పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 02, 2015

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు


ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ)
¤ మన రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలనకు సంబంధించిన సమగ్ర పథకం.

¤ దీనిలో భాగంగానే మహిళల కోసం పావలా వడ్డీ పథకాన్ని (3% వడ్డీ రేటు) ప్రారంభించారు.

¤ ఈ పథకంలో డ్వాక్రా, వెలుగు పథకాలను విలీనం చేశారు.

¤ 'గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (ఎస్ఈఆర్ఐ - సెర్ప్)' ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

వై.ఎస్.ఆర్. అభయహస్తం
¤ 2008 ఫిబ్రవరి 6న 'అభయహస్తం' పేరిట  అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. తర్వాత దీనికి కొన్ని మార్పులు చేసి 'వై.ఎస్.ఆర్. అభయహస్తం' పేరుతో 2009, నవంబరు 1న తిరిగి ప్రారంభించారు.

¤ ఈ పథకం కింద స్వయం సహాయక బృందాల మహిళలకు పెన్షన్, బీమా సౌకర్యం కల్పిస్తారు.

బీమా వివరాలు
¤ మహిళలు రోజుకు రూపాయి చొప్పున సంవత్సరానికి రూ.365 ప్రీమియం చెల్లించాలి. ప్రభుత్వం దీనికి సమానమైన మొత్తం జతచేసి ఎల్ఐసీ ద్వారా బీమా సదుపాయాన్ని కల్పిస్తుంది.

¤ సభ్యురాలు 59 సంవత్సరాల లోపు మరణిస్తే అప్పటివరకు చెల్లించిన ప్రీమియం, దానిపై వడ్డీతో పాటు సహజ మరణమైతే రూ.30,000; ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.75,000 కలిపి నామినీకి అందిస్తారు.

¤ 60 సంవత్సరాలు నిండిన తర్వాత నెలకు కనిష్ఠంగా రూ.500, గరిష్ఠంగా రూ.2,200 పింఛన్ సదుపాయం కల్పిస్తారు.

¤ సభ్యురాలి పిల్లలు (గరిష్ఠంగా ఇద్దరు) 9, 10, ఇంటర్, ఐటీఐ చదువుతుంటే వారికి సంవత్సరానికి రూ.1200 ఉపకార వేతనం అందిస్తారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ
¤ దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి ఉచిత వైద్య సేవలు అందించడానికి ఉద్దేశించిన పథకం ఇది. 2007లో దీన్ని ప్రారంభించారు.

¤ తెల్లరేషన్ కార్డులు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేస్తారు. 942 వ్యాధులకు రూ.2 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తారు.

¤ ఈ పథకంలో భాగంగానే 108 ఈఎమ్ఆర్ఐ, 104 హెచ్ఎమ్ఆర్ఐ సేవలను ప్రారంభించారు.

¤ 108 ఈఎమ్ఆర్ఐ (ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) అత్యవసర సేవలను, 104 హెచ్ఎమ్ఆర్ఐ (హెల్త్ మేనేజ్‌మెంట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) ఉచిత ప్రాథమిక వైద్య సేవలను అందిస్తున్నాయి.

¤ 2007 ఆగస్టు 15న మొదటిదశలో మహబూబ్‌నగర్, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో ప్రారంభించారు.

¤ 2007 డిసెంబరు 1న రెండోదశలో రంగారెడ్డి, నల్గొండ, చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రారంభించారు.

¤ 2008 అక్టోబరు 2న మూడోదశలో మిగిలిన అన్ని జిల్లాల్లో అమలు చేశారు.

¤ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా ఆరోగ్యశ్రీ పథకాన్ని; జీవీకే ఫౌండేషన్ ద్వారా 108, 104 సేవలను అమలు చేస్తున్నారు.

¤ రాష్ట్రవ్యాప్తంగా ట్రస్టు గుర్తించిన నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తున్నారు. ఆసుపత్రిలో రోగికి సహకరించడానికి 'ఆరోగ్యమిత్ర' అనే కార్యకర్తలు 24 గంటలు అందుబాటులో ఉంటారు.

ఇందిరమ్మ (INDIRAMMA - Integrated Novel Development in Rural Areas and Model Municipal Areas)
¤ 2006 ఏప్రిల్ 1న తూర్పు గోదావరి జిల్లా పడమర ఖండ్రిక గ్రామంలో ప్రారంభించారు.

