పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 06, 2015

సల్ఫర్ మరియు దాని సమ్మేళనాలు

సల్ఫర్, దాని సమ్మేళనాలు

                   దీపావళి వస్తే చాలు.. ఆకాశంలో ఎక్కడ చూసినా రంగు రంగుల మతాబులు వెలుగుపూలు విరజిమ్ముతూ కనిపిస్తాయి. అలాంటి రంగులకు కారణమైన రసాయన పదార్థం సల్ఫర్. ఉల్లిపాయలు కోసినప్పుడు కళ్ల వెంట నీరు రావడానికి కారణమూ సల్ఫరే. సల్ఫర్ రూపాంతరాలు, తయారీ, ఉపయోగాల గురించి తెలుసుకుందాం..

              
సల్ఫర్ లేదా గంధకము (Sulfur), ఒక రసాయన మూలకము. దీని పరమాణు సంఖ్య 16. దీని సంకేతము S. ఇది భూమిపై విరివిగా లభించే ఒక అలోహము. ఇది బహు సంయోజనీయత కలిగిన మూలకము. . ప్రకృతి లో సహజంగా లభ్యమయ్యే సల్ఫర్ పసుపు రంగులో ఉండే స్ఫటిక ఘన పదార్ధము. ఇది మూలక రూపంలోను, సల్ఫైడ్, సల్ఫేటు అనే రసాయన సంయోగరూపంలోను కూడా ప్రకృతిలో లభిస్తుంది. భూమిపై జీవపదార్ధాలకు కావలిసిన అత్యవసర పదార్ధాలలో గంధకం ఒకటి. సిస్టీన్ మరియు మితియోనీన్ అనే రెండు అమినో ఆమ్లాలలో (amino acid) గంధకం అణువులు ఉంటాయి. వాణిజ్య పరంగా గంధకం వినియోగించే పదార్ధాలు - ఎరువులు, గన్ పౌడర్, అగ్గిపుల్లలు, పురుగు మందులు, ఫంగస్ నివారణ పదార్ధాలు (insecticides and fungicides). వ్యవహార ఆంగ్ల భాషలో brimstone అని కూడా అంటారు.

                     ఆదిమమానవుడి కాలం నుంచి సల్ఫర్‌ను మందులు, ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. బొగ్గు, పెట్రోలియం ఉత్పన్నాల్లో సల్ఫర్ స్వల్పంగా ఉంటుంది. ఉల్లి, వెల్లుల్లి, గుడ్లు, గోళ్లు, వెంట్రుకలలో కూడా సల్ఫర్ కొద్ది పరిమాణంలో ఉంటుంది.

  సల్ఫర్ ముఖ్య ధాతువులు

       ధాతువు   పేరు                ఫార్ములా
        కాపర్ పైరటీస్                    CuS
       ఐరన్ పైరటీస్ FeS
            గెలీనా                           PbS
         సిన్నబార్                         HgS
        జింక్ సల్ఫెడ్                     ZnS


                       

తయారీ పద్ధతులు
సల్ఫర్‌ను రెండు పద్ధతుల ద్వారా సంగ్రహించవచ్చు.
1. సిసిలీ పద్ధతి
2. ప్రాష్ పద్ధతి (ఇందులో 99.5% స్వచ్ఛమైన సల్ఫర్ తయారవుతుంది)
రూపాంతరత

రూపాంతరత: ఒకే మూలకం రెండు లేదా అంతకంటే ఎక్కువ రూపాల్లో ఉండటాన్ని రూపాంతరత అంటారు. సల్ఫర్ మూడు రూపాల్లో లభిస్తుంది. అవి

1) రాంబిక్ లేదా లేదా అష్టముఖ సల్ఫర్.

2) మోనోక్లినిక్ లేదా ప్రిస్మాటిక్ సల్ఫర్

3) ప్లాస్టిక్ సల్ఫర్

సల్ఫర్ ఉపయోగాలు
   » సల్ఫర్‌ను అగ్గిపెట్టెల పరిశ్రమలో ఉపయోగిస్తారు. కాగితం పరిశ్రమలో విరంజనకారిగా ఉపయోగపడుతుంది.

   » సల్ఫ్యూరిక్ ఆమ్ల తయారీలో ఉపయోగిస్తారు.

  » టపాకాయలు, బాణాసంచా, గన్‌పౌడర్ (సల్ఫర్ + బొగ్గుపొడి + KNO3 ల మిశ్రమం) తయారీలో ఉపయోగిస్తారు.

   » సల్ఫర్‌ను యాంటిసెప్టిక్ మలాం, కీటకనాశనుల తయారీలో ఉపయోగిస్తారు.

