పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 05, 2015

భారతీయ రైల్వేలు


    భారత దేశంలో రైల్వేలు మొదటిసారిగా 1853 లో ప్రవేశపెట్టబడ్డాయి. 1947(స్వతంత్రం వచ్చే)నాటికి దేశంలో మొత్తం42 రైల్వే సంస్థలు నెలకొల్పబడి వున్నాయి. 1951లో ఈ సంస్థలన్నింటినీ కలుపుకొని భారత రైల్వే, ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఆవిర్బవించింది. భారత రైల్వే దూర ప్రయాణాలకు మరియు నగరాలలో దగ్గరి ప్రయాణాలకు సబర్బన్ (suburban) అనగా పట్టణపు పొలిమేరలవరకు) అవసరమైన రైళ్ళను నడుపుతోంది.
                       Indian Railways Logo on Narayanadri-Falaknuma Express.jpg

రైలు మార్గాలు భారతదేశపు నలుమూలలా విస్తరించి వున్నాయి. భారతీయ రైలు మార్గాలపై ప్రభుత్వానికి ఏకఛ్ఛత్రాధిపత్యం ఉంది. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. రైలు మార్గాలు మొత్తం దూరం సుమారుగా 114500 కి.మీ. ఇది సుమారు 65000 కి.మీ రూటు పై వుంది మరియు 7500 స్టేషన్లు వున్నాయియ 20 11 నాటికి రైల్వేల వద్ద 2,40,000 వాగన్లు, 69,000 కోచ్ లు, 9000 ఇంజిన్లు వున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగి వున్న సంస్థలలొ భారతీయ రైల్వేది (సుమారు పదనాలుగు లక్షలు)ద్వితీయ స్థానము.

భారతీయ రైల్వే కంప్యూటరీకరణలో అన్నిటిలో ప్రథమ స్థానంలో వుంది. ముందస్తుగా ప్రయాణం ఖరారు చేసుకునేటందులకు మరియు మార్పులు చేసుకునేందుకు సౌకర్యం అందిస్తోంది. ఈ విభాగం భారతీయ రైల్వే ఆహార నిర్వహణ మరియు పర్యాటక సంస్థ నిర్వహిస్తుంది. ఇది భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పని చేస్తూ భారత రైల్వే రవాణా వ్యవస్థను నిర్వహిస్తూ ఉంటుంది. రైల్వే మంత్రిత్వ శాఖ కేంద్ర రైల్వే మంత్రి (కేబినెట్ హోదా) నిర్వహణలో ఉండే రైల్వే విభాగం, రైల్వే బోర్డు కింద పని చేస్తుంది. దీనిని పరిపాలనా సౌలభ్యం కోసం 17 జోన్లుగా విభజించారు.                    
                             

        ప్రపంచంలోనే అతి పొడవైన, రద్దీ రైలు మార్గాల్లో భారతీయ రైల్వే కూడా ఒకటి. రోజుకి సుమారు 1,60,00,000 మంది ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. 10,00,000 టన్నుల సరకులు భారతీయ రైల్వేల్లో రవాణా అవుతున్నాయి. సుమారు 16 లక్షల మంది ఉద్యోగులున్న భారతీయ రైల్వే, వాణిజ్యపరంగా ప్రపంచంలోనే ఎక్కువమందికి ఉద్యోగం కల్పిస్తున్న సంస్థగా రికార్డులకెక్కింది.


చరిత్ర        

 భారత దేశంలో రైలు మార్గాల కొరకు మొదటిసారిగా 1832లో ప్రణాళిక ప్రవేశపెట్టబడినప్పటికీ, ఆ తరువాత మరో దశాబ్దం వరకూ ఇందులో ఎటువంటి పురోగతి సాధించలేదు. 1844లో అప్పటి గవర్నర్ జనరెల్ విస్కౌంట్ హార్డింగ్(Lord Hardinge) రైల్వేలలో ప్రయివేటు వ్యక్తుల పెట్టుబడులను అనుమతించాడు. ఇదే కాక రెండు రైల్వే సంస్థలను (బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ)స్థాపించి నూతన పెట్టుబడిదారులకు సాయపడవలసిందిగా కోరాడు. ఆ తరువాతి కొద్ది సంవత్సరాలలో బ్రిటిష్ పెట్టుబడిదారుల ఆసక్తి కారణంగా అనేక రైలు మార్గాలు వేగంగా నిర్మించబడ్డాయి. భారతదేశంలో మొట్టమొదటి రైలు 22 డిసెంబర్ 1851న నడుపబడింది. ఇది రూర్కీలో నిర్మాణ సామాగ్రిని తరలించడానికి వినియోగించబడింది. ఆ తరువాత ఒకటిన్నర సంవత్సరాలకు అనగా ది.16 ఏప్రిల్ 1853లో మొదటి ప్రయాణీకుల రైలు బోరిబందర్, బొంబాయి, థాణేల మధ్య నడుపబడింది. ఈ ప్రయాణం మొత్తం దూరం 34 కి.మీ కాగా, సాహిబ్, సుల్తాన్, సింధ్ అనే ఇంజిన్లను వినియోగించారు. ఒక విధంగా ఈ సంఘటన భారత రైల్వేలకు అంకురార్పణ చేసిందని చెప్పుకోవచ్చు.

పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం నూతన పధకాలను ప్రవేశపెట్టింది. ఈ పధకం ప్రకారం, పెట్టుబడిదారులకు మొదటి కొద్ది సంవత్సరాలకు కనీసం ఐదు శాతం లాభాలకు హామీ లభిస్తుంది. సంస్థ ప్రారంభమైన తరువాత అది బ్రిటిష్ ప్రభుత్వ ఆధీనమౌతుంది, కానీ సంస్థ మీద అజమాయిషీ మాత్రం పెట్టుబడిదారుల వద్దే ఉంటుంది. దీంతో 1880కి, మొత్తం రైలు మార్గాల దూరం 14,500 కి.మీ (9000 మైళ్ళు) వరకు విస్తరించింది. ఇందులో అధికశాతం పెద్ద రేవు పట్టణాలైన బొంబాయి, మద్రాస్, కలకత్తాలను చేరుకునేందుకు నిర్మించబడ్డాయి. 1895 నాటికి భారత దేశంలో ఇంజిన్ల తయారీ మొదలయ్యింది. 1896లో భారత ఇంజినీర్లు ఉగాండా రైల్వేను నిర్మించడంలో సాయపడ్డారు.

భారత ద్వీపకల్ప రైల్వే నెట్-వర్క్ 1870 లో. ఆ కాలంలో GIPR అతిపెద్ద రైళ్ళ కంపెనీలలో ఒకటి.ఆ తరువాత కొద్దికాలంలోనే దేశంలోని వివిధ రాజ సంస్థానాలు తమ సొంత రైలు మార్గాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఆ విధంగా రైలు మార్గాలు వేర్వేరు ప్రాంతాలు (ఇప్పటి రాష్ట్రాలు) అస్సాం, రాజస్థాన్, ఆంధ్ర ప్రదేశ్ లకు విస్తరించాయి. 1901లో రైల్వే బోర్డు స్థాపించబడినప్పటికీ విధాన నిర్ణయాధికారం మాత్రం బ్రిటిష్ వైస్రాయ్ జెనరెల్ (లార్డ్ కర్జన్) వద్దనే వుండేది. రైల్వే బోర్డు ఆర్దిక మరియు పరిశ్రమల శాఖ కింద పని చేసేది. ఈ బోర్డును నిర్వహించేదుకు ప్రభుత్వ రైల్వే అధికారి అధ్యక్షుడు గానూ, ఇంగ్లండు నుండి ఒక రైల్వే నిర్వహణాధికారి, రైల్వే సంస్థ ప్రతినిధి ఒకరు ఉండేవారు. రైల్వే బోర్డు చరిత్రలో మొదటి సారిగా లాభాలను ఆర్జించడం మొదలైన తరువాత 1907 లో రైల్వే సంస్థలన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

ఆ తరువాతి సం.లో మొదటి సారిగా విద్యుత్ ఇంజిన్లను ప్రవేశపెట్టారు. మొదటి ప్రపంచ యుద్దం మొదలైన తరువాత రైల్వేలు బ్రిటీష్ వారి అవసరాల కోసం దేశం వెలుపల కూడా వినియోగించడం జరిగింది. ప్రపంచ యుద్దం పూర్తయ్యే సరికి రైల్వేలు బాగా దెబ్బ తిని మూల పడ్డాయి, దాంతో 1920లో ప్రభుత్వం వాటి నిర్వహణను తన ఆధీనంలోకి తీసుకొని రైల్వేల ఆర్థిక వ్యవహారాలను ఇతర ప్రభుత్వ ఆర్దిక వ్యవహారాల నుండి వేరు చేసింది. ఈ విధానం ఇప్పటికీ ప్రత్యేక రైల్వే బడ్జెట్ రూపంలో అమలులో ఉంది.

ఆ తరువాతి కాలంలో సంభవించిన రెండవ ప్రపంచ యుద్దంలో ట్రైన్లను మధ్య ప్రాచ్యంలోకి తరలించడంతో రైల్వేలు మరింత దెబ్బ తిన్నాయి. రైల్వే కర్మాగారాలు ఆయుధ కర్మాగారాలుగా మారిపోయాయి. 1947 లో స్వాతంత్రం వచ్చిన సమయంలో అధిక శాతం రైలు మార్గాలు కొత్తగా అవతరించిన పాకిస్థాన్ లో ఉండి పోయాయి. దాంతో మిగిలిన నలభై రెండు వేర్వేరు రైలు మార్గాలను (రాజ సంస్థానాల ఆధీనంలో ఉన్న ముప్పై రెండు మార్గాలతో సహా) కలుపుకొని ఏకైక సంస్థ "భారతీయ రైల్వే" అవతరించింది. 1951లో అప్పటి వరకు వేర్వేరుగా ఉన్న రైల్వేలను మార్చి, మొత్తం ఆరు ప్రాంతీయ విభాగాలను ఏర్పాటు చేయటం జరిగింది. భారత దేశ ఆర్దిక పరిస్థితి మెరుగు పడటంతో అన్ని రైల్వే కర్మాగారాలు పూర్తిగా దేశీయ సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగంలోకి తెచ్చాయి. సం.1985 నాటికి అప్పటి వరకూ వినియోగంలో ఉన్న ఆవిరి యంత్రాలకు బదులుగా డీసెల్ మరియు విద్యుత్ యంత్రాలు ప్రవేశించాయి. 1995 నాటికి దేశంలోని రైల్వే రిజర్వేషన్ వ్యవస్థ మొత్తం కంప్యూటరీకరించబడింది. ప్రపంచలో చైనా మిలిటరీ తరువాత అత్యధిక ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థగా భారత రైల్వేలు రికార్డును సృష్టించాయి.

