పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 03, 2015

కంప్యూటర్ చరిత్ర

ఉపోద్గాతము
ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్ లేని వ్యవస్థ, రంగం ఏదీ లేదు. కంప్యూటర్ లేని జీవనాన్ని ఊహించుకోవడమే కష్టం. ఇంతవరకూ మానవుడు నిర్మించిన మరే సాధనమూ కంప్యూటర్ చూపిన ప్రభావం చూపలేదంటే దాని శక్తిని అంచనా వెయ్యచ్చు. అటువంటి ప్రాముఖ్యత కలిగిన కంప్యూటర్ రంగంలో మన దేశం కూడా ఎంతో పురోగతిని సాధంచింది. కంప్యూటర్లలో రెండు రకాలు కలవు. సాధారణ అవసరాలు అనగా విద్య, వ్యాపారం, పారిశ్రామికం, డిజైనింగ్ లాంటి వాటిలో మొదటి రకం వాడుతుంటారు. రెండవ రకం కర్మగారములలో, భారీ సంస్థలలో, అధిక డేటా ఉండే సర్వర్లకు, మిలటరీ అవసరాలకు, అంతరిక్ష పరిశోధనా సంస్థలలో రోబోట్‌లను నియంత్రించేందుకు ఇలా కొన్ని ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని తయారు చేయబడతాయి.

కంప్యూటర్ అంటే ఏమిటి?
కంప్యూటర్ అనునది ఒక ఎలక్ట్రానిక్ ఉపకరణం. ఈ ఉపకరణాన్ని ఖచ్చితంగా నిర్వచించాలంటే కష్టతరమనే చెప్పాలి. కంప్యూటర్ అనే పరికరం కాలక్రమేణా ఎన్నో మార్పులు చెందటం వల్ల ఫలానా యంత్రమే కంప్యూటర్ అని నిర్వచించటం కష్టమౌతుంది. మునుపు కంప్యూటర్ అని పిలువబడ్ద యంత్రాలు వేర్వేరు పనులకై ఉపయోగింపబడటం వలన కూడా ఫలానా పని చేసే యంత్రమే కంప్యూటర్‌ అని చెప్పటం కూడా కష్టమౌతుందనే చెప్పాలు. కానీ ఈ క్రింది నిర్వచనాల ద్వారా కంప్యూటరు అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం చెప్పవచ్చు.

                             
సమస్యకు సంబంధించిన దత్తాంశాన్ని స్వీకరించి, ముందుగా ఇచ్చిన ప్రోగ్రామ్ ప్రకారం ఆ డేటాను విశ్లేషించి ఫలితాన్ని అందించే ఎలక్ట్రానిక్ పరికరాన్ని కంప్యూటర్ లేదా గణన యంత్రం అంటారు. ఇది గణనలను అత్యంత వేగంగా చేస్తుంది, సమాచారాన్ని నిల్వ ఉంచుతుంది. క్రీ.పూ. 3500కు ముందే చైనీయులు లెక్కలు చేయడానికి 'అబాకస్' అనే చట్రాన్ని వాడారు.

 'బ్లెయిజ్ పాస్కల్' రూపొందించిన 'పాస్కల్ యంత్రాన్ని' మొదటి ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్‌గా పిలుస్తారు. ఈ యంత్రమే తర్వాతి కాలంలో కంప్యూటర్‌ను రూపొందించడానికి ప్రేరణ ఇచ్చింది.

                       ఛార్లెస్ బాబేజ్ ఆధునిక కంప్యూటర్ సృష్టికర్త.

                              

కన్సైజ్‌ ఆక్స్ఫర్డు ఇంగ్లీష్‌ డిక్షనరి కంప్యూటర్‌ను "ముందుగా నిర్ధరించబడిన ఆదేశాల అనుసారం సమాచారాన్ని నిక్షేపించి (store), విశ్లేషించగల (process/analyze) ఒక ఎలెక్ట్రానిక్ పరికరం" అని నిర్వచిస్తోంది. ఈ నిర్వచనం కంప్యూటర్‌ను ఒక విశ్లేషణా యంత్రంగా లేక పరికరంగా చూస్తుంది.

వెబ్స్టర్స్ ఇంగ్లీష్ డిక్షనరి కంప్యూటర్‌కు "సమాచారాన్ని నిక్షేపించి (store) , అనుదానించి (retrieve), విశ్లేషించగల (process/analyze), ప్రోగ్రామబుల్‌ ఐన (సామాన్యంగా ఎలెక్ట్రానిక్) పరికరం" అనే నిర్వచనాన్ని చెబుతోంది. ఈ నిర్వచనంలో నాన్‌-ఎలెక్ట్రానికి పరికరాలు కూడా కంప్యూటర్లు అనబడవచ్చనే అర్థం గోచరిస్తోంది.

