పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 06, 2015

అయస్కాంతత్వం - ధర్మాలు - తయారు చేయు విధానం - అయస్కాంతం రకాలు

అయస్కాంతత్వం (MAGNETISM)

వస్తువుల యొక్క ఒక అయస్కాంత క్షేత్రామునకు పరమాణు సంబంధముగా కాని లేక ఉప పరమాణు స్థాయిలో కాని ప్రతిస్పందించే లక్షణమును అయస్కాంతత్వం అంటారు. 

        అయస్కాంతం కొన్ని పదార్థాలనే తనవైపు ఆకర్షిస్తుంది ఎందుకు? మేడ పైనుంచి అయస్కాంతాన్ని కిందికి వదిలేస్తే ఏమవుతుంది? అయస్కాంతాల్లో ఎన్ని రకాలు ఉంటాయి? అన్నింటి కంటే బలమైన అయస్కాంతాలు ఏవి? అయస్కాంతాలను కృత్రిమంగా ఎలా తయారు చేస్తారు? వీటి వల్ల ఉన్న ఉపయోగాలు ఏమిటి? తదితర అంశాల గురించి తెలుసుకుందాం....
అయస్కాంతాలు రెండు రకాలు. సహజ అయస్కాంతాలు, కృత్రిమ అయస్కాంతాలు. 

సహజ అయస్కాంతాలు (Natural Magnets):
¤ భూమిలో దొరికే, సహజంగా ఆకర్షణ ధర్మం కలిగి ఉన్న రాళ్లను సహజ అయస్కాంతాలు అంటారు.

                     

¤ ఇవి క్రమరహిత ఆకారాల్లో లభిస్తాయి.

¤ ఇవి బలహీనంగా ఉంటాయి.

¤ వీటికి అయస్కాంతత్వం తక్కువ.

¤ వీటిని ప్రత్యేక అవసరాలకు ఎక్కువగా ఉపయోగించరు.

ఉదా: లోడ్ స్టోన్, మేగ్నటైట్

కృత్రిమ అయస్కాంతాలు (Artificial Magnets):
¤ సహజ అయస్కాంతాలను సరైన పద్ధతిలో బాహ్య అయస్కాంతం ఉపయోగించి రుద్దితే కృత్రిమ అయస్కాంతాలు తయారవుతాయి.

                      

¤ వీటిని కావాల్సిన నిర్దిష్ట ఆకృతిలో తయారు చేస్తారు.

¤ ఇవి చాలా శక్తిమంతమైనవి.

¤ వీటికి అయస్కాంతత్వం ఎక్కువ.

¤ విద్యుదయస్కాంతాలను టేపురికార్డర్లు, స్పీకర్లు, డైనమోలు, మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్‌లలో ఉపయోగిస్తారు.

ధర్మాలు
అయస్కాంతాలు కింది ధర్మాలను పాటిస్తాయి.



ఆకర్షణ ధర్మం (Attractive Property):
అయస్కాంతానికి అయస్కాంత పదార్థాలను ఆకర్షించే గుణం ఉంటుంది. ఈ గుణం అయస్కాంత కొనల దగ్గర గరిష్ఠంగా, మధ్య భాగంలో కనిష్ఠంగా ఉంటుంది.
    

దిశాధర్మం (Directive Property):
అయస్కాంతాన్ని స్వేచ్ఛగా క్షితిజ సమాంతరంగా వేలాడదీస్తే అది ఎప్పుడూ ఉత్తర, దక్షిణ దిశలను సూచిస్తుంది.

ధ్రువాల జంట నియమం
అయస్కాంత ధ్రువాలు జతలుగా ఉంటాయి (ఉత్తర ధ్రువం N, దక్షిణ ధ్రువం S). వీటిని విడదీయలేం. ఏకధ్రువాలు విడివిడిగా ఉండలేవు.

అయస్కాంత ప్రేరణ ధర్మం
అయస్కాంతం, అయస్కాంత పదార్థాలైన ఇనుము (Fe), కోబాల్ట్ (Co), నికెల్ (Ni), ఉక్కు లాంటి వాటిలో అయస్కాంతత్వాన్ని ప్రేరేపిస్తుంది.

