పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 13, 2015

రోమన్ నాగరికత

సోషల్ కంటెంట్ - డి .ఎస్.సి స్కూల్ అసిస్టెంట్ 2014-15

   
     మధ్యధరా సముద్రంలోని ద్వీపకల్పం ఇటలీ. ఈ దేశంలోని ముఖ్య నది 'టైబర్'. ఆ నదీ తీరాన నిర్మితమైన రోమ్ పట్టణం రోమన్ నాగరికతకు కేంద్రం. ఇది తూర్పు, పశ్చిమ నాగరికతల సమ్మిళితమై, ఐరోపా ఖండమంతా విస్తరించింది.

       పురాతన రోమ్ క్రీస్తు పూర్వం 10వ శతాబ్దంలో ఇటలీ ద్వీపకల్పంలో కనుగొనబడిన ఒక చిన్న వ్యవసాయ సమాజం నుండి ఎదిగిన నాగరికత. మధ్యధరా సముద్రం వెంట మరియు రోమ్ నగర కేంద్రంగా, ఇది ప్రాచీన ప్రపంచంలోని అతిపెద్ద సామ్రాజ్యములలో ఒకటిగా మారింది.

          ప్రాచీన రోమన్లు కష్టజీవులు. వీరి ప్రధాన వృత్తులు: వ్యవసాయం, పశుపోషణ, గొర్రెల పెంపకం. వీళ్లు మట్టి, చెక్కతో పాత్రలను తయారు చేసేవారు. ఉన్ని, నేత వస్త్రాలు ధరించేవారు. రోమన్లది పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ. సమాజంలో స్త్రీలకు గౌరవస్థానం ఉండేది. వర్తక వ్యాపారాల్లో, రాజకీయాల్లో మహిళలు పాల్గొనేవారు. కుటుంబ యజమాని తండ్రి/ అన్న.

    రోమన్లు బహుదేవతారాధకులు. జూపిటర్ (వర్షదేవత), మార్స్ (విజయదేవత)ను పూజించేవారు. పూజా కార్యక్రమాలు సామూహికంగా, సమష్టిగా జరిగేవి. రథ పందాలు, కుస్తీ పోటీలు, సుశిక్షుతులైన వ్యక్తుల మధ్య మల్లయుద్ధాలు రోమన్ల ముఖ్య వినోద కార్యక్రమాలు. గెలిచిన వ్యక్తికి ఓడిపోయినవాళ్లను చంపే హక్కు ఉండేది. ప్రభుత్వ పరిపాలనా విధానం, విశదీకరణ ఉన్న న్యాయశాస్త్రాలు రోమన్లు ప్రపంచానికి అందించిన విలువైన అంశాలు. వీళ్లు రాజధానితో కలుపుతూ అనేక రహదార్లను నిర్మించారు. ప్రత్యేక మార్గాల ద్వారా చైనా, ఇండియా దేశాలతో వ్యాపారం చేసేవారు. అరికామెడ్, మద్రాస్ ప్రాంతాలు మనదేశంలోని సముద్ర సమీపాన ఉన్న వ్యాపార కేంద్రాలు

రోమన్ల చరిత్ర 

రోమ్ యొక్క మూలగాధ ప్రకారం, ఈ నగరం క్రీ.పూ.753 ఏప్రిల్ 21న ట్రోజన్ యువరాజు యేనేయాస్ యొక్క వారసులు మరియు అల్బ లోంగ యొక్క లాటిన్ రాజు అయిన నుమిటర్ యొక్క మనుమలైన రోములస్ మరియు రెమస్ అనే కవల సోదరులచే స్థాపించబడింది. నుమిటర్ రాజు క్రూరుడైన తన సోదరుడు అములియస్‌చే పదవి నుండి తొలగించబడగా, నుమిటర్ కుమార్తె రియా సిల్వియా కవలలకు జన్మనిస్తుంది. రియా సిల్వియా అంగారకుని‌చే బలాత్కారం చేయబడి గర్భందాల్చడం వలన, ఈ కవలలు సగం-దైవత్వం కలవారిగా భావించబడతారు. 