సురేశ్‌ బసంద్ర తన కంప్యూటర్స్ టుడే అనే పుస్తకంలో ఈ పరికరాన్ని "విపులమైన ఆదేశాల అధారంగా, దత్తాంశాలను (డేటాను) స్వీకరించి, విశ్లేషించి, ఫలితాలను ప్రదానంచేస్తూ సమస్యలను పరిష్కరించగల యంత్రం." అని నిర్వచించారు. ఈ నిర్వచనంలో కంప్యూటర్‌ను 'సమస్యలను పరిష్కరించే యంత్రం' అని గుర్తించటం జరిగింది.

ఇది మనం ఇచ్చిన సమస్య యొక్క డేటా (INPUT) స్వీకరించి ముందుగా ఇవ్వబడిన ప్రోగ్రాం ప్రకారం డేటాను విశ్లేషించి ఫలితాలు (OUTPUT) అందజేస్తుంది.

కంప్యూటర్ వివరణ
లెక్కలు చేయడం కోసం కాలుక్యులేటర్
ఉత్తరాలు టైప్ చేయడం కోసం టైపురైటర్
ఉత్తరాలు దాచుకోవడం కోసం అలమర
ఆటలు ఆడుకొనే వీడియోగేమ్ ప్లేయర్
సంగీతం వినే టేపురికార్డర్
సినిమాలు చూసే దూరదర్శిని 

ఇలా ఒకే సాధనం ద్వారా విస్త్రుత ఉపయోగాల సమ్మేళనం కంప్యూటర్. కేవలం ఇవేకాక ఫ్యాక్టరీలలో యంత్ర నిర్దేశకుడు, కార్యాలయలలో కాగితాల పని, శాటిలైట్ వ్యవస్థలలో నిపుణుడు, రోబోట్‌లను నడిపించే పనిమంతుడు ఇలా చాలా చాలా చేయగల సాధనం కంప్యూటర్.

                                   
మనిషి విషయం గ్రహిస్తాడు. ఆలోచిస్తాడు. దానికి అనుకూలంగా స్పందిస్తాడు. కాని! కంప్యూటర్ డేటాని ఇన్ పుట్ గా తీసుకొని ప్రొసెస్ చేస్తుంది. అవుట్ పుట్ ఇస్తుంది. ఈ రెండు విషయాల ద్వారా మనిషి చేసే పనికి కంప్యూటర్ చేసే పనికి దగ్గర దగ్గర పోలికలున్నాయని చెప్పవచ్చు.

డేటా స్వీకరణ
కీబోర్డ్, మౌస్, స్కానర్ మొదలగు పరికరాలు డేటాను మన నుంచి తీసుకొని కంప్యూటరుకు అందించుటకు ఉపయోగపడతాయి. వీటిని ఇన్ పుట్ డివైసెస్ అంటారు. వీటిని మనిషి యొక్క కళ్ళు, చెవులుతో పోల్చవచ్చు.

డేటా నియంత్రణ
మనిషి యొక్క శరీర భాగాలను మెదడు ఏ విధంగా నియంత్రిస్తుందో అలాగే కంప్యూటర్లలో మైక్రో ప్రొసెసర్ కంప్యూటరు నందలి అన్ని భాగాలను నియంత్రిస్తుంది. ఇది ఇన్ పుట్ నుండి వచ్చిన డేటాను తీసుకొని ప్రోగ్రాముల సహాయంతో విశ్లేషించి ఫలితాలను తయారు చేస్తుంది.

ఫలితాలు
ప్రొసెసర్ నుండి సమాచారం గ్రహించి బయటకు అందించే ప్రింటరు మానిటరు మొదలగు భాగాలను అవుట్ పుట్ డివైసెస్ అంటారు. వీటిని మానవ శరీరంలోని మెదడు నుండి సమాచారం అందుకొని పని చేసే కాళ్ళు, చేతులు, నోరు లాంటి వాటితో పోల్చవచ్చు.

కంప్యూటర్ నిర్మాణము
కంప్యూటర్లలో రకాలు ఉన్నప్పటికీ సాధారణంగా అందరూ వాడే 'పర్సనల్ కంప్యూటర్' నిర్మాణం ప్రకారం టైపురైటరు లాంటి కీ బోర్డ్ కలిగి ఉంటుంది. కీబోర్డ్ ద్వారా కంప్యూటరుకు అవసరమైన డేటా అందిస్తాము. అందుకొన్న డేటాను విశ్లేషించేందుకు సి పి యు (సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్) అనేది ఒక బాక్సులో మదర్ బోర్డ్, పవర్ సప్లై బాక్స్, చిన్నప్యాన్స్, ప్లాపీ డిస్క్, డేటా డిస్క్(హార్డ్ డ్రైవ్) అనే వాటితో కలసి ఉంటుంది. సెంట్రల్ ప్రోసెసింగ్ యూనిట్ నుండి విశ్లేషించబడిన సమాచారమును చూడడం కోసం టెలివిజన్ మాదిరిగా ఉండే మానిటర్ అను సాధనం ఉండును. వీటన్నిటి కలయికనూ కంప్యూటర్ అనవచ్చు. దీనికి ప్రింటర్, స్కానర్ మొదలగువాటిని కలపవచ్చు.

