పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 07, 2015

కర్ణాటక యుద్ధాలు

          కర్ణాటక యుద్ధాలు (1745-63) 18వ శతాబ్దం మధ్యలో భారత ఉపఖండాన సైనిక విభేదాల వలన సంభవించాయి. ఇందులో వారసత్వం మరియు భూభాగం కోసం జరిగిన పోరాటాలు, మరియు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీల మధ్య జరిగిన దౌత్య మరియు సైనిక పోరాటాలు ఉన్నాయి. ఈ యుద్ధాల ఫలితంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఐరోపా వ్యాపార కంపెనీలపై తమ ఆధిపత్యాన్ని స్థాపించింది. చివరకు ఫ్రెంచి కంపెనీ ప్రధానంగా ఒక్క పాండిచ్చేరికి మాత్రమే పరిమితమైనది. బ్రిటిష్ కంపెనీ ఆధిపత్యం చివరకు భారతదేశంలో బ్రిటీషు రాజ్య స్థాపనకు దారితీసింది. ప్రధానంగా మూడు కర్ణాటక యుద్ధాలు 1744-1763 మధ్య జరిగాయి

భారతదేశంలోని ఆగ్నేయ తీరంలో ఆర్కాట్ రాజధానిగా సాదుతుల్లాఖాన్ స్వతంత్ర కర్ణాటక రాజ్యాన్ని స్థాపించాడు. అంతకు ముందు కర్ణాటక రాజ్యం దక్కన్‌లోని ఒక మొగలు సుభాగా, హైదరాబాద్ నిజాం నామమాత్రపు నియంత్రణలో ఉండేది. ఈ ప్రాంతంలో సంభవించిన అంతర్యుద్ధంలో బ్రిటిష్, ఫ్రెంచివారు చెరో వర్గాన్ని సమర్థించారు. చివరకు బ్రిటిష్‌వారు ఫ్రెంచివారిపై ఆధిపత్యం సాధించారు.

 మొదటి కర్ణాటక యుద్ధం (1745-48): ఐరోపాలో ఆసియా వారసత్వ యుద్ధ ప్రభావంతో భారతదేశంలో ఆంగ్లేయులకు, ఫ్రెంచివారికి మధ్య పోరు మొదలైంది. బార్నెట్ నాయకత్వంలోని ఆంగ్లేయ నౌకాదళం ఫ్రెంచి పడవలను స్వాధీనం చేసుకుంది. ప్రతిగా డూప్లే నాయకత్వంలోని ఫ్రెంచి సైన్యం మద్రాసును ఆక్రమించింది.

 ఆంగ్లేయులు తమను ఫ్రెంచివారి నుంచి రక్షించాల్సిందిగా కర్ణాటక నవాబు అన్వరుద్దీన్‌ను కోరారు. అయితే నవాబు ఆజ్ఞలను ఫ్రెంచివారు ఉల్లంఘించారు. దీంతో ఫ్రెంచివారికి, అన్వరుద్దీన్‌కు మధ్య మద్రాసు సమీపంలోని శాంథోమ్ వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నవాబు ఘోరంగా ఓడిపోయాడు. ఐరోపాలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధంతోపాటు భారతదేశంలో ఆంగ్లేయులు, ఫ్రెంచివారి మధ్య యుద్ధం కూడా ముగిసింది.

  రెండో కర్ణాటక యుద్ధం (1749 - 54): వారసత్వ యుద్ధ సమయంలో ఫ్రెంచివారు హైదరాబాద్‌లో ముజఫర్ జంగ్‌కు, కర్ణాటకలో చందా సాహెబ్‌కు మద్దతు పలికారు. ఆంగ్లేయులు హైదరాబాద్‌లో నాజర్‌జంగ్‌కు, కర్ణాటకలో అన్వరుద్దీన్‌కు, తర్వాత అతడి కుమారుడు మహమ్మద్ అలీకి మద్దతిచ్చారు.
 1749 లో ఫ్రెంచివారు హైదరాబాద్, కర్ణాటకల్లో తమ మద్దతుదారులు సింహాసనం అధిష్టించేలా చేశారు. కానీ ఆంగ్లేయులు రాబర్ట్ క్లైవ్ ఆధ్వర్యంలో ఆర్కాట్‌ను స్వాధీనం చేసుకున్నారు. చందా సాహెబ్‌ను చంపడంతో కర్ణాటక సింహాసనం మహమ్మద్ అలీ వశమైంది.

 మూడో కర్ణాటక యుద్ధం (1758 - 63): ఐరోపాలో 1756 లో సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైంది. 1760 లో జరిగిన వందవాసి యుద్ధంలో ఫ్రెంచి గవర్నర్ కౌంట్ డి లాలీ ఆంగ్ల జనరల్ ఐర్‌కూట్ చేతిలో ఓడిపోయాడు. ఫ్రెంచివారి స్థానంలో బ్రిటిష్‌వారు నిజాం సంరక్షణ బాధ్యతలు చేపట్టారు. 1763 లో ఆంగ్లేయులు, ఫ్రెంచివారి మధ్య సంధి కుదిరింది.

