పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

February 28, 2015

కరెంట్ అఫైర్స్ - ఫిబ్రవరి 2015

అంతర్జాతీయం 

ఫిబ్రవరి - 1

¤ పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచిన క్రీ.శ.1215 నాటి 'మాగ్నా కార్టా' గ్రంథం 800 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అందులోని నాలుగు ప్రతులను ప్రజల సందర్శనార్థం బ్రిటిష్ లైబ్రరీలో ఏర్పాటు చేశారు.
       » ఈ మాగ్నాకార్టాను 1215 జూన్ 15న రూపొందించారు. యుద్ధంలో రెబల్ బారోన్స్ డిమాండ్‌లతో కింగ్ జాన్ మాగ్నాకార్టాను అంగీకరించారు
.
¤ నైజీరియాలో సైన్యం, ఇస్లామిక్ తీవ్రవాదులకు మధ్య జరిగిన పోరులో వంద మందికిపైగా మృతిచెందారు
.
       » ఈశాన్య నైజీరియాలో అతిపెద్ద నగరమైన మైదుగురి కేంద్రంగా ఈ మారణహోమం జరిగింది. నగరాన్ని ముట్టడించాలని ప్రయత్నించిన ఇస్లామిక్ తీవ్రవాదులను సైన్యం అడ్డగించింది. దీంతో ఈ ఘటన చోటు చేసుకుంది
.
       » ఈశాన్య నైజీరియాలో ముస్లిం రాజ్యాన్ని స్థాపించాలన్న 'బొకో హరమ్' తీవ్రవాదానికి మైదుగురిని పుట్టిల్లుగా పేర్కొంటారు
.
¤ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. తమ వద్ద బందీగా ఉన్న జపాన్ పాత్రికేయుడు కెంజి గోటోను గొంతు కోసి హతమార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలను ఆన్‌లైన్‌లో ఉంచారు. జపాన్‌కు చెందిన ఇద్దరు బందీల్లో హరుణ యుకావా అనే వ్యక్తిని వారం క్రితమే హతమార్చారు.
ఫిబ్రవరి - 2 
¤ నోబెల్ బహుమతి గ్రహీత, టిబెట్‌కు చెందిన అధ్యాత్మిక నాయకుడు దలైలామాను ఎవరు కలిసినా, దేని కోసం కలిసినా ఒప్పుకొనేది లేదని చైనా స్పష్టం చేసింది.       » ఫిబ్రవరి అయిదో తేదీన వాషింగ్టన్‌లో మత సంబంధమైన స్వేచ్ఛపై అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రసంగించనున్నారు. దీనికి దలైలామా హాజరు కానున్నారని వైట్‌హౌస్ ప్రకటించింది. దీనిపై చైనా అమెరికాను హెచ్చరించింది. దలైలామా ఒక వేర్పాటువాదని, అతన్ని ఎవరైనా కలవాలనుకుంటే అది మా దేశానికి సంబంధించిన అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడమేనని తెలిపింది.¤ ఫజర్ అనే పరిశీలనా ఉపగ్రహాన్ని ఇరాన్ ప్రయోగించింది. 2012 తర్వాత ఆ దేశం ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం ఇదే మొదటిసారి.       » ఈ ఉపగ్రహాన్ని భూమికి 450 కి.మీ. ఎత్తులోని కక్ష్యలోకి పంపినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ చేపట్టిన నాలుగో ఉపగ్రహ ప్రయోగమిది. మొదటి మూడింటిని 2009 నుంచి 2012 మధ్య ప్రయోగించింది.       » ఫజర్ బరువు 52 కిలోలు. ఇది అంతరిక్షం నుంచి మెరుగైన చిత్రాలను తీస్తుంది.
ఫిబ్రవరి - 3 
¤ ప్రపంచంలోనే తొలిసారిగా కేవలం మహిళల కోసం విలాసవంత విహార నౌకను మొనాకోకు చెందిన లిడియా బెర్సాని రూపొందించారు.       » దీనికి 'లా బెల్లీ' అని పేరు పెట్టారు. అంటే సౌందర్య రాశి అని అర్ధం.       » ఈ విహార నౌకలో ఆరు డీలక్స్ కేబిన్లు, అందమైన లాంజ్‌లు, స్పా , డిస్కో క్లబ్, ఐస్ ఫౌంటెయిన్‌లు, సినిమా థియేటర్ మొదలైనవి ఉన్నాయి. ఈ నౌక మీద ఒక హెలిప్యాడ్ కూడా ఉండటం విశేషం.¤ పాకిస్థాన్ సైనిక, ఆర్థిక అవసరాల కోసం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రూ.6 వేల కోట్లకు పైగా ఆర్థిక సాయాన్ని ప్రతిపాదించారు. అమెరికా శాసనసభకు ఆయన పంపిన బడ్జెట్ ప్రతిపాదనల్లో ఈ మొత్తాన్ని సూచించారు. దీని ప్రకారం 'విదేశీ సైనిక సహాయం' కింద పాక్‌కు అమెరికా రూ.1600 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయనుంది. వీటికి అదనంగా ఆర్థిక చేయూత కింద రూ.రెండు వేలకోట్లు, తీవ్రవాదంపై పోరాటం కోసం మరో 890 కోట్ల రూపాయలు పాక్‌కు అందించనుంది.       » తీవ్రవాదంపై పోరాటం, అఫ్గానిస్థాన్‌లో శాంతిని నెలకొల్పడం లాంటి అంశాల్లో తమకు పాకిస్థాన్ చాలా కీలకమైందని, అందుకే భారీ మొత్తంలో సహాయం చేస్తున్నామని అమెరికా ప్రకటించింది.¤ యుగోస్లావియా విభజన సమయం (1990)లో 1.30 లక్షల మంది మారణకాండ సంఘటనపై అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. క్రొయేషియా, సెర్బియాలను నిర్దోషులుగా ప్రకటించింది.       » మానవ హక్కుల ఉల్లంఘనలపై 16 ఏళ్ల క్రితం సెర్బియాపై క్రొయేషియా కేసు దాఖలు చేసింది. సంఘర్షణ సమయంలో రెండు దేశాలకు చెందిన దళాలూ నేరాలకు పాల్పడినప్పటికీ, జాతి విధ్వంసానికి దిగాలన్న ఉద్దేశం ఉన్నట్లు రుజువు కాలేదని న్యాయస్థానం పేర్కొంది.¤ బ్రిటన్ దిగువ సభ సభ్యులు ఒక చరిత్రాత్మక శాసనానికి ఆమోదం తెలిపారు. తద్వారా ముగ్గురి (తల్లీ, తండ్రి, మహిళా దాత) డీఎన్ఏలతో ఐవీఎఫ్ విధానం ద్వారా సంతానాన్ని పొందడాన్ని చట్టబద్ధం చేశారు.       » ప్రపంచంలోనే ఈ తరహా చర్యకు శ్రీకారం చుట్టిన తొలి దేశంగా బ్రిటన్ చరిత్ర సృష్టించింది.       » దిగువ సభలో ఆమోదం పొందిన ఈ శాసనానికి ఎగువసభ అంగీకారం లభించాల్సి ఉంది.       » సొంత తల్లిదండ్రుల న్యూక్లియర్ డీఎన్ఏ, మహిళా దాత పిండం నుంచి సేకరించిన ఆరోగ్యవంతమైన మైటోకాండ్రియల్ డీఎన్ఏ (ఎండీఎన్ఏ)లతో ఐవీఎఫ్ విధానం ద్వారా బిడ్డకు ప్రాణం పోస్తారు. అంటే ఐవీఎఫ్ విధానం ద్వారా రూపుదిద్దుకునే గర్భస్థ పిండంలో ఈ ముగ్గురి డీఎన్ఏలూ ఉంటాయి. సొంత తల్లి నుంచి జన్యుపరంగా అత్యంత ప్రమాదకరమైన జబ్బులు సంక్రమించకుండా మహిళా దాత నుంచి సేకరించే ఆరోగ్యకరమైన ఎండీఎన్ఏ కాపాడుతుంది.       » ఈ విధానం వల్ల బ్రిటన్‌లో ఏటా కనీసం 150 మంది దంపతులకు మేలు చేకూరనుంది. బ్రిటన్‌లో పుట్టే ప్రతి 6,500 మంది పిల్లల్లో ఒకరికి జన్యు పరంగానే గుండె, కాలేయం, శ్వాసకోశ ఇబ్బందులు, అంధత్వం, కండర క్షీణత లాంటి ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తున్నాయి.¤ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ గత ఏడాది డిసెంబరులో బందీగా పట్టుకున్న జోర్డాన్ ఫైలట్‌ను సజీవంగా తగలబెట్టి హతమార్చింది. ఆ క్రూర చర్య తాలూకు చిత్రాలతో ఆన్‌లైన్‌లో వీడియోను ఉంచింది.
ఫిబ్రవరి - 4
¤ చైనా నుంచి అక్రమ రవాణా ద్వారా వచ్చిన వేలాది పిల్లులను వియత్నాం అధికారులు సామూహికంగా సజీవ సమాధి చేయడం వివాదాస్పదమైంది.       » వియత్నాంలో పెరుగుతున్న పిల్లి మాంసం అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు ఈ చర్య చేపట్టినట్లు, స్మగ్లింగ్ వస్తువులకు సంబంధించిన చట్టం ప్రకారం వాటిని చంపేసినట్లు వియత్నాం వెల్లడించింది.        » ఉత్తర తైపీలోని సొంగ్షన్ విమానాశ్రయం నుంచి తైవాన్ నియంత్రణలోని కిన్‌మన్ ద్వీపానికి బయల్దేరిన ఆ విమానం మార్గమధ్యంలో రహదారి వంతెనను ఢీ కొని అదుపుతప్పి కిలంగ్ నదిలో కుప్పకూలింది. 
ఫిబ్రవరి - 6 
¤ చైనాలోని గ్వాంగ్ డాంగ్ రాష్ట్రంలోని హ్యుడాంగ్ కౌంటీలోని హోల్‌సేల్ మార్కెట్ మాల్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. మాల్‌లో తొమ్మిదేళ్ల బాలుడు లైటర్‌తో అజాగ్రత్తగా వ్యవహరించడం వల్ల ఈ అగ్నిప్రమాదం జరిగింది. 
ఫిబ్రవరి - 9 
¤ నల్లకుబేరులకు సంబంధించి మరో జాబితా వెలుగు చూసింది. ప్రపంచవ్యాప్తంగా లక్షమందికి పైగా ఖాతాదారుల వివరాలు ఇందులో ఉన్నాయి. స్విట్జర్లాండ్‌లోని హెచ్ఎస్‌బీసీ బ్యాంకులో ఉన్న ఈ ఖాతాల వివరాలను అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల వేదిక (ఐసీఐజే) బయటపెట్టింది.       » జాబితాలో భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్‌కు సంబంధించినవారు, మాజీ అధికారుల పేర్లు ఉన్నాయి.       » జాబితాలో 1195 మంది భారతీయుల పేర్లు ఉన్నాయి. ప్రస్తుత విదేశీ మారక విలువల ఆధారంగా లెక్కించినప్పుడు ఆ ఖాతాల్లోని నిల్వలు 400 కోట్ల డాలర్ల (రూ.25,420 కోట్లు)కు పైగా ఉన్నాయి.       » హెచ్ఎస్‌బీసీకి చెందిన స్విట్జర్లాండ్ శాఖలో నల్లధనం దాచుకున్న వారిలో స్విట్జర్లాండ్ పౌరులే అగ్రస్థానంలో నిలుస్తున్నారు. 200 దేశాల్లో భారత్‌కు 16వ స్థానం లభించింది. ఏ దేశానికీ చెందని 19 వేల మంది ఖాతాదారులు దీనిలో ఉన్నారు. భారత్‌కు చెందిన ఒక వ్యక్తి ఖాతాలో గరిష్ఠంగా 876.3 మిలియన్ డాలర్ల (సుమారు రూ.5258 కోట్లు) సొమ్ము ఉంది. ఖాతాదారుల సంఖ్య పరంగా చూస్తే స్విట్జర్లాండ్ 11,235 ఖాతాలతో ప్రథమ స్థానంలో ఉంది.¤ ఈజిప్ట్ రాజధాని కైరోలోని ఎయిర్ డిఫెన్స్ స్టేడియంలో సాకర్ అభిమానులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ తొక్కిసలాటకు దారితీయడంతో 22 మంది మృతి చెందారు.       » స్థానిక క్లబ్ జట్లు జమలేక్, ఈఎన్‌పీపీఐ మధ్య మ్యాచ్ ప్రారంభించడానికి ముందు ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఫిబ్రవరి - 11 
¤ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)పై సైనిక చర్యకు లాంఛనంగా అధికారం ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా చట్ట సభను కోరారు.       » ఐఎస్ ఉగ్రవాదుల హింసాత్మక దురాక్రమణను అరికట్టకపోతే అమెరికాకు ముప్పుగా పరిణమించగలదని ఆయన పేర్కొన్నారు.¤ ఇటీవల జరిగిన మధ్యదరా సముద్ర విషాద ఘటనలో దాదాపు 300 మంది ఆచూకీ లభించడంలేదని ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ వెల్లడించింది.       » లిబియా నుంచి ఇటలీ తీరప్రాంతానికి వలస వస్తున్నవారిలో పలువురు అతిశీతల వాతావరణం కారణంగా మరణించినట్లు ఏజెన్సీ వెల్లడించింది. 
