పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 08, 2015

సౌరకుటుంబం

                           సోషల్ కంటెంట్ - డి .ఎస్.సి స్కూల్ అసిస్టెంట్ 2014-15

ఖగోళ శాస్త్రంలోని అనేక నక్షత్రాలలో ఒక నక్షత్రం సూర్యుడు. సూర్యుడు హైడ్రోజన్ మరియు హీలియం లతో కూడిన ఒక పెద్ద వాయుగోళం. సూర్యుని గురుత్వాకర్షణ శక్తి కారణంగా సౌరకుటుంబం లోని భూమి, అంగారకుడు మొదలైన గ్రహాలు సూర్యుని చుట్టూ నిర్ధిష్ట కక్ష్యలలో తిరుగుతున్నాయి.

 సూర్యుని గురించి ఇతర వివరాలు
 భూమి నుండి సూర్యుడి దూరం. 149.8 మిలియన్ కిలోమీటర్లు.

 కాంతి ఆవరణ ఉష్ణోగ్రత: 6000 సెంటి గ్రేడ్ డిగ్రిలు.

 సూర్యుని వ్యాసం; .. 13,91,980 కిలో మీటర్లు.

 సూర్యుని వయస్సు: సుమారు 5 బిలియన్ సంవత్సరాలు.

 సూర్య కిరణాల ప్రయాణ వేగం: 3 లక్షక కిలో మీట్లు ఒక సెకనుకి.

 సూర్యకిరణాలు భూమిని చేరడానికి పట్టే కాలము: సుమారు 8 నిముషాలు.

సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, ఇతర అంతరిక్ష పదార్ధాల సముదాయమే సౌరమండలం, లేదా సౌరకుటుంబం (Solar system). ఇందులో సూర్యుడు మరియు ఇతర అంతరిక్షపదార్థాలు తమలోతాము గురుత్వాకర్షణ శక్తికిలోబడి వుంటాయి: 8 గ్రహాలూ, వాటి 166 ఉపగ్రహాలూ, 3 మరుగుజ్జు గ్రహాలు (సెరిస్, ప్లూటో మరియు ఎరిస్ మరియు వాటి నాలుగు చంద్రులు) మరియు బిలియన్ల కొద్దీ చిన్నశరీరాలు. ఆఖరు వర్గం గ్రహ శకలాలు, క్యూపర్ బెల్ట్ పదార్థాలూ తోకచుక్కలు ఉల్కలు మరియు గ్రహాంతర ధూళి (అంతరిక్ష ధూళి). ఏమిటో మీకు తెలుసా ?

     


 సౌర వ్యవస్థ సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక పెద్ద పరమాణు మేఘం కూలిపోవటంవలన ఏర్పాటు ఇయింది.

 సంగ్రహంగా చెప్పాలంటే, సౌరమండలంలో సూర్యుడు, నాలుగు ఈవలి గ్రహాలు, ఒక గ్రహ శకలాల పట్టీ, దీనియందు చిన్న రాళ్ళ శరీరాకృతులూ, నాలుగు వాయు రాక్షస ఆవలి గ్రహాలు, మరియు రెండవ పట్టీ, క్యూపర్ బెల్ట్, వీటియందు మంచుతో కూడిన శరీరాకృతులూ. క్యూపర్ బెల్ట్ ఆవల విసరబడ్డ డిస్క్, హీలియోపాజ్, మరియు ఆఖరున ఊర్ట్ మబ్బు కలవు.

        

సౌరమండల జోన్లు: ఈవలి (లోతట్టు) సౌరమండలము, ఆస్టెరాయిడ్ పట్టీ, రాక్షస గ్రహాలు (జోవియన్లు) రాక్షస గ్రహాలు మరియు క్యూపర్ బెల్ట్. ఇవన్నీ స్కేలు ప్రకరాం చూపబడలేదు.

 సూర్యుని నుండి దూరాన్ని బట్టి ఈవలి గ్రహాలు:
బుధుడు
శుక్రుడు
భూమి
అంగారకుడు లేక కుజుడు

 ఆవలి వాయు రాక్షసులు (జోవియన్లు) :
బృహస్పతి, లేక గురుడు
శని
యురేనస్
నెప్ట్యూన్

 మూడు మరుగుజ్జు గ్రహాలు :
 సెరిస్, గ్రహ శకలాల పట్టీలో అతిపెద్ద శకలం

 ప్లూటో, క్యూపర్ పట్టీలోని తెలిసిన శరీరం

 ఎరిస్, ఈ మూడింటిలోనూ పెద్దది మరియు విసరబడ్డ డిస్క్ లో గలదు.

 ఆరు గ్రహాలకునూ రెండు మరుగుజ్జు గ్రహాలకునూ వీటి చుట్టూ పరిభ్రమించే సహజసిద్ధ ఉపగ్రహాలు సాధారణంగా వీటికి "చంద్రులు" అంటారు, మరియు ప్రతి ఆవలి గ్రహానికి కి ధూళితో కూడిన "రింగు" మరియు రేణువులు కలవు.