¤ దేశంలోనే రాష్ట్రాల స్థాయిలో అమలవుతున్న అతి పెద్ద గృహనిర్మాణ పథకం ఇది.

¤ దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు 8 లక్షల పక్కా గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

¤ ప్రతి గృహానికి రూ.70,000 (రూ.40,000 ఉచితం, రూ.30,000 బ్యాంకు రుణం)గా అందిస్తారు.
¤ పట్టణ ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించి మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దుతారు.

రాజీవ్ యువకిరణాలు
¤ 'ఉపాధి కల్పన మిషన్' కింద 2 సంవత్సరాల్లో 15 లక్షల మంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఉద్దేశించిన పథకం ఇది.

¤ 2011, ఆగస్టు 20 (సద్భావన దినోత్సవం)న విశాఖపట్టణంలో ప్రారంభించారు
.
¤ ఈ పథకం కింద కల్పించే ఉపాధి అవకాశాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50% రిజర్వేషన్ కల్పించారు.

¤ ఈ పథకం అమలుకు ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా రాజీవ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయిమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (రీక్యాప్)ను ఏర్పాటు చేశారు.

ఇందిర ప్రభ
¤ 2004లో దీన్ని ప్రారంభించారు. దళిత, బలహీన వర్గాలకు చెందిన భూములను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన పథకం.

మీ సేవ
¤ 2011 నవంబరు 4న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తిరుపతిలో ప్రారంభించారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా స్వల్ప వ్యవధిలో అన్ని రకాల ప్రభుత్వ సేవలను పొందవచ్చు.

                   

¤ 'సులభంగా, వేగంగా' అనేది ఈ పథకానికి ట్యాగ్‌లైన్.

¤ తొలి దశలో 12 రకాల సేవలను ప్రారంభించారు. 2012, మార్చి 31 నాటికి 50 రకాల ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చారు.

¤ డిజిటల్ సంతకాలతో ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.

రచ్చబండ
¤ ఈ కార్యక్రమాన్ని 2011, జనవరి 24న శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తారు.

¤ రెండో విడత రచ్చబండ కార్యక్రమాన్ని 2011, నవంబరు 2న తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ప్రారంభించారు.

సబల పథకం
¤ రాజీవ్‌గాంధీ సబల పథకాన్ని 2011, ఏప్రిల్ 15న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు.

¤ బాలికల సాధికారతకు ఉద్దేశించిన ఈ పథకంలో 11-18 సంవత్సరాల బాలికల స్వయం సమృద్ధి, పౌష్టికాహారం, ఆరోగ్య సమస్యల నిర్మూలనకు కృషి చేస్తారు.

భూ భారతి
¤ భూకమతాల మధ్య సరైన సరిహద్దులను నిర్ణయించి, రైతుల మధ్య తగాదాలను నిర్మూలించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

¤ 1988-89లో కేంద్ర ప్రభుత్వం సీఎల్ఆర్ (కంప్యూటరైజ్డ్ లాండ్ రికార్డ్స్)ను ప్రారంభించింది.

¤ మన రాష్ట్రంలో ఈ పథకాన్ని 2006 నవంబరులో 'భూ భారతి' అనే పేరుతో ప్రారంభించారు.

¤ ఈ పథకాన్ని నిజామాబాద్ జిల్లా బోధన్‌లో 'పైలెట్ ప్రాజెక్ట్‌'గా ప్రారంభించారు.

రాజీవ్ పల్లెబాట
¤ ఈ పథకాన్ని 2004, జూన్ 13న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రారంభించారు.

¤ గ్రామీణ వికాసం, రైతు శ్రేయస్సు, బలహీనవర్గాల సముద్ధరణ, పేదరిక నిర్మూలన దీని లక్ష్యం.

రాజీవ్ నగరబాట
¤ 2005 జనవరి 9న ప్రారంభించారు. పట్టణ ప్రజలు స్థానిక సమస్యలను తమ ప్రజా ప్రతినిధులకు తెలపడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు.

వెలుగు పథకం
¤ గ్రామీణ దారిద్య్ర నిర్మూలన కోసం ఉద్దేశించిన పథకం.