ఫిబ్రవరి - 12
¤ రష్యా, ఉక్రెయిన్ మధ్య బెలారస్ రాజధాని మిన్క్స్‌లో శాంతి ఒప్పందం కుదిరింది. ఈ సమావేశంలో జర్మనీ, ఫ్రాన్స్‌లు కూడా పాల్గొన్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 15 నుంచి ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో కాల్పుల విరమణ అమల్లోకి వస్తుంది.       » ఈ ఒప్పందం విజయవంతంగా అమలైతే రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో నిరంతరంగా జరుగుతున్న కాల్పులు ఆగిపోతాయి. రష్యా అనుకూల తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో శాంతి నెలకొంటుంది. ఆ ప్రాంతం 2015 చివరినాటికి ఉక్రెయిన్ నియంత్రణలోకి వస్తుంది. 
ఫిబ్రవరి - 13 
¤ కశ్మీర్ విషయంలో ఐక్యరాజ్యసమితి తీర్మానాలను భారత్ అమలు చేయనందున భద్రతా మండలిలో ఆ దేశానికి శాశ్వత సభ్యత్వం కల్పించడం తమకు ఆమోదయోగ్యం కాదని పాకిస్థాన్ తెలిపింది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రధాని నవాజ్‌షరీఫ్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పేర్కొన్నారు.¤ యోగా సాధన సందర్భంగా పలువురు ధరించే పొట్టి దుస్తులను నిషేధించడానికి ప్రవేశపెట్టిన బిల్లు అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో వీగి పోయింది.       » మోంటానాకు చెందిన చట్టసభ సభ్యుడు డేవిడ్ మూర్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టాడు.¤ పాకిస్థాన్‌లోని పెషావర్ పట్టణంలో ఒక షియా మసీదుపై తాలిబన్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 20 మంది మరణించారు.       » ఇటీవల సింధ్ ప్రాంతంలోను షియా మసీదులో జరిగిన దాడిలో మొత్తం 61 మంది మరణించారు. 
ఫిబ్రవరి - 15
¤ సౌహార్ధ చర్చల్లో భాగంగా 172 మంది భారత జాలర్లను పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జాలర్లు వాఘా సరిహద్దు గుండా రైలులో ప్రయాణించి భారత్ చేరుకుంటారు.       » అరేబియా సముద్రంలోని తమ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారనే ఆరోపణలతో భారత జాలర్లను పాక్ ప్రభుత్వం గతంలో అరెస్టు చేసింది.       » ఇంకా 349 మంది భారత జాలర్లు పాక్ జైళ్లలో ఉన్నట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది.¤ ఉక్రెయిన్‌లో శాంతి ఒప్పందానికి ఆదిలోనే విఘాతం కలిగింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్దిసేపటికే తిరుగుబాటుదారులు రాకెట్ దాడులకు పాల్పడ్డారు.       » లుగాన్‌స్క్ ప్రాంతంలోని పొప్సొన్ పట్టణంపై తిరుగుబాటుదారుల దాడుల్లో ఇద్దరు మరణించారు.¤ ఐరోపా, ఉత్తర ఆఫ్రికాల మధ్య ఉన్న సముద్రంపై పడవల్లో చిక్కుకున్న 1000 మందికి పైగా వలసదారులను రక్షించడానికి ఇటలీ తీర రక్షక దళం చర్యలు చేపట్టింది. లంపేడూసా దీవికి దక్షిణం వైపు 180 కి.మీ. దూరంలో ఎనిమిది ఓడల్లో వీరు చిక్కుకుని ఉన్నారు. 
ఫిబ్రవరి - 16
¤ సుహ్నద్భావ చర్యల్లో భాగంగా పాకిస్థాన్ మరో 172 మంది భారతీయ మత్స్యకారులను, మరో ఖైదీని విడుదల చేసింది.¤ భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) మరోసారి అమానుష హత్యాకాండకు పాల్పడింది. లిబియాలో 21 మంది ఈజిప్ట్ కాప్టిక్ క్రైస్తవులకు శిరచ్చేదం విధించింది.       » ఈజిప్ట్ ఈ ఘటనపై ఆగ్రహించి ఐఎస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి 64 మంది ఉగ్రవాదులను హతమార్చింది. 
ఫిబ్రవరి - 18
¤ యుద్ధ నేరాల కేసులో బంగ్లాదేశ్‌లో ఛాందసవాద జమాత్-ఇ-ఇస్లామీ పార్టీ అగ్రనేత అబ్దుస్ సుభాన్‌కు అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్-2 మరణశిక్షను విధించింది.       » 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం పాకిస్థాన్‌తో యుద్ధం జరిగింది. ఆ పోరాటాన్ని వ్యతిరేకించిన జమాత్-ఇ-ఇస్లామీ నేతలపై యుద్ధ నేరాలను మోపారు. ఈ నేరాలకు సంబంధించి 2010 నుంచి విచారణ చేపట్టారు. ఇప్పటివరకు 17 మందిపై నేరాలను మోపారు. 
ఫిబ్రవరి - 21 
¤ గ్రీస్ భవితవ్యంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రుణ సంక్షోభం నుంచి గ్రీస్ గట్టెక్కేందుకు ఉద్దీపన (బెయిల్ అవుట్)ను యూరో జోన్ నాలుగు నెలలు పొడిగించింది. అయితే బదులుగా కొన్ని కఠిన షరతులను విధించింది.¤ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అరుణాచల్‌ప్రదేశ్ పర్యటనపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.       » 'సరిహద్దు వివాద పరిష్కార యత్నాల నేపథ్యంలో చైనా-భారత్ సరిహద్దుల్లో ఉన్న వివాదాస్పద ప్రాంతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించడంపై మేం తీవ్ర అసంతృప్తితో ఉన్నాం. అరుణాచల్‌ప్రదేశ్ దక్షిణ టిబెట్‌లో అంతర్భాగం. ఈ ప్రాంతం భారత్‌లో భాగమని మేం ఎప్పుడూ భావించలేదు. సరిహద్దు సమస్యలు క్లిష్టం అయ్యేలా భారత్ వైపు నుంచి ఇలాంటి చర్యలు మళ్లీ జరగవని మేం ఆశిస్తున్నాం' అని చైనా ప్రకటించింది. 
ఫిబ్రవరి - 22
¤ బంగ్లాదేశ్‌లోని పద్మానదిలో ఓ పడవ బోల్తాపడిన ఘటనలో 48 మంది మృతి చెందారు.       » రాజ్‌బరీలోని పటూరియా నుంచి దౌల్‌దియాకు 150 మందితో వెళ్తున్న పడవ మరో సరకు రవాణా పడవను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.¤ భారత్‌లోని గోధుమ రైతులకు ప్రభుత్వం ఎగుమతి సబ్సిడీలను భారీగా ఇస్తోందని, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనల ప్రకారం ఇవి అక్రమమని అమెరికాలోని గోధుమ ఉత్పత్తిదారులు ఆరోపించారు. దీనివల్ల వాణిజ్యంలో సమతుల్యం దెబ్బతిందని, ప్రపంచవ్యాప్తంగా ధరలపై ఒత్తిడి ఏర్పడి ఇతర దేశాల్లోని గోధుమ రైతులు ఇబ్బంది పడుతున్నారని యూఎస్ వీట్ అసోసియేట్స్ ఆరోపించింది.
ఫిబ్రవరి - 25 
¤ పునర్‌వ్యవస్థీకరిస్తున్న ఐరాస భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపినట్లు వైట్‌హౌస్ ప్రకటించింది.¤ హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతులు (వర్క్ పర్మిట్లు) ఇవ్వనున్నట్లు అమెరికా ప్రకటించింది. భారతీయుల జీవన భాగస్వాములకు అమెరికా వచ్చినా పనిచేయడానికి కుదిరేది కాదు. ఈ నిర్ణయం ప్రతిభావంతులు, వృత్తి నిపుణులకు లబ్ధి చేకూర్చనుంది.¤ ముగ్గురు వ్యక్తుల డీఎన్ఏల నుంచి పిండాలను సృష్టించడాన్ని బ్రిటన్‌లో చట్టబద్ధం చేశారు.       » ఈ వివాదాస్పద సంతానోత్పత్తి విధానాన్ని చట్టబద్ధం చేసిన మొదటి దేశం బ్రిటనే.       » జన్యుసంబంధిత ప్రాణాంతక వ్యాధులు తల్లుల నుంచి సంతానికి సంక్రమించకుండా నిరోధించేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తారు.
¤ అఫ్ఘానిస్థాన్‌లోని పంజ్‌షిర్ రాష్ట్రంలో మంచుచరియలు విరిగిపడి 124 మంది సజీవసమాధి అయ్యారు.¤ కెనడా నుంచి అమెరికాలోని గల్ఫ్ఆఫ్ మెక్సికో తీరం వరకు 1900 కిలోమీటర్ల మేర నిర్మించదలచిన కీస్టోన్ ఎక్సెల్ ముడి చమురు పైపులైన్ నిర్మాణాన్ని అమెరికా అధ్యక్షుడు ఒబామా తన వీటో అధికారం ఉపయోగించి తిరస్కరించారు.       » దీనిపై రిపబ్లికన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.       » అధ్యక్షుడిగా ఆరేళ్లకు పైగా పాలనలో ఉన్న బరాక్ ఒబామా ఈ అధికారాన్ని ఉపయోగించడం ఇది మూడోసారి. 


జాతీయం 

ఫిబ్రవరి - 1
¤ రోడ్డు ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన మనూ అనే 30 సంవత్సరాల వ్యక్తికి దేశంలోనే తొలిసారిగా చేతుల మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది.
       » మరో రోడ్డు ప్రమాద బాధితుడి చేతులను మనూకు విజయవంతంగా అమర్చారు
.
       » కొచ్చిలోని అమృత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు ఈ శస్త్రచికిత్సను నిర్వహించారు.