డేటా
కంప్యూటరులో ప్రోగ్రాము వ్రాయుటకు Cobol, Basic, Fortran, Pascal, C, C++లు కలవు. ప్రోగ్రాము రాయుటకు కొన్ని నియమ నిభంధనలు, ఆ భాషకు అనుకూలమైన డేటా రకాలను ఎన్నుకొని ప్రోగ్రాము వ్రాస్తారు. డేటాలో రెండురకములు కలవు.

1. న్యూమరికల్ డేటా(Numaric Data)
న్యూమరికల్ డేటా అంటే 0,1,2,3,4,5,6,7,8,9, నంబర్లతో ఏర్పాటవుతుంది. నుమరిక్ డేటాను మరలా పూర్ణ సంఖ్యలు, సహజ సంఖ్యలుగా వర్గీకరిస్తారు.

 పూర్ణ సంఖ్యలు(Integers)
వీటిలో కేవలం Integer నంబర్స్ మాత్రమే ఉంటాయి. వీటిని వోల్ నంబర్స్(Whol numbers) అని కూడా అంటారు. ఉదాహరణ- 0,+16,+32,+24.

సహజ సంఖ్యలు(Real numbers)
వీటిలో అన్ని సంఖ్యలూ ఉంటాయి. ఉదాహరణకు-0,+5,1/4,-9, ఇలా. న్యూమరిక్ డేటాను కంప్యూటర్ గుర్తించినపుడు ఆ అంకె ఉన్న స్థానాన్ని బట్టి దాని విలువ ఉంటుంది.

2.ఆల్ఫా న్యూమరిక్ డేటా(Alpha Numaric Data)

కంప్యూటర్ చేయు పనులు

లెక్కలు(CALCULATOIN)
విష్లేషణ(ANALYSIS)
పోలిక(COMPARISION)
జ్ఞాపకం(MEMORISATION)
(RETRIVING)
(UPDATING)
(EDITING)
(PRINTING)
(TRANSFER)
(PLAYER)కంప్యూటర్ అభివృద్దిక్రమం  ( చరిత్ర )
కంప్యూటర్ ముఖ్యంగా లెక్కలు చేసేందుకు ఉపయోగించుట కొరకు తయారు చేయబడినది. క్రీస్తు పూర్వం చైనీయులు అబాకస్ అనే సాధనాన్ని లెక్కలు చేసేందుకు వినియోగించేవారు. జాన్ నేపియర్ అను స్కాట్‌లాండ్ దేశ గణిత శాస్త్రజ్ఞుడు గుణకారములను సులభముగా చేయుటకు నేపియర్ బోన్స్ అనే ఎముకలతో తయారు చేయబడిన సాధనమును ఉపయోగించాడు. అదే జాన్ పియర్ తరువాత 1617లో లూగరిధమిక్ టేబుల్స్ను గుణకారములను భాగహారములను చేసేందుకు తయారు చేసి ఉపయోగించాడు. 1620వ సంవత్సరంలో లూగరిధమ్స్ టేబుల్ ద్వారా కొంత అభివృద్ది చేసి స్లైడ్ రూల్ కనుగొన్నాడు. అయితే ఇవన్నీ మానవ శక్తితో పనిచేసేవే.

వీటి తదనాంతరం రూపుదిద్దుకొన్నదే పాస్కల్ ఇది గేర్లు ఇనుప చక్రములు వినియోగించి చేసిన మొదటి యంత్రమనవచ్చు. 1671వ సంవత్సరంలో గాట్ఫ్రెడ్ లైబెంజ్ అను అతడు పాస్కల్ యంత్రానికి మార్పులు చేర్పులు చేసి కూడికలు తీసివేతలతోపాటు గుణకారములు, భాగహారములు కూడా సులభముగా చేయగల్గే లీబ్ నిడ్జ్ అనే యంత్రమును తయారు చేసాడు. 1823వ సంవత్సరంలో కంప్యూటర్ పితామహుడుగా పిలవబడే చార్లెస్ బాబేజ్ అను గణిత శాస్త్రజ్ఞుడు ఆల్జీబ్రా ఈక్వేషన్స్ కూడా చేయగల డిఫరెన్సియల్ ఇంజన్ అనే యంత్రపరికరాన్ని తయారు చేసాడు.

