పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 08, 2015

విజయనగర సామ్రాజ్యం

                                                సోషల్ కంటెంట్ - డి .ఎస్.సి స్కూల్ అసిస్టెంట్ 2014-15

మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో దక్షిణాన స్థాపించిన హిందూ రాజ్యం విజయనగర సామ్రాజ్యం.

¤ క్రీ.శ. 1336లో తుంగభద్రా నది ఒడ్డున విద్యారణ్య స్వామి సహాయంతో హరిహరరాయలు, బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు.

¤ వీరు సంగమ వంశస్థులు. విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశాలు పరిపాలించాయి.


         



 విజయనగర సామ్రాజ్య చరిత్ర 
విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర (హక్క) మరియు బుక్క అనే అన్నదమ్ములు 1336 లో స్ధాపించారు. వారి రాజధాని మొదట ఆనెగొంది. ఆనెగొంది ప్రస్తుతము తుంగభద్ర ఉత్తర తీరమున ఒక చిన్న పల్లె. సామ్రాజ్యము బుక్కరాయని పరిపాలనలో అభివృద్ధి చెందిన తరువాత రాజధానిని తుంగభద్ర దక్షిణ తీరమున గల విజయనగరము నకు తరలించారు. ఈ సామ్రాజ్యం 1336 నుండి 1660 వరకు వర్ధిల్లింది. చివరి శతాబ్దాన్ని దీనికి క్షీణదశగా చెప్పుకోవచ్చు. సుల్తానుల సమాఖ్య వీరిని తళ్ళికోట యుద్ధంలో దారుణంగా ఓడించింది. సుల్తానుల సైన్యం రాజధానిని ఆరునెలల పాటు కొల్లగొట్టి, నేలమట్టం చేశారు. ఈ సామ్రాజ్యపు స్థాపన వివరాలూ, దాని చరిత్రలో ఎక్కువ భాగం అస్పష్టంగా ఉన్నాయి; కానీ దాని శక్తీ, అర్ధిక పుష్ఠి లను పోర్చుగీసు యాత్రికులైన డోమింగో పేస్‌, నూనిజ్‌ వంటి వారే కాక మరి కొందరు కూడా నిర్ధారించారు.

 రాయలవారి రెండో రాజధాని పెనుగొండ. ప్రస్తుతం గంగావతి,ఆనెగొందిలో రాయల వంశానికి చెందిన 17వ తరం వారున్నారు. ఆనెగొందిలో ఏ ఇంట్లో పెళ్లి జరిగినా రాయల వారి ఇంటి నుంచే తాళిబొట్టు వెళుతుంది. ముస్లింలు సైతం ఏ పండుగ వచ్చినా నమాజ్ చేసిన తర్వాత నేరుగా రాయలవారి ఇంటికే వెళ్లి వారికి శుభాకాంక్షలు చెప్పిన తర్వాతే మిగతా కార్యక్రమాలు మొదలుపెడతారు. ఈ ఆచారం వందల సంవత్సరాలుగా ఆ గ్రామంలో కొనసాగుతోంది.

 శ్రీరంగనాథస్వామి దేవాలయం, నవ బృందావనం, ఉచ్చప్పయ్య మఠం, 64 స్తంభాల మండపం, చింతామణి ఆలయం, గజశాల, ఒంటెశాల, ఆదిశక్తి దుర్గాదేవి ఆలయం, మేల్కోటే, గవి రంగనాథస్వామి దేవాలయం, పంపా సరోవరం (విజయలక్ష్మి దేవస్థానం), అంజినాద్రిబెట్ట ఆలయాలన్నింటిలోనూ రాయల కుటుంబీకుల ఆధ్వర్యంలోనే హోమాలు, ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. రాయల కుటుంబీకుల్లో ఎవరి వివాహం నిశ్చయమైనా మొదట హంపిలోనే పూజలు చేస్తారు.