¤ డ్వాక్రాతో కలిపి దీన్ని 'ఇందిరా క్రాంతి పథం'లో విలీనం చేశారు.

దీపం పథకం
¤ 1999 అక్టోబరు 2న డ్వాక్రా మహిళలకు వంట గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు.

¤ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఉబ్బసం, ఆస్తమా వ్యాధుల నివారణకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతోంది.

ఆదరణ పథకం
¤ గ్రామీణ ప్రాంతాల్లోని చేతివృత్తుల వారికి ఆధునిక పనిముట్లను అందించడానికి ఈ పథకాన్ని రూపొందించారు. దీన్ని 1998లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది.

పురా పథకం (PURA - Provision of Urban Amenities in Rural Areas)
¤ పల్లెల్లో మౌలిక వసతులు కల్పించడం ద్వారా వలసలను నివారించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.

¤ మౌలిక వసతుల కల్పనలో గ్రామాలు, పట్టణాల మధ్య అంతరాలను తగ్గించడం కోసం 2004, జనవరి 20న దీన్ని ప్రారంభించారు.

¤ పురా నమూనా రూపకర్త అబ్దుల్ కలాం.

¤ పురా పథకం పైలట్ ప్రాజెక్టులో భాగంగా నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ పట్టణాన్ని ఎంపిక చేశారు.

పశుక్రాంతి పథకం
¤ పాడి పరిశ్రమాభివృద్ధి కోసం రూ.500 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.

¤ కడప జిల్లా పులివెందులలో ప్రారంభించారు.
¤ దీనిలో భాగంగా లబ్ధిదారులకు 1.32 లక్షల పాడి పశువులను పంపిణీ చేశారు.

¤ ఈ పథకం హైదరాబాద్ మినహా మిగిలిన 22 జిల్లాల్లో అమలవుతోంది.

¤ పాడి పరిశ్రమకు సంబంధించి దేశంలో గుజరాత్ ప్రథమ స్థానం, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నాయి.

¤ మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది.

ప్రజాపథం
¤ ప్రభుత్వ పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి 2006 ఏప్రిల్ 9న రంగారెడ్డి, కృష్ణా, వరంగల్ జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు.

¤ ప్రజాపథంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తారు.

¤ దీనికోసం ప్రతి శాసనసభ్యుడికి తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద కోటి రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది.

పావలా వడ్డీ పథకం
¤ వ్యవసాయ రుణాలను తీసుకుని తిరిగి చెల్లించిన రైతులకు ఉద్దేశించిన పథకం.

¤ 2009లో దీన్ని ప్రారంభించారు.

పొలం బడి
¤ సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ, నీటి యాజమాన్య నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ లాంటి అంశాలపై రైతులకు శిక్షణ ఇస్తారు.

¤ ప్రతి మండలంలో 6 నెలలకు ఒకసారి పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

అంబేద్కర్ జీవన్ ధార
¤ దళితులు నివసించే ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించడానికి 2005, ఏప్రిల్ 14న ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఇందిరమ్మ మహిళా ఉపాధి
¤ మహిళలకు స్వయం ఉపాధి కల్పన ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

¤ 2004లో దీన్ని ప్రారంభించారు.

¤ కోటి మంది మహిళలను లక్షాధికారులుగా చేసే లక్ష్యంతో మహిళా స్వయం సహాయక బృందాలకు 3% వడ్డీకి రుణాలు ఇస్తారు.

1 రూపాయికి  కిలో బియ్యం
¤ ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి 2011 నవంబరు 1న హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఇంతకుముందు కిలో బియ్యాన్ని రూ.2కు ఇచ్చేవారు.

ఇందిరమ్మ బాట
¤ ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి 2012 జులై 14న తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామంలో ప్రారంభించారు.

¤ బడుగు, బలహీన, దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు, రైతులు, నిరుద్యోగ యువకుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ పథకాల అమలు తీరును క్షేత్ర స్థాయిలో సమీక్షించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు.

ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన
¤ మాతా శిశు ఆరోగ్య పరిరక్షణకు వీలుగా ఈ పథకాన్ని మొదట పశ్చిమ గోదావరి, నల్గొండ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

¤ ప్రతి గర్భిణీకి ఆమె ఖాతాలో రూ.4,000 జమ చేస్తారు.