ఇతని కాలంలోనే కావలసిన విడి భాగాలు లభించి ఉంటే కంప్యూటర్ తయారయ్యి ఉండేదని అంటారు. ఎందువలనంటే డిఫెన్సియల్ ఇంజనుపై గడించిన అనుభవంతో నిముషానికి అరవై కూడికలు చేయగలిగి విలువలను మెమొరీలో దాయగల అవకాసం గల ఎనలిటికల్ ఇంజన్ రూపకల్పన చేయగలిగాడు. కాని అతని అవసరానికి సరిపడు క్వాలిటీ గల విడిభాగాలు తయారు చేయగల సామర్ధ్యం కలిగిన పరిశ్రమలు ఆనాడు లేకపోవుటచే ఎనలిటికల్ ఇంజన్ తయారు చేయలేక పోయాడు. తరువాత కంప్యూటర్ అభివృద్దికి హార్మన్ హోల్ రీత్ కృషిచేసి తను తయారు చేసిన కంప్యూటర్లను అవసరం కలిగిన కొన్ని కంపెనీలకు విక్రయించగలిగాడు. ప్రసిద్ది గాంచిన కంప్యూటర్ల సంస్థ ఐ.బి.యమ్(I.B.M) హోల్ రీత్ స్థాపించినదే. మొదటి ఎనలాగ్ కంప్యూటర్ రకానికి చెందిన లార్డ్ కెల్విన్ అభివృద్ది చేసాడు. దీని తరువాత మార్క్-1 (MARK-1) అనే కంప్యూటర్ 1948లో ఐ.బి.యమ్. సంస్థ సహకారంతో రూపొందించాడు. ఈ కంప్యూటరునే అసలైన కంప్యూటరుగా పేర్కొంటారు. దీని తరువాత వాల్వులు ఉపయోగించి కంప్యూటర్లు తయారు చేయబడినాయి.

కంప్యూటర్ల వర్గీకరణ
కంప్యూటర్లు అవి పనిచేసే సూత్రము బట్టి కొన్ని వర్గాలుగా విభజించారు.

ఎన్లాగ్ కంప్యూటర్స్
ఇందులో భౌతికంగా మారుతుండే విలువలయిన ఉష్ణోగ్రత మరియు పీడనముల విలువలను తీసుకొని అందుకు అనుగుణమైన విద్యుత్ రంగాలను విశ్లేషించుట ద్వారా మానిటరుపై ఫలితము తెలియచేయబడుతుంది.

డిజిటల్ కంప్యూటర్స్
డిజిటల్ కంప్యూటర్లలో రెండు రకాలు కలవు. సాధారణ అవసరాలు అనగా విద్య, వ్యాపారం, పారిశ్రామికం, డిజైనింగ్ లాంటి వాటిలో మొదటి రకం వాడుతుంటారు. రెండవ రకం కర్మగారములలో, భారీ సంస్థలలో, అధిక డేటా ఉండే సర్వర్లకు, మిలటరీ అవసరాలకు, అంతరిక్ష పరిశోధనా సంస్థలలో రోబోట్ లను నియంత్రించేందుకు ఇలా కొన్ని ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని తయారు చేయబడతాయి. మనం నిత్యం ఉపయోగించు సాధారణమైన కంప్యూటర్లను డిజిటల్ కంప్యూటర్లంటారు. డిజిట్ అంటే అంకె అనే అర్ధంతో వీటిని అలా పిలుస్తున్నారు. డిజిటల్ కంప్యూటర్లు సంఖ్య లకు సంభందించినవి. ఇన్ పుట్ ఏరూపముగా ఇవ్వబడిననూ దానిని సంఖ్యారూపములోకి మార్చుకొంటాయి. డిజిటల్ కంప్యూటర్లు సంఖ్యలను ఒక మానం నుండి వేరొక మానంలోకి (బ్రైనరీ కోడ్) గా మార్చుకొంటూ కేవలం కూడికలు తీసివేతల ద్వారా ఇన్ పుట్ను విశ్లేషిస్తూ తమ పనులను నిర్వర్తించి పలితాలను తెలియపరుస్తూఉంటాయి. ఇవి ఒక గది అంత విస్తీర్ణము నుండి అరచేతిలో ఇమిడిపోయేంత(పామ్ టాప్ కంప్యూటర్) చిన్నగా కూడా ఉంటాయి. ఇవి ఎన్లాగ్ కంప్యూటర్లతో పోలిస్తే ఖర్చు తక్కువ మరియు వేగం కూడా ఎక్కువగా ఉంటాయి.