       మనదేశంలో రైళ్లని ప్రవేశపెట్టాలనే ఆలోచన 1832లో వచ్చింది. 1844లో అప్పటి భారత గవర్నర్ జనరల్ సర్ హెన్రీ హార్డింజ్ (1844-48) రైలు వ్యవస్థ ఏర్పాటుకు ప్రైవేటు వ్యక్తులను ఆహ్వానించాడు. లార్డ్ డల్హౌసీ (1848-56) ఆధ్వర్యంలో దేశంలో మొదటి రైలు పట్టాల కెక్కింది. 1853 ఏప్రిల్ 16న బాంబేలోని బోరిబందర్ నుంచి థానే వరకు మొదటి రైలు ప్రయాణం సాగింది. మొత్తం 34 కిలో మీటర్ల దూరం నడిచిన ఆ రైలులో 400 మంది ప్రయాణించారు. మొదటి రైలు బయలుదేరే ముందు గౌరవ సూచకంగా 21 సార్లు తుపాకులను కూడా పేల్చారు.

దేశంలో రెండో రైలు 1854లో హౌరా, హుగ్లీల మధ్య ప్రయాణించింది. ఆక్వర్త్ కమిటీ సూచనల మేరకు 1892లో ప్రభుత్వం రైల్వేల నిర్వహణను చేపట్టింది. స్వాతంత్య్రం పొందే నాటికి మనదేశంలో 42 వేర్వేరు రైల్వే వ్యవస్థలు ఉండేవి. వీటిని 1951లో జాతీయం చేసి భారతీయ రైల్వేలను ఏర్పరిచారు.

రైల్వే గణాంకాలు
రైలు మార్గాలు మొత్తం దూరం సుమారుగా 114500 కి.మీ .ఇది సుమారు 65000 కి.మీ రూటు పై వుంది మరియు 7500 స్టేషన్లు వున్నాయియ  20 నాటికి రైల్వేల వద్ద 2,40,000 వాగన్లు, 69,000 కోచ్ లు, 9000 ఇంజిన్లు వున్నాయి. భారతీయ రైలు మార్గాలపై ప్రభుత్వానికి ఏకఛ్ఛత్రాధిపత్యం ఉంది. 
                             
భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. ఇది ప్రతి రోజూ మూడు కోట్ల ప్రయాణీకులను గమ్యం చేరుస్తూండడమే కాక మరో 28 లక్షల మెట్రిక్ టన్నుల సరుకులను కూడా రవాణా చేస్తోంది.[3] ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను (సుమారు పదనాలుగు లక్షలు)కలిగి వున్న సంస్థలలొ భారతీయ రైల్వేది ద్వితీయ స్థానము.

ట్రాకు

బ్రాడ్ గేజ్ భారతరైల్వేలు ఉపయోగించిన ప్రముఖ గేజ్.

దక్షిణ మధ్య రైల్వేలోని బొగద రైలు సొరంగం గుండా వెళుతున్న ఒక రైలు
మొత్తం రైలు మార్గము సుమారు 108,706 కీ.మీ.(67,547 మైళ్ళు). ఈ మార్గాలని వేగం అధారముగా (75 కీ.మీ/గం నుండి 160కీ.మీ/గం లేదా 47 మైళ్ళు/గం నుండి 99 మైళ్ళు/గం) విభజించారు. భారతీయ రైలు మార్గాన్ని
బ్రాడ్ గేజ్ (స్టాండర్డ్ గేజ్ కంటే వెడల్పైనది – 4  అడుగులు 8½  అంగుళాలు (1,435 మిల్లీ మీటర్లు)); , మీటర్ గేజ్; మరియు నారో గేజ్ (స్టాండర్డ్ గేజ్ కంటే తక్కువ), గా విభజించారు.

భారతీయ రైల్వే 4 రకాల గేజ్‌లలో కార్యకాలాపాలు సాగిస్తోంది. అవి
1. బ్రాడ్ గేజ్ (1.676 మీటర్లు)

2. మీటర్ గేజ్ (ఒక మీటరు)

3. న్యారో గేజ్ (0.762 మీటర్లు)

4. లైట్ న్యారో గేజ్ (0.610 మీటర్లు).
మొత్తం రైలు మార్గాల్లో సుమారు 71 శాతం బ్రాడ్ గేజ్‌గా ఉంది. మీటర్ గేజ్ కింద 23 శాతం ఉంది. మిగిలిన మార్గాన్ని న్యారోగేజ్, లైట్ న్యారోగేజ్‌లు ఆక్రమించాయి.


బ్రాడ్ గేజ్ – 1,676 మీ.మీ (5.5 అడుగులు) – భారత దేశములో అత్యధిక రైలు మార్గం బ్రాడ్ గేజ్. సుమారు 86,526 కీ.మీ (53,765 మైళ్ళు)ల బ్రాడ్ గేజ్ రైలు మార్గం కలదు. రద్దీ తక్కువ ఉన్న ప్రాంతాలకు మీటర్ గేజ్ (1,000 మీ.మీ. (3.28 ft) రైలు మార్గాన్ని నిర్మించారు. ప్రస్తుతం అన్ని మార్గాలను బ్రాడ్ గేజ్ గా మార్చే పనులు జరుగుతున్నాయి. కొండ ప్రాంతాలలో ఉన్న రైలు మార్గాలను నారో గేజ్ మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గాలను బ్రాడ్ గేజ్ గా మార్చడం చాలా కష్టం. మొత్తం నారో గేజ్ రైలు మార్గం 3,651 కీ.మీ (2,269 మైళ్ళు). ప్రఖ్యాత నీలగిరి పర్వత రైల్వే మరియు [[డార్జిలింగ్ హిమాలయాల రైల్వే] లు నారో గేజ్ రైలు మార్గాన్ని కలిగి ఉన్నాయి. రైల్వేలు ఉపయొగించిన కొన్ని రైలు మార్గాలను జంతు ప్రదర్శన శాలలో ఉపయొగిస్తున్నారు.