 విజయనగర సామ్రాజ్య స్థాపన
విజయనగర సామ్రాజ్య స్థాపనకు శతాబ్దము మునుపు దక్షిణ భారత దేశమునందలి రాజ్యములను ముస్లింలు జయించారు. 1309 లో మాలిక్ కాఫర్ ఓరుగల్లు ను ఆక్రమించి మలబార్ రాజ్యములపై దాడి చేశాడు. ఆ సమయమున హరహర మరియు బుక్క అను సోదరులు ప్రతాపరుద్రుని ఆస్థానములో కోశాధికారులుగా ఉన్నారు. సోదరులిద్దరిని ఢిల్లీకి తరలించి ఇస్లాము మతానికి మార్చారు. హోయసల రాజు తిరుగుబాటు అణచివేయుటకు సుల్తాను వీరిద్దరినీ ద్వారసముద్రము పంపాడు. సోదరులు తమకిచ్చిన కార్యము నెరవేర్చారు గాని శ్రీ విద్యారణ్య స్వామి ప్రభావముతో తిరిగి హిందూ మతము స్వీకరించి విజయనగర రాజ్యము స్థాపించారు

 హరిహర రాయలనే దేవరాయలని కూడా అంటారు. అతడే విజయనగర సామ్రాజ్యానికి తొలి చక్రవర్తి. ముస్లిమ్ చరిత్రకారుడు బర్ని ప్రకారము బుక్కరాయలు ముసునూరి కాపనీడు బంధువు. కాని ఇది సబబుగా తోచదు. దక్కను ప్రాంతంలోని ముస్లిమ్ సామంతుల తిరుగుబాట్ల వల్ల ముహమ్మద్ తుగ్లక్ పాలన అంతమవడంతో హరిహరరాయలు ఏలుబడిలోని ప్రాంతం త్వరితంగా విస్తరించింది. విజయనగర రాజధాని 1340 ప్రాంతంలో ఆనెగొందికి ఎదురుగా తుంగభద్రానదికి ఆవలి తీరాన స్థాపించబడింది. హరిహరరాయల తర్వాత 1343 లో అధికారంలోకి వచ్చిన బుక్కరాయలు 1379 వరకు పాలించాడు. అతడి పాలనా కాలం చివరకొచ్చేసరికి దక్షిణభారత దేశంలో తుంగభద్రానదికి దక్షిణాన ఉన్న ప్రాంతమంతా దాదాపుగా అతడి ఏలుబడిలోకి వచ్చింది.

 విజయనగర సామ్రాజ్య అభివృద్ధి 

 1510 ప్రాంతాల్లో బిజాపూరు సుల్తాను అధీనంలో ఉన్న గోవా ను పోర్చుగీసు వారు ఆక్రమించుకున్నారు. ఇది బహుశా విజయనగర రాజ్యపు అనుమతి లేదా రహస్య అవగాహన ద్వారా జరిగి ఉండవచ్చు. వీరిద్దరి మధ్య ఉన్న వ్యాపార సంబంధాలు వీరికి చాలా ముఖ్యమైనవి.



 శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో ఈ సామ్రాజ్యం ఉచ్ఛస్థితికి చేరింది. దక్కనుకు తూర్పున కొండవీడు, రాచకొండ, కళింగుల అధీనంలోగల ప్రాంతాలను, తమిళదేశమును వశపరచుకున్నాడు. సామ్రాజ్యపు గొప్ప గొప్ప నిర్మాణాలు ఆయన తోటే మొదలయ్యాయి. విజయనగరం లోని హజార రామాలయం, కృష్ణ దేవాలయం, ఉగ్ర నరసింహ మూర్తి విగ్రహం వీటిలో కొన్ని.

 1530 లో అచ్యుతరాయలు ఆయనకు వారసుడయ్యాడు. 1542 లో అళియ రామరాయలు గద్దెనెక్కాడు. ఇతడు దక్కను సుల్తానులను అనవసరంగా రెచ్చగొట్టి వారి శత్రుత్వం కొనితెచ్చుకున్నట్లు కనిపిస్తుంది. 1565 తళ్ళికోట యుద్ధంలో విజయనగర సైన్యాన్ని దక్కను సుల్తానులు చిత్తుగా ఓడించారు. సంయుక్త సుల్తాను సైన్యం రాజధానిని సర్వనాశనం చేసి, నేలమట్టం చేసింది. యుద్దంనుండి సజీవముగా బయటపడిన రామరాయల తమ్ముడు తిరుమలరాయలు, సదాశివరాయలతో సహా పెనుకొండకు పారిపోయాడు.
విద్యా, సాంస్కృతిక పరంగా విజయనగర సామ్రాజ్య కాలాన్ని స్వర్ణయుగంగా పరిగణిస్తారు.