హైబ్రీడ్ కంప్యూటర్స్
కొన్ని ప్రత్యేక అవసరాలకు ఎన్లాగ్ మరియు డిజిటల్ కంప్యూటర్లను కలిపి తయారు చెస్తారు. వీటిలో కొన్ని లెక్కలు ఎన్లాగ్ కంప్యూటర్ విభాగంలోనూ మరికొన్ని డిజిటల్ విభాగంలోనూ జరుగుతాయి. ఉదాహరణకు హాస్పిటల్లలో ఐసియు విభాగాలలో వీటిని వాడుతుంటారు. ఇవి రోగి యొక్క గుండె కొట్టుకొనే రేటును ఎన్లాగ్ ద్వారా తీసుకొని మారుతూ ఉండే విలువలను డిజిటల్ సిగ్నల్స్ రూపంలో విశ్లేషించి రోగికి అపాయమేర్పడినపుడు హెచ్చరిస్తుంది.

కంప్యూటర్ల సామర్ధ్యమును బట్టి మూడు రకాలుగానూ, వాడకమును బట్టి మూడు రకములుగాను విడగొట్టవచ్చు వాటిలో
మొదటి రకం.
మైక్రో కంప్యూటర్స్
మెయిన్ ప్రేమ్ కంప్యూటర్స్
సూపర్ కంప్యూటర్స్

రెండవరకం
హోమ్ కంప్యూటర్లు
మల్టీ మీడియా కంప్యూటర్లు
ఎడ్యుకేషనల్ కంప్యూటర్లు

కంప్యూటర్ తరాలు
మొదటి తరం కంప్యూటర్స్ (1945 - 1952)
మొదటి తరం కంప్యూటర్లలో వాక్యూం ట్యూబులను వాడి తయారు చేసేవారు. వీటిని వాడి తయారు చేసిన మొట్ట మొదటి ఎలెక్ట్రానిక్ కంప్యూటర్ ఎనియాక్ (ENIAC). ఇది రిలేలతో తయారయిన కంప్యూటర్ల కంటే వేగంగా పనిచేయగలదు. సెకనుకు 5000 కూడికలు చేయగలదు. 1946లో తయారయిన ఎనియాక్లో కంప్యూటర్లో మెమొరీ ఉండేదికాదు. దీని తయారీలో 18.000 వాక్యూం ట్యూబులు, 70.000 రెసిస్టర్లు, 1000 కెపాసిటర్లు, 6000 స్విచ్చులు వాడారు. 
                     
దీనిని ఉంచేందుకు చాలా ఎక్కువ స్థలము అవసరమవడమే కాక దీనిని నడిపించేందుకు 150 కె,డబ్ల్యు ల విద్యుత్ అవసరమయ్యేది. అధిక శక్తి వినియోగించుట వలన ఎక్కువ వేడి పుడుతుండేది. 1946లో జాన్ వాన్ న్యూమన్ కంప్యూటరులో ప్రోగ్రాములను దాచే విధానాన్ని ప్రతిపాదించాడు. ఈ విధానంలో ఎడ్సాక్ (EDSAC), ఎడ్వాక్ (EDVAC), యునివాక్ (UNIVAC) అనే కంప్యూటర్లు తయారయినవి. మొదటి తరం కంప్యూటర్లు పంచ్ కార్డు ద్వారా డేటాను తీసుకొనేవి. ఐ,బి,యం - 650 (I B M - 650), మరియు ఐ,బి,యం - 701 (I B M - 701) మొదలగునవి మొదటి తరం కంప్యూటర్లు. "

రెండవతరం కంప్యూటర్స్(1952 - 1964)
రెండవ తరం కంప్యూటర్లలో వాక్యూం ట్యూబులకు బదులు ట్రాన్సిస్టర్స్ వాడడం మొదలెట్టారు. ఇది పరిమాణంలో చిన్నదిగా ఉండటమే కాక వేగంగా పని చేస్తూ తక్కువ వేడిని విడుదల చేస్తుండేది. ఈ కంప్యూటర్లను సాంకేతిక రంగాలలోనే కాక వ్యాపార అవసరములకు కూడా వినియోగించేవారు. ఈ కంప్యూటర్లను వాడుకొనుటకై ఫోర్ట్రాన్, కోబాల్, ఆల్గాల్, స్కోబాల్ అను భాషలు ప్రత్యేకంగా అభివృద్ది చేయబడినవి. ఇవి ఇంగ్లీషు భాష మాదిరిగా ఉపయోగించుటకు తేలికగా ఉండే భాషలు.

