పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 06, 2015

సహజ దృగ్విషయాలు-కాంతి


     స్వయంప్రకాశకాల నుంచి వెలువడి, మనకు దృశ్యానుభవం కలిగించే శక్తిరూపమే 'కాంతి'. న్యూటన్ కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం కాంతి కణాల రూపంలో ప్రయాణిస్తుందని తెలియజేస్తుంది. కాంతి తరంగాల రూపంలో ప్రయాణిస్తుందని హైగెన్స్ 'కాంతి తరంగ సిద్ధాంతం'లో పేర్కొన్నాడు.

¤ పరిస్థితులను బట్టి కాంతి కణస్వభావం, తరంగ స్వభావాలను కలిగి ఉంటుంది.

¤ కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది.

¤ కాంతిని విడుదల చేసే వస్తువులను (కాంతిజనకాలు) 'స్వయం ప్రకాశకాలు' అంటారు.
    ఉదా: సూర్యుడు, మండుతున్న కొవ్వొత్తి, ఎలక్ట్రిక్‌బల్బు, నక్షత్రాలు

అస్వయం ప్రకాశకాలు
     కాంతిని స్వయంగా విడుదల చేయకుండా వాటిమీద కాంతి పడటం వల్ల ప్రకాశించే వాటిని 'అస్వయం ప్రకాశకాలు లేదా గౌణ ప్రకాశకాలు' అంటారు.
     ఉదా: భూమి, చంద్రుడు, టేబుల్, కుర్చీ

పారదర్శక పదార్థాలు
     ఏ పదార్థాల ద్వారా కాంతి స్వేచ్ఛగా ప్రయాణించగలుగుతుందో ఆ పదార్థాలను 'పారదర్శకాలు' అంటారు.
ఉదా: గాలి, నీరు, గాజు, కెనడాబాల్సమ్ నూనె.

పాక్షిక పారదర్శకాలు
     పాక్షికంగా కాంతి ప్రయాణించే పదార్థాలు
     ఉదా: గరుకుగాజు, ఫారాపిన్ మైనం, నూనెకాగితం

కాంతి నిరోధకాలు
     కాంతిని తమ ద్వారా ప్రసరింపచేయని పదార్థాలను కాంతి నిరోధకాలు అంటారు.
     ఉదా: రాయి, కర్ర, లోహాలు, మానవశరీరం

క్రమ పరావర్తనం
     కాంతి కిరణాలు నున్నని, మెరుగు పెట్టిన క్రమతలాలపై పడినప్పుడు క్రమ పరావర్తనం జరుగుతుంది.

అక్రమ పరావర్తనం
     కాంతి గరుకైన, క్రమరహిత తలాలపై పతనమైనప్పుడు అక్రమ పరావర్తనం జరుగుతుంది.

     గరుకుతలం విభిన్న పతన బిందువుల నుంచి పరావర్తనం చెందిన కాంతికిరణాల సమూహ ఫలితాన్ని 'కాంతి పరిక్షేపణం' (Scattering of light) అంటారు.

¤ తునకలు చేసిన మంచుముక్కలు, మంచుగడ్డకంటే ప్రకాశవంతంగా ఉండటానికి కారణం- 'కాంతి పరిక్షేపణం'

¤ నిశ్చలంగా ఉన్న నీటి ఉపరితలంకంటే, అలజడులు ఉన్న నీటి ఉపరితలం అక్కడక్కడ మెరుస్తుంది. దీనికి కారణం- కాంతి పరిక్షేపణం.

¤ కాంతి కిరణాలు ఏదైనా యానకంలో ప్రయాణిస్తూ ఒక తలంపై పతనం చెంది, తిరిగి అదే యానకంలోకి చేరడాన్ని 'పరావర్తనం' అంటారు.

పరావర్తన సూత్రాలు
     1. పరావర్తన కోణం, పతనకోణానికి సమానంగా ఉంటుంది.

     2. పతన కిరణం, పరావర్తన కిరణం, తలానికి గీసిన లంబం ఒకే సమతలంలో ఉంటాయి.

సమతల దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు
     1. మిథ్యా ప్రతిబింబం

     2. నిటారు ప్రతిబింబం

     3. ప్రతిబింబం కుడి ఎడమల తారుమారు అవుతుంది లేదా పార్శ్వ విలోమం చెందుతుంది.

     4. ప్రతిబింబ, వస్తు పరిమాణాలు సమానంగా ఉంటాయి.