¤ 19 సంవత్సరాలు నిండి మొదటిసారి గర్భం దాల్చిన మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది.

¤ లబ్ధిదారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా అంగన్‌వాడీ కేంద్రంలో పేరు నమోదు చేసుకోవాలి.

¤ ప్రభుత్వ ఉద్యోగం చేసే స్త్రీలకు ఈ పథకం వర్తించదు.

వడ్డీలేని రుణాలు
¤ మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో 2011 నవంబరు 25న జరిగిన రచ్చబండలో ఈ పథకాన్ని ప్రారంభించారు.

జననీ శిశు సురక్షా పథకం
¤ ఈ పథకాన్ని 2011 అక్టోబరు 23న సచివాలయంలో ప్రారంభించారు.

¤ ఈ పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం, పుట్టిన పిల్లలకు 30 రోజుల్లోగా అవసరమైన వైద్య సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తారు.

104 సంచార వైద్య సేవలు
¤ 2009, ఫిబ్రవరి 11 నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు.

¤ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మూడు కిలోమీటర్ల తర్వాత ఉన్న గ్రామీణులకు వైద్య సేవలు అందిస్తారు.

ఆహార హామీ పథకం
¤ శ్రామిక కుటుంబాలన్నింటికీ ఆహార భద్రత లక్ష్యంతో 2004లో దీన్ని ప్రారంభించారు.

రాజీవ్ యువశక్తి
¤ నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా 2004లో దీన్ని ప్రారంభించారు.

రాజీవ్ గృహకల్ప
¤ పట్టణాల్లో అల్పాదాయ వర్గాల ప్రజలకు ఇళ్లు నిర్మించేందుకు 2005లో దీన్ని ప్రారంభించారు.

దళిత జీవనాధార పథకం
¤ దళితవాడలకు రక్షిత మంచినీరు అందజేయడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని 2005లో ప్రారంభించారు.

బడిబాట
¤ 2005లో ఈ పథకాన్ని ప్రారంభించారు.

¤ బడిలో చేరని, మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పిన పిల్లలను బడిలో చేర్పించడం దీని లక్ష్యం.

రాజీవ్ అభ్యుదయ యోజన
¤ 2005లో దీన్ని ప్రారంభించారు.

¤ బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకం.

రాజీవ్ ఉద్యోగశ్రీ
¤ నిరుద్యోగులకు ఉపాధి కల్పన లక్ష్యంగా 2007లో ప్రారంభించారు.

ఇందిరమ్మ చెరువు పథకం
¤ 2007లో దీన్ని ప్రారంభించారు
.
¤ స్థానిక నీటి వనరులను పూర్తిగా వినియోగంలోనికి తేవడానికి ఉద్దేశించిన పథకం.

రాజీవ్ స్వగృహ
¤ మధ్య తరగతి వర్గాలకు సొంత ఇంటిని సమకూర్చడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని 2008లో ప్రారంభించారు.

మత్స్యమిత్ర
¤ మత్స్యకార మహిళలను ఆదుకోవడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని 2008లో ప్రారంభించారు.

జీవక్రాంతి
¤ దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని 2008లో ప్రారంభించారు.

ఇందిరా జీవిత బీమా పథకం
¤ వ్యవసాయ కూలీల కోసం ఉద్దేశించిన ఈ పథకాన్ని 2008లో ప్రారంభించారు.
ఇందిరా మేఘ మథనం

¤ రాష్ట్రంలోని వర్షాభావ ప్రాంతాల్లో వర్షాన్ని కురిపించడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని 2009లో ప్రారంభించారు.

మన బియ్యం
¤ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హైదరాబాద్‌లోని లలిత కళా తోరణంలో పైలట్ ప్రాజెక్టుగా 2013, జనవరి 16న ప్రారంభించారు.

¤ స్థానికంగా పండించిన ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా సేకరించి, మర పట్టి, బియ్యంగా మార్చి చౌక ధరల దుకాణాల ద్వారా స్థానిక ప్రజలకే అందించడం ఈ పథకం ముఖ్యోద్దేశం.

