పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 09, 2015

ఆంధ్ర శాతవాహనులు

                           సోషల్ కంటెంట్ - డి .ఎస్.సి స్కూల్ అసిస్టెంట్ 2014-15

  ఆంధ్ర అన్న పదం మొట్టమొదటగా క్రీ.పూ 8వ శతాబ్దములో ఐతరేయ బ్రాహ్మణం లో పేర్కొనబడినది. పురాణాలలో మరియు వారి నాణేలపై ఈ వంశము ఆంధ్రులు, ఆంధ్ర భృత్యులు, శాతకర్ణులు మరియు శాతవాహనులని అనేక పేర్లతో పేర్కొనబడింది. గ్రీకు రాయబారి, యాత్రికుడు మెగస్తనీస్ వ్రాసిన ఇండికాలో కూడా ఆంధ్రుల ప్రస్తావన ఉన్నది. ఈయన ఆంధ్రులు లక్ష పదాతిదళం, వెయ్యి యేనుగులు మరియు 30 దుర్భేధ్యమైన దుర్గాలు కలిగి ఉన్నారని పేర్కొన్నాడు     

                                     

మౌర్య సామ్రాజ్య పతనానంతరం వాయవ్య భారతదేశంలో కుషాణులు, ఉత్తర భారత్‌లో శుంగులు, కణ్వులు, గుప్తులు, దక్కన్‌లో ఆంధ్ర శాతవాహనులు అధికారంలోకి వచ్చారు. వీరు మౌర్యులకు సామంతులుగా వ్యవహరించారు. పురాణాల ప్రకారం 30 మంది రాజులు 450 సంవత్సరాలపాటు పాలించినట్లు తెలుస్తోంది.

          భారతదేశ చరిత్రలో అతి సుదీర్ఘకాలం పరిపాలించిన ఒకే ఒక రాజవంశం - శాతవాహనులు. పురాణాలు శాతవాహనులను 'ఆంధ్ర భృత్యులుగా' పేర్కొన్నాయి.
 ఆంధ్రుల ప్రస్తావన కిందివాటిలో ఉంది.

1. ఐతరేయ బ్రాహ్మణం (మొదటిసారిగా)

2. అశోకుని 13 వ శిలాశాసనం

3. కర్నూలులోని ఎర్రగుడి, రాజుల మందగిరి శాసనాలు

4. మెగస్తనీసు - ఇండికా గ్రంథం

5. మహాభారతం

6. సేరివణిజ జాతకం - ఆంధ్రనగరి పదం కనిపిస్తుంది.

7. భీమసేన జాతకం - ఆంధ్ర పదం కనిపిస్తుంది.

8. గౌతమీ బాలశ్రీ వేయించిన 'నాసిక్' శాసనంలో ప్రత్యక్షంగా 'ఆంధ్ర' పదం కనిపించకపోయినా, ఆంధ్రదేశంలో ఉన్న పర్వతాల ప్రసక్తి కనిపిస్తుంది. అవి: సెటగిరి - నాగార్జునకొండ, సిరిటన - ధాన్యకటకం/ శ్రీశైలం, మహేంద్ర - విశాఖపట్నంలోని కొండలు.

               

       శాతకర్ణి విడుదల చేసిన తొలి నాణేలు మహారాష్ట్ర - విదర్భ రకం.


 తొలి పాలకులు
క్రీ.పూ 230 ప్రాంతములో శాతవాహనులు స్వతంత్ర రాజులైన తర్వాత, వంశ స్థాపకుడైన శిముక మహారాష్ట్ర, మాల్వా మరియు మధ్య ప్రదేశ్ లోని కొంత భాగమును జయించాడు. ఈయన తర్వాత ఈయన సోదరుడు కన్హ (లేదా కృష్ణ) పాలన చేపట్టి రాజ్యాన్ని పశ్చిమాన మరియు దక్షిణాన మరింత విస్తరింప జేశాడు. కన్హ క్రీ.పూ 207 నుండి క్రీ.పూ 189 వరకు పరిపాలించాడు.

 కన్హుని వారసుడైన మొదటి శాతకర్ణి ఉత్తర భారతదేశంలో శుంగ వంశము ను ఓడించి, అత్యంత వ్యయముతో అశ్వమేధం తో పాటు అనేక యజ్ఞయాగాదులు జరిపించాడు. ఈయన సమయానికి శాతవాహన వంశము సుస్థిరమై, తెలఁగానాలోని కోటలింగాల (కోటిలింగాల) రాజధానిగా తన బలాన్ని దక్షిణభారతదేశమంతా వ్యాపించింది. పురాణాలు ఈ వంశానికి చెందిన 30 మంది పాలకుల జాబితా ఇస్తున్నవి. అందులో చాలామంది వాళ్లు ముద్రింప జేసిన నాణేలు మరియు శాసనాల వల్ల కూడా పరిచితులు.