     5. ప్రతిబింబ దూరం, వస్తువు దూరం సమానం

పెరిస్కోపు
     జలాంతర్గాముల్లో ఉన్న వ్యక్తులు నీటి ఉపరితలంపై ఉండే ఓడలలాంటి వస్తువులను చూడటానికి ఉపయోగించేది 'పెరిస్కోపు'. దీన్ని సైనికులు గోతుల్లో ఉండి శత్రువులకు కనపడకుండా వాళ్ల సంచారాన్ని చూడటానికి ఉపయోగిస్తారు. పెరిస్కోపులో వాడేది సమతలదర్పణం.

                                          

     పెరిస్కోపు పనిచేసే సూత్రం - 'సమతల దర్పణంపై కాంతి పరావర్తనం చెందుతుంది'. పెరిస్కోపులో రెండు సమతలదర్పణాలు ఒకదానికొకటి 450 కోణంలో అమరి ఉంటాయి. రెండు సమతల దర్పణాలను θ కోణంలో అమర్చినపుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య 
   
     n సరిసంఖ్య అయితే
     n బేసిసంఖ్య అయితే గా తీసుకోవాలి

                        

     ఒకవేళ భిన్నంవస్తే దాన్ని వదిలేసి పూర్ణాంకాన్ని మాత్రమే తీసుకోవాలి.

   రెండు దర్పణాలను ఒకదానికొకటి సమాంతరంగా అమర్చి వాటిమధ్య ఉంచితే అనంత సంఖ్యలో ప్రతిబింబాలు కనిపిస్తాయి.

     కెలిడయోస్కోపు అనే పరికరం సమతల దర్పణాలపై ఏర్పడే అసంఖ్యాక పరావర్తన ప్రతిబింబాల సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది.

వక్రదర్పణాలు: ఇవి రెండు రకాలు
     1) కుంభాకార దర్పణం
     2) పుటాకార దర్పణం

     దర్పణం మధ్య బిందువుని దర్పణ ధ్రువం అంటారు. దర్పణం ఏ గోళంలో ఒక భాగమో ఆ గోళ కేంద్రాన్ని దాని వక్రతా కేంద్రం అంటారు. దర్పణ ధ్రువానికి వక్రతాకేంద్రానికి మధ్య ఉండే దూరాన్ని వక్రతా వ్యాసార్ధం (R) అంటారు.

                          

     దర్పణ ధ్రువాన్ని, వక్రతాకేంద్రాన్ని కలుపుతూ పోయే సరళరేఖను 'ప్రధాన అక్షం' అంటారు.

గోళాకార దర్పణ ధ్రువం నుంచి నాభి వరకు ఉండే దూరాన్ని 'నాభ్యంతరం' అంటారు. గోళాకార దర్పణం ప్రధాన అక్షానికి సమాంతరంగా, దగ్గరగా వచ్చి పతనమయ్యే కాంతి కిరణాలు పరావర్తనం చెందిన తర్వాత ప్రధాన అక్షంపై ఒక బిందువు వద్ద కేంద్రీకృతమవుతాయి 'లేదా' ఒక బిందువు నుంచి వికేంద్రీకరణం చెందుతాయి. ఆ బిందువును దాని 'ప్రధాననాభి' అంటారు.

నాభ్యంతరం, వక్రతా వ్యాసార్ధానికి మధ్య ఉండే సంబంధం

పుటాకార దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు
     1. ప్రతిబింబ పరిమాణం వస్తువు పరిమాణం కంటే చిన్నదిగా ఉంటుంది.

     2. ప్రతిబింబం తెరమీద పడడం వల్ల అది నిజప్రతిబింబం.

     3. తలకిందులైన ప్రతిబింబం ఏర్పడుతుంది.

     u, v, f ల మధ్య సంబంధం:

     ప్రతిబింబ పరిమాణం, వస్తుపరిమాణానికి మధ్య ఉండే నిష్పత్తిని 'రేఖీయ ఆవర్తనం' లేక వృద్ధీకరణం అంటారు.

       

     వస్తువు అనంతదూరంలో ఉండటం వల్ల, దర్పణానికి తెరకూ మధ్య దూరం పుటాకార దర్పణ నాభ్యంతరం(f)కు సమానం.

     పుటాకార దర్పణం వృద్ధీకృత మిథ్యా ప్రతిబింబాన్ని, నిజ ప్రతిబింబాన్ని కూడా ఏర్పరుస్తుంది.

     కుంభాకార దర్పణం క్షయీకృత మిథ్యాప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.

