పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 06, 2015

శక్తి రకాలు


¤ పనిచేసే పటిమను శక్తి అంటారు. వస్తువుకు పనిచేసే పటిమ ఉంటే దాన్ని శక్తి కలిగినది అంటారు.

¤ శక్తి అనేక రూపాల్లో ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి:
                1. యాంత్రిక శక్తి
                2. రసాయనిక శక్తి
                3. ధ్వనిశక్తి
                4. ఉష్ణశక్తి
                5. కాంతిశక్తి
                6. అయస్కాంత శక్తి
                7. విద్యుత్‌శక్తి

¤ జీవరాశులు తీసుకునే ఆహారంలో ఉండే శక్తిని జీవ రసాయనిక శక్తి అంటారు.
¤ శక్తిని అది చూపే ఫలితాల ద్వారా గుర్తించవచ్చు. అంతేకాకుండా శక్తిని ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్చవచ్చు.

ఉదా: 1. బొగ్గును మండించినప్పుడు అది ఉష్ణశక్తిని, కాంతిశక్తిని ఇస్తుంది.
          2. విద్యుత్ బల్బులో విద్యుత్‌శక్తి కాంతిశక్తి, ఉష్ణశక్తిగా మారుతుంది.
          3. కొవ్వొత్తిని మండించినప్పుడు దానిలోని రసాయనిక శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది.

ఇప్పుడు శక్తుల్లోని రకాలను గురించి తెలుసుకుందాం.

1) యాంత్రికశక్తి: ఒక వస్తువును పైకి ఎత్తి వదలడం వల్ల దానికి కలిగిన శక్తిని యాంత్రికశక్తి అంటారు. యాంత్రికంగా మనం ఒక పనిని చేయడానికి ఉపయోగపడేది యాంత్రికశక్తి.

2) రసాయనిక శక్తి: రసాయన సంయోగ పదార్థాల అణువుల్లో దాగి ఉన్న శక్తిని రసాయనిక శక్తి అంటారు. ఈ అణువులు రసాయనిక మార్పులో పాల్గొన్నప్పుడు ఈ శక్తి విడుదల అవుతుంది. రసాయన అణువుల్లోని రసాయన శక్తి భిన్న రూపాల్లోకి మారుతుంది.
ఉదా:    అగ్గిపుల్లను పెట్టె పక్క భాగంలో గీసినప్పుడు వాటిలోని రసాయనిక శక్తి ఉష్ణశక్తి, కాంతిశక్తిగా మారుతుంది.

    పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాల్లోని రసాయనిక శక్తి అవి మండినప్పుడు ఉష్ణశక్తిగా మారుతుంది.

    టార్చి సెల్‌లో రసాయనాల శక్తి దానిని టార్చిలైట్‌లో వేసి పని చేయించినప్పుడు కాంతిశక్తిగా మారుతుంది.

3) ధ్వనిశక్తి: జీవులకు వినికిడి జ్ఞానం కలిగించే శక్తిని ధ్వనిశక్తి అంటారు. వస్తువు కంపించడం వల్ల ధ్వనిశక్తి పుడుతుంది. ఆ కంపనాల కారణంగా మనం ధ్వనిని వినగలుగుతాం. ఒక వస్తువు ముందుకు, వెనుకకు కదలడాన్ని కంపనం అంటారు.
ఉదా:   వీణ తీగలను వేలితో మీటినప్పుడు వాటి కంపనాల వల్ల ధ్వని జనిస్తుంది.
     డోలక్, తబలాల చర్మాన్ని కొట్టినప్పుడు అది కంపించడం వల్ల ధ్వని జనిస్తుంది.

¤ ఒక వస్తువు ఒక సెకను కాలంలో చేసే కంపనాల సంఖ్యను దాని పౌనఃపున్యం (Frequency) అంటారు.

¤  ఒకే పౌనఃపున్యం ఉన్న ధ్వనిని ఉత్పత్తి చేయడానికి శృతి దండాన్ని ఉపయోగిస్తారు. ఇది 'U' ఆకారంలో ఉండే  దీర్ఘచతురస్రాకార లోహపు కడ్డీ.