 ఐతరేయ బ్రాహ్మణంలో 'శునేశ్శపుని' కథ రూపంలో ఆంధ్రుల ప్రస్తావన కనిపిస్తుంది. శునేశ్శపుడిని బలి ఇస్తుండగా అడ్డుకున్న విశ్వామిత్రుడు అతడిని తన 50 మంది కుమారుల వద్దకు తీసుకెళ్లి సోదరుడిగా భావించమని కోరాడు. వారు దానికి తిరస్కరించడంతో కోపోద్రిక్తుడైన విశ్వామిత్రుడు తన కుమారులను ఆర్యవ్రతాన్ని వదిలి వెళ్లమని శపించాడు. ఈ నేపథ్యంలో దక్షిణ భారతావనికి వెళ్లి మూతిబ, పులింద, పిటినిక, శబర మొదలైన తెగలుగా స్థిరపడ్డారు.

 ఐతరేయ బ్రాహ్మణం ప్రకారం వీరు ఆర్యజాతికి చెందినవారు. చరిత్రకారుడు బి.ఎస్.ఎల్. హనుమంతరావు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు.

 'వ్రత్యస్థోమం' అనే యజ్ఞం ద్వారా ఆర్యవ్రతాన్ని స్వీకరించడం వల్ల ఆర్యజాతిగా పరిగణిస్తున్నారు. కానీ వాస్తవంగా వీరు ద్రావిడులని రామ్‌శరణ్ శర్మ అభిప్రాయం.

 ఆంధ్రులు - శాతవాహనులు ఒక్కరు కాదు. ఎందుకంటే 30 మంది రాజులు తమ శాసనాల్లో, లేదా సాహిత్యంలో ఎక్కడా 'ఆంధ్రులు' అనే పదం ఉపయోగించలేదని కె.పి. జయస్వాల్, రామ్ చౌదరి పేర్కొన్నారు.

 ఆంధ్రులు - శాతవాహనులు ఒక్కరే అని, ఆంధ్ర అనేది 'జాతి' నామమని, శాతవాహన అనేది 'వంశ నామమని' భండార్కర్, డాక్టర్ కె. గోపాలాచారి అభిప్రాయపడ్డారు.

 జన్మస్థలం 
 మహారాష్ట్ర ప్రాంతవాసులని డాక్టర్ పుసాల్కర్ అభిప్రాయం. మహారాష్ట్రలో ఉన్న నానాఘట్ శాసనం, నాసిక్ శాసనం, జోగల్‌తంబి నాణేలు, రాజులు తమ పేర్లకు ముందు తల్లుల పేర్లు పెట్టుకోవడం లాంటి అంశాల ఆధారంగా ఆయన ఈ నిర్ణయానికి వచ్చారు.

  శాతవాహనులు కర్ణాటక ప్రాంతవాసులని డాక్టర్ సుక్తాంకర్ అభిప్రాయం. శాతవాహనుల్లో చివరివాడైన మూడో పులోమావి కర్ణాటకలోని బళ్లారిలో 'మ్యాకదోని శాసనం' వేయించాడు. దీనిలో శాతవాహనిహార (రాష్ట్రం), గుళ్మిక (గ్రామాధికారి/ భూస్వామి), కండనాభుడు అనే సైనికుడి ప్రస్తావన ఉన్నాయి.
 విదర్భ ప్రాంతవాసులు - డాక్టర్ మిరాసి

  వీరు ఆంధ్రులే
'శాతవాహనులు ఆంధ్రులు' అనడానికి కారణాలు: 
 శాతవాహన వంశ మూలపురుషుడు - శాతవాహనుడు. మెదక్‌లోని కొండాపూర్‌లో లభ్యమైన నాణేలపై సాద్వాహాన, సాతావాహన అనే పదజాలం కనిపిస్తుంది. అతడే శాతవాహనుడిగా భావిస్తారు.

  శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు. ఇతడి నాణేలు కరీంనగర్‌లోని మునులగుట్టకు సమీపంలో ఉన్న కోటిలింగాల వద్ద లభ్యమయ్యాయి. ఈ నాణేలపై 'సిముఖ' అని రాసి ఉంది.