 విజయనగర సామ్రాజ్య పతన దశ
 తళ్ళికోట యుద్ధానంతర దశను విజయనగర సామ్రాజ్య పతనదశగా చెప్పుకోవచ్చు. 1565లో తళ్లికోట యుద్ధం జరిగి యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పూర్తిగా ఓటమిచెందిన తర్వాత తిరుమల దేవరాయలు నామమాత్ర పరిపాలకుడైన సదాశివరాయలను తీసుకుని విజయనగర ఖజానాను ఎత్తుకుని పెనుకొండకు పారిపోయారు. విజయనగరాన్ని పాదుషాలు నేలమట్టం చేసి వదిలిపోయాకా తిరుమల దేవరాయలు ఆ రాజధానిని బాగుచేసుకుని పరిపాలించేందుకు మూడేళ్ళపాటు ప్రయత్నించారు. స్మశానంలా తయారైన ఈ రాజధానిని తిరిగి ఏలుకోలేక పెనుకొండకు తిరిగివచ్చారు. అంతటితో విజయనగర సామ్రాజ్యపు రాజధానిగా విద్యానగరం ముగిసిపోయింది. ఆపైన కొన్నేళ్ళు పెనుకొండ, మిగిలిన సంవత్సరాలు చంద్రగిరిలను రాజధానులుగా చేసుకుని పాలించారు

 తళ్ళికోట ఓటమి తర్వాత రాజ్యభాగాలు తగ్గిపోనారంభించాయి. తిరుమలదేవరాయలు తన ముగ్గురు కుమారులను మూడు ప్రాంతాలకు ప్రతినిధులుగా పరిపాలింపజేశారు. పెద్దకుమారుడైన రామరాయలు కన్నడప్రాంతాలను శ్రీరంగపట్నం రాజధానిగా పరిపాలించారు. రెండో కుమారుడు శ్రీరంగ దేవరాయలు పెనుగొండను రాజధానిగా చేసుకుని తెలుగు ప్రాంతాలను పరిపాలించారు. మూడో కుమారుడు వేంకటపతి దేవరాయలు మొదట చంద్రగిరిని రాజధానిగా చేసుకుని తమిళ ప్రాంతాలు పాలించేవారు. విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తిగా శ్రీరంగదేవరాయలు తెలుగు ప్రాంతాల విషయంలో చాలా ప్రయత్నాలు చేసి, వైభవాన్ని పునరుద్ధరించేందుకు విఫలయత్నాలు చేశారు. బీజాపూరు సుల్తానులతో కొన్ని యుద్ధాల్లో గెలిచి, కొన్ని ఓడిపోయారు. ఆయనకు పుత్రసంతానం లేకపోవడంతో చిన్నతమ్ముడు చంద్రగిరి పాలకుడు అయిన వేంకటపతి దేవరాయలకు రాజ్యాన్నిచ్చారు. ఆయన పాలనకాలంలోనే బ్రిటీషు వారికి మద్రాసు పట్టణం ఏర్పాటు చేయటానికి భూమి మంజూరు చేశారు. కొంతకాలం పాటు పెనుకొండను రాజధానిగా చేసుకుని అన్నగారు ఇచ్చిన సామ్రాజ్యాన్ని పాలించినా ఆపైన మాత్రం రాజధానిని తన పట్టణమైన చంద్రగిరికే మార్చుకున్నారు. ఆయన విజయనగర సామ్రాజ్యపు ఆఖరి గొప్ప చక్రవర్తిగా పేరొందారు. ఆయన కాలంలో శ్రీరంగపట్నాన్ని ఒడయారు రాజులు స్వతంత్రం ప్రకటించుకున్నారు. స్వాతంత్రాన్ని ప్రకటించుకోకపోయినా కొందరు రాజులు స్వతంత్రించే వ్యవహరించేవారు

 విజయ నగర రాజుల కాలంనాటి పన్నులు
 విజయనగర రాజ్యంలో పన్నులు చాలా ఎక్కువగా ఉండేవి, ఎక్కువ ఆదాయం, ఎక్కువ పన్నులుగా ఉండేవి. పన్నుల అధికారిగా భాండాగర్రి అని ఓ పదవి ఉండేది, ఇది చాలా అత్యున్నతమైనది, ప్రధాన మంత్రి తరువాత ఇదే విలువైనది.