¤  శృతి దండాన్ని గాలిలో కంపింపజేసినప్పుడు ప్రతి కంపనం ఒక సంపీడ్యత, ఒక విరళీకరణంతో ఉంటుంది.

¤  సంపీడ్యతలో గాలి సాంద్రత పెరుగుతుంది. విరళీ కరణంలో గాలి సాంద్రత తగ్గి పలచనవుతుంది.

¤  ఒక సంపీడ్యత, ఒక విరళీకరణాలను కలిపి ధ్వని తరంగం అంటారు.

¤  ధ్వని ప్రసరణకు గాలి లాంటి యానకం అవసరం. ధ్వని శూన్యంలో ప్రసరించదు. గంట జాడీ ప్రయోగం ద్వారా ధ్వని ప్రసరణకు యానకం అవసరమని, శూన్యంలో ధ్వని ప్రసరణ జరగదని నిరూపించవచ్చు. ఈ ప్రయోగంలో వాయురేచకం గాలిని తీసివేయడానికి ఉపయోగ పడుతుంది. గాలిని ఉంచి గంట మోగించినప్పుడు దాని ధ్వని మనకు వినిపిస్తుంది. గాలిని తీసివేసి గంటను మోగించినప్పుడు ధ్వని మనకు వినపడదు.        

                                   

¤  ధ్వని ఘన, ద్రవ, వాయు పదార్థాల ద్వారా ప్రసరించగలదు. ధ్వని ప్రసరణ ఘన పదార్థాల్లో ద్రవ పదార్థాల కంటే ఎక్కువగా, ద్రవ పదార్థాల్లో వాయు పదార్థాల కంటే ఎక్కువగా ఉంటుంది.
                పదార్థం ధ్వని వేగం
                గాజు 5500 మీ/సె.
                నీరు 1435 మీ/సె.
                గాలి 330 మీ/సె.

ధ్వని పరావర్తనం: రుజుమార్గంలో ప్రయాణించిన ధ్వని అవరోధానికి తగిలి వెనుకకు మళ్లడాన్ని ధ్వని పరా వర్తనం అంటారు. ఆ విధంగా తిరిగి వచ్చి మనకు వినిపించే ధ్వనిని ప్రతిధ్వని అంటారు.

¤  లోతైన బావులు, పెద్ద పెద్ద భవనాల ఎదుట, బీజాపూర్‌లోని గోల్‌గుంబజ్ లాంటి భవనాల దగ్గర ప్రతిధ్వనులను మనం వినవచ్చు.
¤ కాంతి మాదిరి ధ్వని ప్రసారదిశను కూడా మార్చవచ్చు.
¤  రెండు ధ్వనులను మనిషి విడివిడిగా వినాలంటే ఆ ధ్వనుల మధ్య 1/15 సెకనుల కాలవ్యవధి ఉండాలి. అంతకంటే తక్కువ వ్యవధి ఉంటే ఆ తేడాను చెవి గుర్తించలేదు.
¤  గాలిలో ధ్వని వేగం 330 మీటర్లు/సెకను. కాబట్టి 1/15 సెకన్ల కాలంలో ధ్వని ప్రయాణం చేసే దూరం
                    = వేగం × కాలం 330 × 1/15
                   = 22 మీటర్లు.
¤  అసలు ధ్వని, ప్రతిధ్వని మనం వినాలంటే అది మొత్తం 22 మీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అంటే అవరోధానికి, మనకు మధ్య దూరం కనీసం 11 మీటర్లు ఉంటే ప్రతిధ్వని స్పష్టంగా వినగలం.

ధ్వని పరావర్తనం - అనువర్తనాలు: ధ్వని పరావర్తనాన్ని ఉపయోగించి సముద్రపు లోతులను కనుక్కుంటారు. అతి ధ్వనులను సముద్రం అడుగుకు పంపితే అవి నేలకు తగిలి పరావర్తనం చెంది తిరిగి ఉపరితలం చేరతాయి. దీనికి పట్టిన కాలాన్ని బట్టి సముద్రం లోతును నిర్ణయిస్తారు.

¤  ధ్వనిని బాగా పరావర్తనం చెందించగల పదార్థాలు ప్త్లెవుడ్, లోహపు పలకలు మొదలైనవి.