అయస్కాంతీకరణ పద్ధతులు

ఏకస్పర్శ పద్ధతి: ఒక దండాయస్కాంతం సహాయంతో ఉక్కుకడ్డీని అనేకసార్లు రుద్దితే ఉక్కుకడ్డీ అయస్కాంతంగా మారుతుంది. ఉక్కుకడ్డీని అయస్కాంతీకరించడానికి దండాయస్కాంతానికి చెందిన ఏ ధ్రువాన్ని ఉపయోగించామో ఉక్కుకడ్డీ ప్రారంభపు కొన అదే ధ్రువసత్వం పొందుతుంది. రెండో కొన వ్యతిరేక ధ్రువసత్వం పొందుతుంది.

ద్విస్పర్శ పద్ధతి: రెండు బలమైన దండాయస్కాంతాలను ఉపయోగించి ఉక్కుకడ్డీని అయస్కాంతంగా మారుస్తారు. ఏ కొన దగ్గరైతే అయస్కాంత ఉత్తర ధ్రువం ఉక్కుకడ్డీని వదిలిపెడుతుందో ఆ కొన దక్షిణ ధ్రువంగా మారుతుంది. ఏ కొనను దక్షిణ ధ్రువం వదిలిపెడుతుందో ఆ కొన ఉత్తర ధ్రువం అవుతుంది.

విద్యుత్ పద్ధతి: అయస్కాంతంగా మార్చాల్సిన ఉక్కుకడ్డీకి రాగితీగను చుట్టి బ్యాటరీ ద్వారా విద్యుత్‌ను ప్రవహింపజేస్తే ఉక్కుకడ్డీ శాశ్వత అయస్కాంతంగా మారుతుంది. విద్యుత్ పద్ధతిలో అధిక శక్తిమంతమైన అయస్కాంతాలను తయారుచేస్తారు.

ప్రేరణ పద్ధతి: అయస్కాంత ప్రేరణ ధర్మాన్ని ఉపయోగించి కృత్రిమ అయస్కాంతాలను తయారుచేస్తారు.

విద్యుదయస్కాంతం తయారీ
         కడ్డీ చుట్టూ చుట్టిన తీగచుట్ట ద్వారా విద్యుత్‌ను ప్రవహింపజేసినప్పుడు అయస్కాంతంగా మారి, విద్యుత్ ఆపివేసినప్పుడు అయస్కాంతత్వాన్ని కోల్పోతే దాన్ని విద్యుదయస్కాంతం అంటారు. విద్యుత్ అయస్కాంత తయారీకి మెత్తటి ఇనుమును ఉపయోగిస్తారు.

నిరయస్కాంతీకరణం
¤ అయస్కాంతాన్ని సున్నితంగా ఉపయోగించకపోతే అది తన అయస్కాంతత్వాన్ని కోల్పోతుంది.

¤ అయస్కాంతాన్ని రబ్బరు సుత్తితో అనేకసార్లు కొడితే అయస్కాంతత్వం పోతుంది.

¤ వేడిచేసినా అయస్కాంతత్వాన్ని కోల్పోతుంది.

¤ చాలా ఎత్తు నుంచి భూమిపై పడేస్తే అయస్కాంతం తన గుణాన్ని కోల్పోతుంది.

పదార్థాల అయస్కాంత వర్గీకరణ
         అయస్కాంతాల ఆకర్షణ ధర్మాన్ని అనుసరించి అయస్కాంత పదార్థాలను 3 వర్గాలుగా విభజించారు. అవి

¤ డయా అయస్కాంత పదార్థాలు

¤ పారా అయస్కాంత పదార్థాలు

¤ ఫెర్రో అయస్కాంత పదార్థాలు

డయా అయస్కాంత పదార్థాలు
¤ అయస్కాంతంతో బలమైన వికర్షణకు గురయ్యే పదార్థాలను డయా అయస్కాంత పదార్థాలు అంటారు.

     

¤ వీటి సాపేక్ష ప్రవేశ్య శీలత (µr) ఒకటి లేదా ఒకటికంటే తక్కువగా ఉంటుంది (µr ≤ 1 ).

¤ వీటి ససెప్టిబిలిటీ () తక్కువ, రుణాత్మకం.
ఉదా: గాలి, నీరు, బిస్మత్, బంగారం, పాదరసం, ఆల్కహాల్, హైడ్రోజన్ మొదలైనవి.


పారా అయస్కాంత పదార్థాలు
¤ అయస్కాంతం స్వల్పంగా ఆకర్షించే పదార్థాలను పారా అయస్కాంత పదార్థాలు అంటారు.

¤ వీటి సాపేక్ష ప్రవేశ్య శీలత (µr) ఒకటి కంటే ఎక్కువగా ఉంటుంది (µr > 1).