రైలు పట్టాల కింద ఉపయోగించే స్లీపెర్స్ ఎక్కువ భాగం కాంక్రీట్ తో తయారైనప్పటికీ కొన్ని పాత రైలు మార్గాలలో టేకు, మహాగని వంటి చెక్క స్లీపర్స్ కూడా వాడకంలో వున్నాయి. కాంక్రీట్ స్లీపర్స్ వాడటం వీలు కాని ప్రదేశాలలో లోహపు స్లీపర్స్ కూడా వినియోగంలో వున్నాయి.

బోగీ
సామాన్యంగా ప్రతి ట్రైన్ వెనుక గార్డుకు ఒక ప్రత్యేకమైన భోగి కేటాయంచబడి వుంటుంది. ఈ గార్డు ట్రైన్ బయలుదేరే ముందు అన్నీ సరిగా వున్నాయో లేదో చూసి మందు వుండే వాహకునికి (డ్రైవర్) సంకేతాలను ఇవ్వవలసి వుంటుంది. సాధారణంగా ప్రతి ప్రయాణీకుల ట్రైన్ కూ నాలుగు సాధారణ భోగీలు (ముందు రెండు, వెనుక రెండు) వుంటాయి. అందులో ఒకటి ఆడవారికి కేటాయించబడి వుంటుంది. ప్రతి ట్రైన్ కీ వుండే భోగీల సంఖ్య ఆ మార్గానికి వుండే రద్దీని బట్టి వుంటుంది. అవసరాన్ని బట్టి సామాన్ల కోసం, ఉత్తరాల బట్వాడా కోసం ప్రత్యేక భోగీలు అనుసంధానించి వుండటం కూడా గమనించవచ్చు. దూర ప్రయాణాలు చేసే ట్రైన్లలో వంట సదుపాయం వుండే ప్రత్యేక బోగి భోజన సదుపాయ బోగి కూడా వుంటుంది.

నామకరణ విధానం
రైళ్ళు వివిధ వివిధ వర్గాలుగా విభజించబడ్డాయి. వీటి ప్రకారం వాటి ప్రాముఖ్యత, అవి ఆగే ప్రదేశాలు, టిక్కెట్ల రేట్లు ఉంటాయి. ప్రతి ఎక్స్ప్రెస్ రైలుకు నాలుగు అంకెల పేరు ఉంటుంది – మొదటి అంకె ఆ రైలును నడిపే రైల్వే మండలాన్ని, రెండోది ఆ రైలును నియంత్రించే సదరు మండలంలోని విభాగం పేరు, చివరి రెండు ఆ రైలు వరుస సంఖ్యను తెలియజేస్తాయి.

సూపరు-ఫాస్టు రైళ్ళన్నిటికీ, మొదటి అంకె ఎప్పుడూ '2' ఉంటుంది. రెండో అంకె రైల్వే మండలాన్ని, మూడోది విభాగాన్ని, ఆ విభాగంలోని వరుస సంఖ్యను తెలుపుతాయి. రెండు గమ్యస్థానాల మధ్య ఎదురుబొదురుగా నడిచే జంటా రైళ్ళకు సాధారణంగా పక్కపక్క నంబర్లు ఉంటాయి. దాదాపుగా అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ళన్నిటికీ ఓ ప్రత్యేకమైన పేరు పెడతారు. ఈ పేరు ప్రముఖ వ్యక్తులకు, సంఘటనలకు, నదులు, పర్వతాలు మొదలైన వాటికి చెంది ఉంటాయి. కొన్ని గుర్తుపెట్టుకోదగిన ఉదాహరణలు:

హైదరాబాద్ లోని చార్మినార్ కట్టడానికి గుర్తుగా, హైదరాబాద్ మరియు చెన్నై ల మధ్య నడిచే చార్మినార్ ఎక్స్‌ప్రెస్.

ఆధ్యాత్మిక నేత అయిన మాతా అమృతానందమయి కి గుర్తుగా, పాలక్కాడ్ టౌన్ మరియు తిరువనంతపురము ల మధ్య నడిచే అమృతా ఎక్స్‌ప్రెస్

మహాత్మా గాంధీ యొక్క సబర్మతి ఆశ్రమం నకు గుర్తుగా, అహ్మదాబాద్ మరియు న్యూ ఢిల్లీ ల మధ్య నడిచే ఆశ్రమ్ ఎక్స్‌ప్రెస్

ప్రపంచ ప్రఖ్యాత కవి అయిన రవీంద్రనాథ టాగూరు కి గుర్తుగా ముంబయి (చత్రపతి శివాజి టెర్మినస్, CST) మరియు హౌరా (కోల్‌కతా) ల మధ్య నడిచే గీతాంజలి ఎక్స్‌ప్రెస్

పురాణ పురుషుడైన పరశురాముడు నకు గుర్తుగా, మంగుళూరు మరియు తిరువనంతపురము ల మధ్య నడిచే పరశురామ్ ఎక్స్‌ప్రెస్.

