పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 03, 2015

విటమిన్లు - వనరులు


విటమిన్లు (ఆంగ్లం: Vitamins) జీవి పెరుగుదలకు, ఆరోగ్యవంతంగా ఉండడానికి అత్యంత అవసరమైన అనుబంధ ఆహార కారకాలు. ముందుగా వీటిని వైటల్ - అతిముఖ్యమైన; అమైన్ - అమినో సమ్మేళనాలు అని ఫంక్ 1912లో ప్రతిపాదించాడు. తరువాత కాలంలో విటమిన్లన్నీ అమైన్లు కాదని గుర్తించారు. కాబట్టి 'vitamines' అనే పదంలోని 'e' ని తొలగించి ప్రస్తుతం వాటిని 'vitamins' అని పేర్కొంటున్నారు. ఇవి స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడంలోగానీ దేహనిర్మాణంలోగానీ తోడ్పడవు. కానీ శక్తిప్రసరణ, జీవక్రియల నియంత్రణలో ముఖ్యపాత్ర వహిస్తాయి. కొన్ని విటమిన్లు సహ ఎంజైము (Coenzymes) లుగా పనిచేస్తాయి.      

విటమిన్లు కర్బన రసాయనిక పదార్థాలు. ఇవి సూక్ష్మపోషకాలు. అతి కొద్ది మొత్తాల్లో (మైక్రోగ్రాం పరిమాణంలో) శరీరానికి అవసరమవుతాయి. ఇవి ఆవశ్యక పోషకాలు. మన శరీరానికి రెండు మార్గాల ద్వారా విటమిన్లు లభిస్తాయి.

                
                                           

1) ఆహారం ద్వారా
2) పేగులో ఉండే బాక్టీరియా విటమిన్లను సంశ్లేషణం చేసి మన శరీరానికి అందిస్తాయి.

         విటమిన్లు శరీరంలో వాటంతటవే శక్తిని ఉత్పత్తి చేయలేవు, రసాయనిక చర్యలు జరపలేవు. శరీరంలో విటమిన్లు కొన్ని ఎంజైమ్ లను చైతన్యవంతం చేస్తాయి. విటమిన్లు లేకపోతే ఈ ఎంజైమ్ లు చైతన్యవంతం కాలేక జీవ రసాయన చర్యలను ఉత్ప్రేరణ చెయ్యలేవు. దీనివల్ల అనేక వ్యాధులు వస్తాయి. సహజంగా లభించే అన్ని ఆహార పదార్థాలు, పాలు, మాంసం, ఫలాలు, కాయగూరల్లో విటమిన్లు లభిస్తాయి.

మానవులలో 13 విటమిన్లు గుర్తించారు. వీటిని రెండు రకాలుగా వర్గీకరించారు.  

రంగుల్లో విటమిన్లు
రంగుల ఆహారము చూసేందుకు అందముగా ఉండడమేకాక ఎన్నో విటమిన్లు కలిగి ఉండి ఆరోగ్యాన్నిస్తుంది. ఏయే రంగుల ఆహారములో ఏ విటమిన్లు ఉంటాయో చూడండి.

తెలుపు : పాలలా మెరిసే వెల్లుల్లి , ఉల్లిపాయలు, పాలు వంటి తెలుపురంగు ఆహారములో 'ట్యూమర్ల'నుంచి మనల్ని కాపాడే 'అల్లిసన్' ఉంటుంది. ఇక పుట్టగొడుగుల్లో వ్యాధులతో పోరాడే శక్తి ఉన్న రసాయనాలు , కణాలు పాడవకుండా ఆపే శక్తి ఉన్న 'ప్లావయినాడ్స్' ఉన్నాయి .

ఎరుపు,పర్పుల్ : ఈ రంగులలో ఉండే ఆహారములో 'యాంథోసియానిన్స్' ఉంటాయి, ఇవి శక్తివంతమైన యాంటిఆక్సిడెంట్లు గాను, రక్తము గడ్డకట్టకుండా ఆపేందుకు గాను సహాయపడతాయి. కాన్సర్ కారకాలతో కూడా పోరాడగలుగుతాయి.ఉదా: టమాటో, ముదురు పర్పుల్ రంగుగల ద్రాక్ష మొదలగునవి.

పసుపు : ఈ రంగుతో ఉన్న ఆహారము రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరంజ్ రంగులో ఉండే ఆహారములో 'బీటాక్రిప్టాక్సాన్థిన్(beta cryptaxanthin) అనే యాంటిఆక్సిడెంట్ ఉంటుంది. వీటిలో రోగనిరోధకశక్తిని పెంచే 'విటమిన్ -సి- ఉంటుంది. ఇది శరీర కణాలు పాడవకుండా ఆపుతుంది,కళ్లకు రక్షణ కూడా ఇస్తుంది.