బక్సార్ యుద్ధం (1764)  కారణాలు: 
    సార్వభౌమాధికారం కోసం ఆంగ్లేయులు, బెంగాల్ నవాబు మీర్ ఖాసిం మధ్య పోరు.

    1717 లో మొగలులు జారీ చేసిన ఫర్మానాను ఆంగ్లేయులు దుర్వినియోగం చేయడం.

    నవాబు అంతర్గత వ్యాపారంపై అన్ని రకాల పన్నులను తొలగించడం.

    నవాబు అధికారులతో ఆంగ్లేయులు అమర్యాదకరంగా ప్రవర్తించడం.

   బక్సార్ అనే ప్రదేశం పాట్నా నగరానికి పశ్చిమంగా 120 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ 1764 అక్టోబరు 22 న మేజర్ హెక్టార్ మన్రో నాయకత్వంలోని బ్రిటిష్ సేనలకు, మీర్ ఖాసిం, అవధ్ నవాబు షూజా ఉద్దౌలా, రెండో షా ఆలం ఉమ్మడి సేనలకు మధ్య యుద్ధం జరిగింది.

  ఈ యుద్ధం భారతీయ పాలకుల ఓటమితో ముగిసింది. మూడు రాజ్యాల సేనల మధ్య సమన్వయం లేకపోవడమే బ్రిటిష్ వారి విజయానికి ప్రధాన కారణం.

ఫలితాలు: బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో బ్రిటిష్ ఆధిపత్య స్థాపన, అవధ్ నవాబు ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో కీలుబొమ్మగా మారడం, మొగలు చక్రవర్తి రెండో షా ఆలం కంపెనీ పెన్షనర్ కావడం, కంపెనీ ఔన్నత్యం పెరగడం.

మైసూరు యుద్ధాలు 
 మొదటి మైసూరు యుద్ధం (1766 - 69): మైసూరు పాలకుడు హైదర్ అలీ బ్రిటిష్ వారిని కర్ణాటక ప్రాంతం నుంచి, చివరకు భారతదేశం నుంచి తరిమివేయాలని భావించాడు. హైదర్ అలీ వల్ల తమ సామ్రాజ్యానికి ముప్పు వాటిల్లనుందని గ్రహించిన బ్రిటిష్ వారు నిజాం, మరాఠాలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది యుద్ధానికి దారితీసింది.

  ఈ యుద్ధంలో బ్రిటిష్ వారిపై విజయం సాధించిన హైదర్ అలీ మద్రాసుకు 5 కి.మీ. దూరం వరకు దండయాత్ర కొనసాగించాడు. 1769 లో జరిగిన మద్రాసు సంధితో యుద్ధం ముగిసింది.

 రెండో మైసూరు యుద్ధం (1780 - 84): మరాఠాలు 1771 లో హైదర్ అలీపై దాడి చేసినప్పుడు బ్రిటిష్‌వారు హైదర్ అలీకి మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు. అమెరికా స్వాతంత్య్ర యుద్ధం సందర్భంగా ఇంగ్లండ్‌కు, హైదర్ అలీ మిత్రదేశమైన ఫ్రాన్స్‌కు మధ్య తగాదా తలెత్తింది. హైదర్ అలీ ఆధీనంలోని ఫ్రెంచి భూభాగమైన మహేను బ్రిటిష్ వారు ఆక్రమించారు. ఇవే ఈ యుద్ధానికి దారితీసిన కారణాలు.
 ఈ యుద్ధంలో 1780 లో కల్నల్ బైలీని హైదర్ అలీ ఓడించాడు. 1781 లో పోర్టోనోవో యుద్ధంలో ఐర్‌కూట్ చేతిలో హైదర్ అలీ పరాజయం పొందాడు. 1782 లో హైదర్ అలీ కల్నల్ బ్రైల్‌వైట్‌ను ఓడించాడు. ఈ యుద్ధం 1784 లో జరిగిన మంగళూరు సంధితో ముగిసింది.

 మూడో మైసూరు యుద్ధం (1790 - 92): అంతర్గత సంస్కరణల ద్వారా టిప్పు సుల్తాన్ తన రాజ్యాన్ని బలోపేతం చేయడం, టర్కీ, ఫ్రాన్స్‌లకు రాయబారులను పంపడం ద్వారా వారి సహాయం పొందడానికి ప్రయత్నించడం, బ్రిటిష్ వారి మిత్ర రాజ్యమైన ట్రావెన్‌కోర్ రాజ్య భూభాగాలను టిప్పు సుల్తాన్ ఆక్రమించడం ఈ యుద్ధానికి ప్రధాన కారణాలు.

  ఈ యుద్ధంలో బ్రిటిష్ సైన్యానికి స్వయంగా గవర్నర్ జనరల్ కారన్‌వాలీస్ నాయకత్వం వహించాడు. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓటమి పాలయ్యాడు. 1792 లో జరిగిన శ్రీరంగ పట్టణం సంధితో మూడో మైసూరు యుద్ధం ముగిసింది. ఈ సంధి షరతుల ప్రకారం టిప్పు సుల్తాన్ తన రాజ్యంలో సగం భూభాగాలను బ్రిటిష్ వారికి ఇవ్వడానికి అంగీకరించాడు. యుద్ధ నష్టపరిహారం కింద రూ.3.6 కోట్లు చెల్లించడానికి అంగీకరించి, రూ.1.6 కోట్లు వెంటనే చెల్లించాడు.