సూఫీ గురువు ఐన హజరత్ నిజాముద్దీన్ ఔలియా నకు గుర్తుగా వివిధ స్టేషన్ల మధ్య నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్.

ముఖ్యాంశాలు

    పరిపాలనా సౌలభ్యం కోసం భారతీయ రైల్వేలను 17 జోన్లుగా విభజించారు. మన రాష్ట్రం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చింది.

    దేశంలో మొదట ఏర్పాటుచేసిన రైల్వే జోన్ దక్షిణ రైల్వే. మద్రాసు కేంద్రంగా 1951 ఏప్రిల్ 14న దక్షిణ రైల్వేను ఏర్పాటు చేశారు.

    దేశంలో అతి పెద్ద రైల్వే జోన్‌గా ఉత్తర రైల్వే రికార్డు సృష్టించింది.

  1966 అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే జోన్‌ను ప్రారంభించారు. 2006 అక్టోబరు 2 నాటికి దీనికి 40 సంవత్సరాలు పూర్తయ్యాయి.

    
   మొదటి విద్యుత్ రైలు ఇంజన్‌ను 1908లో ప్రవేశపెట్టారు. భారతీయ రైల్వేల్లో మొదటిసారిగా బొంబాయి వి.టి నుంచి కుర్లా వరకు 16 కి.మీ. దూరాన్ని 1925లో విద్యుదీకరించారు. 1929లో మొదటి ఎలక్ట్రిక్ రైలు కళ్యాణ్, పుణెల మధ్య ప్రయాణించింది. దాని పేరు దక్కన్ క్వీన్.

    దేశంలో మొదటి భూగర్భ రైల్వే (మెట్రో రైలు వ్యవస్థ)ను 1984 అక్టోబర్ 24న కలకత్తాలో ప్రారంభించారు. ప్రారంభంలో డమ్ డమ్ నుంచి బెల్గాచియా వరకు ఉన్న మెట్రో రైలు మార్గాన్ని తరువాత ఎస్ల్పినాడే - టాలీగంజ్ వరకు విస్తరించారు.

    భారతీయ రైల్వేలకు 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా 2003లో రైల్వేశాఖ బోలు, దగార్డ్ అనే ఒక మస్కట్‌కు విడుదల చేసింది. బోలు, దగార్డ్ అనేది సిగ్నల్ లైట్‌ను పట్టుకుని ఉన్న ఒక ఏనుగు బొమ్మ.

                                 
                        భారతీయ రైల్వే ల గార్డుకి గుర్తు

    రాజస్థాన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహకారంతో పర్యాటక రంగ అభివృద్ధి కోసం రైల్వే శాఖ 'ప్యాలెస్ ఆన్ వీల్స్' అనే విలాసవంతమైన రైలును జనవరి 26, 1982న ప్రారంభించింది. ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలును న్యూఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో ప్రముఖ పర్యాటక స్థలాలను వీక్షించడానికి ఏర్పాటు చేశారు.

    మనదేశంలో అతి చిన్న పేరున్న రైల్వేస్టేషన్ ఇబ్ (IB). ఇది ఒరిస్సాలో ఉంది. అదే విధంగా అతి పొడవైన పేరు మన రాష్ట్రంలోని రేణిగుంట సమీపంలోని 'వెంకట నరసింహరాజువారి పేట' స్టేషన్‌కు ఉంది.

    మనదేశంలో ఎక్కువ దూరం, ఎక్కువ సమయం నడిచే రైలు హిమసాగర్ ఎక్స్‌ప్రెస్. ఇది కన్యాకుమారి నుంచి జమ్మూతావి వరకు సుమారు 3,745 కిలో మీటర్ల దూరాన్ని 74 గంటల 55 నిముషాల్లో ప్రయాణిస్తుంది. హిమసాగర్ ఎక్స్‌ప్రెస్ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ, జమ్మూకాశ్మీర్‌లను కలుపుతూ ప్రయాణిస్తుంది.


    దేశంలో అత్యంత వేగంగా (గంటకు 140 కి.మీ.) ప్రయాణించేది శతాబ్ది ఎక్స్‌ప్రెస్. ఫరీదాబాద్ - ఆగ్రాల మధ్య ప్రయాణించే భోపాల్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ దేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా గుర్తింపు పొందింది.

    త్రివేండ్రం రాజధాని ఎక్స్‌ప్రెస్ ఎక్కడా ఆగకుండా ఎక్కువ దూరం నడిచే రైలుగా రికార్డు సాధించింది. ఇది వడోదరా - కోటాల మధ్య 528 కి.మీ. దూరం వరకు (6.55 గంటలు) ఆగకుండా ప్రయాణిస్తుంది.

    రాజమండ్రి వద్ద గోదావరి నదిపై నిర్మించిన రోడ్డు - రైలు బ్రిడ్జి దేశంలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది.

    దేశంలో అత్యంత పొడవైన రైల్వే వంతెన (3.5 కి.మీ) బీహార్‌లోని ససారంనకు సమీపంలో సోన్ నదిపై ఉంది. దీనిపేరు నెహ్రూసేతు.