ఆకుపచ్చరంగు : ఈ రంగులో ఉన్న ఆహారములో ఐరన్ , కాల్షియం, ఖనిజలవణాలు ఎక్కువగా ఉంటాయి. రక్తహీనతను సరిచేస్తుంది. కంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. కాన్సర్ తో పోరాడే లివర్ ఎంజైముల ఉత్పత్తికి దోహదం చేస్తుంది.

బ్రౌన్ , ఆరంజ్ : ఈ రంగు ఆహారములో విటమిన్ -ఎ- ఎక్కువగా ఉంటుంది, కంటి జబ్బులు రాకుండా 'బీటాకెరోటీన్లు' కాపాడతాయి. చర్మాన్ని ఆరోగ్యవంతముగా ఉండేందుకు దోహదము చేస్తాయి.
                          

విటమిన్లు 2 రకాలు
1) నీటిలో కరిగే విలమిన్లు : 'బి కాంప్లెక్స్, విటమిన్ 'సి

2) కొవ్వులో కరిగే విటమిన్లు : విటమిన్ 'ఎ, 'డి, 'ఇ, 'కె

1. నీటిలో కరిగే విటమిన్లు
విటమిన్ 'బి కాంప్లెక్స్: ఇది అనేక విటమిన్ల సమూహం.
ఈ గ్రూపులో విటమిన్లు 1) థయామిన్ 2) రైబోఫ్లేవిన్ 3) నియాసిన్ 4) పిరిడాక్సిన్ 5) ఫోలిక్ఆమ్లం 6) సయనోకోబాలమిన్ 7) పాంటోథినిక్ ఆమ్లం 8) బయోటిన్ విటమిన్లు ఉంటాయి.

1. థయామిన్ (B1 Vit): సహజంగా లభించే అన్ని రకాల ఆహార పదార్థాల్లో థయామిన్ ఉంటుంది. ముఖ్యంగా గోధుమ లాంటి ధాన్యాలు, వేరుశనగ లాంటి నూనె గింజలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లు, కాయగూరల్లో లభిస్తుంది. మన దేశంలో పెద్ద వారికి బియ్యం, గోధుమ ద్వారా; పిల్లలకు పాల ద్వారా థయామిన్ లభిస్తుంది.

                        

కార్బోహైడ్రేట్ల జీవక్రియలో ముఖ్య పాత్ర వహించే కొన్ని ఎంజైమ్‌ల చర్యలకు థయామిన్ (B1) అవసరం. థయామిన్ లోపం వల్ల బెరి బెరి వ్యాధి వస్తుంది. పిక్క కండరాలు పచ్చిగా ఉంటాయి. వాంతులు, వణుకు, మూర్చ, ఆకలి తగ్గడం లాంటివి సంభవిస్తాయి. పక్షవాతం సైతం రావచ్చు.

2. రైబోఫ్లేవిన్ (B2 Vit): ఇది క్షయకరణ, ఆక్సీకరణ చర్యల్లోనూ; శ్వాస క్రియలోనూ, ముఖ్యపాత్ర వహిస్తుంది.

                        

                            

ఇది పాలు, గుడ్లు, కాలేయం, మూత్రపిండాలు, ఆకుకూరల్లో లభిస్తుంది. రైబోఫ్లేవిన్ న్యూనత వల్ల నోటిపూత లేక గ్లాసైటిస్ వ్యాధి సంభవిస్తుంది. ఈ వ్యాధిగ్రస్తుల నాలుక పొక్కులతో ఎర్రబారి నిగనిగలాడుతుంది. నోటి మూలలు పగులుతాయి. కళ్ల నుంచి నీరు కారుతుంది. వెలుతురు చూడలేరు, చర్మం పొలుసులుగా మారుతుంది.

3. నియాసిన్ (B3 Vit): నియాసిన్ రసాయనిక నామం నికోటినిక్ ఆమ్లం.

                            

కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వుల జీవక్రియకు నియాసిన్ తోడ్పడుతుంది. శరీరంలో ఇది లోపిస్తే 'పెల్లాగ్రా అనే వ్యాధి వస్తుంది.

4. పిరిడాక్సిన్: (B6 Vit): ఇది పాలు, కాలేయం, మాంసం, గుడ్లలోని సొన, చేపలు, పప్పుధాన్యాలు, కాయగూరల్లో లభిస్తుంది.