        కొత్త రాజు రోములస్ మరియు రెమస్ సింహాసనాన్ని తిరిగి తీసుకుంటారని భయపడి, వారిని ముంచివేయాలనుకుంటాడు.ఒక ఆడ-తోడేలు (లేదా కొన్ని గాధల ప్రకారం ఒక గొర్రెల కాపరి భార్య) వారిని కాపాడి, పెంచుతుంది, యుక్తవయసు వచ్చిన తరువాత, వారు అల్బలోంగ సింహాసనాన్ని నుమిటర్‌కు తిరిగి అందిస్తారు.

                        

అప్పుడు ఆ కవలలు వారి స్వంత నగరాన్ని స్థాపిస్తారు, రోమ్ యొక్క రాజుగా ఎవరు పాలిస్తారనే దానిపై జరిగిన పోరాటంలో రోములస్, రెమస్‌ను చంపివేస్తాడు, కొన్ని ఆధారాలు నగరానికి ఎవరి పేరు ఇవ్వాలనే దానిపై పోరాటం జరిగిందని తెలుపుతాయి.నగరం యొక్క పేరుకి రోములస్ మూలం అయ్యాడు.ఈ నగరానికి ప్రజలను ఆకర్షించే ప్రయత్నంలో, రోమ్ అనాధలకు, బహిష్క్రుతులకు, మరియు అవాంఛితులకు ఆశ్రయంగా మారింది. ఈ కారణంగా మగవారు ఎక్కువై ఆడవారు లేకపోవడంతో రోమ్ నగరంలో సమస్యకు దారితీసింది. రోములస్ పరిసర ప్రాంతాలలోని పట్టణాలు మరియు తెగల వద్దకు వెళ్లి వివాహ హక్కుల కొరకు ప్రయత్నించారు కానీ రోమ్ అంతా అవాంఛితులతో నిండి ఉండటం వలన వారందరూ దానిని తిరస్కరించారు. ఇతిహాసాల ప్రకారం లాటిన్‌లు, సబైన్‌లను పండుగకు ఆహ్వానించి వారి కన్యలను తస్కరించారు, ఇది లాటిన్‌లు మరియు సబైన్‌ల కలయికకు దారితీసింది

 రాజ్యం

       రోమ్ నగరం రవాణా మరియు వర్తకానికి కూడలి అయిన టైబర్ నది యొక్క రేవు చుట్టూ ఉన్న స్థావరాల నుండి పెరిగింది.పురాతత్వ ఆధారాల ప్రకారం, రోమ్ గ్రామం సుమారు క్రీ.పూ.8వ శతాబ్దం, క్రీ.పూ.10వ శతాబ్దం కూడా అయి ఉండగలిగి, ఇటలీ యొక్క లాటిన్ తెగచే, పాలటైన్ హిల్‌పై స్థాపించబడి ఉండవచ్చు.

       దీనికి పూర్వమే ఉత్తరాన ఎట్రురియలో స్థిరపడిన ఎట్రుస్కన్లు, క్రీ.పూ.7వ శతాబ్దం నాటికి ఈ ప్రాంతంలో ఉన్నత వంశీకుల మరియు రాచరిక పాలనను ఏర్పరిచి, రాజకీయ నియంత్రణ సాధించినట్లు కనబడుతుంది.

   క్రీ.పూ.6వ శతాబ్దం నాటికి ఎట్రుస్కన్లు ఈ ప్రాంతంలో అధికారాన్ని కోల్పోయారు, మరియు ఇదే సమయంలో, సహజ లాటిన్ మరియు సబైన్ తెగలు వారి ప్రభుత్వాన్ని గణతంత్ర సృష్టి ద్వారా తిరిగి ఏర్పరచి, పాలకులు అధికారాన్ని నియోగించడంపై అధిక నియంత్రణలను ఏర్పరచారు

         రోమన్ సాంప్రదాయం మరియు పురాతత్వ ఆధారాలు ఫోరం రొమానంలో గల సముదాయాన్ని రాజు యొక్క అధికార కేంద్రం మరియు మరియు మత కేంద్రం యొక్క ప్రారంభంగా సూచిస్తాయి. రోములస్ తరువాత రోమ్ యొక్క రాజులలో రెండవ వానిగా నుమా పొంపిలియస్ అతని స్థానాన్ని ఆక్రమించాడు. అతను తన రాజభవం రెజియా మరియు వెస్టల్ కన్యల సముదాయంతో పాటు రోమ్ యొక్క గొప్ప నిర్మాణాలను ప్రారంభించాడు.