ఫిబ్రవరి - 2 
¤ 'విశ్వాస పూరితమైన శునకం నమ్మకమైన స్నేహితుడులాంటిది' అని సుప్రీంకోర్టు అభివర్ణించింది. ప్రజలకు చికాకుగా మారాయన్న కారణంతో వీధి శునకాలను చంపడానికి పురపాలక సంస్థలకు ఏ అధికారం ఉందని ప్రశ్నించింది.       » జంతు సంక్షేమ బోర్డు, శునక ప్రేమికులు తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది.       » జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ పి.సి.పంత్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది.       » ప్రజలకు చికాకు కలిగిస్తున్న శునకాలను చంపడానికి మహారాష్ట్ర పురపాలక సంస్థకు అనుమతిస్తూ ముంబయి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.¤ మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం 10వ వార్షికోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.       » కూలీలను నిపుణత ఉన్న కార్మికులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఇకపై ఈ పథకాన్ని నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 
ఫిబ్రవరి - 4 
¤ రాజస్థాన్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు సూర్య నమస్కారాలు, యోగా, ధ్యానాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటివల్ల విద్యార్థుల మానసిక, శారీరక ఆరోగ్యం మరింతగా మెరుగుపడుతుందని ప్రభుత్వం పేర్కొంది.       » ప్రతి పాఠశాలలోను ఉదయపు ప్రార్థన అనంతరం విద్యార్థులందరూ పది నిమిషాలపాటు వీటిని ఆచరించాలని సూచించింది.¤ శారదా గ్రూపు సంస్థల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తులో కల్పించుకున్నందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి కేంద్ర ప్రభుత్వం ఉద్వాసన పలికింది.       » గోస్వామి స్థానంలో కేరళ క్యాడర్‌కు చెందిన 1979 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఎల్.సి.గోయోల్‌ను నియమించారు. ఆయన ఇప్పటివరకు గ్రామీణాభివృద్ధి కార్యదర్శిగా ఉన్నారు.       » పశ్బిమ బంగ రాష్ట్రంలో చోటు చేసుకున్న శారదా కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి మాతంగ్ సిన్హ్‌ను అరెస్టు చేయకుండా మెతకగా వ్యవహరించాలంటూ సీబీఐ అధికారులపై గోస్వామి ఒత్తిడి తీసుకురావడం, దానిపై ప్రధాన మంత్రి కార్యాలయానికి సీబీఐ నివేదిక అందించడం ఇటీవల చోటుచేసుకున్నాయి. 
ఫిబ్రవరి - 5 
¤ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్.సి.గోయల్ కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అనిల్ గోస్వామి స్థానంలో ఈయన నియమితులయ్యారు.¤ నాగాలాండ్ ముఖ్యమంత్రి జెలియాంగ్ విశ్వాస పరీక్షలో నెగ్గారు. మొత్తం 60 మంది సభ్యులున్న శాసనసభలో 59 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా ఓటు వేశారు.       » అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు 38 మంది శాసనసభ్యులున్నారు. వీరిలో 22 మంది గతనెలలో జెలియాంగ్ నేతృత్వంపై తిరుగుబాటు చేయండంతో సంక్షోభం తలెత్తింది.¤ మైనర్ ఖనిజాల జాబితాకు మరో 31 ఖనిజాలను చేర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి ప్రస్తుతం మేజర్ ఖనిజాల జాబితాలో ఉన్నాయి.       » దిల్లీలో జరిగిన 'కేంద్ర భూగర్భ కార్యక్రమాల బోర్డు' 54వ సమావేశంలో కేంద్ర ఉక్కు, గనులశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ విషయాన్ని వెల్లడించారు.       » ఈ 31 ఖనిజాల తాలూకు లీజులు మొత్తం లీజుల్లో 55 శాతం వరకు ఉన్నాయని, మొత్తం లీజు ప్రాంతంలో వీటి వాటా 60 శాతం వరకు ఉంటుందని మంత్రి తెలిపారు.       » రాష్ట్రాలకు మరిన్ని అధికారాలను ఇవ్వడం, దేశంలో ఖనిజాభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. 
ఫిబ్రవరి - 6
¤ 'నీతి ఆయోగ్' తొలి సమావేశాన్ని దిల్లీలో నిర్వహించారు. దాదాపు మూడు గంటలపాటు జరిగిన సమావేశంలో దేశ ఆర్థిక పరిస్థితి గురించి ప్రముఖ ఆర్థికవేత్తల అభిప్రాయాలను ప్రధాని నరేంద్ర మోదీ అడిగి తెలుసుకున్నారు.       » చమురు ధరల తగ్గుదల, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను దేశ ఆర్థిక వృద్ధికి అవకాశంగా మలచుకోవాలని కృత నిశ్చయంతో ఉన్న ప్రధాని ఈ విషయంలో ప్రముఖ ఆర్థికవేత్తల సూచనలు కోరుతూ నీతి ఆయోగ్ తొలి సమావేశాన్ని నిర్వహించారు.       » ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియా, పూర్తికాలపు సభ్యులు బిబేక్ దేబ్రాయ్, వి.కె.సారస్వత్; ఆర్థికవేత్తలు విజయ్ కేల్కర్, నితిన్ దేశాయ్, బిమల్ జలాన్, రాజీవ్ లాల్, ఆర్.వైద్యనాథన్, సుబిర్ గోకర్ణ్, పార్థసారధి షోమ్, పి.బాలకృష్ణన్, రాజీవ్ కుమార్, అశోక్ గులాటీ, ముకేష్ బుతానీ, జి.ఎన్.బాజ్‌పాయ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.       » నీతి ఆయోగ్ సీఈఓ సింధుశ్రీ ఖుల్లర్ కొత్త సంస్థ గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు.       » పీఎమ్‌జేడీవై, వంటగ్యాస్ రాయితీ ప్రత్యక్ష బదిలీ, స్వచ్ఛభారత్ సహా ఇటీవల కాలంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రధాని వివరించారు.
ఫిబ్రవరి - 7 
¤ దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 67.14 శాతం పోలింగ్ నమోదైంది.       » మొత్తం 70 సీట్లకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 1.33 కోట్ల మంది ఓటర్లలో 67.14 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.       » గోకల్‌పూర్ నియోజకవర్గంలో అత్యధికంగా 73.46%, దిల్లీ కంటోన్మెంట్‌లో అత్యల్పంగా 58.47% పోలింగ్ జరిగింది. 
ఫిబ్రవరి - 8 
¤ అణు ఒప్పందానికి సంబంధించి ఇటీవల అమెరికాతో కుదిరిన అవగాహనను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అణు ప్రమాదం జరిగితే బాధితులు అణు రియాక్టర్లకు పరికరాలను సరఫరా చేసే విదేశీ కంపెనీలపై దావా వేయజాలరని ఇది స్పష్టం చేస్తోంది. అయితే ఆ సరఫరాదారులను ఆపరేటర్ మాత్రమే జవాబుదారు చేయగలడని వివరించింది. పౌర అణు జవాబుదారీ చట్టం (సీఎల్ఎన్‌డీఏ)లో సవరణలు చేసే ప్రతిపాదన ఏదీ లేదని ప్రభుత్వం పేర్కొంది.¤ దేశంలో టెలిఫోన్ వినిమోగదారుల సంఖ్య 97 కోట్లకు చేరిందని టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) వెల్లడించింది. గత నవంబరు నెలాఖరుకి వినియోగదారుల సంఖ్య 96.42 కోట్లు కాగా, డిసెంబరు ఆఖరుకు ఈ మొత్తం 97.10 కోట్లకు చేరింది.       » ఇందులో మొబైల్ వినియోగదారులే 94.39 కోట్లు ఉన్నారు. టెలీ సాంద్రత 77.58 (ప్రతి 100 మందిలో ఫోన్ కనెక్షన్ ఉన్నవారు) గా నమోదైంది.¤ మారిషస్ సముద్ర గర్భంలో భారత్ త్వరలో ఖనిజ అన్వేషణ చేపట్టనుందని అంటార్కిటిక్ సముద్ర పరిశోధన జాతీయ సంస్థ (ఎన్‌సీఏఓఆర్) ప్రకటించింది.       » కొచ్చిన్‌లో జరిగిన 'ప్రపంచ సముద్ర అధ్యయన సమావేశం-2015' లో ఈ విషయాన్ని ఎన్‌సీఏఓఆర్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.రాజన్ వెల్లడించారు. 10 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో సముద్రం మధ్యలో ఈ శోధన కొనసాగించడానికి అంతర్జాతీయ సముద్ర గర్భ ప్రాధికార సంస్థ (ఐఎస్ఏ) నుంచి అనుమతి లభించిందని రాజన్ పేర్కొన్నారు. 
ఫిబ్రవరి - 9 
¤ సెలవు ప్రయాణ రాయితీ (ఎల్టీసీ)ని కేవలం ఏడాదికి ఒక్కసారే నగదుగా మార్చుకునే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.       » కేంద్ర పౌర సేవలు (సెలవులు) నిబంధనలు, 1972 ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండు రకాల ఎల్టీసీలను (స్వస్థలం, దేశవ్యాప్తంగా ఎక్కడికైనా) పది రోజుల వరకు నగదుగా మార్చుకోవచ్చు.¤ ప్రముఖ ఇతిహాసమైన రామాయణంలో ప్రస్తావించిన 'పంచవటి' ఉద్యానవనం ఆధారంగా దేశంలోని ప్రతి గ్రామంలో అయిదు మొక్కలను నాటాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) నిర్ణయించింది. వీటిలో భాగంగా మర్రి, రావి, అత్తి, రాం అంజీర్ (పకాడ్), అశోక మొక్కలను ఎంచుకుంది. వీటికి తోడు తులసి మొక్కను కూడా ఇంటికి ఒకటి చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. 
ఫిబ్రవరి - 10 
¤ దిల్లీ శాసనసభ ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 70 స్థానాలకు 67 స్థానాలను కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘన విజయం సాధించింది.       » భాజపా కేవలం మూడు స్థానాలను గెల్చుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానమూ దక్కలేదు.       » ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రతిష్ఠాత్మక కొత్త దిల్లీ నియోజక వర్గం నుంచి 31,500 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి నూపుర్ శర్మపై ఘన విజయం సాధించారు. 2013 ఎన్నికల్లో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన షీలా దీక్షిత్‌ను 25,864 ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ఓడించారు.       » భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆప్ అభ్యర్థి ఎస్.కె.బగ్గా చేతిలో 2,277 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.       » ఆప్ 54.3% ఓట్లను గెల్చుకుంది. భాజపాకు 32.7%, కాంగ్రెస్‌కు 9.7%, ఇతరులు 3.3% పొందారు.       » ఈ స్థాయిలో ఒక పార్టీ రాష్ట్రాల్లో విజయం సాధించడం అరుదు. 1989 సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం సంగ్రామ్ పరిషద్ మొత్తం 32 స్థానాలనూ గెల్చుకుంది.       » కేజ్రీవాల్ 2014 ఫిబ్రవరి 14న 49 రోజుల పాలన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. జన్‌లోక్‌పాల్ బిల్లుకు దిల్లీ శాసనసభలో భాజపా, కాంగ్రెస్ అడ్డుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు ఆయన 2013లో అధికార కాంగ్రెస్‌ను ఓడించి దిల్లీ ఏడో ముఖ్యమంత్రిగా 2013 డిసెంబరు 28న బాధ్యతలు చేపట్టారు.       » వికాస్‌పురి నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి మహీందర్ యాదవ్ 77,665 ఓట్ల ఆధిక్యంతో సమీప భాజపా అభ్యర్థి సంజయ్ సింగ్‌పై గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజారిటీ. నజాఫ్‌గఢ్ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి కైలాస్ గెహ్లాట్ సమీప ఐఎన్ఎల్‌డీ (ఇండియన్  నేషనల్ లోక్‌దళ్) లో అభ్యర్థిపై 1,555 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. తాజా ఎన్నికల్లో ఇదే అత్యల్ప మెజారిటీ.       » 70 మంది తాజా ఎమ్మేల్యేల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. వీరంతా ఆప్ నుంచే విజయం సాధించారు. మొత్తం 66 మంది మహిళలు పోటీ పడ్డారు. రాఖీ బిర్లా, సరితాసింగ్, వందన కుమారి, ప్రమీలా తోకాస్, భావన గౌర్, అల్కా లంబా గెలిచారు. రాఖీ బిర్లా గత ఆప్ ప్రభుత్వంలో మహిళా శిశు సంక్షేమ మంత్రిగా పని చేశారు.       » దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 36,000 మంది ఓటర్లు తమ నియోజక వర్గాల్లో పోటీ చేసిన అభ్యుర్థులెవరూ నచ్చలేదని తిరస్కరించారు. పోలింగ్ శాతంలో 0.4 శాతం మంది ఓటర్లు నోటా మీట నొక్కారు.        » ముగ్గురు భాజపా అభ్యర్థులు విజయం సాధించారు. రోహిణి నియోజక వర్గం నుంచి భాజపా దిల్లీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా, ముస్తఫాబాద్ నిమోజకవర్గం నుంచి జగదీష్ ప్రధాన్, విశ్వాస్ నగర్ నియోజకవర్గం నుంచి ఓం ప్రకాష్ శర్మ విజయం సాధించారు.       » అరవింద్ కేజ్రీవాల్ ఆగస్టు 16, 1968న హరియాణాలోని భివానీ జిల్లా సివానీలో జన్మించారు. మెకానికల్ ఇంజినీరింగ్ అభ్యసించారు. ఐఆర్ఎస్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. ఆదాయపు పన్నుశాఖలో పనిచేస్తూ సామాజిక అంశాలపైనా, సహ చట్టం విస్తృతి కోసం పాటు పడ్డారు. అందుకు ఆయన ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసె పురస్కారాన్ని పొందారు. ఈ పురస్కారానికి వచ్చిన రూ.30 లక్షలతో మూలనిధిగా ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. 2006లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2011లో ఉద్యమ కర్త అన్నా హజారేతో కలిసి జనలోక్‌పాల్ బిల్లు కోసం పోరాడారు. 2012 నవంబరు 26న 'ఆప్‌'ను స్థాపించారు.¤ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన 'జాతీయ అల్ప సంఖ్యాక వర్గాల అభివృద్ధి, ఆర్థిక సంస్థ' (ఎన్ఎండీఎఫ్‌సీ) లో అధీకృత వాటా ధనాన్ని రూ.1500 కోట్ల నుంచి రూ.3000 కోట్లకు పెంచాలని కేంద్రం నిర్ణయించింది.¤ సునామీ వచ్చే సమయంలో ఎలా వ్యవహరించాలి అనే అంశంపై నావికా దళం లక్షద్వీప్‌లో కవాతు నిర్వహించింది.       » తూర్పు, పశ్చిమ నౌకాదళానికి చెందిన 20 యుద్ధ నౌకలు, విమానాలు దీనిలో పాలు పంచుకున్నాయి. హిందూ మహా సముద్రంలోని దాదాపు 8000 చదరపు మైళ్లలో కవరత్తి, కల్పేని, ఆండ్రోత్, అగ్గటి ప్రాంతాల్లో దీన్ని చేపట్టారు. భారీ సునామీ ద్వీపాన్ని తాకినప్పుడు భారీ విధ్వంసం జరిగి, ప్రధాన సేవలకు అంతరాయం ఏర్పడితే ఎలా స్పందిస్తారో కవాతు చేశారు. ఇప్పటి వరకు చేపట్టిన కవాతుల్లో ఇదే అతి పెద్దది. 