                        

                             

ఇది ఎమైనో ఆమ్లాల జీవక్రియలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీని న్యూనత వల్ల కోపం, రక్తహీనత, వికారం, వాంతులు కలుగుతాయి. పిల్లల్లో దీని లోపం వల్ల మూర్చ లేక ఈడ్పు రోగం (ఫిట్స్) వస్తాయి.

5. ఫోలిక్ ఆమ్లం: ఇది ఎముక మజ్జలో ఎర్ర రక్తకణాలు ఏర్పడటానికి, న్యూక్లిక్ ఆమ్లాల సంశ్లేషణానికి అవసరం. ఇది కాలేయం, గుడ్లు, పాలు, ఫలాలు, తృణధాన్యాలు ఆకుకూరలో లభిస్తుంది.
                  

దీని న్యూనత వల్ల రక్తహీనత, అతిసారం, తెల్ల రక్తకణాల క్షీణత ఏర్పడుతుంది.

6. సయనోకోబాలమిన్ (B12 Vit): ఇది ఆహార పదార్థాల్లో లభించదు. పేగులోని బాక్టీరియా దీన్ని సంశ్లేషణం చేసి శరీరానికి అందిస్తాయి.
                   

                              

కాలేయంలో నిల్వ ఉంటుంది. ప్రోటీన్ల సంశ్లేషణలో, న్యూక్లిక్ ఆమ్లాల జీవక్రియలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీని న్యూనత వలన హానికర రక్తహీనత (Pernicious anaemia) కలుగుతుంది.
                             

7. పాంటోథినిక్ ఆమ్లం: ఇది తాజా కూరగాయలు, కాలేయం, మూత్రపిండం, ఈస్ట్, గుడ్డులోని సొన, మాంసం, చిలగడ దుంపలు, వేరుశనగల్లో లభిస్తుంది. దీని లోపం వల్ల కాళ్లు, పాదాల్లో మంటలు పుడతాయి.

8. బయోటిన్: ఇది పప్పు దినుసులు, గింజలు, కాయగూరలు, కాలేయం, మూత్రపిండాల్లో లభిస్తుంది. దీని న్యూనత వల్ల కండరాల్లో నొప్పులు, అలసట, నాడీమండల రోగాలు, మానసిక రుగ్మతల లాంటి వ్యాధులు వస్తాయి.

II. కొవ్వులో కరిగే విటమిన్లు
1. విటమిన్ 'ఎ: దీని రసాయనిక నామం రెటినాల్.
(1) ఇది కంటిలోని వర్ణకాలు రాడిప్సిన్ (దండాల్లో (Rods) ఉంటుంది) ఐడాప్సిన్ (శాంకవాల్లో (Cones) ఉంటుంది.) ఉత్పత్తికి దోహదపడుతుంది. ఈ వర్ణకాలు సాధారణ కంటి దృష్టికి అవసరం.

                                

(2) విటమిన్ "A" అస్థిపంజర వ్యవస్థ పెరగడానికి సహాయ పడుతుంది.

(3) ఇది వృక్ష సంబంధ ఆహార పదార్థాల్లో కెరాటిన్ (Carotene) రూపంలో ఉంటుంది. మన శరీరంలో Carotene, విటమిన్ "A" గా మారుతుంది.

(4) ఇది కాలేయం, గుడ్లు, వెన్న, పాలు (Whole Milk), చేప, మాంసం, కాడ్, షార్క్ చేపల నూనె, బచ్చలి, తోటకూరలు, కేరట్, టొమాటో, గుమ్మడి, బొప్పాయి, మామిడి లాంటి వాటిలో దొరుకుతుంది.

(5) Vit "A" న్యూనత వల్ల రేచీకటి, జిరాప్‌థాల్మియా, శుక్లపటలం పగలడం, చర్మం మీద పొలుసులు మొదలైన వ్యాధులు వస్తాయి.

2. విటమిన్ 'డి:  దీని రసాయనిక నామం కాల్సిఫెరాల్ (Calciferol).

¤ ఎముకల్లో కాల్షియం (Calcium), ఫాస్ఫరస్ (Phosphorus)ల నిల్వకు Vit "D" అవసరం.

                       

¤ ఎముకలు పెరగడానికి ఇది దోహదపడుతుంది.

¤ సూర్యరశ్మి తాకిడివల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ (Cholesterol) విటమిన్ 'డి' గా రూపాంతరం చెందుతుంది.

                              

¤ కాలేయం, గుడ్డులోని సొన, వెన్న, కాడ్ చేపనూనె, షార్క్ చేప నూనెలో ఇది లభిస్తుంది.