 రాజునకు ఆదాయ మార్గాలు చాలా ఉండేవి, ముఖ్యముగా భూమిశిస్తుపై ఆధారపడి ఉండేవారు.

భూమిశిస్తు
 పంటపొలాలు కొలిపించేవారు, తరువాత న్యాయముగా 1/6 వ వంతు శిస్తు వసూలు చేసేవారు, కానీ చాలా పర్యాయములు ఇవి ఎక్కువగా ఉండేవి, చాలాసార్లు సగంకంటే ఎక్కువ పంట శిస్తుగా కట్టవలసి వస్తూ ఉండేది, కానీ భ్రాహ్మణుల కిచ్చిన అగ్రహారములందూ, ఇనాము భూములపైననూ న్యాయమైన 1/6 వ వంతు మాత్రమే వసూలు చేసేవారు, దేవాయల భూములపై 1/30 వ వంతు మాత్రమే వసూలు చేసేవారు. అడవులను కొత్తగా కొట్టి గ్రామములను ఏర్పరచి వ్యవసాయం చేసినవారికి పన్నులలో మినహాయింపు ఉండేది. మాగాణి, మెట్టభూములపై పన్నులు విడివిడిగా ఉండేవి. ఈ శిస్తు ధనముగా కానీ, ధాన్యముగా కానీ ఉండేది. మాగాణి భూములపై ధాన్యం రూపంలోనూ తోటలపైన అయితే ధనం రూపంలోనూ ఉండేది. రైతులు పన్నులు కట్టలేక వలసపోయిన దృష్టాంతములు కలవు. గ్రామములయందు పన్నులు వసూలు చేయడానికి కరణము అను అధికారి ఉండేవాడు.


ఇతర పన్నులు



మత పన్ను
వృత్తి పన్ను
సామాజిక పన్ను
వాణిజ్య పన్ను
పుల్లరి
కొండగట్టు పన్ను
గ్రామదేవత పూజలపై పన్నులు
వేశ్యలపై పన్ను
మగ్గముపన్ను
ఆదాయపు పన్ను
ఉప్పు పన్ను
నిధి నిక్షేపాలపై పన్ను
పశువులపై పన్ను
నీటి బుగ్గలపై పన్ను
స్థిరాస్తులపై పన్నులు
ఎండుగడ్దిపై పన్ను
దేవాలయ యాత్రికులనుండి పన్ను
వివాయములపై పన్ను
ఊరేగింపులపై పన్ను

వృత్తి పన్ను
ఎంత చిన్న ఆదాయమైననూ, వృత్తిపన్ను చెల్లింపవలసి వచ్చేది, చాకలి, మంగలి, కుమ్మరి, పంచాణమువారు, పశువులకాపరులు, జంగమవృత్తి,చర్మకారులు, మేళగాండ్రు, మొదలగువారు వృత్తిపన్నులక్రిందకి వచ్చేవారు.

వేశ్యలపై పన్ను
వేశ్యలపై కూడా పన్ను ఉండేది. విజయనగరమందున్న వేశ్యలు చెల్లించేపన్ను 12,000 మంది సైనికాధికారులకు సరిపొయ్యేవి.


 విజయ నగర రాజుల కాలంనాటి ఆర్ధిక పరిస్థితులు
విజయనగర రాజుల ఆర్థిక పరిస్థితి పటిష్టముగా ఉండేది. దేశము సుభిక్షముగా ఉండేది, రాజాధాయమున అన్ని వ్యయాలూ పోను సంవత్సరాంతమునకు లక్ష మాడలు విగులు ఉండేవి.


సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితి
సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితి బాగుగానే ఉండేది, వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం. భూమి సారవంతమైనది, వ్యవసాయదారులు మంచి పంటలు పండించేవారు. రాజులు వ్యవాసాయాభివృద్దికి మంచి చర్యలు తీసుకునేవారు, అనేక చెరువులూ, కాలవులూ తవ్వించి వ్యవసాయాభివృద్దికి దోహదంచేసేవారు.
పండ్లతోటలు అనేకరకాలు పెంచేవారు, కొద్దిగా ధనవంతులే వరి అన్నమును తినేవారు, మిగిలిన రైతులూ, రైతుకూలీలు పేదవారు రాగులూ, జొన్నలు, తినేవారు.