¤  ధ్వనిని ఎక్కువగా శోషణం చేసుకునే పదార్థాలను అధమ పరావర్తకాలు అంటారు. 
ఉదా: దుస్తులు, సచ్చిద్ర పదార్థాలు, థర్మోకోల్.

¤  సభా భవనాలు, సినిమా హాళ్ల గోడలు, సీలింగ్‌లను అధమ పరావర్తక పదార్థాలతో కప్పి ఉంచుతారు. దీనివల్ల ధ్వని పరావర్తనం తగ్గి ధ్వని జనకం నుంచి వచ్చే ధ్వని మాత్రం వినిపిస్తుంది. ప్రతిధ్వనులు వినిపించవు.

¤  గబ్బిలాలు అతి ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి. ఆ ధ్వనులు అవరోధాలకు తగిలి పరా వర్తనం చెందినప్పుడు వాటిని గుర్తించి అవరోధాన్ని తప్పించుకు ఎగురుతాయి.

శబ్ద కాలుష్యం: వినడానికి ఇష్టంగా ఉండే ధ్వనిని సంగీత ధ్వని అంటారు. వినడానికి ఇష్టంగా ఉండని ధ్వనులను చప్పుళ్లు అంటారు. ఇవి శబ్ద కాలుష్యాన్ని కలుగజేస్తాయి.

¤ ధ్వని తీవ్రతను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం డెసిబెల్. డెసిబెల్ అంటే బెల్‌లో 1/10వ వంతు అని అర్థం. ఈ ప్రమాణానికి అలెగ్జాండర్ గ్రాహంబెల్ పేరు పెట్టారు. డెసిబెల్ స్కేలు సంవర్గమానంగా (లాగర్థమిక్‌గా) ఉంటుంది.

¤  వినీ వినిపించని స్థాయిలో ఉండే శబ్దతీవ్రత '0' డెసిబెల్స్ ఉంటుంది. దీని ధ్వని పీడనం చ.సెం.మీ.కు 0.0002 డైన్స్ ఉంటుంది.

¤ శబ్ద కాలుష్యం వల్ల మానవుల్లో వచ్చే అనర్థాలు:

    తాత్కాలికంగా లేదా శాశ్వతంగా చెవుడు.
    పనిలో నైపుణ్యం తగ్గి ఏకాగ్రత లోపిస్తుంది.
    నరాల బలహీనత ఏర్పడి ఏకాగ్రత లోపిస్తుంది.
    అలసట, అశాంతి, తలనొప్పి, అజీర్తి వస్తాయి.
    గుండె మంట, అల్సర్‌లు, గుండెజబ్బులు వస్తాయి.

అకస్మాత్తుగా వచ్చే తీవ్రమైన శబ్దాలు మెదడు, కర్ణభేరిని పాడుచేస్తాయి.

¤ శబ్ద కాలుష్యం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పుట్టబోయే పిల్లలు చెవిటివారుగా పుట్టే ప్రమాదం ఉంది.

నిజ జీవితంలో వినిపించే చప్పుడు మరియు ధ్వని తీవ్రత డెసిబెల్స్‌లో ఈ క్రింది విధంగా ఇవ్వడమైనది 

1) పచ్చిక బయళ్లలో గాలి కదలిక శబ్దం       -        0    

2) గోడ గడియారంలో టిక్‌టిక్ ధ్వని       -        30

3) టెలిఫోన్ గంట శబ్దం            -                     60

4) వినికిడి మీద దుష్పరిణామాలు కలిగించే శబ్దం    -      80

5) చెవి నొప్పికి కారణమయ్యే శబ్ద తీవ్రత       -       120

6) నగరాల్లో ట్రాఫిక్‌కు 50 మీటర్ల దూరంలో శబ్ద తీవ్రత   -    50

7) రోడ్డు పక్కన 10వ అంతస్తులో  వినిపించే శబ్ద తీవ్రత    -50

శబ్ద కాలుష్యం - నివారణ: దీనికోసం కింది పద్ధతులు అనుసరించాలి.

1. కొన్ని ప్రాంతాల్లో హారన్ వేయకుండా వాహనాలు ప్రయాణించాలన్న నిబంధనను విధించాలి.