క్రీ.శ.150లో శాతవాహన సామ్రాజ్య విస్తృతి
అధికార భాషలుప్రాకృతం (ఆది-మరాఠి)
సంస్కృతం
తెలుగు
రాజధానులుపుణె వద్ద ఉన్న జున్నార్మరియు గుంటూరు సమీపాన కల ధరణికోటఅమరావతి
ప్రభుత్వంరాచరికం
శాతవాహనులకు ముందు పాలించినవారుమౌర్యులు
శాతవాహనుల తర్వాత పాలించినవారుఇక్ష్వాకులుకాదంబులు

 హాలుడి 'గాథాసప్తశతి'లో దేశీభాష పదాలైన అత్తి, అమ్మ, అందం, చోద్యం, ఓడ, అద్దము మొదలైన పదాలు కనిపిస్తాయి.

 ప్రాకృత భాషలో కుతుహలుడు రాసిన 'లీలావతి పరిణయం' అనే గ్రంథం - హాలుడు సింహళంపై దండెత్తి లీలావతిని తీసుకువచ్చి, ద్రాక్షారామం వద్ద ప్రేమ వివాహం చేసుకున్నాడని తెలుపుతుంది.

 కుల ప్రస్తావన: గౌతమీ బాలశ్రీ నాసిక్ శాసనంలో గౌతమీపుత్ర శాతకర్ణిని ఏక బ్రాహ్మణుడిగా ప్రస్తావించింది. అదే నాసిక్ శాసనంలో 'రాజర్షిపత్ని' అనే నామ సంకేతాన్ని బట్టి క్షత్రియులుగా భావిస్తారు. పురాణాలు మాత్రం శ్రీముఖుడిని శూద్రుడిగా పేర్కొన్నాయి.

 రాజధాని: మొదటి రాజధాని మహారాష్ట్రలోని ప్రతిష్ఠానపురం (నేటి పైఠాన్). శ్రీముఖుడు సామ్రాజ్య విస్తరణలో భాగంగా, శత్రువులైన శకుల దాడిని అరికట్టడానికి మహారాష్ట్రలో రాజధానిని ఏర్పాటు చేశాడు. ఇది వాస్తవమేనని ఆచార్య జి. వెంకట్రావ్, మార్తాండ రామారావు ఏకీభవించారు. రెండో రాజధాని గుంటూరులోని ధాన్యకటకం (ధరణికోట). రాజధానిని ప్రతిష్ఠానపురం నుంచి ధాన్యకటకానికి మార్చిన పాలకుడు వాశిష్టీపుత్ర రెండో పులోమావి (ఇతడు 24 వ రాజు).

 కాల నిర్ణయం: శాతవాహనుల పాలన క్రీ.పూ. 232 నుంచి క్రీ.శ. 225 వరకు సాగిందని చరిత్రకారులు పేర్కొంటారు..

రాజకీయ చరిత్ర
శాతవాహన వంశ మూల పురుషుడు - శాతవాహనుడు (నాణేల ఆధారంగా), రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు. సోమదేవసూరి రాసిన 'కథాసరిత్సాగరం'లో ఆంధ్రుల తొలిరాజైన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు శ్రీకాకుళం రాజధానిగా పాలించాడని, అతడి పేరు మీదే 'శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు దేవాలయం' ఉందని పేర్కొన్నారు.

  నయసేనుడు కన్నడ భాషలో రాసిన ధర్మామృతం ప్రకారం ఆంధ్రుల తొలి రాజు 'యశోధరుడు'. ఇతడు గుంటూరులోని భట్టిప్రోలు ప్రాంతాన్ని పాలించినట్లు చెబుతారు.

 శ్రీముఖుడు
శ్రీముఖుడికి సమకాలీకుడు - ఉత్తర భారతదేశ పాలకుడైన అశోకుడు. పురాణాలు శ్రీముఖుడిని శూద్రుడని, కులహీనుడని (వృషల) పేర్కొన్నాయి. ఇతడికి సంబంధించిన పోటీన్ (మిశ్రమ) నాణేలు (రాగి, సీసంతో చేసినవి) కరీంనగర్‌లోని మునులగుట్టకు సమీపంలో ఉన్న కోటిలింగాల వద్ద లభ్యమయ్యాయి. వాటిపై 'సిముఖ' అనే ప్రస్తావన కనిపిస్తుంది.

  శ్రీముఖుడిని వాయు పురాణంలో 'సింథకుడు' అని, విష్ణు పురాణంలో 'బలిపుచ్ఛకుడు' అని, మత్స్య పురాణంలో 'శిశుక' అని పేర్కొన్నారు.