 వ్యవసాయాధార పరిశ్రమలు ప్రతిగ్రామములోనూ ఉండేవి, బెల్లము, నెయ్యి తయారి, నీలిమందు తయారి, వస్త్ర పరిశ్రమ ముఖ్యమైనవి. తాడిపత్రి, ఆదవాని, వినుకొండ, గుత్తి, రాయదుర్గము పట్టుపరిస్రమకు ప్రసిద్దిపొందిన కేంద్రాలు. ఒక్క అలవకొందలోనే 411 మగ్గాలు ఉండేవి, ఈ మగ్గాలు పై ఆధారపడి 2000 మంది జీవించేవారు.

వజ్రములు
కర్నూలు, గుత్తి, అనంతపురంలందు లభించు వజ్రములు చాలా పశస్తమైనవి. ఈ వజ్రములు ప్రపంచ ప్రసిద్దిగాంచినవి, తళ్ళికోట యుద్ధము లేదా రక్షస తంగిడి యుద్దం తరువాత జరిగిన దోపిడిలో రాజుగారి ఖజాన యందు ఓ కోడిగుడ్డు అంత పరిమాణము ఉన్న వజ్రం దొరికినది అని చెప్పబడినది.

 సైనికులకు కావలసిన కత్తులూ, శిరస్తానములు, మొదలగున్నవి తయారు చేయడం ఓ వృత్తిగా ఉండేది.

సుగంధ ద్రవ్యములు
కస్తూరి, పన్నీరు, బుక్క, గులాలు వంటి సుగంధ ద్రవ్యాలు ధనవంతులు ఉపయోగించేవారు.

 పాడి పరిశ్రమ కూడా మంచి ఉపాధి కలిగించుతుండేది.

నాణెములు
బంగారు, వెండి నాణెములు తయారు చేయబడుచుండేవి, వరహా లేదా గద్యాణ అను బంగారు నాణెము ఉండేది తార్ అనునది ఓ వెండి నాణెము, జిటలు, కాసు అను రాగి నాణెములు వాడుకలో ఉండేవి

 విజయ నగర రాజుల కాలంనాటి సైనిక స్థితి
విభాగములు
వీరి సైన్యమున పదాతి దళము, గజ దళము, అశ్విక దళము అను విభాగములు కలవు, చివరలో పిరంగి దళము, తుపాకి దళములు కూడా ఉండెను

ఆయుధములు
సాధారణ సైనికునకు శిరస్త్రానము, డాలు, కత్తి ఉండేవి, ఇంకా ఈటె మొన్నగు ఆయుధములు కూడా కలవు.

విశేషములు
ఈ సైన్యము ముఖ్యముగా రెండు రకములగా ఉండేవి

సిద్ద సైన్యము
అనగా ఇది కేంద్ర పరిపాలనలో ఉండే సైన్యము, ఇది సుమారుగా లక్ష మంది వరకూ ఉండేది (కృష్ణ దేవరాయల సమయమున) దీనికి జీత భత్యములు అన్నీ కేంద్ర ఖజానా నుండే వచ్చేది

అమర సైన్యము
లేదా నాయకర సైన్యము లేదా సామంత సైన్యము, దీనిని సామంతులు చూసుకునేవరు, అవసరమైనప్పుడు రాజునకు పంపించేవారు


 డొమింగో పీస్ వివరణ ప్రకారం : 
శ్రీక్రిష్ణదేవరాయలు ఎలా వున్నాడు ? 