2. లౌడ్ స్పీకర్లు వాడేందుకు అనుమతులు విధించి పాఠశాలలు, ఆసుపత్రులు, నివాస గృహాల ప్రాంతాల్లో వాడకాన్ని నిషేధించాలి.

3. బాణాసంచా పేల్చడాన్ని నిషేధించాలి.

4. శబ్ద కాలుష్యం కలిగించే పరిశ్రమలను నిషేధించాలి.

5. మానాశ్రయాలను పట్టణాలకు దూరంగా నిర్మించాలి.

6. వనాల చుట్టూ, రహదారుల వెంబడి, పరిశ్రమల ఆవరణల్లో చెట్లు నాటించాలి.

4) ఉష్ణశక్తి: జీవులకు స్పర్శ జ్ఞానాన్ని కలిగించే రూపాన్ని ఉష్ణశక్తి అంటారు. పనిచేసే పటిమను శక్తి అంటారు. పనిచేసే పటిమ ఉష్ణానికి ఉంది. అందుకే ఉష్ణం ఒక శక్తిరూపం.

ఉదా: 1. రైలు ఇంజన్‌లోని ఉష్ణం నీటిని నీటి ఆవిరిగా మారుస్తుంది. నీటి ఆవిరిలోని శక్తి యాంత్రిక శక్తిగా మారి రైలు చక్రాలను తిప్పగలదు.

2. ఇంధనాలను దహనం చేస్తే అవి అధిక ఉష్ణోగ్రత ఉన్న వాయువులుగా మార్పు చెందుతాయి. ఈ వాయువులకు ఉన్న ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా మారి వాహనాలు కదులుతాయి.

¤ ఇతర శక్తిరూపాలను ఉష్ణశక్తిగా మార్పు చేయవచ్చు.

ఉదా: 1. కొవ్వొత్తిలోని రసాయనికశక్తి దానిని మండించినప్పుడు ఉష్ణశక్తి, కాంతిశక్తిగా మారుతుంది.

2. విద్యుత్ బల్బును వెలిగించినప్పుడు విద్యుత్‌శక్తి ఉష్ణశక్తి, కాంతిశక్తిగా మారుతుంది.

3. నిప్పు అంటించిన టపాకాయలో రసాయనశక్తి ఉష్ణశక్తి, కాంతిశక్తి, ధ్వనిశక్తిగా మారుతుంది.

¤ ఉష్ణశక్తిని ఇతర శక్తిరూపాలుగా కూడా మార్చవచ్చు. ఉదా: థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో నీటి ఆవిరి టర్బైన్‌లను వాడి ఉష్ణశక్తిని విద్యుత్‌శక్తిగా మార్చవచ్చు.

ఉష్ణ ఫలితాలు: ఒక వస్తువుకు ఉష్ణాన్ని అందించినప్పుడు

1. దాని స్థితిలో మార్పు వస్తుంది.
2. అది వ్యాకోచించి దాని ఘన పరిమాణం పెరుగుతుంది.
3. రసాయన చర్య వేగం వృద్ధి చెందుతుంది.

¤ ఉష్ణాన్ని పాలలోని సూక్ష్మజీవులను చంపడానికి, తాగునీటిని మరిగించి శుద్ధిచేయడానికి ఉపయో గిస్తారు.
¤ పదార్థాలను వేడిచేసినప్పుడు అవి వ్యాకోచిస్తాయి. వాటిని చల్లార్చినప్పుడు సంకోచిస్తాయి.
¤ ఘన, ద్రవ, వాయు పదార్థాలు సంకోచ, వ్యాకోచ ధర్మాలతో ఉంటాయి.
¤ ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలు, ద్రవ పదార్థాల కంటే వాయు పదార్థాలు ఎక్కువగా వ్యాకోచిస్తాయి.
¤ ఇనుప పట్టాను బండి చక్రానికి తొడగడానికి దాన్ని కాల్చి వ్యాకోచింపజేసి తొడిగిన తర్వాత చల్లారుస్తారు. దీనివల్ల పట్టా చక్రానికి గట్టిగా బిగుసుకుంటుంది.


0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again