కొంకణ్ రైల్వే: భారత దేశంలో మొదటిసారిగా ప్రైవేటు రంగంలో నిర్మితమైంది. 1998 జనవరిలో కొంకణ్ రైల్వే మార్గం ప్రారంభం కాకముందు పశ్చిమ తీరం వెంబడి రైలు మార్గంలేదు. కొంకణ్ రైల్వేను మహారాష్ట్రలోని రోహ నుంచి కర్ణాటకలోని మంగళూరు వరకు నిర్మించారు. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు కొంకణ్ రైల్వేలో భాగస్వాములుగా ఉన్నాయి. ఇంజినీరింగ్ అద్భుతంగా పేర్కొనే కొంకణ్ రైల్వే మార్గం 760 కి.మీ. మేర విస్తరించి ఉంది. ఈ రైలు మార్గంలో సుమారు 146 నదులు, ప్రవాహాలు, 2000 బ్రిడ్జిలు, 73 సొరంగ మార్గాలు ఉండటం గమనార్హం.

    భారత్‌లోనే కాకుండా ఆసియాలో కూడా అత్యంత పొడవైన రైలు సొరంగ మార్గం (టన్నెల్) కొంకణ్ రైల్వేలోనే ఉంది. గోవాకు సమీపంలో ఉన్న ఈ సొరంగాన్ని 'కర్బుడే టన్నెల్' అంటారు. దీని పొడవు సుమారు 6.5 కి.మీ. ఉంటుంది. కొంకణ్ రైల్వేలోని పన్వల్ నది మీద 64 మీటర్ల ఎత్తున ఉన్న వంతెన దేశంలోనే ఎత్తయినది.హౌరా - అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్ మొత్తం 115 చోట్ల ఆగుతుంది. ఎక్కువ స్టేషన్లలో ఆగే ఎక్స్‌ప్రెస్‌గా ఇది రికార్డుకెక్కింది.

భారతీయ రైల్వేల నిర్వహణా వ్యవస్థలో రైల్వే మంత్రిత్వ శాఖ అగ్ర భాగాన ఉంది. రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. అవి.

   RITES (రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీసెస్ లిమిటెడ్)
   IRCON (ఇండియన్ రైల్వే కన్‌స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్)
   IRFCL (ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్)
   CONCOR (కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్)
  IRCTC(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) మొదలైనవి.

    దేశంలో నాలుగు ముఖ్యమైన రైల్వే శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. అవి: 

1. రైల్వే టెస్టింగ్ అండ్ రిసెర్చ్ సెంటర్, లక్నో,

2. ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్డ్స్ ట్రాక్ టెక్నాలజీ, పుణె.

3. ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్, సికింద్రాబాద్.

4. రైల్వే స్టాఫ్ కాలేజ్, వడోదరా.

రైల్వే విభాగాలు
పాలనా సదుపాయం కోసం భారతీయ రైల్వేలను 17 జోనులు (రైల్వే మండలాలు)గా విడగొట్టారు.

   కొంకన్ రైల్వే                -   ముంబై 

భారత రైల్వేలు మరి కొన్ని విశేషాలు
భారతదేశంలో మొదటి సారిగా రైలు ప్రయాణం చేసిన తేది 16.04.1851.

భారత దేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన రైలు స్టేషన్లు వరుసగా భవానీ మాండీ ఇది మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ సరిహద్దులలో ఉంది. నవాపూర్ ఇది మహారాష్ట్రా మరియు గుజరాత్ సరిహద్దులలో ఉన్నది. జరాయ్‌కేలా ఇది ఒరిస్సా మరియు జార్ఖండ్ సరి హద్దులలో ఉన్నది. ఒరిస్సా మరియు జార్ఖండ్ సరి హద్దులలో ఉన్న మరో రైల్వే స్టేషన్ బార్బిల్.

భారతదేశంలో అత్యంత చిన్న పేరున్న రైల్వే స్టేషన్ ఇబ్. ఇది ఒరిస్సా లోని ఝూర్స్ గూడా సమీపంలో ఉన్నది.

భారతదేశంలో పెద్ద పేరున్న రైల్వే స్టేషన్ వెంకట నరసింహరాజు వారి పేట. ఇది అర్కోణమ్ మరియు రేణిగుంట రైలు మార్గంలో ఉన్నది.

భారతదేశంలో అత్యంత తక్కువ దూరం ప్రయాణిచే రైలు నాగపూర్ నుండి అంజి వరకు ప్రయాణం చేస్తుంది.ఈ రైలు ప్రయాణం చేసే దూరం కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే.

భారతదేశంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలు కన్యాకుమారి కుమారి నుండి దిబ్రూఘ‌డ్‌టౌన్‌ వరకు ప్రయాణించే వివేక్ ఎక్స్‌ప్రెస్. ఇది 110 గంటల సమయంలో 4273 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది.

భారతదేశంలో అత్యంత తక్కుగా మధ్య దూరం ఉన్న రైలు స్టేషన్లు సఫిల్ గూడ దయానంద సాగర్. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం 170 మీటర్లు మాత్రమే.

భారతదేశంలో ఉన్న అత్యంత పొట్టి రైలు కొసాంబ్ ఉమర్‌పడ వరకు ప్రయాణిస్తుంది. దీనికి కేవలం రెండు భోగీలు మాత్రమే ఉన్నాయి.

భారతదేశంలో అత్యంత ఆలస్యంగా వచ్చే రైలు గౌహతి. ఇది గౌహతి నుండి తిరువనంత పురంవరకు సరాసరి 10 నుండి 12 గంటల ఆలస్యంగా ప్రయాణం చేస్తుంది. దీని ప్రయాణ సమయం 63.05 గంటలు.