రాజు సాధారణ ఎత్తు కలిగి అంత సన్నగాను కాక లావు గాను కాక మద్యస్తంగా వున్నాడు. ఇతను ఇతర దేశస్తులను చాల మర్యాదగా గౌరవిస్తాడు. ఇతను ధర్మ బద్దుడైన గొప్ప పాలకుడు. ఇతనికి రారాజని, చక్రవర్తి అని, లార్డ్ ఆఫ్ సెవెన్ సీస్ అండ్ ల్యాండ్ అని. బిరుదులు గలవు. అతనికున్న రాజ్య విస్తరణాన్ని బట్టి, అతనికున్న సైనిక భలగాన్ని బట్టి అతన్ని మహా వీరుడని అంటారు. అతనికున్న శక్తి సామర్ద్యాలను బట్టి ఇతను ఒరియా రాజుతో సదా యుద్దాలు చేసే వాడు. ఆ రాజ్యంలోని చాల నగరాలను వశపరుచు కున్నాడు. ఆ దేశపు రాజ కుమారులను బందీగా పట్టుకొని విజయనగరంలో చాల కాలం బందీగా వుంచగా అక్కడే అతను మరణించాడు. ఆతర్వాత సంధి ఒడంబిడకలో ఒరియా రాజు తన కుమార్తెను రాజుగారికిచ్చి వివాహం చేశాడు. ఇతని పేరు "శ్రీ క్రిష్ణ దేవరాయలు "ఇతనికి పన్నెండు మంది భార్యలున్నా వారిలో ముగ్గురే మహారాణులు. ఈ మహారాణుల కొడుకులకే రాజ్యాధికారం వుంటుంది. మిగతా భార్యలలో ఎవరికైనా ఒకే కొడుకున్నచో అతనిక్కూడ రాజ్యాధి కారం వుంటుంది. ఈ మహా రాణులలో ఒకరు ఒరియా రాజ కుమార్తె, ఇంకొకరు శ్రీరంగ పట్నం రాజ కుమార్తె. మూడో మహారాణి, రాజు తన యుక్త వయస్సులో ప్రేమించిన అమ్మాయి. శ్రీ క్రిష్ణ దేవరాయలు తాను రాజైనప్పుడు ఈమెను పెళ్ళాడి మహారాణిని చేస్తానని మాట ఇచ్చి నందున ఆమె కోరికను నెరవేర్చాడు. ఆమెమీదున్న ప్రేమకు చిహ్నంగా రాజుగారు కొత్త నగరాన్ని నిర్మించాడు.

రాజుగారి భార్యలు అందరికి ప్రత్యేకంగా భవనములు, స్త్రీజన పరివారము, సేవకులు (స్త్రీలె) వారికి కావలసిన ఆవాసములు అన్ని వున్నాయి. పురుషు లెవ్వరు అందు ప్రవేశించరు. వీరు కూడ బయటకు వెళ్ళరు. తప్పని సరియై వెళ్ళ వలసి వస్తే మూసి వున్న పల్లకిలో వెళ్తారు. ప్రజలు కూడ వీరికి దూరంగా వుంటారు., చాల మంది నపుంసకులు వీరికి రక్షణ గా వుంటారు.


వంశ వృక్షము

కింది జాబితా రాబర్ట్ సెవెల్ రాసిన ఎ ఫర్గాటెన్ ఎంపైర్ (విస్మృత సామ్రాజ్యం) అనే పుస్తకం నుండి సంగ్రహించినవి.

సంగమ వంశము
హరిహర I (దేవ రాయ) -  1336-1343
బుక్క I - 1343-1379
హరిహర II - 1379-1399
రెండవ బుక్క రాయలు - 1399-1406
మొదటి దేవ రాయలు - 1406 - 1412
వీర విజయ - 1412-1419
రెండవ దేవ రాయలు - 1419-1444
(తెలియదు) - 1444-1449
మల్లికార్జున రాయలు - 1452-1465 (తేదీలు సందేహాస్పదం)
రాజశేఖర రాయలు - 1468-1469 (తేదీలు సందేహాస్పదం)
మొదటి విరూపాక్ష రాయలు - 1470-1471 (తేదీలు సందేహాస్పదం)
ప్రౌఢదేవ రాయలు - 1476-? (తేదీలు సందేహాస్పదం)
రాజశేఖర - 1479-1480 (తేదీలు సందేహాస్పదం)
రెండవ విరూపాక్ష రాయలు 1483-1484 (తేదీలు సందేహాస్పదం)
రాజశేఖర 1486-1487 (తేదీలు సందేహాస్పదం)


సాళువ వంశము
నరసింహ 1490-?