   » రబ్బరు వల్కనైజేషన్‌లలో సల్ఫర్ ఉపయోగపడుతుంది.

సల్ఫర్ సమ్మేళనాలు
ఎ. సల్ఫర్ డై ఆక్సైడ్ (SO2):
1) సల్ఫర్‌ను గాలిలో లేదా ఆక్సిజన్‌తో మండించి సల్ఫర్ డై ఆక్సైడ్‌ను తయారు చేయవచ్చు.

2) రాగి ముక్కలను గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో వేడిచేసి చర్య నొందించడం ద్వారా ప్రయోగశాలలో సల్ఫర్ డై ఆక్సైడ్‌ను తయారు చేస్తారు.
SO2 ధర్మాలు:
¤ ఇది విషపూరితమైంది

¤ దీనికి ఆమ్ల స్వభావం ఉంటుంది.

¤ గాలి కంటే రెట్లు బరువైంది

¤ నీటిలో అధికంగా కరుగుతుంది.

¤ ఆక్సీకరణిగా, విరంజనకారిణిగా పనిచేస్తుంది

¤ నీటితో చర్యనొంది సల్ఫ్యూరస్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది.
SO2 + H2O H2SO3

బి. సల్ఫ్యూరిక్ ఆమ్లం (H2SO4):
¤ H2SO4 పారిశ్రామికంగా అతి ముఖ్యమైన రసాయనం. అందుకే దీన్ని రసాయనాల రాజు అంటారు.

తయారీ: H2SO4ను రెండు పద్ధతుల్లో తయారు చేస్తారు.

1) స్పర్శ విధానం (V2O5 ఉత్ప్రేరకం)

2) లెడ్ ఛాంబర్ విధానం

¤ ఓలియంను నీటిలో కరిగించి సల్ఫ్యూరిక్ ఆమ్లం పొందవచ్చు.

H2S2O7 + H2O   2H2SO4

¤ సల్ఫ్యూరిక్ ఆమ్లం లోహాలతో చర్యనొంది హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది.

H2SO4 ఉపయోగాలు:
   » ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు.

   » ఆక్సీకరణ, నిర్జలీకరణ చర్యలను ప్రదర్శిస్తుంది.

   » దుస్తులు ఉతికే సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు.

   » పేలుడు పదార్థాల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు.

   » బ్యాటరీలను నిల్వ చేయడానికి వాడతారు.

సి. హైడ్రోజన్ సల్ఫైడ్ (H2S):
   » H2S ను కిప్పు పరికరం ద్వారా తయారు చేస్తారు.

   » ఇది గాలి కంటే బరువైంది.

   » నీటిలో కరుగుతుంది.

   » 1 ml నీటిలో 3 ml H2S కరుగుతుంది.

   »ఇది ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటుంది.

   » ఇది క్షయకారిణిగా పనిచేస్తుంది.

  » కుళ్లిన కోడిగుడ్ల వాసనతో ఉంటుంది నైట్రోజన్, దాని సమ్మేళనాలు

¤ గాలిలో 77 - 79% నైట్రోజన్ ఉంటుంది.

¤ గాలిలో నైట్రోజన్ 3/4 వంతు భారశాతంగా, 4/5 వంతు ఘనపరిమాణ శాతంగా లభిస్తుంది.

¤ నైట్రోజన్‌ను అంశిక స్వేదనం ద్వారా తయారు చేస్తారు.

¤ జౌల్-థామ్సన్ ప్రభావం: ఒక వాయువును పీడనానికి గురిచేసి, వ్యాకోచింపజేసి చల్లబరిచే విధానాన్ని 'జౌల్‌థామ్సన్ - ప్రభావం' అంటారు.

¤ నైట్రోజన్ తయారీ విధానం: ప్రయోగశాలలో సోడియం నైట్రేట్, అమ్మోనియం క్లోరైడ్‌ల మిశ్రమాన్ని వేడిచేసి నైట్రోజన్‌ను తయారు చేస్తారు.

నైట్రోజన్ భౌతిక ధర్మాలు:
   » నైట్రోజన్ రంగు, రుచి, వాసనలేని వాయువు.

   » ఇది విషవాయువు కాదు, గాలి కంటే తేలికగా ఉంటుంది.

   » ఇది దహనశీలికాదు, దహన దోహదకారి కాదు.

   » ఇది చర్యాశీలత లేని వాయువు. ఇది -210.5ºC వద్ద రంగులేని ఘనపదార్థంగా మారుతుంది.