భారతదేశంలో ఉన్న అత్యంత పొడవైన రైలు స్టేషన్ పశ్చిమ బెంగాలు లోని ఖరగ్‌పూర్. దీని పొడవు 1072.5 మీటర్లు.

భారతదేశంలో మూడు గేజుల పట్టాలు ఉన్న స్టేషన్ పశ్చిమ బెంగాల్ లోని న్యూజల్సాయ్ గురి.

భారతదేశంలో అత్యధిక మార్గాలు ఉన్న రైలు జంక్షన్ ఉత్తరప్రదేశ్‌లో ఉన్న మ‌థుర‌'.


రైళ్ళ క్రమం

రాజధాని ఎక్స్‌ప్రెస్: ఈ రైళ్ళు పూర్తిగా ఎయిర్ కండిషన్ కలిగి, దేశంలోని ముఖ్య నగరాలను దేశ రాజధాని ఢిల్లీతో కలుపుతుంటాయి. మిగిలిన అన్ని రైళ్ళ కన్నా ఆద్యత కలిగి ఉండే ఈ రాజధాని రైళ్ళు దేశంలోనే అతి వేగవంతమైనవి. వీటి సగటు వేగం గంటకు 120 కి.మి (గంటకు 74.5 మైళ్ళు). ఈ రైళ్ళు తమ మార్గంలో కొన్ని ముఖ్య స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి.

శతాబ్ది మరియు జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్: శతాబ్ది రైళ్ళు ఎయిర్ కండిషన్ కలిగి ఉండి, ముఖ్య నగరాలను కలుపుతాయి. అయితే వీటిలో కేవలం కూర్చుని ప్రయాణించే సదుపాయం మాత్రమే ఉంటుంది. జన శతాబ్ది రైళ్ళు ఎయిర్ కండిషన్ లేకుండా ఉండి ప్రయాణ ధరలు శతాబ్ది రైళ్ళకన్నా తక్కువగా ఉంటాయి.

సూపర్-ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లేక మెయిల్: ఈ రైళ్ళ సగటు వేగం గంటకు 55 కి.మి. (గంటకు 34మైళ్ళు) కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటి టికెట్టు ధరలో అదనంగా సూపర్ ఫాస్ట్ సర్చార్జి కలుపుతారు.

ఎక్స్‌ప్రెస్: భారత దేశంలో అధిక శాతం రైళ్ళు ఈ తరగతికి చెందినవి. ఇవి సూపర్ ఫాస్ట్ రైళ్ళకన్నా ఎక్కువ స్టేషన్లలో ఆగుతాయి కాని చిన్న చిన్న ఊళ్ళ స్టేషన్లలో మాత్రం ఆగవు.

పాసెంజర్ మరియు ఫాస్ట్ పాసెంజర్: ఇవి నెమ్మదిగా ప్రతీ స్టేషన్ లోనూ ఆగుతూ వెళతాయి. వీటి టికెట్ వెల కూడా చాలా తక్కువ. రైలు మొత్తం జనరల్ కంపార్ట్మెంట్లే వుంటాయి.

సుబర్బన్ రైళ్ళు: ఇవి నగర ప్రాంతాలలో మాత్రం సంచరించే రైళ్ళు. ఇవి అన్ని స్టేషన్లలోనూ ఆగుతాయి. ప్రాధాన్యతా క్రమంలో ఇవి చివరన నిలుస్తాయి.


రిజర్వేషన్ టిక్కెట్లు
ఎనభయ్యవ దశాబ్ధం వరకు రైల్వే రిజర్వేషన్ టికేట్టు మాన్యువల్ గా జరిగేది. 1987 సంవత్సరం కంప్యూటర్ వ్యవస్థని ప్రవేశపెట్టారు. అప్పటి నుండి అంచెలంచెలగా దేశమాంతా కంప్యూటర్ రిజర్వేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

హౌరా మెయిల్ లో, చెన్నై నుండి విజయవాడకు వెళ్ళేందుకు 'భారతీయ రైల్వే టికెట్'.

1980 వరకు, భారతీయ రైల్వే రిజర్వేషన్లు సాంప్రదాయక పద్దతి లోనే జరిగేవి.

1987, నుంచి రైల్వేలలో ఇప్పుడున్న కంప్యూటర్ విధానం అమలు లోకి వచ్చింది. 1995 లో రైల్వేలు మొత్తం కంప్యుటరీకరణ చేయడంతో రిజర్వేషన్ సమాచారాన్ని ఎక్కడనుంచైనా చూడగలిగే వీలు కలిగింది. ఈమధ్య ముఖ్యమైన కూడళ్ళలో మరియు చిన్న చిన్న గ్రామాలలో సైతం కంప్యూటర్ ద్వారా రిజర్వేషన్ చేసుకొనే సదుపాయం ఏర్పాటుచేసారు. ఇటీవలే రైల్వే టికేట్టు ప్రయాణికులకు సులభ పద్దతిలో ( అనగా ఇంటర్నెట్ ద్వారా మరియు మొబైల్ ద్వారా ) రిజర్వేషన్ చేసుకొనే సదుపాయం ఏర్పాటుచేసారు, కాని ఈ సౌలభ్యానికి అదనపు రుసుము వసూలు చేస్తారు.