తుళువ వంశము
నరస (వీర నరసింహ) ?-1509
శ్రీ కృష్ణదేవరాయలు 1509-1530
అచ్యుత దేవరాయలు 1530-1542
సదాశివరాయలు (నామమాత్రపు రాజు) 1542-1567
రామరాయలు (పట్టాభిషిక్తుడు కాదు) 1542-1565
తిరుమల రాయలు (పట్టాభిషిక్తుడు కాదు) 1565-1567
తిరుమల (పట్టాభిషిక్తుడు) 1567-1575
రెండవ రంగరాయలు 1575-1586
మొదటి వెంకటాపతి రాయలు 1586-1614

ఆరవీటి వంశము

ఆరవీడు (తేదీలు సందేహాస్పదం, కేవలం శాసనాల ఆధారంగా సేకరించిన సమాచారం) రాజుల్లో కిందివారు ఉన్నారు. ప్రతిపేరుతోను ఒకరికంటే ఎక్కువమంది రాజులు ఉన్నారు. కాలం - 1614 నుండి చివరగా తెలిసిన 1739 వరకు

అళియ రామ రాయలు ??
తిరుమల దేవ రాయలు, 1565 - 1572
శ్రీరంగ దేవ రాయలు, 1572 - 1585
రామ రాజు, 1585
వేంకటపతి దేవ రాయలు, 1585 - 1614
శ్రీరంగ రాయలు, 1614 - 1614
రామదేవ రాయలు, 1617 - 1630[1]
వేంకటపతి రాయలు, 1630 - 1642
శ్రీ రంగ రాయలు 2, 1642 - 1678
వేంకట పతి రాయలు, 1678 - 1680


 విజయనగర సామ్రాజ్య ముఖ్యాంశాలు 

 రాయచూర్ దోఆబ్ గురించి బహమనీ సుల్తానులకు విజయనగర రాజులకు నిరంతరం యుద్ధాలు జరిగేవి.

 సంగమ వంశంలో గొప్పవాడు రెండో దేవరాయులు.

 ఇతడి కాలంలో అబ్దుల్ రజాక్ అనే పారశీక రాయబారి క్రీ.శ. 1443లో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు.

 సంగమ వంశం తర్వాత సాళువ వంశస్థులు పరిపాలించారు. 

 సాళువ వంశం తర్వాత తుళువ వంశస్థులు పరిపాలించారు.

 తుళువ వంశంలో గొప్ప పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు.


 శ్రీకృష్ణదేవరాయలు (క్రీ.శ. 1509-1529)  గురించి ముఖ్యాంశాలు 

    విజయనగర సామ్రాజ్య పాలకులలో శ్రీకృష్ణదేవరాయలు గొప్పవాడు.

 ఉమ్మత్తూరు, శివసముద్రాల పాలకులను ఓడించాడు.

 పోర్చుగీసు వారితో స్నేహసంబంధాలు పెంపొందించుకున్నాడు.

 క్రీ.శ. 1510లో వారితో సంధి చేసుకుని మేలు జాతి అశ్వాలను పొందాడు.

 శ్రీకృష్ణదేవరాయలు తన దిగ్విజయ యాత్రలతో కటక్‌ను పరిపాలించే గజపతులను, బీజాపూరు సుల్తానులను ఓడించాడు.

 ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి, బెజవాడ, రాజమండ్రి మొదలైన దుర్గాలను ఆక్రమించాడు.

 సింహాచలంలో విజయస్తంభాన్ని ఏర్పాటు చేశాడు

 గజపతి కుమార్తెను రాయలు వివాహం చేసుకున్నాడు.

 శ్రీకృష్ణదేవరాయలు బీజాపూరు సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్‌షాతో రాయచూరు దగ్గర యుద్ధంచేసి ఓడించాడు.

 శ్రీకృష్ణదేవరాయల కాలంలో పోర్చుగీసు వర్తకుడు డోమింగ్ పేయిజ్ విజయనగరాన్ని సందర్శించాడు.

 రాయలు యుద్ధవీరుడు మాత్రమే కాదు పరిపాలనా దక్షుడు కూడా. ప్రజలను పన్నులతో బాధించలేదు.

 నీటిపారుదల సౌకర్యాలు కల్పించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాడు.

 రాయలు గొప్ప కవి, పండితపోషకుడు.

 ఆముక్తమాల్యద కావ్యాన్ని రాశాడు. భువనవిజయం అనే పండిత సభను ఏర్పాటుచేసి పండితులను సత్కరించాడు.

 అష్టదిగ్గజాలనే కవులు రాయల ఆస్థానంలో ఉండేవారు.