పుటాకార, కుంభాకార దర్పణాల ఉపయోగాలు
     1. పుటాకార దర్పణాన్ని మోటారు వాహనాల హెడ్‌లైట్లలో పరావర్తకాలుగా ఉపయోగిస్తారు.

     2. పుటాకార దర్పణ నాభ్యంతరం కంటే ఎక్కువ, వక్రతా వ్యాసార్ధం కంటే తక్కువ దూరంలో వస్తువును ఉంచితే అది వస్తువు వృద్ధీకృత ప్రతిబింబాన్నిస్తుంది. అందువల్ల కన్ను, ముక్కు, గొంతు, పంటి వైద్యులు శరీరంలోని చిన్నచిన్న భాగాలను పరిశీలించడానికి పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు.

                   

     కుంభాకార దర్పణం ఎల్లప్పుడూ చిన్నదైన నిటారు ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. అందువల్ల దీన్ని మోటారు వాహనాల్లో డ్రైవర్‌కు ఎదురుగా అమర్చుతారు. అప్పుడు డ్రైవర్ వెనక్కి తిరిగి చూడనవసరం లేకుండా వెనకనున్న రోడ్డును చూడగలుగుతాడు.

¤ హైదరాబాద్‌లోని రంగాపూర్ ఖగోళ పరిశోధనశాలలో ఉన్న ఖగోళ దూరదర్శినిలో 125 సెం.మీ. వ్యాసం ఉన్న పెద్ద పుటాకార దర్పణాన్ని ఉపయోగించారు.

¤ పుటాకార, కుంభాకార దర్పణాలను పరావర్తన దూరదర్శినిలో ఉపయోగిస్తారు.

వక్రీభవనం
     ఏదైనా ఒక యానకంలో ప్రయాణిస్తున్న కాంతి కిరణాలు మరొక యానకంలోకి ప్రవేశించేటప్పుడు అవి కాంతివేగంలో మార్పు వల్ల విభాజక తలం వద్ద వంగి ప్రయాణిస్తాయి. ఈ దృగ్విషయాన్ని 'వక్రీభవనం' అంటారు. విరళ యానకంలో పతనకోణం సైన్ విలువకు, సాంద్రతర యానకంలో వక్రీభవన కోణం సైన్ విలువకు మధ్య ఉండే నిష్పత్తి స్థిరంగా ఉంటుంది. దీన్నే విరళయానకం దృష్ట్యా సాంద్రత యానకం వక్రీభవన గుణకం అంటారు.


                       

                                                  


                           


 ¤  పతన కిరణం, వక్రీభవన కిరణం, పతన బిందువు వద్ద తలానికి గీసిన లంబం ఒకే తలంలో ఉంటాయి.
                            

¤ కాంతి కిరణాల వక్రీభవనం వల్ల నీటి తొట్టెలో ఉంచిన కడ్డీ వంగినట్లు కనిపిస్తుంది.

¤ వేర్వేరు ఉష్ణోగ్రతలు ఉన్న గాలి ద్వారా కాంతి ప్రయానిస్తూ వక్రీభవనం చెందడం వల్ల నక్షత్రాలు మినుకు మినుకుమంటూ కనిపిస్తాయి.

పట్టకం
     త్రిభుజాకారంలో ఉండే పారదర్శక పదార్థాన్ని 'పట్టకం' అంటారు. కాంతి పట్టకం ద్వారా వెళ్లినప్పుడల్లా, రెండుసార్లు వక్రీభవనం చెందుతుంది. పట్టకం కాంతిని వక్రీభవనం చేయడమే కాకుండా విశ్లేషిస్తుంది. ఈ ధర్మం వల్ల కాంతి అనేక ధర్మాలను అవగాహన చేసుకోవచ్చు. దీన్నే 'స్పెక్ట్రోస్కోపి' (వర్ణపటశాస్త్రం) అంటారు.

                          

¤ కనిష్ఠ అతిక్రమణకోణంతో ఒక పట్టకం వక్రీభవన గుణకాన్ని నిర్ణయించవచ్చు.

¤ పట్టకం వక్రీభవన గుణకం.


¤ ఏ పతనకోణం సైన్ విలువకు, వక్రీభవన కోణం విలువ 900 ఉంటుందో, ఆ పతనకోణాన్ని ఆరెండు యానకాలకు 'సందిగ్ధ కోణం' అంటారు.

                              v
                                                 త్రికోణ పట్టకం 

     పతనకోణం విలువ, సందిగ్ధకోణం విలువ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కిరణం వక్రీభవనం చెందడానికి బదులుగా అది బయలుదేరిన యానకంలోకే వెనుకకు వస్తుంది. దీన్నే 'సంపూర్ణాంతర పరావర్తనం' అంటారు.