మూడవతరం కంప్యూటర్స్(1964 - 1972)
మూడవ తరం కంప్యూటర్స్ చిప్ ఆధారంగా పనిచేయు కంప్యూటర్స్. లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ ద్వార 1000 కంటే ఎక్కువ ట్రాన్సిస్టర్లను, రెసిస్టర్లను, కెపాసిటర్లను కాప్స్యూల్ సైజుకు లేదా అంతకంటే చిన్నగా చిప్ లేదా ఐ సి(ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్)గా తయరు చేయవచ్చు. ఇలాంటి చిప్పులను వాడడం ద్వారా కంప్యూటర్స్ పరిమాణం తగ్గించి మినీ కంప్యూటర్లుగా తయారు చేయడం మొదలైంది.

ఈ చిప్పులను ఉపయోగించి తయారైన మెయిన్ ప్రేమ్ కంప్యూటర్లు మరింత శక్తివంతముగా మరాయి. వీటిని విద్యాసంస్థలలో, ప్రభుత్వకార్యాలయాలలో ఉపయోగించుట మెదలెట్టారు. ఈ కాలంలో అత్యంత శక్తివంతమైన ప్రొసెసింగ్ యూనిట్లు, శక్తివంతమైన మెమొరీ, అధిక సామర్ధ్యం కలిగిన చిప్స్ అభివృద్ది చేయబడ్డాయి. ఈ కాలంలోనే అయస్కాంతత్వ టేపుల స్థానంలో డిస్కులు వినియోగంలోకి వచ్చాయి. ఈ తరం కంప్యూటర్లలో చెప్పదగిన అభివృద్ది కలిగిన శక్తివంతమైన కంప్యూటర్లు రావడంతో వాటికి అనుసంధానంగా పి,యల్-1, ఫోర్ట్రాన్-4 మొదలగు భాషలు వచ్చాయి. ఈ తరం కంప్యూటర్లలో కొన్ని ఐబియమ్ 360 (IBM-360), ఐబియమ్ 370 (IBM-370), ఐసిఎల్ 2900 (ICL-2900) మొదలగునవి.

నాలగవ తరం కంప్యూటర్స్(1972 - 1985)
మైక్రో ప్రొసెసరునుపయోగించి తయారు చేయబడిన వాఅటిని నాల్గవ తరం కంప్యూటర్లు అనవచ్చు. కంప్యూటరుకు అవసరమైన సర్క్యూట్ మొత్తమును ఒకే సిలికాన్ చిప్ మీద "పరీలార్జ్ ఇంటిగ్రేషన్" టెక్నాలజీ సహాయంతో సూక్ష్మీకరించి తయారు చేసిన వీటిని చిప్ లేదా 'ఐసిపి' మైక్రో ప్రొసెసరు అంటారు. ఇంటెల్ సంస్థవారిచే తయారు కాబడిన 8080 మైక్రో ప్రొసెసర్ ఉపయోగించి ఎడ్వర్డ్ రాబర్ట్ మొదటి మైక్రో కంప్యూటరు తయారు చేసాడు. దీని పేరు ఆల్ టెయిరీ. ఐబియమ్ సంస్థ వారూ మైక్రో ప్రొసెసర్ ఉపయోగించి 1981లో పర్సనల్ కంప్యూటర్ తయారు చేసారు. వీటి ధరలు తక్కువగా ఉండటంతో ఇవి ఎక్కువ ప్రజాధరణ పొందుతున్నాయి. వీటికి ఉదాహరణలు- జెడ్ ఎక్ష్ స్పెక్ట్రం, పిసి ఎట్ పెంటియం.

అయిదోతరం కంప్యూటర్లు (1985 తర్వాత):
 వీటిని జపాన్ ప్రవేశపెట్టింది. ఈ కంప్యూటర్లను Ultra Large Scale Integration (ULSI) టెక్నాలజీ ఆధారంగా కృత్రిమ మేధస్సుతో రూపొందిస్తున్నారు.
 వీటిని సిలికాన్ (Si)తో కాకుండా ఇతర పదార్థాలతో తయారుచేస్తున్నారు.
 వీటికి నిల్వ (స్టోరేజ్) సామర్థ్యం, జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది.
                       

ఉదా: సూపర్ కంప్యూటర్లు.

ఆపరేటింగ్ సిస్టమ్స్
ఎమ్.ఎస్,డాస్(M S-DOS)
యునిక్స్(UNIX)
విండోస్(WINDOS)

లాంగ్వేజీలు
మనుషుల మధ్య సమచార ప్రసారానికి ఒక మాద్యమం అవసరం. భాష లేకపోతే సమాచర వ్యవస్థ స్థంభించి పోతుంది. అలాగే కంప్యూటర్లతో మాట్లాడలన్నా ఒక భాష అవసరం. కంప్యూటరు కోసం వాడే భాషలను ప్రోగ్రామింగ్ భాష అంటారు. అలాంటి భాషలలో కొన్ని.