ఫిబ్రవరి - 13 
¤ బెంగళూరు సమీపంలోని ఆనేకల్ శివార్లలో బెంగళూరు-ఎర్నాకుళం (12677) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో 9 మంది మరణించారు.¤ దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉద్యానోత్సవం - 2015ను ప్రారంభించారు. మార్చి 15 వరకు ఈ ఉద్యానవనాన్ని ప్రజలు సందర్శించవచ్చు.¤ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్‌ను నియమించారు. మరో ఆరుగురిని (మనీష్ సిసోడియా, ఆసిం అహ్మద్‌ఖాన్, సందీప్ కుమార్, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, జితేంద్రసింగ్ తోమర్) కేజ్రీవాల్ సలహా మేరకు మంత్రులుగా నియమించారు.       » వీరంతా ప్రమాణ స్వీకరణ చేసిన నాటి నుంచి అధికారంలోకి వస్తారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.¤ అధికార వికేంద్రీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడగు వేసింది. కేంద్ర ప్రజాపనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) ప్రాంతీయ కార్యాలయాలకు మరింత అధికారం కల్పించింది. దీనిలో భాగంగా రూ.200 కోట్ల మేర వ్యయంతో చేపట్టే పనుల టెండర్లను ఆమోదించడం, అనుమతులు ఇచ్చే అధికారాన్ని ఇక మీదట సీపీడబ్ల్యూడీ ప్రాంతీయ కార్యాలయాలకే అప్పజెప్పారు.¤ వివాదాస్పద చిత్రం 'ఎమ్ఎస్‌జీ ది మెసెంజర్' నిరసనల మధ్య దేశ వ్యాప్తంగా విడుదలైంది.       » ఈ చిత్రాన్ని నిషేధించాలని పంజాబ్‌లోని అధికార శిరోమణి అకాలీదళ్ కేంద్రాన్ని కోరింది. చిత్రంలోని 'డేరా సచ్ఛా సౌదా' అధినేత గుర్మీత్ రాం రహీమ్ సింగ్ పాత్ర మతపరమైన అలజడికి కారణమౌతోందని ఆరోపించింది.¤ ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో దేశవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ బారిన పడి 70 మంది మరణించారని, దీంతో ఈ సంవత్సరం స్వైన్‌ఫ్లూ మరణాల సంఖ్య 485కు చేరుకుందని కేంద్రం వెల్లడించింది.       » ఈ ఏడాది ఫిబ్రవరి 12 వరకు 6,298 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం అత్యధికంగా రాజస్థాన్‌లో 1631 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా, వీరిలో 130 మంది మరణించారు. గుజరాత్‌లో 1233 మంది ఈ జబ్బు బారిన పడగా 117 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్‌లో 56, మహారాష్ట్రలో 51, దిల్లీలో ఆరుగురు మరణించారు.       » తెలంగాణలో 969 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా 45 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో అయిదుగురు మరణించారు.       » దేశంలో స్వైన్‌ఫ్లూ మూలంగా 2009లో 981 మంది, 2010లో 1763 మంది, 2011లో 75 మంది, 2012లో 405 మంది, 2013లో 699 మంది, 2014లో 218 మంది మరణించారు. 
ఫిబ్రవరి - 14 
¤ పుణెకు సమీపంలోని ఛకాన్ వద్ద జీఈ సంస్థ ఏర్పాటు చేసిన తయారీ కర్మాగారాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. పెట్టుబడిదారులకు మరిన్ని సంస్కరణలను అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.       » ముంబయి హైకోర్టు ప్రాంగణంలో ప్రధాని 'జ్యుడీషియల్ మ్యూజియం'ను ప్రారంభించారు. అందులో మహాత్మాగాంధీ, మహమ్మద్ అలీ జిన్నా, బి.ఆర్.అంబేడ్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, కె.ఎం.మున్షీ, జస్టిస్ ఎం.సి.ఛగా తదితర ప్రముఖుల బారిస్టర్ సర్టిఫికెట్లను ఈ ప్రదర్శనశాలలో ఉంచారు. వీటితో పాటు విద్యుత్ వసతిలేని రోజుల్లో కోర్టు గదుల్లో ఉపయోగించిన క్యాండిల్ స్టాండ్లు, సిరాబుడ్డీలు, పేపర్ వెయిట్లు, వెండి దండం తదితరాలు ఉన్నాయి. 150 ఏళ్ల నాటి హైకోర్టు సుసంపన్న చరిత్రకు ఈ ప్రదర్శనశాల అద్దం పట్టింది. 1864లో ముంబయి కోటను కూల్చివేసిన తర్వాత సేకరించి పెట్టిన ఫిరంగి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.¤ మొదటి బొగ్గు గనుల వేలంలో జీఎంఆర్, రిలయన్స్ సిమెంట్‌లు తలొక బ్లాకును దక్కించుకున్నాయి.       » సెప్టెంబరు 2014లో 204 గనుల కేటాయింపును సుప్రీం కోర్టు రద్దుచేసిన తర్వాత బొగ్గు బ్లాకులను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేలం ద్వారా వచ్చిన నిధులను తూర్పు రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.       » ఒడిశాలోని తాలబిరా-1 బొగ్గు బ్లాకును జీఎంఆర్ ఛత్తీస్‌గఢ్ ఎనర్జీ రూ.1375 కోట్ల బిడ్‌తో గెలుచుకుంది.       » అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ సిమెంట్ మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాకు చెందిన సియాల్ ఘోఘ్ని గనిని సొంతం చేసుకుంది. దీనికి రూ. 798 కోట్ల బిడ్‌ను సమర్పించింది.¤ దిల్లీలోని రాంలీలా మైదానంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.       » మనీష్ సిసోడియా ఉపముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.దిల్లీ నూతన మంత్రి మండలి అరవింద్ కేజ్రీవాల్: ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా: ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, విద్య, రెవెన్యూ సర్వీసులు, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, ఐటీ, పరిపాలన సంస్కరణలు, పట్టణాభివృద్ధి భూములు, భవనాలు, విజిలెన్సులతో పాటు ఇతరులకు కేటాయించని శాఖలు జితేంద్ర సింగ్ తోమార్: హోం, న్యాయ, పర్యటకం, కళలు, సాంస్కృతిక శాఖలు సందీప్ కుమార్: మహిళా, శిశు సంక్షేమం, సామాజిక సంక్షేమం, భాషలు, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి శాఖలు గోపాల్‌రాయ్: ఉద్యోగిత, అభివృద్ధి, కార్మిక, సాధారణ పరిపాలన శాఖలు ఆసిం అహ్మద్ ఖాన్: ఆహార, పౌర సరఫరాలు, అటవీ, పర్యవరణం, ఎన్నికల శాఖలు సత్యేంద్ర జైన్: విద్య, ఆరోగ్య, పరిశ్రమలు, గురుద్వారా నిర్వహణ, ప్రజాపనులు, నీటి పారుదల, వరద నియంత్రణ శాఖలు మంత్రుల్లో సత్యేంద్ర జైన్ అత్యంత పెద్ద వయస్కుడు (50 ఏళ్లు), అతి చిన్న వయస్కుడు సందీప్‌కుమార్ (34 ఏళ్లు).దిల్లీ ముఖ్యమంత్రులు1. చౌధరి బ్రహ్మ ప్రకాష్ (కాంగ్రెస్) : 1952 మార్చి 17 - 1955 ఫిబ్రవరి 122. జి.ఎన్.సింగ్ (కాంగ్రెస్) : 1955 ఫిబ్రవరి 12 - 1956 నవంబరు 11956 - 1993 వరకు దిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది.3. మదన్‌లాల్ ఖురానా (భాజపా): 1993 డిసెంబరు 2 - 1996 ఫిబ్రవరి 264. సాహెబ్ సింగ్ వర్మ (భాజపా): 1996 ఫిబ్రవరి 26 - 1998 అక్టోబరు 125. సుష్మాస్వరాజ్ (భాజపా): 1998 అక్టోబరు 12 - 1998 డిసెంబరు 36. షీలా దీక్షిత్ (కాంగ్రెస్): 1998 డిసెంబరు 3 - 2013 డిసెంబరు 287. అరవింద్ కేజ్రీవాల్ (ఆప్): 2013 డిసెంబరు 28 - 2014 ఫిబ్రవరి 14రాష్ట్రపతి పాలన: 2014 ఫిబ్రవరి 14 - 2015 ఫిబ్రవరి 148. అరవింద్ కేజ్రీవాల్ (ఆప్): 2015 ఫిబ్రవరి 14న ప్రమాణ స్వీకారం 
ఫిబ్రవరి - 15
¤ అవినీతి నిరోధక కేంద్ర నిఘా సంఘం (సీవీసీ)లో గతేడాది 63,288 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈ సారి 79 శాతం కేసులు పెరిగాయి.       » సీవీసీకి నాలుగు నెలలుగా ప్రధాన అధిపతి లేకపోయినప్పటికీ రికార్డు స్థాయిలో 5,743 కేసులు విచారణ చేపట్టినట్లు సీవీసీ వెల్లడించింది.
సంవత్సరం
మొత్తం కేసులు
విచారించిన కేసులు
2013
37,037
4,801
2012
16,929
5,720
2011
16,260
5,341
       » కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) మాజీ డైరెక్టర్ జనరల్ రాజీవ్ సీవీసీ కి తాత్కాలిక అధిపతిగా కొనసాగుతున్నారు. 