 మొత్తం గ్రహాలు 
బుధుడు
శుక్రుడు
భూమి
కుజుడు (అంగారకుడు)
బృహస్పతి (గురుడు)
శని
యురేనస్ (వరుణుడు)
నెప్ట్యూన్ (ఇంద్రుడు)
ప్లూటో (యముడు) (ప్రస్తుతం గ్రహ హోదా కోల్పొయింది - 2006 ఆగస్ట్ లో ఖగోళ విజ్ఙాన శాస్త్రవేత్తలు 'ప్లూటో'ని గ్రహం కాదని, కేవలం సౌరకుటుంబంలో ఒక వస్తువనీ తీర్మానించారు)



 సౌరకుటుంబం బిట్స్ 

1. ఉదయతార (మార్నింగ్ స్టార్) అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?
జ: శుక్రుడు

2. చంద్రుడిపై ప్రయాణించేవారికి పగటి వేళలో ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది?
జ: నలుపు

3. శాంతి సముద్రం, తుపాన్ల సముద్రాలు ఏ గ్రహరాశిపై ఉన్నాయి?
జ: చంద్రుడు

4. సౌర కుటుంబంలో తన చుట్టూ తాను అత్యంత వేగంగా భ్రమణం చెందే గ్రహం ఏది?
జ: బుధుడు

5. అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది?
జ: శుక్రుడు

6. హేలి తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది?
జ: 76

7. గురుత్వాకర్షణ బలం వల్ల ఏర్పడే నక్షత్ర సమూహాలను ఏమంటారు?
జ: గెలాక్సీ

8. బృహస్పతి గ్రహం భూమి కంటే ఎన్నిరెట్లు పెద్దది?
జ: 11

9. సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది?
జ: భూమి, సూర్యుడి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు

10. గ్రహాల పరికల్పన దేంతో సంబంధం కలిగి ఉంటుంది?
జ: గ్రహాల పరిమాణం ప్రకారం సౌర వ్యవస్థలో గ్రహాల విస్తరణ

11. సౌర వ్యవస్థలో ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి?
జ: బుధుడు, శుక్రుడు

12. నక్షత్రాల రంగు మారడానికి కారణం ఏమిటి?
జ: ఉపరితల ఉష్ణోగ్రతల్లో భేదం వల్ల

13. సూర్య వికిరణ శక్తి ఏ రూపంలో ప్రసారమవుతుంది?
జ: హ్రస్వ తరంగాలు

14. చంద్రుడికి భూమి ఒక్కటే ఉపగ్రహం అంటారు ఎందుకు?
జ: భూమి చుట్టూ తిరగడం వల్ల

15. 'గ్రీన్‌హౌజ్ ఎఫెక్ట్' అంటే ఏమిటి?
జ: వాతావరణంలో కార్బన్‌డై ఆక్సైడ్ వల్ల సౌరశక్తి బంధింపబడటం

16. భూమిపై రుతువులు ఏర్పడటానికి కారణం ఏమిటి?
జ: సూర్యుడి చుట్టూ భూమి అక్షంతో వంగి పరిభ్రమణం చెందడం వల్ల

17. భూమి సరాసరి వ్యాసార్ధం ఎంత?
జ: 640 కి.మీ.

18. సూర్యుడు దేనిపై లంబంగా ఉన్నప్పుడు భూగోళం అంతా పగలు, రాత్రులు సమానంగా ఉంటాయి?
జ: కర్కటరేఖ

19. భూమి తన కక్ష్యలో తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం ఎంత?
జ: 23 గంటల 56 నిమిషాల 4.09 సెకన్లు

20. భూమి ఏ ఆకారంలో ఉంటుంది?
జ: లఘు గోళాకారం

21. మధ్యరాత్రి సూర్యుడు ఉండే భూభాగం?
జ: ఆర్కిటిక్ వలయానికి బాహ్య ప్రాంతం

22. భూమి ఉపరితలం గ్రహించే సౌరపుటం శాతం ఎంత?
జ: 51%

23. పోటు పాటులు ఎప్పుడు అధికంగా వస్తాయి?
జ: సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై ఉన్నప్పుడు

24. ఉర్సా మైనర్ అంటే ఏమిటి?
జ: ఉత్తర నక్షత్ర మండలం చివర్లో నక్షత్రాల సమూహం 'లిటిల్ బేర్' గా ఏర్పడటం

25. సౌర కుటుంబానికి మాతృక
జ: సూర్యుడు

26. భూ పరిభ్రమణం వల్ల ఏర్పడేవి?
జ: రుతువులు

27. సూర్యుడికి భూమి దగ్గరగా రావడాన్ని ఏమంటారు?
జ: పరిహేళి

28. 'బేబి బ్లూ ప్లానెట్' అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?
జ: నెప్ట్యూన్

29. విశ్వంలోకెల్లా అతి పెద్ద ఉపగ్రహం ఏది?
జ: గనిమెడ

30. విశ్వం పుట్టుక గురించి విశదీకరించే సిద్ధాంతం ఏది?
జ: బిగ్‌బాంగ్ సిద్ధాంతం

31. వసంత విషవత్తు అని ఏ రోజుకు పేరు?
జ: మార్చి 3

32. అపహేళి జరిగే రోజు?
జ: జులై 4

33. 1974లో బ్లాక్ హోల్స్‌ను ఎవరు కనుక్కున్నారు?
జ: స్టీఫెన్ హాకింగ్

34. తూర్పు నుంచి పశ్చిమానికి తిరిగే గ్రహాలు ఏవి?
జ: శుక్రుడు, యురేనస్

35. అత్యధిక సాంద్రత ఉన్న గ్రహం ఏది?
జ: భూమి

36. కర్కట రేఖపై సూర్యకిరణాలు లంబంగా పడే రోజు?
జ: జూన్ 21

37. అత్యల్ప పగటి కాలం ఉండే రోజు?
జ: డిసెంబరు 22


0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again