         రోమన్లది రిపబ్లిక్ ప్రభుత్వ వ్యవస్థ. దీంట్లో సెనెట్, అసెంబ్లీ ప్రముఖ పాత్ర పోషించేవి. రోమన్ల భాష లాటిన్. ఇది పశ్చిమ యూరప్ అంతటా వ్యాపించింది. నేటి శాస్త్రీయ పదజాలంలో లాటిన్ పదాలు ఎక్కువగా కనిపిస్తాయి.

         రోమన్ల తాత్విక సిద్ధాంతాల్లో 'ఎపిక్రియానిజం', 'స్టాయిజం' చాలా ముఖ్యమైనవి.'సిసిరో' గొప్ప వేదాంతి. హోరస్ గొప్పకవి. వర్జిల్ గ్రీకుల ఇతిహాసమైన 'ఇలియడ్' పంథాలో 'ఎనిమిడ్‌'ను రచించాడు. 'టాసిటిన్' ప్రసిద్ధ రోమన్ చరిత్రకారుడు. 

          రోమన్ల నిర్మాణశైలికి ప్రత్యేకత ఉంది. కాంక్రీట్‌ను నిర్మాణాల్లో మొదట ఉపయోగించింది రోమన్లే. 'పాంథియాన్' అనే గొప్ప నిర్మాణంలో ఎత్తయిన స్తంభాలు ఉన్నాయి. రహదారులను నిర్మించారు. నీటిపారుదల కాల్వలను తవ్వించారు. పైపుల ద్వారా సుదూర ప్రాంతాలకు మంచినీటిని సరఫరా చేసేవారు. గ్రీకు పద్ధతుల్లో రోమన్ల కళలు అభివృద్ధి చెందాయి. గ్రీకు చిత్రాల్లా కాకుండా రోమన్ చిత్రాలకు సహజ స్వరూపం ఉండేది. 

          ఇంటి గోడలపై రంగుల చిత్రాలను వేసేవారు. ప్లీనీ, సేనికా 'విజ్ఞాన సర్వసాలను' సంకలనం చేశారు. వెల్సన్ శస్త్రచికిత్స సంబంధమైన గ్రంథాన్ని రూపొందించాడు. గలెన్ 'వైద్య విద్యా విజ్ఞాన సర్వస్వం' అనే గ్రంథాన్ని రాశాడు. రక్తప్రసరణ గురించి మొదట తెలియజేసింది ఇతడే. బీదలకు ఉచిత వైద్యం లభించేది. రోమన్లు క్యాలెండర్లను ఉపయోగించారు. నేటికీ ఇంగ్లిష్ నెలలు రోమన్ చక్రవర్తుల పేర్ల ఆధారంగానే ఉన్నాయి. విశిష్ట నాగరికతకు కేంద్రమైన రోమన్ సామ్రాజ్యం గోధులు, ఫ్రాంక్‌లు, జర్మన్ల దండయాత్రల వల్ల పతనమైంది.

 జ్యూయిష్ నాగరికత
          మతాలన్నీ మంచిని సూచిస్తూ, మానవ కల్యాణానికి తోడ్పడతాయి. జుడాయిజం, క్రైస్తవ మతాలు ప్రాచీన కాలంలో ప్రముఖమైనవి. ఇవి రెండూ పాలస్తీనాలో ఆవిర్భవించాయి. జ్యూయిష్, హిబ్రూ ప్రజల మతమే జుడాయిజం. అబ్రహం నాయకత్వంలో మెసపటోమియాలో స్థిరపడిన జ్యూయిష్ ప్రజలు జుడాయిజమ్ మతాన్ని అనుసరించారు. క్రీ.పూ. 1700 లో పాలస్తీనాలో ఘోర కరవు సంభవించించడంతో చాలామంది ప్రజలు ఈజిప్ట్‌కు వలస వెళ్లారు. అక్కడి పాలకుల చేతిలో అనేక హింసలకు గురయ్యారు. దీంతో క్రీ.పూ. 1300లో తిరిగి పాలస్తీనాకు చేరుకున్నారు. వీరికి మోసెస్ నాయకత్వం వహించాడు. ఇతడు మత విజ్ఞానాన్ని ప్రబోధించాడు. భగవంతుడి ద్వారా తెలుసుకున్న 10 సూత్రాలను బోధించాడు. భగవంతుడు ఒక్కడే అనీ, అతడే యొహోవా లేదా ఒహోవా అని నమ్మారు. మోసెస్ సూత్రాలు వీరిని సన్మార్గం దిశగా నడిపించాయి. యూదుల పవిత్ర క్షేత్రం జెరూసలేం. 'అపోక్రైఫా లేదా 'ఓల్డ్ టెస్ట్‌మెంట్ వీరి పవిత్ర మత గ్రంథం.