¤ రేషన్ షాపుల ద్వారా తెల్ల కార్డు ఉన్న లబ్ధిదారులకు రూపాయికి కిలో బియ్యం పథకం కింద దీన్ని అమలు చేస్తారు. తలసరి 4 కిలోల చొప్పున గరిష్ఠంగా 20 కిలోలు సరఫరా చేస్తారు.

¤ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు మొదటి విడతగా 7 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేస్తారు.

¤ ఈ పథకానికి అయ్యే వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.9600 కోట్లు సబ్సిడీగా ఇస్తున్నాయి.

రైతు బంధు
¤ 2012లో ప్రవేశపెట్టారు.

¤ పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో గోదాముల్లో భద్రపరచుకుంటే ఇచ్చే ఆర్థిక సహాయాన్ని రూ.లక్ష రూపాయలకు పెంచారు.

అమ్మ కొంగు
¤ మాతా శిశు రక్షణకు ఉద్దేశించిన ఈ పథకాన్ని 2012లో ప్రవేశపెట్టారు.

¤ ప్రసవానికి, ప్రసవం అనంతరం తల్లీ బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు అమ్మ కొంగు వాహనాలను ప్రారంభించారు.

బాల కిరణాలు
¤ 2012లో ప్రారంభించారు.

¤ 8 నుంచి 10వ తరగతి చదువుతున్న బాలబాలికలకు సాంప్రదాయక విద్యతోపాటు వృత్తి విద్యా శిక్షణ ఇస్తారు.

ఇందిరమ్మ బాట
¤ వివిధ సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షించడానికి ఉద్దేశించిన పథకం
.
¤ 2012, జులై 14న తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు.

¤ నిర్మాణ పనులు, పాఠశాలలు, వసతి గృహాలు, ఆసుపత్రులు, చౌకధరల దుకాణాలు, అంగన్‌వాడీ కేంద్రాల ఆకస్మిక తనిఖీలు, లబ్ధిదారుల సమస్యలు అడిగి తెలుసుకోవడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం.

చిన్నారి చూపు
¤ 2012లో ప్రారంభించారు.

¤ ఈ పథకం కింద స్కూలుకు వెళ్లే విద్యార్థుల కంటిచూపును పరీక్షిస్తారు. అవసరమైతే వారికి కంటి అద్దాలు పంపిణీ చేస్తారు, శస్త్రచికిత్సలను నిర్వహిస్తారు.

ఇందిరమ్మ అమృత హస్తం
¤ పౌష్టికాహార లోపంతో సంభవిస్తున్న గర్భిణులు, బాలింతలు, శిశువుల మరణాలను నివారించేందుకు 2012లో ప్రవేశపెట్టారు.

రాజీవ్ విద్యా మిషన్
¤ 2012లో ప్రవేశపెట్టారు.

¤ 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రి మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను అందిస్తారు.

బంగారు తల్లి పథకం
¤ బంగారుతల్లి పథకాన్ని 2013, మే 1 నుంచి రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు.

¤ 2013, మే 1 తర్వాత పుట్టిన ఆడపిల్లలకు, వారి తల్లులకు ఈ పథకం కింద లబ్ధి చేకూరుతుంది.

¤ మహిళ గర్భవతి కాగానే రూ.1000 చెల్లిస్తారు.

¤ ఆడపిల్ల పుట్టగానే తల్లికి రూ.2500 నగదు చెల్లిస్తారు.

¤ పాపకు 5 ఏళ్లు వచ్చేవరకు ఏటా రూ.1500 చొప్పున అందజేస్తారు..

¤ బాలిక బడిలో చేరగానే రూ.1000 ఇస్తారు.

¤ 1-5 తరగతి వరకూ ఏటా రూ.2000 ప్రోత్సాహం.

¤ 6-8 తరగతి వరకు రూ.2500 చెల్లింపు.

¤ 9-10 తరగతుల్లో ఏడాదికి రూ.3000.

¤ ఇంటర్మీడియట్‌లో రూ.3500 ఇస్తారు. ఇక్కడితో చదువు ఆపేస్తే రూ.50,000 చెల్లిస్తారు.

¤ గ్రాడ్యుయేషన్‌లో ఏటా రూ.4,000, గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగానే రూ.లక్ష అందిస్తారు.

¤ ప్రతి ఆడపిల్లకు ఈ పథకం ద్వారా లభించే మొత్తం ఆర్థిక సాయం 2 లక్షల 16 వేల రూపాయలు.