  మత్స్య పురాణ సంకలనం యజ్ఞశ్రీ శాతకర్ణి కాలం నాటికి పూర్తయ్యిందని 'ఫర్గీటన్' అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. ఇతడు నాణేలపై 'ఏనుగు బొమ్మ'ను ముద్రించాడు. శ్రీముఖుడు జైన మతస్తుడు. ఇతడి గురువు కాలాసూరి. శ్రీముఖుడు ప్రజల ఆగ్రహానికి గురై మరణించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి.

 కృష్ణ / కన్హా
ఇతడు శ్రీముఖుని సోదరుడు. అతి తక్కువ కాలం పరిపాలించిన ఏకైక పాలకుడు (అయిదేళ్లు). వైష్ణవ మతాన్ని అనుసరించాడు. తాను వేయించిన 'నాసిక్' శాసనంలో విష్ణువును దామోదరుడిగా, లక్ష్మీనారాయణుడిగా ప్రస్తావించాడు. బౌద్ధ భిక్షువుల బాగోగులు చూసుకోవడానికి 'మహామత్తర' అనే ఉద్యోగిని నియమించినట్లు తెలుస్తోంది.

 ఇతడి కాలంలోనే మొదటిసారిగా భాగవత వైష్ణవం వాడుకలోకి వచ్చి, సంకర్షణ/ వాసుదేవ, బలరామ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, సాంబ అనే అయిదుగురి ఆరాధన జరిగినట్లు చరిత్రకారులు చెబుతారు. దీన్నే 'పంచరాత్ర' విధానం అంటారు.

          
           గౌతమీపుత్ర యజ్ఞ శాతకర్ణి యొక్క నాణెం (పా. 167-196)


 మొదటి శాతకర్ణి
ఇతడు తొలి శాతవాహన పాలకుల్లో గొప్పవాడు. మహారధిత్రణయిక రాకుమార్తె నాగానికను వివాహం చేసుకున్నాడు. నాగానిక వేయించిన 'నానాఘట్ శాసనం' ఇతడి పరిపాలన గురించి తెలుపుతుంది. ఈ శాసనం 'సంకర్షణ-వాసుదేవ' స్తోత్రంతో ప్రారంభమవుతుంది. ఇందులో వీర, శూర, అప్రతిహత, దక్షిణాధిపతి అనేవి మొదటి శాతకర్ణి బిరుదులుగా పేర్కొన్నారు.

  మొదటి శాతకర్ణి రెండు అశ్వమేథ యాగాలు, ఒక రాజసూయ యాగం చేశాడు. తూర్పు భారతదేశ పాలకుడైన ఖారవేలుడు, విదేశీ పాలకుడు డెమెట్రియస్, ఉత్తర భారత పాలకుడు పుష్యమిత్ర శుంగుడు ఇతడి సమకాలీకులే. మొదటి శాతకర్ణి ఉజ్జయిని బొమ్మ ఉన్న నాణేలను ముద్రించాడు.

  మొదటి శాతకర్ణి కళింగ చక్రవర్తి అయిన ఖారవేలుడిని ఓడించి, 'అస్మాకాధిపతి' అనే బిరుదు స్వీకరించినట్లు 'చుళ్ళ కళింగ జాతకం' తెలుపుతోంది. రెండోసారి జరిపిన దండయాత్రలో మొదటి శాతకర్ణిని ఓడించిన ఖారవేలుడు 'మూషికాధిపతి' బిరుదు స్వీకరించాడని ఖారవేలుడి 'హాతిగుంఫా శాసనం' పేర్కొంటోంది.

 రెండో శాతకర్ణి
      శాతవాహనుల్లో అత్యధికంగా 56 ఏళ్లు పాలించిన రాజు రెండో శాతకర్ణి. ఇతడి కాలంలోనే శక - శాతవాహనుల సంఘర్షణ ప్రారంభమైంది. ఉత్తర భారతదేశ పాలకుడు, శుంగ వంశస్థుడైన భాగభద్రుడు ఇతడి సమకాలీకుడు. రెండో శాతకర్ణి భాగభద్రుడిని ఓడించి, అతడి రాజధాని విదిశను ఆక్రమించాడు. విదిశకు సమీపంలో సాంచి బౌద్ధ స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించాడని 'సాంచి స్తూప శాసనం' తెలుపుతోంది.