ఉదాహరణలు:
     1. ఎండమావులు ఏర్పడడం

     2. నీటిపై తేలియాడే పల్చటి నూనె పొరలు విభిన్న రంగులను ఏర్పరచడం.

¤ తెల్లని కాంతి, పట్టకం ద్వారా వక్రీభవనం చెంది అంశ రంగులుగా విడిపోవడాన్ని 'కాంతివిశ్లేషణ' లేదా 'వర్ణవిశ్లేషణ' అంటారు.

¤ సూర్యకాంతిని, పట్టకం ద్వారా విశ్లేషించినపుడు ఏడు రంగులు ఉండే వర్ణపటంగా కనిపిస్తుంది. దీన్నే వర్ణపటం (Spectrum) అంటారు.

¤ వివిధ కాంతి కిరణాల వర్ణపటాల అధ్యయనాన్ని 'స్పెక్ట్రోస్కోపి' అంటారు. దీంట్లో ఉపయోగించే పరికరాన్ని స్పెక్ట్రోస్కోప్ అంటారు.

¤ రంగులను ప్రాథమిక, గౌణ రంగులుగా విభజించవచ్చు.

¤ ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను ప్రాథమిక రంగులు అంటారు. పసుపు, ముదురు ఎరుపు, ముదురు నీలం రంగులను గౌణ రంగులు అంటారు.

¤ ప్రాథమిక రంగులను సరైన నిష్పత్తిలో కలిపి, గౌణ రంగులను ఉత్పత్తి చేయవచ్చు.

కటకాలు
     ప్రకాశపారదర్శకమై కాంతిని వక్రీభవనం చెందించే ఒక జత (గోళాకార) వక్ర ఉపరితలాలు కలిగిన యానకాన్ని 'కటకం' అంటారు.

¤ కుంభాకార కటకం మధ్యభాగం మందంగా, అంచులు పలచగా ఉంటాయి.

¤ పుటాకార కటకం మధ్యభాగం పలచగా, అంచులు మందంగా ఉంటాయి.

¤ వస్తువుని కటకం ముందు ఆరు స్థానాల్లో ఉంచవచ్చు

   1) C కంటే దూరంగా
   2) C పైన
   3) C, F ల మధ్య
   4) F పైన
   5) O, F ల మధ్య
   6) ప్రధాన అక్షానికి కొంత కోణం చేస్తూ ఉంచవచ్చు.

¤ కెమెరా, మానవుని కన్ను పనితీరు ఒకేలా ఉంటాయి. ఈ రెండింటిలోనూ సవరించడానికి వీలున్న ఒక 'కుంభాకార కటకం', ఒక తెర, కాంతి చొరబడటానికి వీలులేని ఒక గది కలిసి ఉంటాయి.

¤ కనుపాపలు, కెమెరాలోని తలుపుల్లా పనిచేస్తాయి.

దృష్టిదోషాలు
   1) హ్రస్వదృష్టి (మయోపియా)
   2) దీర్ఘదృష్టి (హైపరోమెట్రోపియా)

హ్రస్వదృష్టి
     ఈ దృష్టి దోషం ఉన్నవారు దగ్గరలోఉండే వస్తువులను చూడలేరు. దీనికి కారణం దూరంగా ఉన్న వస్తువుల ప్రతిబింబాలు రెటీనాపై కాకుండా రెటీనా కంటే ముందు కేంద్రీకరించబడతాయి.

               దృష్టి దోషము లేనపుడు యేర్పడు ప్రతిబింబ చిత్రం
     ¤ తగిన పుటాకార కటకాన్ని ఉపయోగించి ప్రతిబింబం రెటీనాపై పడేలా చేయవచ్చు.

                 దీర్ఘ దృష్టి దోషము యేర్పడు విధానము

                దీర్ఘ దృష్టి దోష నివారణకు కుంభాకార కటకం వాడుట
దీర్ఘదృష్టి
     ఈ దృష్టి దోషం ఉన్నవారు దూరంగా ఉండే వస్తువులను మాత్రమే చూడగలుగుతారు. దగ్గరగా ఉండే వస్తువులను చూడలేరు. దీనికి కారణం వస్తువుల ప్రతిబింబం రెటీనాకు వెనుకభాగంలో కేంద్రీకరింపబడుతుంది.
     ¤ తగిన కుంభాకార కటకాన్ని ఉపయోగించి, ప్రతిబింబం రెటీనాపై పడేలా చేయవచ్చు.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again