ఫిబ్రవరి - 17 
¤ ఇండోర్ లోని విజయనగర్‌లో ఉన్న 'ప్రెస్టీజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్' కళశాలకు చెందిన 401 మంది విద్యార్థులు మానవహారంగా ఏర్పడి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఎత్తు ఆధారంగా అవరోహణ క్రమంలో నిల్చుని వారు ఈ రికార్డు నెలకొల్పారు.       » 2013 మార్చి 21న 311 మంది పోలీష్ బ్యాంకు ఉద్యోగులు మానవహారంగా ఏర్పడి సృష్టించిన రికార్డును వీరు తిరగరాశారు.¤ ఏటా 2.5 - 7 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే విమానాశ్రయాల్లో, విమానాశ్రయ సేవల నాణ్యతకు సంబంధించి, ప్రపంచంలోనే దిల్లీలోని 'ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐఐజీ)' అగ్రస్థానంలో నిలిచింది.       » జెనీవాకు చెందిన ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఐసిఐ), ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ఏఎస్‌క్యూ)కి సంబంధించి 2014 సంవత్సరానికి ప్రకటించిన జాబితాలో దిల్లీ మొదటి స్థానంలో, ముంబయి అయిదో స్థానంలో ఉన్నాయి.       » దిల్లీ విమానశ్రయాన్ని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), జీఎంఆర్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.        » ఏడాదికి 50 లక్షలు నుంచి 1.5 కోట్ల ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం ఉన్న విమానశ్రయాల్లో ప్రపంచంలో మూడో అత్యుత్తమ విమానాశ్రయంగా శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అవార్డు లభించింది. (ఈ అవార్డు లభించడం వరుసగా ఇది ఆరోసారి) 
ఫిబ్రవరి - 18 
¤ బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో పదో అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన 'ఏరో ఇండియా 2015'ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ వైమానిక ప్రదర్శన అయిదు రోజులపాటు కొనసాగనుంది.       » రక్షణ రంగానికి అవసరమైన నైపుణ్యం, మానవ వనరుల సృష్టికి విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు.       » 'ప్రపంచంలో కెల్లా రక్షణ పరికరాలు, వ్యవస్థల్ని అత్యధికంగా 60% మేర దిగుమతి చేసుకునే దేశంగా భారత్‌కు పేరుంది. ఈ నేపథ్యంలో రక్షణ రంగంలో స్వావలంబన సాధన దిశగా బలమైన అడుగులు వేయాలి' అని ప్రధాని పిలుపునిచ్చారు. రక్షణ రంగ ఉత్పత్తుల నమూనాల తయారీకి కేంద్రం 80% వరుకు నిధుల్ని సమకూర్చే విధానాన్ని త్వరలో ప్రవేశపెడతామని ఆయన పేర్కొన్నారు.¤ పట్టణాభివృద్ధిలో ప్రణాళికల రూపకల్పన నుంచి అమలు వరకు ప్రతిస్థాయిలో పౌరులకు అధిక భాగస్వామ్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే లక్ష్యంతో 'నూతన పట్టణ, ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, ఆచరణ మార్గదర్శకాలను రూపొందించింది. వీటిని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు దిల్లీలో విడుదల చేశారు.
ఫిబ్రవరి - 19
¤ రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్‌లో 'భూసార కార్డు పథకం'ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.       » ఎక్కువ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఎక్కువ ఎరువులను, నీటిని వాడటం వల్ల భూ సారం నాశనమైందని, అందువల్లే భూసార పరీక్షా కార్డు పథకాన్ని ప్రారంభించామని ప్రధాని పేర్కొన్నారు. ఎరువులను సమతౌల్యంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో వచ్చే మూడేళ్లలో 14 కోట్ల మంది రైతులకు భూసార కార్డులు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఏ పంటకు ఏ ఎరువు అవసరమో కార్డులో వివరంగా సిఫార్సు చేస్తారు.¤ భారత నౌకాదళాన్ని బలోపేతం చేసేలా రూ.లక్ష కోట్ల వ్యయంతో దేశీయంగా జలాంతర్గాములను నిర్మింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.       » 24 జలాంతర్గాముల నిర్మాణానికి 30 ఏళ్ల కార్యక్రమాన్ని 1999లో ఆమోదించారు. దీనిలో భాగంగా పి-75 పేరుతో తొలిదశలో ఆరు జలాంతర్గాముల నిర్మాణానికి ప్రభుత్వం గతేడాది ఆమోదం తెలిపింది. మరో ఆరింటిని నిర్మింపజేయడానికి వచ్చే నెలలో 'ప్రతిపాదనకు అభ్యర్థన (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ - ఆర్.ఎఫ్.పి)' జారీ చేస్తారు. సంప్రదాయ ఇంధనాలకు భిన్నంగా అణు ఇంధనంతో నడిచేలా వీటిని తీర్చిదిద్దుతారు. అదే విధంగా గోప్యంగా వ్యవహారాన్ని చక్కబెట్టే నాలుగు యుద్ధ నౌకల్ని ముంబయిలోని మజిగావ్ డాక్స్‌లో, మూడింటిని కోల్‌కత లోని గార్డెన్ రీచ్ నౌకా నిర్మాణ కేంద్రంలో నిర్మింపజేస్తారు. 
ఫిబ్రవరి - 20 
¤ బిహార్ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ శాసనసభ బలపరీక్షలో ఓటమి తప్పదని గ్రహించి తన పదవికి రాజీనామా చేశారు.       » జేడీయూ నేత, మాజీ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరుతూ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీని కలిశారు.¤ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన బంద్‌గలా నీలం రంగు సూటును వేలంలో సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి లాల్జీపటేల్, ఆయన కుమారుడు రూ.4.31 కోట్లకు సొంతం చేసుకున్నారు.       » ఈ సూటును సూరత్‌లో ఫిబ్రవరి 18 నుంచి వేలానికి పెట్టారు. దీంతో పాటు ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు వచ్చిన సుమారు 455 బహుమతులను కూడా వేలానికి పెట్టారు.       » మొత్తం మూడు రోజులపాటు జరిగిన ఈ వేలంలో సూటుతో కలిపి అన్ని వస్తువులకు సుమారు రూ.8.33 కోట్లు వచ్చాయి.¤ ఇటానగర్‌లో నిర్వహించిన అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్ర దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొని ప్రసంగించారు. ఈశాన్య రాష్ట్రాల్లో కొత్తగా ఆరు వ్యవసాయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తామని ప్రధాని ప్రకటించారు. 18 ఎఫ్ఎం ఛానళ్లను కూడా ప్రారంభిస్తామని తెలిపారు.       » నాగర్ లగూన్ (అరుణాచల్‌ప్రదేశ్) - హర్‌ముటి (అసోం) మధ్య ఏర్పాటు చేసిన బ్రాడ్‌గేజ్ రైల్వే మార్గాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు. దీంతో, అరుణాచల్‌ప్రదేశ్ భారత రైల్వే మ్యాప్‌లోకి లాంఛనంగా వచ్చినట్లయింది. తర్వాత ఓ విద్యుత్ పథకానికి శంకుస్థాపన చేశారు. అరుణాచల్‌లో రైలు ప్రాజెక్టులకు రూ.4,200 కోట్లు, విద్యుత్ ప్రసార పథకానికి రూ.3,200 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.       » దేశంలో ప్రజలు ఒకరినొకరు 'జై హింద్' అంటూ పలకరించుకునే సంప్రదాయం ఒక్క అరుణాచల్‌ప్రదేశ్‌లో మాత్రమే ఉందనీ, ఈ రాష్ట్ర ప్రజల దేశభక్తికి తన జోహార్లని మోదీ ప్రశంసించారు.       » ప్రధాని ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ పట్టణ రైల్వేస్టేషన్‌కు ప్రారంభోత్సవం చేసి, 'హజారీ బాగ్ - కోడెర్మా' రైలును ప్రారంభించారు. 
ఫిబ్రవరి - 21 
¤ విదేశాల్లో నివసిస్తున్న భారత పౌరులు దౌత్య కార్యాలయాలపరంగా ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఈ-పోర్టల్‌ను ప్రారంభించింది. దీనికి 'మదత్ (చేయూత)' అని పేరు పెట్టింది.       » దౌత్య కార్యాలయాలపరంగా సమస్యలను ఎదుర్కొనేవారు వాటిని ఇక ఆన్‌లైన్‌లోనే నమోదు చేయవచ్చు. అత్యధిక జవాబుదారి తనంతో ఆయా ఫిర్యాదులను సత్వరం పరిష్కరిచేందుకు 'మదత్' పోర్టల్ సాయపడుతుంది.       » భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ దిల్లీలో ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. 
ఫిబ్రవరి - 22
¤ బిహార్ నూతన ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ (63 సంవత్సరాలు) ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన సీఎం పదవిని చేపట్టడం ఇది నాలుగోసారి.       » పట్నాలోని రాజ్‌భవన్‌లో నితీష్‌తో పాటు 22 మంది మంత్రులతో గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీ ప్రమాణం చేయించారు.       » నితీష్ కుమార్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ ఓటమికి బాధ్యత వహిస్తూ బిహార్ సీఎం పదవి నుంచి 2014 మే 17న వైదొలిగారు. ఆ తర్వాత మే 20న జీతన్‌రామ్ మాంఝీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎనిమిది నెలల తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు మాంఝీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని నితీష్‌పై ఒత్తిడి తీసుకురావడంతో మాంఝీ ఇటీవల రాజీనామా చేశారు.¤ ఆకాశవాణి ద్వారా 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. త్వరలో పరీక్షలు రాయబోతున్న పదోతరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో భయాన్ని పోగోట్టేందుకు, మానసిక స్థైర్యాన్ని నింపడానికి ఆయన తన ప్రసంగంలో ఓ నిపుణుడిలా ప్రయత్నించారు.
ఫిబ్రవరి - 23
¤ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం కొలువు దీరాక 9 నెలల కాలంలో ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ పథకాలను, కార్యక్రమాలను, విధానాలను గంటపాటు సాగిన 18 పేజీల ప్రసంగ పాఠంలో రాష్ట్రపతి వివరించారు.ముఖ్యాంశాలు:      » 'అందరితో కలిసి...అందరి అభివృద్ధి' అనేది తన ప్రభుత్వ ప్రాథమిక సూత్రమని రైతులు, కుటుంబాల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది.      » విలువ ఆధారిత వ్యవసాయం అవసరం. మార్కెట్ సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం అవసరం.      » తాజా అంచనాల ప్రకారం మన స్థూల జాతీయోత్పత్తి 7.4 శాతం వృద్ధిరేటుతో ఉంది. ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది.      » 'ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం' ద్వారా రూ.11వేల కోట్లు జమ అయ్యాయి. ఈ అనూహ్య లక్ష్యాన్ని ఆరు నెలల కంటే తక్కువ కాలంలోనే సాధించాం. ఇలాంటి కార్యక్రమాల్లో ఇది ప్రపంచంలోనే పెద్దది.      » ప్రభుత్వం అమలు చేస్తున్న నగదు బదిలీ కార్యక్రమం కూడా ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం.      » 2022 నాటికి అందరికీ గృహవసతి కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. గృహనిర్మాణ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని ప్రభుత్వం సరళీకరించింది.      » పాఠశాల విద్యకు ప్రాధాన్యత. పాఠశాలలులేని ఆవాసాలను జీఐఎస్ పరిజ్ఞానంతో గుర్తించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఉపాధ్యాయుల సామర్థ్యాలను పెంచడానికి 'పండిట్ మదన్‌మోహన్ మాలవ్య' కార్యక్రమాన్ని ప్రారంభించింది.      » దేశంలో అత్యధికంగా ఉన్న యువశక్తిని ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం కొత్తగా నైపుణ్యాభివృద్ధి మంత్రత్వ శాఖను ఏర్పాటు చేసింది. నైపుణ్య భారత్‌లో భాగంగా 'దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన'ను ప్రకటించింది.      » భారత్‌ను సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత మార్పునకు సంసిద్ధం చేయడానికి 'డిజిటల్ ఇండియా' కార్యక్రమానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది.      » వ్యాపార ప్రక్రియలను సరళతరం చేయడానికి ప్రభుత్వం ముఖ్యమైన చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న నిబంధనలను సరళీకరించడం, హేతుబద్ధీకరించడం జరిగింది. అనుమతులకు 'ఏక గవాక్ష' పద్ధతిని అమల్లోకి తెచ్చాం. ఇందుకోసమే ప్రభుత్వం 'ఈబిజ్' వెబ్‌సైట్‌ను రూపొందించింది.      » భారత్‌ను తయారీ కేంద్రంగా మలచడానికి 'భారత్‌లో తయారీ' (మేక్ఇన్ ఇండియా) కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.      » గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన, సమగ్ర విద్యుత్ అభివృద్ధి పథకాలను ప్రారంభించాం.      » పట్టణ ప్రాంతాల్లో ఆధునిక సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించడానికి 'స్మార్ట్ నగరాల' ప్రాజెక్టును చేపట్టాం.¤ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగం అనంతరం కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ లోక్‌సభ ఆమోదం కోసం భూసేకరణ, బీమా రంగంలో ఎఫ్‌డీఐలు, బొగ్గు వేలం, ఇ-రిక్షాలు, గనులు- ఖనిజాలు, పౌరసత్వ సవరణకు సంబంధించిన ఆరు ఆర్డినెన్స్‌లను సభలో ప్రవేశపెట్టారు. ఈ ఆర్డినెన్స్‌ల కాలపరిమితి మార్చి 20 నాటికి ముగియనుంది.