    
                       శాతవాహనుల కాలరేఖ
చరిత్ర పూర్వ యుగముక్రీ.పూ.1500వరకు
పూర్వ యుగముక్రీ.పూ.1500-క్రీ.త.650
• మౌర్యులకు ముందుక్రీ.పూ.1500-క్రీ.పూ.322
• మౌర్యులు• క్రీ.పూ.322 - క్రీ.పూ. 184
• శాతవాహనులు• క్రీ.పూ.200 - క్రీ.త.200
• కళింగులు• క్రీ.పూ.180? - క్రీ.త.400?
• ఇక్ష్వాకులు• 210 - 300
• బృహత్పలాయనులు• 300 - 350
• అనందగోత్రులు• 295 - 620
• శాలంకాయనులు• 320 - 420
• విష్ణుకుండినులు• 375 - 555
• పల్లవులు• 400 - 550
పూర్వమధ్య యుగము650 - 1320
• మహాపల్లవులు
• రేనాటి చోడులు
• చాళుక్యులు
• రాష్ట్రకూటులు
• తూర్పు చాళుక్యులు• 624 - 1076
• పూర్వగాంగులు• 498 - 894
• చాళుక్య చోళులు• 980 - 1076
• కాకతీయులు• 1083 - 1323
• అర్వాచీన గాంగులు
ఉత్తరమధ్య యుగము1320 - 1565
• ముసునూరి నాయకులు• 1320 - 1368
• ఓఢ్ర గజపతులు• 1513
• రేచెర్ల పద్మనాయకులు• 1368 - 1461
• కొండవీటి రెడ్డి రాజులు• 1324 - 1424
• రాజమహేంద్రవరం రెడ్డి రాజులు• 1395 - 1447
• బహమనీ రాజ్యము
• విజయనగర సామ్రాజ్యము• 1336 - 1565
ఆధునిక యుగము1540 – 1956
• అరవీటి వంశము• 1572 - 1680
• కుతుబ్ షాహీ యుగము• 1518 - 1687
• నిజాము రాజ్యము• 1742-1948
• బ్రిటిషు రాజ్యము
• స్వాతంత్ర్యోద్యమము• 1800 - 1947
• ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు• 1912-1953
• హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు• 1948-1952
• ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ• 1953-1956
• ఆంధ్ర ప్రదేశ్ ఇటీవలి చరిత్ర• 1956-

 బిట్స్ 

1. పురాణాలు శాతవాహనులను ఏమని పేర్కొన్నాయి?
జ: ఆంధ్ర భృత్యులు

2. కిందివాటిలో మ్యాకదోని శాసనానికి సంబంధించి సరైనవి ఏవి?
ఎ) శాతావాహనిహార                         బి) గుళ్మిక
సి) కండనాభుడు                             డి) పైవన్నీ
జ: డి(పైవన్నీ)

3. బౌద్ధ క్షేత్రం, రేవు పట్టణం ఏది?
జ: ఘంటశాల

4. 'ఆంధ్రులు - శాతవాహనులు ఒక్కరే' అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఎవరు?
జ: భండార్కర్, డాక్టర్ కె. గోపాలచారి

5. 'పంచరాత్ర' విధానం దేనికి సంబంధించింది?
జ: భాగవత వైష్ణవం

7. 'క్షత్రియదర్పమానమర్థన', 'క్షహరాట వంశ నిరవశేషకర' బిరుదాంకితుడు ఎవరు?
జ: గౌతమీపుత్ర శాతకర్ణి

8. శాతవాహనుల మొదటి రాజధాని ఏది?
జ: ప్రతిష్ఠానపురం

9. శాతవాహనుల శాసన భాష ఏది?
జ: ప్రాకృతం

10. శాతవాహనుల నాటి 'నిగమ సభ'ను ప్రస్తావించిన శాసనం ఏది?
జ: భట్టిప్రోలు శాసనం

11. కిందివారిలో 'గాథాసప్తశతి'కి సంబంధించని వారిని గుర్తించండి.
ఎ) బొద్ధిక                      బి) శ్రీరాజదేవ
సి) చెల్లవ్వ                     డి) అనులక్ష్మి
జ: సి(చెల్లవ్వ)

12. శాతవాహనుల జన్మస్థలి 'మహారాష్ట్ర' అన్నదెవరు?
జ: డాక్టర్ పుసాల్కర్

13. కిందివాటిలో అమరావతి నమూనారీతి బౌద్ధ స్తూపం ఏది?
        ఎ) అన్నాం - డాంగ్‌డువాంగ్             బి) కాంబోడియా - అంగ్‌కోర్‌వాట్
        సి) సింహళం - అనురాధపురం          డి) పైవేవీకావు
జ: ఎ(అన్నాం - డాంగ్‌డువాంగ్)


0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again