ఇందిరమ్మ మహాలక్ష్మి పథకం
¤ ఈ పథకం కింద మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు వారికి 30 ఎకరాలు కేటాయించి, ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 2013 ఏప్రిల్ 17న ప్రకటించారు.

¤ 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్వయం సహాయక బృందాల లింకేజీ ప్రణాళికను ఆయన ఆవిష్కరించారు.

పచ్చ తోరణం
¤ భూమిలేని ఎస్సీ, ఎస్టీల కోసం 'పచ్చతోరణం' పథకాన్ని మెదక్ జిల్లా సంగారెడ్డిలో 2013, ఏప్రిల్ 29న ప్రకటించారు.

¤ ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా భూమిలేని దళిత, గిరిజనులకు 200 మొక్కలు ఇస్తారు. వాటి సంరక్షణకు ఏడాదికి రూ.3,000 చొప్పున అయిదేళ్లపాటు ఆర్థిక సాయం అందిస్తారు.

¤ తొలిదశలో లక్ష కుటుంబాలను ఎంపిక చేసి వారికి మొక్కలు, పట్టాలు, ఆర్థిక సాయం అందజేస్తారు. ఆ చెట్ల ద్వారా వచ్చే ఫలసాయాన్ని ఆయా లబ్ధిదారులే పొందుతారు.

ఇందిరమ్మ కలలు
¤ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం - 2013'ను ఇందిరమ్మ కలలుగా పిలుస్తున్నారు.

¤ దేశంలోనే మొదటిసారిగా ఈ పథకాన్ని బాబూ జగ్జీవన్‌రాం జయంతి సందర్భంగా 2013, ఏప్రిల్ 5న పశ్చిమగోదావరి జిల్లా ఇల్లెందులలో ప్రారంభించారు.

¤ ఈ పథకం ప్రకారం జనాభా నిష్పత్తికి అనుగుణంగా నిధుల్లో వాటా ఇస్తారు. కేటాయింపులు, ఖర్చులో జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు.

¤ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 50 యూనిట్ల లోపు గృహ విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేస్తారు.

అమ్మ హస్తం
¤ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి 2013, ఏప్రిల్ 1న రవీంద్రభారతిలో ఈ పథకాన్ని ప్రారంభించారు.

¤ ఈ పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు తక్కువ ధరలకు నిత్యావసర సరకులు పంపిణీ చేస్తారు.

¤ 9 నిత్యావసర సరకులను కేవలం 185 రూపాయలకే అందిస్తారు.

¤ ఈ పథక నిర్వహణకు ఏడాదికి రూ.5544 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

¤ సబ్బులు, టీ, కాఫీ పౌడర్, టూత్‌పేస్ట్, కొబ్బరినూనె లాంటి వస్తువులను కూడా విలేజ్ మాల్స్ ద్వారా తక్కువ ధరలకు అందించనున్నారు.

స్త్రీ నిధి
¤ ఆర్థిక అవసరాల కోసం గ్రామీణ ప్రాంత మహిళలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా చేసేందుకు ఉద్దేశించిన పథకం. వారికి సహాయం చేయడానికి ప్రభుత్వం 'స్త్రీ నిధి'ని ప్రవేశపెట్టింది.

¤ అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ మహిళల అవసరాలకు ఈ నిధి నుంచి రుణాలను అందిస్తారు.

¤ ఈ పథకం కింద రూ.15,000 వరకు రుణాలు ఇస్తారు. ఈ మొత్తాన్ని 24 వాయిదాల్లో తిరిగి చెల్లించాలి.

¤ ఈ పథక నిర్వహణకు ప్రభుత్వం ప్రారంభ మూలధనం కింద రూ.1000 కోట్లను విడుదల చేసింది.

¤ ఈ పథకం ద్వారా 1.38 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందుతారు.

రాజీవ విద్యా దీవెన
¤ బలహీన వర్గాల కోసం 2012, నవంబరు 25న కిరణ్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు.

¤ 9, 10 తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం రూ.120 కోట్ల ఉపకార వేతనాలను మంజూరు చేశారు.

¤ కేంద్ర ప్రభుత్వ మద్దతుతో రాజీవ్ విద్యా దీవెన పథకాన్ని చేపట్టారు.