               

కొన్ని వర్గాల వారికి అనగా ముసలవారికి (60 ఏళ్ళు పైబడిన వారికి) , వికలాంగులకు, చదువుకొనే విద్యార్దులకు మరియు పైస్ధాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు టికేట్టులో రాయితీ కేటాయించడం జరిగింది. ఒక కాల పరిమితిలో లేదా కొన్ని రైళ్ళలో లేదా కొన్ని రైల్వే విభాగాలలో ఎన్ని సార్లైనా ప్రయాణించడానికి వీలుగా సీజన్ టిక్కెట్లు కూడా లభ్యమవుతాయి. యూ-రెయిల్ పాస్ ను పోలి ఉండే ఇండ్-రెయిల్ పాస్ ను కొనడం ద్వారా విదేశీ యాత్రికులు ఒక గరిష్ట కాల పరిమితిలోపు భారత దేశాన్ని మొత్తం చుట్టి రావచ్చు. అనగా ఈ కాల పరిమితిలో ఎన్ని రైళ్ళనైనా ఎక్కవచ్చు.

అధిక దూరం ప్రయాణించే రైలులో పడుకొనేందుకు పడకల (బెర్త్)ఏర్పాటు ఉంటుంది. ఆ పడకలకు రిజర్వేషన్ ప్రయాణించే తారీఖుకు రెండు నెలల ముందు లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ప్రయాణించే వ్యక్తి యొక్క నామధేయము, వయస్సు మరియు రాయితీ వివరాలు టికేట్టులో పొందుపరచబడతాయి. టికెట్టు ధర సాధారణంగా మూల ధరతో పాటు టికెట్టు ధర సాధరణంగా మూల ధరతో పాటు ప్రయాణీకులు ఎంచుకున్న బోగీ తరగతి మరియు రాత్రి ప్రయాణాలకు గానూ రిజర్వేషన్ ధరను కూడా కలుపుకుని ఉంటుంది. మూల ధరకు కొన్నిసార్లు రైలు వర్గీకరణలను బట్టి అదనపు ధరను కలుపుతుంటారు. (ఉదాహరణకు: సూపర్ ఫాస్ట్ రైళ్ళకు సర్చార్జి టికెట్టు మూల ధరకు కలుపుతారు.)

ఒకవేళ రైలులోని సీట్లన్నీ నిండిపోయి ఉంటే టికెట్టు పై ఒక క్రమ సంఖ్యను ముద్రిస్తారు. అది ఆ రైలులో ప్రయాణించడానికి సీటు కోసం వేచి చూస్తున్నవారి సంఖ్యను సూచిస్తుంది. అలా కాకపోతే టికెట్టు పై సీటు / పడక సంఖ్యను ముద్రిస్తారు. అలాంటి టికెట్టును ఖచితపరచబడిన టికెట్టుగా వ్యవహరిస్తారు. వేచియుండు సంఖ్య ఉన్న టికెట్టు కలిగిన ప్రయాణికుడు రైలులో ప్రయాణించరాదు. కేవలం సీటు ఖచితపరచబడిన మీదటనే రైలు ఎక్కాలి. ఇవి రెండూ కాకుండా మరో రకం టికెట్టు ఉంది. దీన్ని RAC లేదా 'రిజర్వేషన్ అగైన్‌స్‌ట్ కేన్సిలేషన్' అని వ్యవహరిస్తారు. అంటే ప్రయాణం రద్దైన వారి సీట్ల కోసమని అర్థం. ఇవి ఖచితపరచబడిన మరియు వేచియుండు టికెట్లకు మధ్య జాతి టికెట్లు. ఇలాంటి టికెట్టు కలిగిన ప్రయాణికుడు సీటు ఖచితం కాకపోయినా రైలు ఎక్కవచ్చు. ఈ టికెట్టుపైనా ఒక క్రమ సంఖ్య ముద్రించబడి ఉంటుంది. వీరికి ఈ సంఖ్య ఆధారంగా రైలు టికెట్టు కలెక్టరు ప్రయాణం మానుకున్న ప్రయాణీకుల సీట్లను కేటాయిస్తారు.

రిజర్వేషన్ లేని టికెట్లు ప్రయాణానికి ముందుగా రైల్వే స్టేషన్లోనే కొనుక్కోవచ్చు. కాని ఇలాంటి టికెట్లు కొన్న ప్రయాణీకులు జనరల్ బోగీలోనే ప్రయాణించాల్చి రావచ్చు.

ఉత్పత్తి కేంద్రాలు

CLW: చిత్తరంజన్ లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ లో విద్యుత్ ఇంజన్లు తయారవుతాయి.

DLW: వారణాసి లోని డీజల్ లోకోమోటివ్ వర్క్స్ లో డీజలు ఇంజన్లు తయారవుతాయి.

ICF: పెరంబూరు లోని ఇంటెగ్రల్ కోచ్ ఫాక్టరీ లో రైలుపెట్టెలు తయారవుతాయి. ఈ పెట్టెల నేల, అడుగున ఉండే అండరుక్యారేజీతో కలిసి ఉంటుంది.

RCF: కపూర్తలా లోని రైల్ కోచ్ ఫాక్టరీ లో కూడా రైలుపెట్టెలు తయారవుతాయి.

RWF: యెలహంక లోని రైల్ వీల్ ఫాక్టరీ లో చక్రాలు, ఇరుసులు తయారవుతాయి.

ఇతరత్రా: BHEL కొన్ని విద్యుత్ ఇంజన్లను సరఫరా చేస్తుంది. వివిధ ఇంజను సామాగ్రి దేశంలోని వివిధ ప్రాంతాల్లో తయారవుతాయి.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again