ఫిబ్రవరి - 24
¤ కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటాను ఎప్పుడూ లేని విధంగా గణనీయంగా పది శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.      » కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా గతంలో 32 శాతం ఉండగా 42 శాతానికి పెంచాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ వై.వి.రెడ్డి నేతృత్వంలోని 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సును కేంద్రం ఆమోదించింది.      » తాజా నిర్ణయం ప్రకారం రాష్ట్రాలకు కేంద్రం 2015-16లో అదనంగా రూ.1.78 లక్షల కోట్లు ఇవ్వనుంది. అయితే రాష్ట్రాలకు గ్రాంట్లు సిఫార్సు చేసే విషయంలో ఈ ఆర్థిక సంఘం ప్రణాళిక, ప్రణాళికేతర అనే వర్గీకరణను పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్రాల మొత్తం ఆదాయ వ్యయ అవసరాలను పరిగణనలోకి తీసుకుంది.      » విభజన కారణంగా ఆదాయలోటు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు గ్రాంట్ మంజూరు చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. దీని ప్రకారం ఏపీకి 2015 నుంచి 2020 వరకు దక్కే మొత్తం రూ.22,113 కోట్లు.      » ఆదాయ లోటు ఏర్పడిన మరో పది రాష్ట్రాలకు గ్రాంట్ మంజూరు చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. 2015-16 కాలంలో మొత్తం 11 రాష్ట్రాలకు దక్కే మొత్తం రూ.48,906 కోట్లు. 2020 వరకు రూ.1.94 లక్షల కోట్లకు పైనే ఉంటుంది.      » రెవెన్యూ లోటు భర్తీకి 11 రాష్ట్రాలకు కేంద్ర సాయం 2015-20 కాలానికి ఈ విధంగా ఉంది. జమ్మూకశ్మీర్ రూ.59,666 కోట్లు; హిమాచల్ ప్రదేశ్ రూ.40,626 కోట్లు; ఆంధ్రప్రదేశ్ రూ.22,113 కోట్లు; నాగాలాండ్ రూ.18,475 కోట్లు; మిజోరాం రూ.12,183 కోట్లు; పశ్చిమబంగ రూ.11,760 కోట్లు; మణిపూర్ రూ.10,227 కోట్లు; కేరళ రూ.9,519 కోట్లు; త్రిపుర రూ.5,103 కోట్లు; అసోం రూ.3,379 కోట్లు; మేఘాలయ రూ.1170 కోట్లు.      » విపత్తు నిర్వహణ కింద అయిదేళ్లకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,429 కోట్లు, తెలంగాణకు రూ.1364 కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది.      » 2015-16 నుంచి 2019-20 వరకు రాష్ట్రాలకు గ్రాంటు కింద రూ.5,37,354 కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో స్థానిక సంస్థలకు రూ.2,87,436 కోట్లు, ప్రకృతి విపత్తుల నిర్వహణకు రూ.55,097 కోట్లు, ఆదాయ లోటు ఉన్న 11 రాష్ట్రాలకు రూ.1,94,821 కోట్లు కలిపి ఉన్నాయి.      » 14వ ఆర్థిక సంఘం నివేదికను ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాకు సంబంధించి ఇది రికార్డు స్థాయి పెంపు. గతంలో ఈ పెంపు 1-2 శాతమే ఉండేది. 2015-16లో కేంద్రం నుంచి రాష్ట్రాలకు సంప్రాప్తించే మొత్తం నిధులు రూ.5.26 లక్షల కోట్లు. 2014-15లో ఈ మొత్తం రూ.3.48 లక్షల కోట్లు ఉంది. అంటే 1.78 లక్షల కోట్లు పెరిగింది. 2019-20 వరకు మొత్తం అయిదేళ్లలో సంప్రాప్తించే మొత్తం నిధులు రూ.39.48 లక్షల కోట్లు. అయిదేళ్ల కాలానికి పంచాయతీలు, పురపాలక సంఘాలకు రూ.2.87 లక్షల కోట్ల గ్రాంటును ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది.      » 2015-16 ఏడాదికి ద్రవ్యలోటు లక్ష్యం 3.6 శాతంగా ఉండాలని, తర్వాతి సంవత్సరాల్లో 3 శాతంగా ఉండాలని ఆర్థిక సంఘం సూచించింది.      » వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అంశంపైనా ఆర్థిక సంఘం సూచనలు చేసింది. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత మొదటి మూడేళ్లూ రాష్ట్రాలకు 100 శాతం పరిహారం చెల్లించాలని, నాలుగో ఏడాది 75 శాతం, చివరిదైన అయిదో ఏడాది 50 శాతం పరిహారం చెల్లించాలని సూచించింది.      » కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి కూడా ఆర్థిక సంఘం సిఫార్సులు చేసింది. పన్నుల వాటా అధిక పెంపును దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలకు బదిలీ చేయడానికి 30 పథకాలను గుర్తించింది. అయితే ఆయా పథకాల ప్రాముఖ్యాన్ని న్యాయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని 8 పథకాలను మాత్రమే కేంద్రం పరిధి నుంచి తప్పిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.      » 1971 నాటి జనాభాను, అప్పటి నుంచి జనాభాలో వచ్చిన మార్పులను, ఆదాయ వ్యత్యాసాలను, అటవీ విస్తీర్ణం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ 42 శాతం వాటాలో 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు కేటాయింపులు జరిపింది.      » రాష్ట్రాలకు కేటాయించిన మొత్తంలో ఆంధ్రప్రదేశ్‌కు 4.305 శాతం, తెలంగాణకు 2.437 శాతం వాటాగా ఆర్థిక సంఘం నిర్ణయించింది. అలాగే సేవా పన్ను (సర్వీస్ ట్యాక్స్) లో ఏపీ వాటా 4.398 శాతంగా, తెలంగాణ వాటా 2.499 శాతంగా నిర్ధారించింది. వీటికి అదనంగా స్థానిక సంస్థలకు గ్రాంట్లను కూడా సిఫార్సు చేసింది.      » పన్నుల్లో వాటాతో పాటు స్థానిక సంస్థలకు గ్రాంట్ల రూపంలో కేంద్రం ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ స్థానిక సంస్థలకు 2015-20 వరకు మొత్తం రూ.7,788.68 కోట్లు, పట్టణ, స్థానిక సంస్థలకు రూ.2,908.64 కోట్లు ఇవ్వాలని సూచించింది. అదే సమయంలో తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.4,837.75 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.2,711.12 కోట్లు చొప్పున కేటాయించాలని సిఫార్సు చేసింది. వీటితో పాటు పనితీరు ఆధారిత గ్రాంట్లను కూడా స్థానిక సంస్థలకే కేటాయించాలని చెప్పింది. ఆ ప్రకారం ఏపీలోని గ్రామీణ స్థానిక సంస్థలకు అయిదేళ్ల పాటు రూ.865.41 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.727.16 కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది. అదే రీతిలో తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.537.53 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.677.78 కోట్లు ఇవ్వాలని సూచించింది.      » ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటు భర్తీ కోసం అయిదేళ్ల పాటు గ్రాంట్లను ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. దీనిలో భాగంగా ఏపీకి మొత్తం రూ.22,113 కోట్లు కేటాయించింది. 2015-16లో రూ.6,609 కోట్లు, రెండో సంవత్సరంలో రూ.4,930 కోట్లు, మూడో సంవత్సరంలో రూ.4,431 కోట్లు, నాలుగో సంవత్సరంలో రూ.3,644 కోట్లు, అయిదో సంవత్సరంలో రూ.2,499 కోట్లు చొప్పున కేటాయించాలని సిఫార్సు చేసింది. తెలంగాణకు రెవెన్యూ లోటు లేనందున ఈ జాబితాలో చోటు కల్పించలేదు.      » ఆర్థిక సంఘం తన నివేదికలో కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటాను రూ.1,69,969 కోట్లుగా పేర్కొంది. 2015-16 సంవత్సరంలో రూ.24,938 కోట్లు, 2016-17లో రూ.28,776 కోట్లు, 2017-18లో రూ.33,248 కోట్లు, 2018-19లో రూ.38,462 కోట్లు, 2019-20లో రూ.44,546 కోట్లుగా పేర్కొంది. అన్ని రాష్ట్రాలకు కేటాయించిన రూ.39,48,186 కోట్ల మొత్తంలో ఇది 4.305 శాతానికి సమానం.      » ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 - 05 నుంచి 2012 - 13 వరకు వచ్చిన ఆదాయం, వ్యయం ఆధారంగా రెండు రాష్ట్రాలకు మధ్య వనరుల పంపిణీ చేసినట్లు 14వ ఆర్థిక సంఘం పేర్కొంది. ఈ ఆర్థిక సంఘం పని చేస్తుండగానే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగింది. దీంతో కాగ్ అధికారులతోనూ, రెండు రాష్ట్రాల ఆర్థిక శాఖ అధికారులతోనూ పలు దఫాలు చర్చించిన ఆర్థిక సంఘం 2004-13 వరకు ఆదాయ వ్యయాలను పరిగణనలోకి తీసుకుంది. ప్రతి పనికి చేసిన ఖర్చును తీసుకుని ప్రాంతాల వారీగా లెక్క గట్టింది. వ్యాట్, ఎక్సైజ్ పన్నులను హైదరాబాద్ అర్బన్, రంగారెడ్డి జిల్లా మినహా ఏ ప్రాంతంలోనివి ఆ ప్రాంతానికి పరిగణనలోకి తీసుకుంది. దీని ఆధారంగా సొంత ఆదాయం, వ్యయాలను లెక్కించింది.వచ్చే అయిదేళ్లలో ఏపీ ఆదాయం, వ్యయాల (రూ.కోట్లలో) అంచనా చిత్రం
వచ్చే అయిదేళ్లలో తెలంగాణ ఆదాయం, వ్యయాల (రూ.కోట్లలో) అంచనా చిత్రం
వచ్చే ఐదేళ్లలో పన్నులు, జీఎస్‌డీపీ నిష్పత్తి అంచనా (శాతంలో)
రాష్ట్రం2015-162016-172017-18
2018-19
2019-20
ఆంధ్రప్రదేశ్7.988.28.318.368.41
తెలంగాణ9.9910.0610.12 10.1910.26
      » కేంద్రానికి లభించే పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం వాటా కేటాయించాలంటూ చరిత్రాత్మక సిఫార్సు చేసిన 14వ ఆర్థిక సంఘానికి నేతృత్వం వహించిన డాక్టర్ యాగ వేణుగోపాల్‌ రెడ్డి తెలుగు వ్యక్తి. ఆగస్టు 17, 1941న కడపలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళిక, ఆర్థికశాఖ కార్యదర్శిగా, కేంద్ర ప్రభుత్వంలో ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేశారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి నిపుణుల ప్యానెల్ సభ్యుడిగా, ప్రపంచ బ్యాంకు కార్యనిర్వాహక డైరెక్టర్ సలహాదారుగా సేవలందించారు. 2003 నుంచి 2008 వరకూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2010లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని పొందారు. 2013 జనవరి 2న 14వ ఆర్థికసంఘం ఛైర్మన్‌గా వై.వి.రెడ్డి బాధ్యతలు చేపట్టారు.