 నాలుగో మైసూరు యుద్ధం (1799): 
తన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టిప్పు సుల్తాన్ భావించడం, కొత్త బ్రిటిష్ గవర్నర్ జనరల్ వెల్లస్లీ  బ్రిటిష్ సామ్రాజ్యానికి టిప్పు సుల్తాన్ నుంచి ఉన్న ముప్పును పూర్తిగా తొలగించాలని భావించడం.. ఇవీ ఈ యుద్ధానికి దారితీసిన ప్రధాన కారణాలు.

                                  

 ఈ యుద్ధం సందర్భంగా 1799 మేలో శ్రీరంగ పట్టణంలో బ్రిటిష్ వారితో పోరాడుతూ టిప్పు సుల్తాన్ మరణించాడు. గవర్నర్ జనరల్ సోదరుడు ఆర్థర్ వెల్లస్లీ ఈ యుద్ధంలో పాల్గొన్నాడు. ఇతడే 1815 లో జరిగిన వాటర్లూ యుద్ధంలో ఫ్రెంచి చక్రవర్తి నెపోలియన్‌ను ఓడించాడు.

 మైసూరు రాష్ట్రంలోని చాలా భూభాగాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమయ్యాయి. కొంత భూభాగానికి ఒడయార్ వంశానికి చెందిన కృష్ణరాజ అనే బాలుడిని రాజుగా చేసి, మైసూరు రాజవంశాన్ని పునరుద్ధరించారు.

 బెంగాల్ ఆక్రమణ, ప్లాసీ యుద్ధం (1757)
కారణాలు:   కంపెనీ అధికారులు దస్తక్/ ఉచిత పాసులను దుర్వినియోగం చేయడం.

  యువ నవాబు సిరాజుద్దౌలా తన పూర్వీకుల్లా తాను కూడా ఆంగ్లేయులపై నియంత్రణ కలిగి ఉండాలని భావించడం.

  బ్రిటిష్‌వారు నవాబు ఆజ్ఞలకు విరుద్ధంగా కలకత్తాలో కోటలు నిర్మించడం.


  ప్లాసీ (పలాసీ) అనేది ముర్షిదాబాద్‌కు 20 మైళ్ల దూరంలో ఉన్న ఒక గ్రామం. ఇక్కడ 1757 జూన్ 23 న బ్రిటిష్ సైన్యానికి, నవాబు సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది. రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలోని ఆంగ్లేయ సేనలు సిరాజుద్దౌలాను ఓడించాయి. నవాబు సైన్యంలోని అయిదుగురు సేనానుల్లో మీర్ మదన్, మదన్‌లాల్ మాత్రమే యుద్ధం చేశారు. మిగతా ముగ్గురు - మీర్ జాఫర్, యార్ లుతుఫ్ ఖాన్, రాయ్ దుర్లబ్ కంపెనీ ఏజెంట్లతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని, ప్రేక్షక పాత్ర వహించారు.

 ప్లాసీ యుద్ధం మొదట బెంగాల్‌లో, చివరికి భారతదేశమంతటా బ్రిటిష్ వారి ఆధిపత్య స్థాపనకు దారితీసింది. భారతదేశం నుంచి బ్రిటన్‌కు సంపద తరలింపు ప్రారంభమైంది.

 బిట్స్ 

1. స్వతంత్ర కర్ణాటక రాజ్య స్థాపకుడెవరు?
జ: సాదుతుల్లాఖాన్

2. కర్ణాటక రాజ్య రాజధాని ఏది?
జ: ఆర్కాట్

3. హైదర్ అలీ ఏ మైసూరు యుద్ధ సమయంలో మరణించాడు?
జ: రెండో మైసూరు యుద్ధం

4. ప్లాసీ యుద్ధం తర్వాత సిరాజుద్దౌలాను బంధించి, చంపిన వ్యక్తి ఎవరు?
జ: మిరాన్

5. బక్సార్ యుద్ధ హీరో ఎవరు?
జ: హెక్టార్ మన్రో

6. 'చీకటి గది ఉదంతం'గా పేర్కొనే సంఘటన జరిగిన ప్రదేశం ఏది?
జ: కలకత్తా 

7. ఆర్కాట్ వీరుడిగా ప్రసిద్ధి గాంచిన బ్రిటిష్ జనరల్ ఎవరు?
జ: రాబర్ట్ క్లైవ్

8. పోర్టోనోవో యుద్ధం ఎప్పుడు జరిగింది?
జ: 1781

9. టిప్పు సుల్తాన్ మరణించిన సంవత్సరం?
జ: 1799

10. రెండో మైసూరు యుద్ధం ఏ సంధితో ముగిసింది?
జ: మంగళూరు

11. ఐరోపాలోసప్తవర్ష సంగ్రామం ప్రారంభమైన సంవత్సరం?
జ: 1756 


0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again