బేసిక్
"బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్స్ కోడ్" అనేదానికి సంక్షిప్త రూపమే బేసిక్. 1960లో డార్ట్ మౌత్ దీనిని సృష్టించాడు. 1975లో రొపొందించిన అల్టయిర్ కంప్యూటరు యొక్క ప్రోగ్రామింగ్ భాష ఇదే. ఐబియమ్ వారు పర్సనల్ కంప్యూటర్లలో సైతం ఇదే భాషను వాడారు. కొత్తగా నేర్చుకొనే వారికి సులభంగా అర్ధమయ్యేలా దీనిలో సూచనలు దాదాపు ఆంగ్ల భాష మాదిరిగానే ఉంటాయి.

ఫోర్ట్రాన్
"ఫార్ములా ట్రాన్సులేషన్"కు సంక్షిప్త రూపమే ఫోర్ట్రాన్. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాషలలో అతి పురాతనమైన భాష. క్లిష్టతరమైన గణిత సంభద సమస్యలు పరిష్కరించేందుకు ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. 1954వ సంవత్సరంలో జాన్ బాకస్ తదితరులు దీనిని అభివృద్ది చేసారు. అనేక మార్పులు జరిగిన తరువాత 1977లో ఫోర్ట్రాన్-77గానూ 1991లో ఫోర్ట్రాన్-90గానూ 1995లో ఫోర్ట్రాన్-95గానూ మార్కెటులో విడుదల చేయబడినది.

కోబాల్
"కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజి" అనేదానికి సంక్షిప్తరూపం కోబాల్. వాణిజ్య అవసరాలకు ఉపయొగపడే దీనిని 1964లో రూపొందించారు. 1964లో అమెరికాలోని అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇనిస్టిట్యూట్ వారిచే ఆమోదించబడినది. దీనిని డేటా ప్రొసెసింగ్ కొరకు వాడతారు.

పాస్కల్
జూరిచ్ దేశానికి చెందిన నికొలస్ విర్త్ రూపొందించిన లాంగ్వేజ్ ఇది. దీనిని ఆదునిక పర్సనల్ కంప్యూటర్ల కొరకు మార్పులు చేసి టర్బో పాస్కల్ రూపొందించారు. బోర్లాండ్ కంపెనీ పాస్కల్ భాషకు రకరకాల అభివృద్ది చేస్తూ పాస్కల్ భాషను చరిత్రలో కలసిపోకుండా చేస్తుంది. వీటిలో కొత్తది డెల్ఫీ ఇది విజువల్ బేసిక్‌తో పోటీ పడుతున్నది.

కంప్యూటర్ నిర్మాణం
కంప్యూటర్ సిస్టమ్‌లో 2 ప్రాథమిక విభాగాలు ఉంటాయి.
                        1) హార్డ్‌వేర్ 
                       2) సాఫ్ట్‌వేర్

హార్డ్‌వేర్: కంప్యూటర్ తయారీలో ఉపయోగించే పరికరాలను 'హార్డ్‌వేర్' అంటారు.
ఉదా: కీబోర్డు, మానిటర్, ప్రింటర్, సీపీయూ.

సాఫ్ట్‌వేర్: కంప్యూటర్ పనిచేయడానికి ప్రవేశపెట్టిన సమాచారాన్ని 'సాఫ్ట్‌వేర్' అంటారు. దీనిలో సాధారణంగా కంప్యూటర్ కార్యనిర్వహణను తెలియజేసే ఆదేశాలు (కమాండ్స్) ఉంటాయి.

ప్రోగ్రామ్: ఇన్‌పుట్ ద్వారా అవుట్‌పుట్ పొందడానికి కంప్యూటర్‌లో ఏర్పాటు చేసిన సమాచారాన్నే 'ప్రోగ్రామ్' అంటారు.

కంప్యూటర్ సిస్టమ్‌లో ప్రధానంగా కింది భాగాలు ఉంటాయి. అవి:

ఇన్‌పుట్: కంప్యూటర్‌లో ఫీడ్ చేసే దత్తాంశం (డాటా). తర్వాత ఈ డాటాను ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేయాల్సిన డాటాను ఇన్‌పుట్ పరికరాలైన కార్డ్ రీడర్స్, కీబోర్డు ద్వారా ఎంటర్ (ఫీడ్) చేస్తారు.

సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (సీపీయూ): దీనిలో 3 భాగాలు ఉంటాయి.