¤ వీటి ససెప్టిబిలిటీ () తక్కువ, ధనాత్మకంగా ఉంటుంది.
ఉదా: ఆక్సిజన్, అల్యూమినియం, ప్లాటినం, క్రోమియం మొదలైనవి.


ఫెర్రో అయస్కాంత పదార్థాలు
¤ అయస్కాంతం వల్ల అధికంగా ఆకర్షణకు గురయ్యే పదార్థాలను ఫెర్రో అయస్కాంత పదార్థాలు అంటారు.

                             

¤ వీటి సాపేక్ష ప్రవేశ్య శీలత (µr) ఒకటికంటే చాలా ఎక్కువ ( µr >> 1 ).

¤ వీటి ససెప్టిబిలిటీ () చాలా ఎక్కువ, ధనాత్మకంగా ఉంటుంది.
ఉదా: ఐరన్ (Fe), కోబాల్ట్ (Co); నికెల్ (Ni), గడోలినియం (Gd); డిస్ప్రాన్షియం (Dy).


ఉపయోగాలు
¤ అయస్కాంత సూచిని సముద్రం మధ్యలోని ఓడ స్థానాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. అయస్కాంత సూచి దిశాధర్మంతో నావికా దిక్సూచిని తయారు చేస్తారు.

¤ మామూలు రాళ్ల నుంచి ఇనుప ఖనిజాన్ని వేరుచేయడానికి అయస్కాంతాన్ని ఉపయోగిస్తారు.

                                   

¤ విద్యుదయస్కాంతాన్ని పెద్దపెద్ద దూలాలు, బరువులను ఎత్తడానికి ఉపయోగించే ఎలక్ట్రికల్ క్రేనుల్లో ఉపయోగిస్తారు.

¤ విద్యుదయస్కాంతాలను టేపురికార్డర్లు, స్పీకర్లు, డైనమోలు, మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్‌లలో ఉపయోగిస్తున్నారు.

ముఖ్యమైన ప్రమాణాలు - విలువలు
¤ ధ్రువసత్వం (m): M.K.S. ప్రమాణం = వెబర్
                           SI ప్రమాణం = ఆంపియర్ - మీటరు

¤ శూన్యం ప్రవేశ్యశీలత (µ0) విలువ =
                                  ప్రమాణం = హెన్రీ/ మీటరు

¤ శూన్యం లేదా గాలి సాపేక్ష ప్రవేశ్యశీలత (µr) = 1. ప్రమాణాలు లేవు.

¤ ప్రమాణ ధ్రువసత్వం: 1 మీటరు దూరంలో 10 -7 N బలంతో వికర్షించేది.

¤ అయస్కాంత ప్రేరణ లేదా అయస్కాంత అభివాహ సాంద్రత (B):
1. వెబర్/ మీటరు2
2. న్యూటన్/ ఆంపియర్ - మీటరు 3. టెస్లా

¤ అయస్కాంత భ్రామకం (M): ఆంపియర్ - మీటరు2

¤ అయస్కాంతీకరణ తీవ్రత (I): ఆంపియర్/ మీటరు

¤ అయస్కాంత ససెప్టిబిలిటీ (): ప్రమాణాలు లేవు.

శాస్త్రీయ పదాలు
¤ లాక్టోమీటర్: పాల స్వచ్ఛతను తెలియజేస్తుంది.

¤ హైగ్రోమీటరు: గాలిలోని తేమను కొలిచే పరికరం.

¤ హైడ్రోమీటరు: ద్రవాల సాపేక్ష సాంద్రతను కొలవడానికి ఉపయోగిస్తారు.

¤ పాథోమీటరు: సముద్రపు లోతును కొలవడానికి ఉపయోగిస్తారు.

¤ ఆడోమీటరు: ధ్వని తీవ్రతను తెలుసుకోవడానికి తోడ్పడుతుంది.

¤ ఆల్టీమీటరు: అక్షాంశాల ఎత్తును తెలుసుకోవడానికి సాయపడుతుంది.

కొన్ని ముఖ్య ఆవిష్కరణలు

అయస్కాంత బల సూత్రం               - కూలూంబ్

అయస్కాంత అణు సిద్ధాంతం          - ఈవింగ్

ఎలక్ట్రాన్ ఉనికి                               - థాంప్సన్

న్యూట్రాన్ల ఉనికి                             - ఛాడ్విక్

ధనధ్రువ కిరణాలు                         - గోల్డ్‌స్టెయిన్

విద్యుత్ విశ్లేషణ                             - ఫారడే

స్వర్ణపత్ర విద్యుత్‌దర్శిని                  - బెన్నెట్

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again