నైట్రోజన్ ఉపయోగాలు:
¤ నైట్రోజన్‌ను హేబర్ పద్ధతిలో అమ్మోనియా తయారీలో ఉపయోగిస్తారు.

¤ నైట్రోగ్లిజరిన్, TNT (ట్రైనైట్రోటొలీన్) లాంటి పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు.

¤ యూరియా లాంటి కొన్ని ఎరువుల తయారీలో వాడతారు


అమ్మోనియం లవణాలు:


1. అమ్మోనియం క్లోరైడ్ (NH4Cl):
అమ్మోనియం హైడ్రాక్సైడ్‌ను హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో తటస్థీకరిస్తే అమ్మోనియం క్లోరైడ్ లభిస్తుంది.

NH4OH + HCl NH4Cl + H2O

ఉపయోగాలు: 
¤  సోల్డరింగ్‌లో ఉపయోగిస్తారు.

¤ లెక్లాంచి ఘటం, నిర్జలఘటంలో విద్యుత్ విశ్లేష్యంగా ఉపయోగిస్తారు.

¤ అద్దకపు పరిశ్రమలో, మందుల తయారీలో ఉపయోగిస్తారు.

2. అమ్మోనియం సల్ఫేట్ ((NH4)2SO4):
అమ్మోనియా వాయువును గాఢ సల్ఫ్యూరికామ్ల ద్రావణంలోకి పంపడం ద్వారా తయారు చేస్తారు.
2NH3 + H2SO4 (NH4)2SO4

ఉపయోగాలు: దీన్ని ఎరువుగా ఉపయోగిస్తారు.

3. అమ్మోనియం నైట్రేట్ (NH4NO3):
అమ్మోనియం హైడ్రాక్సైడ్‌పై నైట్రిక్ ఆమ్లం చర్య వల్ల దీన్ని తయారు చేస్తారు.
NH4OH + HNO3 NH4NO3 + H2O

ఉపయోగాలు: అమ్మోటాల్ (NH4NO3 + 20% TNT), అమ్మోనాల్ (NH4NO3 + Al పొడి) లాంటి పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు.

నైట్రిక్ ఆమ్లం (HNO3):
పొటాషియం నైట్రేట్‌ను, గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరపడం ద్వారా నైట్రిక్ ఆమ్లం ఏర్పడుతుంది.
KNO3 + H2SO4 HNO3 + KHSO4

ఉపయోగాలు:
¤ నైట్రో గ్లిజరిన్, TNT, డైనమైట్ లాంటి పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు.

¤ కృత్రిమ సిల్కు (సెల్యులోజ్ నైట్రేట్) తయారీలో ఉపయోగిస్తారు.

¤ బంగారం, వెండి లోహాలను శుద్ధి చేయటంలో ఉపయోగిస్తారు.

¤ ద్రవరాజం లేదా అక్వారీజియా (1:3 ఘనపరిమాణాల గాఢ HNO3, గాఢ HCl) తయారీలోనూ నైట్రిక్ ఆమ్లం ఉపయోగపడుతుంది.

                                   నత్రజని స్థాపన - నత్రజని చక్రం
¤ నత్రజని వాయువును నైట్రేట్ లవణాలుగా మార్చడాన్ని నత్రజని స్థాపన అంటారు.

¤ మేఘాలలో మెరుపులు ఏర్పడినప్పుడు వాతావరణంలోని నైట్రోజన్, ఆక్సిజన్ కలిసి నైట్రిక్ ఆక్సైడ్‌లను ఏర్పరుస్తాయి.

¤ లెగ్యుమినేసి మొక్కలైన బఠాణీ, చిక్కుడు వేర్ల బుడిపెలలో ప్రత్యేకమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది నత్రజనిని నైట్రోజన్ సమ్మేళనాలుగా మారుస్తుంది.¤ నైట్రేట్‌ల ఉనికిని బ్రౌన్ వలయ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు.

¤ భూమిలో ఉండే క్షార ఆక్సైడ్‌లు వర్షపు నీటిలోని నైట్రికామ్లంతో చర్యనొంది నైట్రేట్‌లను ఇస్తాయి.


కర్బన రసాయన శాస్త్రంలో సల్ఫర్‌, హాలోజన్‌లు మరియు నైట్రోజన్‌లను గుర్తించే లైసన్‌ పరీక్షలలో సోడియంను ఉపయోగిస్తారు.లిథియం, సోడియం, పోటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియంలు క్షార మృత్తిక లోహాలులిథియం అతి తేలికైన, అధిక కాఠిన్యత గల లోహమూలకం.
0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again