం నిలుస్తుంది.నగలు, ఇతర విలువైన పత్రాలు పెట్టే బీరువాలను, లాకర్లను వాస్తు ప్రకారం పెట్టుకోవాలి. తూర్పు ముఖంగా తలుపు తెరుచుకునే పశ్చిమపుగోడకు వీటిని పెట్టడం మంచిది. లేదా తూర్పు లేదా ఉత్తర ముఖంగా తలుపు తెరుచుకునేలా నైరుతి మూల ఉంచాలి.


 లాకర్లు ఉత్తర ముఖం తెరుచుకునేలా దక్షిణపు గోడకు పెట్టడం కూడా అదృష్టాన్ని తీసుకువస్తుంది. లాకర్‌ తలుపులు ఉత్తరముఖంగా తెరుచుకోవడం మంచిది. ఎందుకంటే వాస్తు ప్రకారం ఈ దిక్కుకి కుబేరుడు అధిపతి. బీరువాను ఈశాన్య మూలలో ఎప్పుడూ పెట్టకూడదు. ఎందుకంటే దీనివల్ల సంపద నష్టం జరుగుతుంది. ఆగ్నేయ, వాయువ్య దిక్కులు కూడా మంచివి కావు ఎందుకంటే దీనివల్ల అనవసర ఖర్చులు అధికమవుతాయి. డబ్బులు పెట్టుకునే బీరువాను ఎప్పుడూ దూలం కింద ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఆర్థిక స్థిరత్వం మీద ఎక్కువ ఒత్తిడి పెడుతుంది.ఈశాన్య మూల కూడా సంపద వృద్ధికి తో డ్పడుతుంది. ఇంటికి ఈ మూలన సంప్‌, బోర్‌వెల్‌ లేదా బావి నిర్మిస్తే అభివృద్ధి, స్థిరత్వం వస్తాయి.


 ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిల్వ ఉండకపోవడం లేక అది వృద్ధి జరగకపోవడం వంటివి ఎదుర్కొంటుంటే ఇంట్లో రాత్రంతా కనీసం ఒక దీపానై్ననా వెలగని స్తూ ఉండాలిట. ఎందుకంటే కాం తి కూడా ఒక రకమైన శక్తే. ఫెంగ్‌షూయ్‌ ప్రకారం దీన్ని యాంగ్‌ శక్తి అం టారు. ఇది చలనం తీసుకువస్తుంది.ఇంట్లో చేపల అక్వేరియం పెట్టుకోవడం సంపద వృద్ధి కావడానికి దోహదం చేస్తుందిట. ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండే చేపలను ఎం చుకొని ఇంటికి తెచ్చుకోవాలి. నీటిని శుభ్రం గా, గాలిపోయేలా ఉంచాలి. చేపలు అక్వేరియంలో తిరుగుతూ ఉంటే ఆ శక్తి ఇంట్లో సం పద వృద్ధి కావడానికి దోహదం చేస్తుందిట. దీ నిని గదిలో నైరుతి దిక్కున ఉంచడం మంచిది.

 మీ అపార్ట్‌మెంట్‌ ముఖద్వారం పొడవైన కా రిడార్‌ చివర ఉన్నప్పుడు అక్కడ ప్రవహించే శ క్తి చాలా ఉధృతంగా ఉంటుంది. ఇది మీ ఆర్థిక పె ట్టుబడులకు రిస్క్‌ కాగలదు. దీనిని తగ్గించేందుకు కారిడార్‌ మధ్యలో అంటే దారికి అడ్డంగా కాదు గాని ఒక వైపు ఒక మొక్కను పె డితే ఆ ఉధృతి తగ్గుతుంది. 

 ఇంటి ముఖ ద్వారానికి మంచి రంగులు వేయడం ద్వారా సంపదను ఆహ్వానించవచ్చు. పక్కింటివారి గోడలకు, ముఖద్వారాలకు భిన్నంగా, ఆకర్షణీయమైన రంగులు వేసుకోమంటున్నారు నిపుణులు. 

 ముఖ్యంగా జీవితంలో ఆర్థికాంశాల పట్ల మరింత స్పష్టత కావాలనుకున్నప్పుడు మీ ఇం ట్లో గాజు వస్తువులను ఒకసారి పరిశీలించండి.

 ముఖ్యంగా ఇంటికి గాజు కిటికీ తలుపులు వుంటే అవి ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. మురికిగా ఉన్న అద్దపు తలుపులు సంపదను లోనికి రానివ్వవట.కిటికీకి క్రిస్టల్స్‌ వేలాడదీయడం వల్ల శక్తి చురుకుగా ప్రవహిస్తుంది. సూర్యకిరణాలు వా టిని తాకినపుడు అవి రంగు రంగుల అద్భుత ఇంద్రధనస్సులను సృష్టిస్తాయి. నేరుగా సూర్యకిరణాలు ప్రసరించే కిటికీని ఎంచుకుని అక్క డ ఒక క్రిస్టల్‌ను వేలాడదీస్తే మీ కెరీర్‌ వృద్ధికి అది దోహదం చేస్తుందంటున్నారు.ఆదాయానికన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటే మొక్కలను కానీ విత్తనాలను కానీ టాయిలెట్లలో ఉంచాలి. ఇది ధన ప్రవాహం వృధా కావడాన్ని నిరోధిస్తుంది. ఎందుకంటే ఎదిగేవి ఏవైనా నీటి శక్తిని తిరిగి పీల్చుకొని రీసైకిల్‌ చేస్తుంటాయి.మీ క్యాష్‌ బాక్స్‌ను లేదా లాకర్‌ను ప్రతిఫలించేలా బీరువాలో ఒక అద్దాన్ని పెట్టండి.


 ఇది మీ సంపదను సంకేతాత్మకంగా రెట్టింపు చేస్తుంది.ఇంట్లో అస్సలు డబ్బు నిలబడకుండా జీవితంలోంచే అదృశ్యమైపోతున్నట్టు అనిపించినపుడు ఇంటి ఎడమ మూలన బాగా బరువుగా ఉండే వస్తులను పెట్టండి. దానితో పాటుగా బాగా వెలుతురు వచ్చేలా చూడండి.సంపదను పెంచుకోవాలంటే ఆహ్లాదకరంగా నీరు పారే శబ్దం వినిపించేలా చిన్న ఫౌంటెన్‌ ఇంట్లో పెట్టుకోండి. అది డెస్క్‌ మీద పెట్టుకునేదైనా పర్లేదు. వాటర్‌ ఫౌంటెన్‌లా డబ్బును, సంపదను ఆకర్షించే శక్తి మరేదీ లేదు. నీరు పారే శబ్దం ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేలా చేస్తుంది.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again