14వ ఆర్థిక సంఘం సభ్యులు: సుష్మానాథ్, (కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి), డాక్టర్ ఎం.గోవిందరావు (జాతీయ ప్రజా ఆర్థిక, విధాన జాతీయ సంస్థ డైరెక్టర్), డాక్టర్ సుదీప్తో ముండ్లే (జాతీయ గణాంక కమిషన్ మాజీ యాక్టింగ్ ఛైర్మన్) కార్యదర్శిగా అజయ్ నారాయణ్ ఝా, పార్ట్ టైం సభ్యుడిగా ప్రొఫెసర్ అభిజిత్ సేన్ ఉన్నారు.¤ వేలం పాట విధానంలో గనులను కేటాయించడానికి వీలుగా చట్ట సవరణకు ఉద్దేశించిన బిల్లును ప్రతిపక్షాల నిరసనల నడుమ ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.¤ కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బీరేంద్రసింగ్ లోక్‌సభలో భూసేకరణ బిల్లును ప్రవేశపెట్టారు. విపక్షాలు (దాదాపు సగం) సభ నుంచి వాకౌట్ చేశాయి. రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించే ఈ బిల్లుకు మద్దతు ఇవ్వమని భాజపా స్వపక్షం శివసేన కూడా వ్యతిరేకత వ్యక్తం చేసింది.¤ ఈ ఏడాది ఆరంభం నుంచి ఫిబ్రవరి 23 వరకు స్వైన్‌ఫ్లూతో దేశవ్యాప్తంగా 875 మంది మృతి చెందినట్లు కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించింది. మొత్తం 15,413 మంది ఈ వ్యాధి బారినపడ్డారు.
ఫిబ్రవరి - 25 
¤ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన రెండు ముఖ్య హామీలను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిలబెట్టుకున్నారు. నెలకు 400 యూనిట్లలోపు వాడుకునే విద్యుత్తు వినియోగదారులకు 50 శాతం రుసుమును తగ్గించడంతో పాటు ప్రతి ఇంటికీ నెలకు 20,000 లీటర్ల ఉచిత నీటి సరఫరాను మార్చి 1 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు.¤ ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటైన 'నీతి ఆయోగ్' పాలక మండలిలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సభ్యుడయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.¤ జాతీయ సౌరశక్తి పథకం కింద ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో 15,000 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిర్మాణం పూర్తయ్యాక, ఈ ప్రాజెక్టులను గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. 3 విడతల్లో జరిగే ఈ పనులను ఎన్‌టీపీసీకి చెందిన విద్యుత్ వ్యాపార నిగమ్ (ఎన్‌వీవీఎన్) పర్యవేక్షిస్తుంది.¤ అయిదు దేశాల (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) భాగస్వామ్యంతో ఏర్పాటు చేయతలపెట్టిన బ్రిక్స్ బ్యాంక్ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.      » మౌలిక సదుపాయాల కల్పనకు, వర్ధమాన దేశాలు చెల్లింపు సంక్షోభాన్ని ఎదుర్కొంటే స్వల్పకాలిక రుణాలు అందించేందుకు ఈ బ్యాంకును ఉద్దేశించారు.      » 100 బిలియన్ డాలర్ల (రూ.6 లక్షల కోట్లు) నిధితో ఏర్పాటయ్యే ఈ బ్యాంకును న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ)గా పేర్కొంటున్నారు.      » ఈ బ్యాంక్ అధ్యక్ష బాధ్యత తొలి ఆరేళ్లు భారత్‌కు ఉంటుంది.      » చైనా ఆర్థిక కేంద్రమైన షాంఘై కేంద్రంగా ఈ బ్యాంక్ పని చేస్తుంది. ¤ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న స్వచ్ఛభారత్ కార్యక్రమ అమలుకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు పది రాష్ట్రాలకు 2014-15కి రూ.459.93 కోట్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.      » మొత్తం నిధుల్లో రూ.310.10 కోట్లను మరుగుదొడ్ల నిర్మాణానికి ఉద్దేశించి మంజూరు చేశారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా 2018 నాటికి పట్టణ ప్రాంతాల్లో 1.04 కోట్ల వ్యక్తిగత సామాజిక మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 7.93 లక్షల మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.తొలి విడత నిధుల వివరాలు: మహరాష్ట్ర (రూ.135కోట్లు), కర్ణాటక (రూ.80.01 కోట్లు), పశ్చిమ బంగ (రూ.64.02 కోట్లు), గుజరాత్ (రూ.40.95 కోట్లు), ఆంధ్రప్రదేశ్ (రూ.40 కోట్లు), బిహార్ (రూ.37.72 కోట్లు), ఛత్తీస్‌గఢ్(రూ.30.79 కోట్లు), మధ్యప్రదేశ్ (రూ.18.81 కోట్లు), మణిపూర్ (రూ.11.21 కోట్లు), ఒడిశా (రూ.14.3 కోట్లు).¤ మధ్యప్రదేశ్ గవర్నర్ రాం నరేష్ యాదవ్‌ను రాజీనామా చేయాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. మధ్యప్రదేశ్ వృత్తివిద్య పరీక్షల మండలి (ఎంపీపీఈబీ) నియామకాల కుంభకోణంలో ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలైన ఒకరోజు వ్యవధిలోనే కేంద్రం ఈ చర్య తీసుకుంది. అటవీ శాఖలో గార్డులుగా నియమించడానికి అయిదుగురి పేర్లను యాదవ్ సిఫార్సు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ వివాదం నెలకొంది. ఆయన పదవీకాలం వచ్చే ఏడాది సెప్టెంబరు వరకు ఉంది.
ఫిబ్రవరి - 26
¤ పౌరసత్వ సవరణ బిల్లు 2014ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ నుంచి ఉపసంహరించుకుంది. ఈ బిల్లును గత శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టింది. దీని స్థానంలో తీసుకొచ్చే నూతన బిల్లులో భారత సంతతి ప్రజలు (పీఐవో), ఖండాతర భారత పౌరులు (ఓసీఐ) అనే రెండు వీసా విభాగాలను కలిపి ఒకే వీసా ఇచ్చే ఏర్పాట్లతో పాటు ఇతర అంశాలను చేర్చనున్నారు.¤ దేశంలో స్వైన్‌ఫ్లూ మరణాల సంఖ్య 965కి చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశ వ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ బారినపడ్డ వారిసంఖ్య 17,000 దాటిందని వెల్లడించింది.¤ ఇరాక్, సిరియాలో వరుస హత్యలు దాడులతో మారణ కాండను కొనసాగిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ, దాని అనుబంధ సంస్థలను భారత్ నిషేధించింది.      » భారత్ సహా వివిధ దేశాల యువతను ఉగ్రవాదులుగా ఆ సంస్థ నియమించుకుంటోందని, ఉగ్రవాద శిక్షణ పొందిన యువత తిరిగి దేశంలోకి ప్రవేశిస్తే జాతీయ భద్రతకే పెనుముప్పు కలుగుతుందని, అందుకే ఇస్లామిక్ స్టేట్/ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్/ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా / డైష్ ఉగ్రవాద సంస్థ, దాని అనుబంధ సంస్థలను చట్ట వ్యతిరేక కార్యలకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసినట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.¤ దేశంలోని వివిధ ట్రైబ్యునళ్లను ఒకే నిబంధనల కిందకు తీసుకొస్తూ సిఫార్సు చేసిన స్థాయీ సంఘం నివేదిక పార్లమెంటుకు చేరింది. దీని ప్రకారం ఇకపై అన్ని ట్రైబ్యునళ్లలోని ఛైర్ పర్సన్లకు, సభ్యులకు అయిదేళ్ల పదవీ కాలపరిమితితో పాటు రిటైర్‌మెంట్ వయసు, వారికిచ్చే భత్యాలు ఒకే రీతిగా ఉండనున్నాయి.

రాష్ట్రీయం 
ఫిబ్రవరి - 1
¤ నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో రహదారులు, తాగునీటి సౌకర్యం, మురుగునీటి పారుదల, ఘనవ్యర్థాల నిర్వహణ, ఉద్యాన వనాలు, వినోద కేంద్రాలు, విద్యుదీకరణ, భూగర్భ కేబుళ్లు తదితర మౌలిక సౌకర్యాలకే దాదాపు రూ.85 వేల కోట్ల వరకు ఖర్చు కానున్నట్లు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) అంచనాలు సిద్ధం చేసింది.
       » రాజధానికి అనుసంధానం చేసే ప్రధాన రహదారిని ఎనిమిది వరుసలతో 370 కిలోమీటర్ల పొడవున, ఆరు వరుసలతో 863 కిలోమీటర్ల పొడవున నిర్మించేందుకు కనీసం రూ.6,644 కోట్లు అవసరమని అంచనా వేసింది. ప్రధాన రహదారుల అనుబంధ రహదారులు నాలుగు నుంచి ఆరు వరుసల వెడల్పు ఉంటాయి. మొత్తం 2,413 కి.మీ పొడవున ఈ రోడ్లు వేసేందుకు రూ.11,395 కోట్లు కావాలి. కిలో మీటరు రోడ్డు నిర్మాణానికి రూ.3.63 కోట్లు నుంచి రూ.6.53 కోట్ల వరకు ఖర్చవుతుందని లెక్కించింది
.
       » రాజధాని ప్రాంతంలో రోజుకు 450 మిలియన్ లీటర్ల తాగునీరు అవసరమని సీఆర్‌డీఏ పేర్కొంది. తాగునీటి సరఫరా పైపులైన్లు, విద్యుదీకరణ, మురుగునీటి పారుదల, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, వరదనీటి కాలువలు నిర్మాణానికి రూ.10,208.57 కోట్లు కావాలని అంచనా వేసింది. ఘన వ్యర్థాల నిర్వహణ, వాహనాల కొనుగోలు, రవాణా, తడి-పొడి చెత్తలను వేరుచేయడం, డంపింగ్ యార్డుల కోసం రూ.308 కోట్లు అవసరమని తేల్చింది. అతిథి గృహాలు, వినోద కేంద్రాలు, వాణిజ్య భవనాలు, రహదారులు తదితర సౌకర్యాలకు మరో రూ.50 వేల కోట్లు అవసరమని భావించింది
.
       » కృష్ణా నది ప్రక్షాళన, నదిని దాటేందుకు వీలుగా ఆరు వరుసల రహదారులు, నదీతర ప్రాంత సుందరీకరణకు రూ.1186 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని సీఆర్‌డీఏ సర్కారుకు నివేదించింది.