¤ డేస్కాలర్‌కు నెలకు రూ.150 చొప్పున 10 నెలలు, గ్రాంట్‌గా రూ.750 మంజూరు చేస్తారు. హాస్టల్ విద్యార్థులకు నెలకు రూ.350 చొప్పున 10 నెలలు, రూ.1000 గ్రాంట్‌గా అందిస్తారు.

¤ రాష్ట్రంలోని 1.6 లక్షల ఎస్టీ విద్యార్థులు, 4 లక్షల ఎస్సీ విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.


బిట్స్ 

1. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాల్లో మొదట ప్రారంభించారు
    జవాబు: 5

2. రచ్చబండ కార్యక్రమం ఎప్పుడు మొదలైంది? 
     జవాబు:24 జనవరి, 2011

3. మన రాష్ట్రంలో గ్రామీణ పేదరిక శాతం ఎంత?(2004-05లెక్కల్లో)
     జవాబు: 11.2 %

4. రాజీవ్ ఇంటర్‌నెట్ విలేజ్ పథకాన్ని మన రాష్ట్రంలో మొదట ఏ జిల్లాలో ప్రారంభించారు?
     జవాబు: గుంటూరు

5. రాజీవ్ ఇంటర్‌నెట్ విలేజ్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
     జవాబు: 20 ఆగస్ట్, 2004

6. పేదరికం అంచనాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో తీసుకునే ఆహారంలో కనీసం ఎన్ని కాలరీల పోషక విలువలు ఉండాలి?
    జవాబు: 2400

7. మనరాష్ట్రంలోని ఎన్ని గ్రామాల్లో రాజీవ్ ఇంటర్‌నెట్ విలేజ్ పథకం అమల్లో ఉంది.
     జవాబు: 8618

8. రాజీవ్ పల్లెబాట ఎప్పుడు ప్రారంభమైంది?
     జవాబు: 13 జూన్, 2004

9. ఇందిరమ్మ చెరువు పథకం ఎప్పుడు ప్రారంభమైంది?
    జవాబు: 8 జనవరి, 2007

10. సబల పథకాన్ని 2011 ఏప్రిల్‌లో ఎక్కడ ప్రారంభించారు?
      జవాబు: హైద్రాబాద్

11. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు అవసాన దశలో ఆదాయ భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన పథకం ఏది?
       జవాబు: వైఎస్ఆర్ అభయహస్తం

12. ఒక రూపాయికే కిలోబియ్యం పథకం ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడు ప్రారంభమైంది?
      జవాబు: 1 నవంబర్, 2011

13. 2004 - 05 లెక్కల ప్రకారం గ్రామీణ నిరుద్యోగిత రేటు ఎంత ?(ప్రతివెయ్యిమందికి)
      జవాబు: 109

14. ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డులు ఎక్కువగా ఏ జిల్లాలో ఉన్నాయి?
       జవాబు: తూర్పు గోదావరి

15. 'రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రస్తుతం ఎన్ని వ్యాధులకు వైద్యసేవలు అందిస్తున్నారు.?
       జవాబు: 940

16.రాజీవ్ గృహకల్ప పథకం కింద పేదలు ఇల్లు పొందాలంటే వార్షిక ఆదాయ పరిమితి ఎంత?
     జవాబు: రూ. 36 వేలు

17. పిల్లల్లో రక్తహీనత, పౌష్టికాహారలోపం లాంటి సమస్యలను తగ్గించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పథకం ఏది?
      జవాబు: జవహర్ బాలఆరోగ్యరక్ష

18. మన రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏర్పాటైన కొత్త పథకం ఏది?
       జవాబు: రాజీవ్ యువకిరణాలు

19. 'ఆసరా పథకం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నెంబర్ ఎంత?
       జవాబు: 1253

20. బంజరు భూముల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పథకం ఏది?
       జవాబు: ఇందిర ప్రభ

21. ఇందిర జలప్రభ అమలుకాని జిల్లా ఏది?
      జవాబు: హైద్రాబాద్

22. గర్భిణులకు వైద్యపరీక్షలతో పాటు, సురక్షిత ప్రసవం కోసం ప్రారంభించిన పథకం ఏది?
      జవాబు: జననీ శిశు సురక్ష 

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again