 క్రైస్తవ మతం
          జీసస్ క్రైస్తవ మతాన్ని స్థాపించాడు. ఇతడు జ్యూయిష్ జాతికి చెందినవాడు. మేరీ అనే కన్యకు బెత్లెహాంలో జన్మించాడు. ఇతడు నిరాడంబర, పవిత్ర జీవనం; అభాగ్యులపట్ల అపారమైన ప్రేమ; భూతదయ, జాలి, కరుణతో కూడిన మనస్తత్వం లాంటి వాటి గురించి బోధించాడు. పాలస్తీనా, రోమన్ గవర్నర్ పాంటియాన్ పైలెట్ జీసస్‌కు శిలువపై మరణ దండన విధించాడు. మరణించిన మూడు రోజుల తర్వాత జీసస్ సమాధి నుంచి లేచివచ్చి, భక్తులకు దర్శనమిచ్చినట్లు చెబుతారు. దీన్నే 'పునరుత్థానం' అంటారు.

        క్రైస్తవులు క్రిస్మస్‌ను జీసస్ జన్మదిన వేడుకగా, శిలువ వేసిన రోజును గుడ్‌ఫ్రైడేగా, జీసస్ మళ్లీ జన్మించినందుకు సూచికగా ఈస్టర్‌ను జరుపుకుంటారు. నిరాడంబరత, ప్రేమ, అపారమైన కరుణ లాంటి సద్గుణాలుండటం వల్ల క్రైస్తవ మతానికి విశేష ప్రజాదరణ లభించింది. రోమ్ నగరం క్రైస్తవ మతానికి కేంద్రం. సెయింట్ పీటర్స్ చర్చి బిషప్, పోప్‌గా గుర్తింపు పొందాడు. ఇతడు క్రైస్తవ మతాధిపతిగా, జీసస్ ప్రతినిధిగా గౌరవం పొందాడు. రోమన్ చక్రవర్తి కానిస్టెంటైన్ క్రైస్తవ మతాన్ని స్వీకరించి, దాన్ని ప్రభుత్వ మతంగా రూపొందించాడు.

          క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్. ఇందులో పాత నిబంధనల గ్రంథం, కొత్త నిబంధనల గ్రంథం అనే రెండు భాగాలున్నాయి. మొదటిది హిబ్రూ భాషలో ఉంది. ఇది జ్యూయిష్ ప్రజల మత విశ్వాసాలతోపాటు వారి జీవిత చరిత్రను, పురోగతిని కల్పించే మెసయ్య గురించి తెలియజేస్తుంది. నూతన నిబంధనల గ్రంథంలో ఏసు ప్రభువు జీవిత విశేషాలు, బోధనలు ఉన్నాయి. 'సెయింట్ పాల్ ఎపిస్టల్స్' లేఖలు క్రైస్తవ మతం, దాని బోధనల గురించి వివరిస్తాయి. 17వ శతాబ్దంలో ఇంగ్లండ్‌ను పాలించిన మొదటి జేమ్స్ కాలంలో బైబిల్‌ను ఇంగ్లిష్‌లోకి అనువదించారు.

 ప్రాచీన ఆఫ్రికా నాగరికత
ఆఫ్రికాను చీకటి ఖండం అంటారు. పోర్చుగీసువారు ఆఫ్రికా ఖండంలో ప్రవేశించి అక్కడి నాగరికత, సంస్కృతులను బయటి ప్రపంచానికి తెలియజేశారు. ఆ తర్వాత ఐరోపావారు అక్కడి ప్రాచీన సంస్కృతి గురించి పరిశోధన జరిపి, అనేక విషయాలను కనుక్కున్నారు. 19వ శతాబ్దంలో ఐరోపావారి పాలన ఆరంభమైంది. 7వ శతాబ్దానికి చెందిన అరబ్బు యాత్రికులు, వ్యాపారుల రచనలు ప్రాచీన ఆఫ్రికా సంస్కృతిని తెలియజేస్తున్నాయి. క్రమంగా 15వ శతాబ్దంలో పోర్చుగీస్‌వారితోపాటు ఇతర ఐరోపా జాతివారు ఆఫ్రికాలోని అనేక ప్రాంతాల నాగరికతను తెలుసుకున్నారు. ఇక్కడ క్రీస్తు శకారంభం నుంచే క్రైస్తవ మత ప్రభావం ప్రారంభమైంది.