ఎ) కంట్రోల్ యూనిట్ (సీయూ): కంప్యూటర్‌లోని ఇతర విభాగాలపై దీనికి నియంత్రణ ఉంటుంది. ఇది ఒక పర్యవేక్షకుడిలా పనిచేస్తుంది. వివిధ విభాగాల మధ్య సమాచారాన్ని చేరవేయడంలో దిశను, సమయాన్ని నిర్దేశిస్తుంది.

బి) మెమొరి యూనిట్ (ఎంయూ): కంప్యూటర్‌లో కొన్ని ఆదేశాలతో సహా ఇతర సమాచారాన్ని భద్రపరిచే స్థలాన్ని 'మెమొరి యూనిట్' అంటారు. ఇక్కడ నుంచే నియంత్రణ విభాగం (కంట్రోల్ యూనిట్) దత్తాంశాన్ని, ఆదేశాలను తీసుకెళ్లి అంకగణిత తార్కిక విభాగం (ఏఎల్‌యూ)కు పంపిస్తుంది. ప్రాసెస్ చేసిన డాటా(దత్తాంశం)ను తిరిగి మెమొరి యూనిట్‌లోనే భద్రపరుస్తుంది.

సి) అరిథ్‌మెటిక్ లాజిక్ యూనిట్ (ఏఎల్‌యూ): ఈ విభాగంలో గణిత తార్కిక ప్రక్రియలు, గణన (కంప్యూటింగ్) జరుగుతాయి.

అవుట్‌పుట్: ప్రాసెస్ చేసిన సమాచారాన్ని డిస్‌ప్లే చేసే పరికరాలను 'అవుట్‌పుట్' పరికరాలు అంటారు. ఈ డిస్‌ప్లే ఎలక్ట్రానిక్ ప్రింటర్ సాయంతో కాగితంపై ప్రింటవుట్ తీసుకునేందుకు ఉపయోగపడే హార్డ్‌కాపీ కావచ్చు లేదా ఇతర విజువల్ డిస్‌ప్లే యూనిట్ కావచ్చు.

           కంప్యూటింగ్ అంటే 'లెక్కించడం' అని అర్థం. కంప్యూటర్ అంటే లెక్కించే సాధనం. వేగంగా గణనలు చేయడానికి కంప్యూటర్‌ను కనుక్కున్నారు. ఇతర అవసరాలకూ దీన్ని వినియోగిస్తున్నారు. వాటిలో ముఖ్యమైనవి

ఎ) విశ్లేషణ: కంప్యూటర్ విధుల్లో ఇది కీలకమైంది. ఇచ్చిన దత్తాంశాన్ని విశ్లేషించి ముందుగా ఇచ్చిన ప్రోగ్రామ్ ద్వారా మనకు కావాల్సిన రీతిలో కంప్యూటర్ ఫలితాన్ని అందిస్తుంది. అందుకే దీన్ని అనేక రంగాల్లో ఉపయోగిస్తున్నారు.

ఉదా: ఉపగ్రహం పంపిన ఛాయాచిత్రాలను కంప్యూటర్ విశ్లేషిస్తుంది. వివిధ ప్రదేశాల్లోని వాతావరణ వివరాలను తెలియజేస్తుంది.

బి) మెమొరి: కొన్ని వేల పేజీల సమాచారాన్ని ఫ్లాపీ డిస్క్, హార్డ్ డిస్క్‌ల్లో తక్కువ సమయంలో దాచుకోవచ్చు.

సి) రిట్రీవింగ్ (తిరిగి పొందడం): మెమొరిలో ఫైల్స్ రూపంలో దాచుకున్న సమాచారాన్ని కావాలనుకున్నప్పుడు తీసుకునే లక్షణాన్ని రిట్రీవింగ్ అంటారు. కంప్యూటర్‌లో నిర్ణీత సమాచారాన్ని ప్రత్యేక పేరుతో ఫైల్ రూపంలో భద్రపరుస్తారు.

డి) అప్‌డేటింగ్: ఒకసారి తయారు చేసిన ఫైల్‌కు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను జతచేయడాన్ని 'అప్‌డేటింగ్' అంటారు.

ఇ) ఎడిటింగ్: టైప్ చేసి ఫైల్‌లో దాచుకున్న సమాచారాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా 'ఎడిటింగ్' ద్వారా మార్పులు చేసుకోవచ్చు.

ఎఫ్) ప్రింటింగ్: కంప్యూటర్‌లో ఫైల్ రూపంలో భద్రపరచుకున్న సమాచారాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. అక్షరాలను మనకు నచ్చిన రంగు, పరిమాణంలో పొందవచ్చు.

జి) ట్రాన్స్‌ఫర్: వివిధ కంప్యూటర్ల మధ్య సమాచారాన్ని 'ఫ్లాపీ డిస్క్' లేదా 'లాన్' ద్వారా బదిలీ చేయవచ్చు.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again