¤ విటమిన్ 'డి' న్యూనత వల్ల రికెట్స్ (Rickets) వ్యాధి వస్తుంది. ఎముకలు పెళుసుగా అవుతాయి

Rickets(రికెట్స్):- ఈ వ్యాధి 2 నెలల నుంచి 2 ఏళ్ల వయసులో వస్తుంది. దీనివల్ల ఎముకలు సక్రమంగా పెరగక దొడ్డికాళ్లు (Bow legs), వికృతరూపశ్రేణి (Deformed Pelvis), ముట్టికాళ్లు (Knock Knee) మొదలైన వ్యాధులు కలుగుతాయి.

3.విటమిన్ 'ఇ :- దీని రసాయనిక నామం టోకోఫెరాల్ (Toco ferol).

¤ ఇది ఫలాలు, కాయగూరలు, మొలకెత్తిన గింజలు, మాంసం, గుడ్డలోని సొన, పొద్దుతిరుగుడు పువ్వు గింజల నూనె మొదలైన వాటిలో లభిస్తుంది.

                      

¤ ఇది ప్రత్యుత్పత్తి అవయవాలు మామూలుగా పనిచేయడానికి అవసరం.

¤ విటమిన్ 'ఇ న్యూనత వల్ల పురుషుల్లో వంధత్వం, స్త్రీలలో గర్భస్రావం, ఎర్రరక్త కణాల జీవితకాల పరిమితి తగ్గడం మొదలైనవి సంభవిస్తాయి.

4. విటమిన్ 'కె : దీని రసాయనిక నామం ఫిల్లోక్వినోన్.

¤ ఇది రక్తం గడ్డకట్టడానికి అవసరం మానవుని పేగుల్లోని బాక్టీరియాలు 'ఈ విటమిన్‌ను సంశ్లేషణ చేయడంలో తోడ్పడతాయి.

                

¤ ఇది ఆకుకూరలు, ఆవుపాలల్లో లభిస్తుంది.

¤ దీని న్యూనత వల్ల రక్తం ఆలస్యంగా గడ్డ కడుతుంది.

విటమిన్లు - చెడు ప్రభావము
మనిషి ఆరోగ్యముగా మనుగడ సాగించడానికి విటమిన్ల అవసరమెంతోవుంది. విటమిన్ల లోపము వలన ఎన్నో వ్యాధులు వచ్చినా సదరు లోపాన్నిపూరించినట్లైతే ఆయా వ్యాధులు ఇట్టే మాయమవుతాయి. అయితే వచ్చిన చిక్కేమిటంటే విటమిన్ల లోపాలను పూరించే ఆదుర్దాలో విటమిన్లు పుష్కలముగా ఉండే తాజా పండ్లు,ఆకు కూరలకు బదులు ఏకంగా విటమిన్ గుళికలు మింగడము వల్ల ప్రయోజనానికి బదులు కీడే ఎక్కువ జరుగుతుందని ఐరోపా శాస్త్రజ్ఞులు అంటున్నారు. డెన్మార్క్ లోని కోపెన్ హెగాన్ యూనివర్సిటీ ఆసుపత్రికి చెందిన 'గోరన్ బెలకోవిచ్'నాయకత్వములో జరిగిన పరిశోధనలో ..విటమిన్ ఎ ,విటమిన్ ఇ ,బీటాకెరోటిన్లను గుళికల రూపంలో తీసుకుంటే ఏకంగా ప్రాణహాని సంభవిస్తుందని తేలింది. అయితే విటమిన్ సి ,సెలీనియం లను ఈవిధంగా తీసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదన్నారు. గతంలో కొన్ని పరిశీలనలు విటమిన్ గుళికలలో వుండే యాంటి ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని తెలిపాయి. ప్రస్తుత పరిశోధనా ఫలితాలు అందుకు విరుద్ధముగా ఉన్నాయి. 180,938 మంది ప్రజలపై చేసిన పరిశోధనల వల్ల మొత్తము మీద 5 శాతము ప్రజలు విటమిన్ గుళికల వలన మరణిస్తారని తేలింది.

వివిధ రకాల విటమిన్లు వేరు వేరుగా పరిశీలించినపుడు

బీటా కెరోటిన్ వల్ల 7 శాతము

విటమిన్ A వల్ల 16 శాతము

విటమిన్ E వల్ల 4 శాతము మంది మరణించారు అని పరిశోధనల వల్ల తెలిసింది. సెలీనియం వల్ల 10శాతము మరణపు రేటు తగ్గిందని గమనించారు.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again