         8 నుంచి 16వ శతాబ్దం మధ్యకాలంలో ఇస్లాం మతం సూడాన్ వరకూ విస్తరించింది. ఆఫ్రికా ఖండంలో సుడానిక్, బంటు, సెమిటిక్ అనే మూడు ప్రముఖ భాషలు మాట్లాడే ప్రజలున్నారు. మొదటి మానవుడు హోమోసెపియన్స్ ఆఫ్రికా ఖండంలోనే జన్మించాడు.

          ఆఫ్రికాలోని ప్రముఖ దేశం ఈజిప్ట్. ఇక్కడ క్రీ.పూ.10 వేల సంవత్సరాల క్రితమే 'యెరో' రాజధానిగా 'కుష్' సామ్రాజ్యం ఉండేది. యెరో నగరంలో ఇనుప గనులు ఎక్కువగా ఉండేవి. ఈ నగరాన్ని మధ్య ఆఫ్రికాలోని 'రెండో బర్మింగ్‌హాం' అంటారు. కుష్ ప్రజల లిపిని 'మీరియోటిక్' అంటారు. కుష్ సామ్రాజ్యం పతనమైన తర్వాత ఉత్తరాన నూబియా, దక్షిణాన ఆక్సిం రాజ్యాలు ఏర్పడ్డాయి. ఈ రాజ్యాల్లో 4వ శతాబ్దంలో క్రైస్తవ మతం విస్తరించింది. నూబియా రాజులు 13వ శతాబ్దంలో ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ఆక్సిం రాజ్యంలోని ఆదీనా రేవు ప్రధాన వ్యాపార కేంద్రం. ఇక్కడి నుంచి భారత్, గ్రీకు దేశాలతో వ్యాపారం జరిగేది. వీళ్లు కేవలం రాతితో కట్టడాలను నిర్మించేవారు. ఆక్సింలోని సొమాలి తీర ప్రాంతాలు సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి.


 రోమన్ నాగరికత బిట్స్ 

1. మధ్యధరా సముద్రంలోని ద్వీపకల్పం ఏది?
జ:  ఇటలీ

2. ఇటలీ దేశంలోని ముఖ్య నది ఏది?
జ:  టైబర్

3. రోమన్ల వర్షదేవత ?
జ:  జూపిటర్

4. రోమన్ల భాష ఏది?
జ:  లాటిన్

5. రోమ్‌లో గొప్ప వేదాంతి ఎవరు?
జ:  సిసిరో

6. రోమన్ల చరిత్రకారుడు -
జ:  టాసిటిన్

7. గ్రీకుల 'ఇలియడ్' పంథాలో 'ఎనిమిడ్' అనే ఇతిహాసాన్ని రాసిందెవరు?
జ:  వర్జిల్

8. నిర్మాణాల్లో కాంక్రీట్‌ను మొదట ఉపయోగించిందెవరు?
జ:  రోమన్లు

9. 'వైద్య విద్యా విజ్ఞాన సర్వస్వం' గ్రంథ రచయిత ఎవరు?
జ:  గలెన్

10. ఏ చక్రవర్తుల పేర్ల ఆధారంగా ఇంగ్లిష్ నెలలు ఉన్నాయి?
జ:  రోమన్

11. జుడాయిజమ్, క్రైస్తవ మతం ఎక్కడ ఆవిర్భవించాయి?
జ:  పాలస్తీనా

12. యూదుల పవిత్ర మత గ్రంథమేది?
జ:  అపోక్రైఫా

13. యూదుల పవిత్ర స్థలం ?
జ:  జెరూసలేం

14. కుష్ సామ్రాజ్య రాజధాని ఏది?
జ:  యెరో

15. 'రెండో బర్మింగ్‌హాం' అని ఆఫ్రికాలోని ఏ నగరాన్ని పిలుస్తారు?
జ:  యెరో

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again