¤ కన్నడ, తమిళ భాషల కవులను ఆదరించాడు.

 ఈయన కాలంలో హజార రామాలయం ప్రసిద్ధిచెందింది.

 రామాయణ గాథను శిల్పులు హజార రామాలయం గోడలపై చెక్కారు.

 క్రీ.శ. 1529లో శ్రీకృష్ణదేవరాయలు మరణించాడు.

 విజయనగర సామ్రాజ్య పతనం ముఖ్యాంశాలు 

 క్రీ.శ. 1565లో తళ్లికోట యుద్ధం లేదా రాక్షస - తంగడి యుద్ధం జరిగింది.

 ఈ యుద్ధంలో బీజాపూర్, గోల్కొండ, అహ్మద్‌నగర్ సుల్తానులు ఒక కూటమిగా ఏర్పడి విజయనగరంపై దండెత్తి రామరాజును ఓడించి చంపారు

 తళ్లికోట యుద్ధంలో ఓటమి చెందడంతో విజయనగర సామ్రాజ్య పతనం మొదలైంది.

 తిరుమల రాయలు పెనుకొండకు పారిపోయాడు.

 తర్వాత విజయనగరాన్ని అరవీటి వంశం పెనుకొండ నుంచి పరిపాలించింది.


 విజయనగర రాజ్యపాలన - వైభవం ముఖ్యాంశాలు 

మధ్యయుగంలో దక్షిణ భారత రాజ్యాల్లో ప్రసిద్ధి చెందింది విజయనగర సామ్రాజ్యం.

 ఈ సామ్రాజ్యాన్ని అబ్దుల్ రజాక్, న్యూనిజ్, నికోలోకాంటి, డోమింగ్ పేయిజ్ మొదలైన విదేశీ రాయబారులు సందర్శించారు.

 విజయనగర రాజులు సంప్రదాయబద్ధమైన రాచరికాన్ని అనుసరించారు.

 రాజుకు పరిపాలనలో సలహాలు ఇవ్వడానికి మంత్రి పరిషత్తు ఉండేది.

 చక్రవర్తికి ప్రధానమంత్రి ముఖ్య సలహాదారుడు.

 విజయనగర సామ్రాజ్య కాలంలో రాష్ట్రాలతోపాటు సామంత రాజ్యాలు కూడా ఉండేవి.

 రాష్ట్రాలు గవర్నర్ల ఆధీనంలో ఉండేవి.

 సైన్యంలో అశ్వదళం, గజదళం, కాల్బలం ప్రధానమైనవి. ఫిరంగి దళం కూడా ఉండేది.

 సార్వభౌముల ఆధీనంలో, రాష్ట్ర గవర్నర్లు, నాయకుల ద్వారా కొంత సైన్యాన్ని పోషించేవారు.

 విజయనగర చక్రవర్తుల పరిపాలనా కాలంలో ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం.

 రాజ్యానికి ముఖ్య ఆదాయం భూమిశిస్తు. 1/3వ వంతు భూమిశిస్తును వసూలు చేసేవారు

 వ్యవసాయాభివృద్ధికి చెరువులు, కాలువలను తవ్వించేవారు.

పర్షియా, అరేబియా, ఈజిప్టు, ఇటలీ, పోర్చుగల్, సింహళం, చైనా, బర్మా మొదలైన దేశాలతో వర్తక వ్యాపారాలను కొనసాగించారు.

సమాజంలో బ్రాహ్మణులను గౌరవించేవారు.

             

                     విజయనగర సామ్రాజ్య రాజధాని - హంపి

 హిందూ ధర్మ రక్షణకు పాటుపడ్డారు.

 శైవ, వైష్ణవాలు ఉండేవి

 సాళువ రాజుల కాలం నుంచి వైష్ణవమతం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

 తిరుపతి, శ్రీరంగం, అహోబిలం మొదలైనవి కొన్ని ప్రముఖ వైష్ణవ కేంద్రాలు.

 విజయనగర రాజులు విఠలస్వామి దేవాలయం, హజార రామ దేవాలయం మొదలైన దేవాలయాలను నిర్మించారు.

 పద్మమహలు, రంగమంటపం మొదలైన వాటిని కట్టించారు.

 సంస్కృతం, కన్నడ, తమిళ భాషల కవులను పోషించారు.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again