ఫిబ్రవరి - 2 
¤ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన సౌర, పవన విద్యుత్ విధానాన్ని ఖరారు చేసింది.       » ఆంధ్రప్రదేశ్‌లో 38,500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పాదనకు అవకాశముంది. ప్రస్తుతం 127 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది.       » సౌర విద్యుత్ ఉత్పాదన లక్ష్యాలను దశలవారీగా సాధించాలని నిర్ణయించారు. 2018-19 నాటికి 5 వేల మెగావాట్లు, 2021-22 నాటికి 10 వేల మెగావాట్ల ఉత్పాదన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 619 మెగావాట్ల ఉత్పాదనకు ఇప్పటికే విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు కుదిరాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సౌర విద్యుత్ పార్కులు (2 వేల మెగావాట్లు) నెలకొల్పనున్నారు.       » వచ్చే 5 ఏళ్లలో 50 వేల వ్యవసాయ పంపు సెట్లకు సౌర ఫలకాలు అమరుస్తారు.       » ప్రభుత్వ భవనాల మీద 5 మెగావాట్ల సామర్థ్యం, కాలువలపై 6 మెగావాట్ల ఉత్పాదన సామర్థ్యం ఉన్న సౌర ఫలకాలను ఏర్పాటు చేస్తారు.       » దేశంలో అత్యధికంగా గుజరాత్‌లో 929 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ (839 మెగావాట్లు), మధ్యప్రదేశ్ (353 మెగావాట్లు), మహారాష్ట్ర (287 మెగావాట్లు) ఉన్నాయి.       » ప్రపంచంలో అత్యధికంగా జర్మనీ (35,900 మెగావాట్లు)లో స్థాపిత సామర్థ్యం ఉంది. తర్వాతి స్థానాల్లో చైనా (19,900 మెగావాట్లు), ఇటలీ (17,600 మెగావాట్లు), జపాన్ (13,600 మెగావాట్లు), అమెరికా (12,100 మెగావాట్లు) ఉన్నాయి.       » ఆంధ్రప్రదేశ్‌లో 13 వేల మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పాదనకు సామర్థ్యం ఉంది. ప్రస్తుతం 877 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. తమిళనాడులో అత్యధికంగా 7,251 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (3,427 మెగావాట్లు), గుజరాత్ (3,383 మెగావాట్లు), రాజస్థాన్ (2734 మెగావాట్లు), కర్ణాటక (2,312 మెగావాట్లు) ఉన్నాయి.       » ప్రపంచంలో పవన విద్యుత్ ఉత్పాదనలో 91,400 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో చైనా మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో అమెరికాలో (61,100 మెగావాట్లు), జర్మనీ (34,700 మెగావాట్లు), ఉన్నాయి.       » 2018-19 నాటికి 5 వేల మెగావాట్ల పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఫిబ్రవరి - 3 
¤ భారతీయ ప్రజారోగ్య ఫౌండేషన్ (పీహెచ్ఎఫ్ఐ) దక్షిణాది ప్రాంతీయ ప్రాంగణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని రాజేందర్ నగర్‌లో భూమిపూజ చేశారు.      » ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ అధిపతి ఎన్.ఆర్.నారాయణ మూర్తి, పీహెచ్ఎఫ్ఐ అధ్యక్షులు ప్రొఫెసర్ కె.శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
¤ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో బాలకార్మికులు ఎక్కువగా కనిపిస్తున్నారని, వారికి విముక్తి కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం 'ఆపరేషన్ స్మైల్' కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి ప్రకటించారు.      » పోలీసులకు వారంలో ఒకరోజు సెలవు ఇవ్వనున్నట్లు, అది ఇప్పటికే నల్గొండ జిల్లాలో అమలవుతుందని మంత్రి వెల్లడించారు.
ఫిబ్రవరి - 4
¤ రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడ్డ ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీతోపాటు రెవెన్యూలోటు భర్తీకి ఆర్థిక సాయం ప్రకటించింది.      » ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 46(2), 46(3) ప్రకారం ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని ఏడు వెనుకబడ్డ జిల్లాలకు రూ.350 కోట్లను (ప్రతి జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున) ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అభివృద్ధి కార్యకలాపాల కోసం ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి 2014-15 ఆర్థిక సంవత్సరంలోనే అందిస్తామని వెల్లడించింది.      » ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న రెవెన్యూ లోటు భర్తీకోసం తాత్కాలిక సాయంగా రూ.500 కోట్లు ఇస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.      » దీంతోపాటు పారిశ్రామిక పన్ను రాయితీలను ఏపీతో పాటు తెలంగాణకు వర్తింపజేస్తున్నట్లు తెలిపింది.      » నోటిఫై చేసిన వెనుకబడ్డ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తయారీ పరిశ్రమల్లో కొత్త ప్లాంటు, దానికి యంత్ర సామాగ్రిపై తొలి సంవత్సరం 15% అదనపు తరుగుదల ప్రయోజనం.      » నోటిఫై చేసిన వెనుకబడ్డ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు 15% అదనపు పెట్టుబడి అలవెన్స్.      » రూ.25 కోట్లకు పైన ఉన్న పెట్టుబడులకే ఈ రాయితీలు కల్పిస్తామన్న షరతు విధించకుండా అన్నింటికీ అదనపు తరుగుదల, పెట్టుబడి అలవెన్సులు వర్తిస్తాయి.¤ సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిబొట్ల ఆనంద్‌ను కూచిపూడి నాట్యారామం ఛైర్మన్‌గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.      » ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ కూచిపూడి నాట్యోత్సవంలో మాట్లాడిన సందర్భంగా సీఎం చంద్రబాబు రూ.100 కోట్లతో నాట్యారామాన్ని నిర్మించి కూచిపూడి అభివృద్ధికి కృషి చేస్తామని ప్రకటించారు. 
ఫిబ్రవరి - 5
¤ తెలంగాణ ఉద్యోగులకు మూలవేతనంలో 43 శాతం మేర పెంచాలని (ఫిట్‌మెంట్) రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వేతన సవరణను ఖరారు చేసింది. తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్ 2వ తేదీ నుంచి ఈ నగదు ప్రయోజనం అమలు కానుంది. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు భారం ఏటా రూ.6500 కోట్లకు పైగా ఉండనుంది.¤ ఆచార్య హరగోపాల్ నేతృత్వంలోని తెలంగాణ పబ్లిక్‌సర్వీస్ కమిషన్ సిలబస్ కమిటీ తన తుది నివేదికలను హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ఆచార్య ఘంటా చక్రపాణి; సభ్యులు విఠల్, చంద్రావతి, మతిన్-ఉద్దీన్ ఖాద్రీకు అందజేసింది.
      » నియామకాల ప్రక్రియలో కొన్ని మార్పులు, చేర్పులు అవసరమైనప్పటికీ, పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల ఉద్యమ నేపథ్యాన్ని, తెలంగాణ సంధికాలాన్ని దృష్టిలో ఉంచుకుని కమిటీ భారీ మార్పులను సూచించలేదు. సిలబస్‌లో మాత్రమే తెలంగాణ ఆర్థిక, రాజకీయ, చరిత్ర రంగాల్లో మార్పులు సూచించింది.
¤ విద్యుత్తు కొరతను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అదనంగా 450 మెగావాట్ల విద్యుత్తును ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
      » ఆంధ్రప్రదేశ్‌లోని మూడు సహజవాయువు (గ్యాస్) ఆధారిత విద్యుత్‌కేంద్రాల్లో ఈ విద్యుత్తును ఉత్పత్తి చేసి రెండు రాష్ట్రాలకూ పంచుతారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఈ విద్యుత్‌లో 53.89 శాతం తెలంగాణకు, మిగతాది ఏపీకి సరఫరా కానుంది. 450 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి అవసరమైన సహజవాయువును ఇచ్చేందుకు కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ అంగీకరించింది.
¤ తెలంగాణ జెన్‌కో రూపొందించిన నివేదికలో వరంగల్ జిల్లా భూపాలపల్లి సమీపంలోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం-1 (కేటీపీపీ-1) విద్యుత్తు ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
      » 95 శాతం పీఎల్ఎఫ్ సాధించడం ద్వారా కేటీపీపీ-1 ఈ ఘనత సాధించింది. ఒక విద్యుత్తు కేంద్రానికి ఉండే ఉత్పత్తి సామర్థ్యంలో ఎంత శాతం విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందనే అంశాలను 'పీఎల్ఎఫ్' గా పిలుస్తారు.
      » తెలంగాణలో మొత్తం అయిదు థర్మల్ కేంద్రాల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2282.50 మెగావాట్లు.      » తెలంగాణ జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు.¤ తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు కేబినెట్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఫిబ్రవరి - 6
¤ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 'పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం' తొలిదశకు రూ.14,350 కోట్లను కేటాయించి ఆమోదం తెలిపారు.      » జూరాల బ్యాక్ వాటర్ నుంచి 70 టీఎంసీల కృష్ణా వరద నీటిని మళ్లించి 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఈ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.¤ 'అప్పా (APPA - ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ)'గా ప్రసిద్ధి చెందిన రాజా బహద్దూర్ వెంకట్రామిరెడ్డి (ఆర్‌బీవీఆర్ఆర్) ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ పేరును మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి 'ఆర్‌బీవీర్ఆర్ఆర్ తెలంగాణ స్టేట్ పోలీసు అకాడమీ'గా ఈ సంస్థను పిలవనున్నారు.
¤ తెలంగాణలో కొత్తగా అభయారణ్యం ఏర్పాటైంది. అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రాన్ని గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
      » రాష్ట్ర విభజనకు ముందు నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జున సాగర్ - శ్రీశైలం అభయారణ్యం (ఎన్ఎస్‌టీఆర్) ఉమ్మడిగా ఉండేది. దీని విస్తీర్ణం 3,568 చదరపు కిలోమీటర్లు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ పరిధిలోకి వచ్చే అమ్రాబాద్ అటవీ ప్రాంతాన్ని నూతన అభయారణ్యంగా గుర్తించారు.
      » మహబూబ్‌నగర్ - నల్గొండ జిల్లాల సరిహద్దులో మొత్తం 2166.37 చదరపు కలోమీటర్ల పరిధిలో అమ్రాబాద్ అభయారణ్యం విస్తరించి ఉంది. దీనికి అదనంగా 445.02 చ.కి.మీ. పరిధిని బఫర్ ప్రాంతంగా గుర్తించారు. అమ్రాబాద్ సమీపంలోనే అభయారణ్యం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం అమ్రాబాద్ పేరుతో పులుల సంరక్షణ ప్రాంతాన్ని ఏర్పాటు చేసింది.
      » కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న పులులను రక్షించడానికి, పర్యాటకానికి అనుకూలంగా అభివృద్ధి చేయడానికి దీన్ని ప్రత్యేక ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ ఉన్న స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా దీని ముఖ్య ఉద్దేశం.      » ఈ అభయారణ్యం కింద మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోని అచ్చంపేట, నాగార్జునసాగర్ అటవీ డివిజన్లు ఉన్నాయి.
ఫిబ్రవరి - 8
¤ రాష్ట్రంలో తొలి విడతగా 9,470 ఆవాసాల్లోని ప్రతి ఇంటికీ నల్లా ద్వారా రక్షిత మంచినీటిని అందించే పనులకు తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. అయిదు జిల్లాల పరిధిలో 14 చోట్ల గ్రిడ్‌లు ఏర్పాటు చేసే పనులను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది.      » తొలి విడత పనులకు రూ.1,518.51 కోట్లు వ్యయం చేస్తారు. ఇందులో భాగంగా వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో 2,131 ఆవాసాలు, ఆదిలాబాద్ జిల్లాలో 3,224, మెదక్ జిల్లాలో 1,311, ఖమ్మం జిల్లాలో 3,224 ఆవాసాలకు నీటిని అందిస్తారు.
ఫిబ్రవరి - 9
¤ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం 43% ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై మధ్యంతర భృతి కాకుండా అదనంగా రూ.3,610.80 కోట్ల భారం పడనుంది. పదో వేతన సవరణ కింద రూ.9284.52 కోట్లు అదనంగా వేతనాల కోసం ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోంది. (ఇప్పటికే అమలు చేస్తున్న 27% మధ్యంతర భృతి కింద ప్రభుత్వంపై 5,673.72 కోట్లు భారం ఉంది).      » ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నాటి నుంచి (2014 జూన్ 2) పీఆర్‌సీ అమల్లోకి వస్తుంది. పెరిగిన వేతనాలు మే 1 నుంచి ఉద్యోగుల చేతికి అందనున్నాయి.
ఫిబ్రవరి - 10
¤ ఎస్టీ వధువు కుటుంబానికి 'గిరిపుత్రిక కళ్యాణ పథకం' కింద వివాహ సమయంలో రూ.50 వేల వరకు ఆర్థిక సహాయం అందజేయాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది.
ఫిబ్రవరి - 11
¤ యువతలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు కొత్తగా నైపుణ్యాల అభివృద్ధి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసి, దాని బాధ్యతను మంత్రి అచ్చెన్నాయుడుకి అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నిర్ణయించారు.      » ప్రస్తుతం ఆయన కార్మిక, ఉపాధి శాఖతోపాటు ఫ్యాక్టరీస్, యువజన, క్రీడల మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు.
ఫిబ్రవరి - 12
¤ ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో క్రికెట్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని తపాలాశాఖ ప్రత్యేకంగా ప్రపంచకప్ జ్ఞాపిక పత్రాన్ని (సావనీర్ షీట్) విడుదల చేసింది.      » సుమారు A4 పరిమాణంలో ఉండే జ్ఞాపిక పత్రంలో ఐసీసీ ప్రపంచకప్ లోగోతో పాటు ఇందులో పాల్గొంటున్న 14 జట్లకు సంబంధించిన దేశాల రంగులతో బంతి ఆకారపు స్టాంపులుంటాయి.
      » తెలంగాణలోని 36, ఆంధ్రప్రదేశ్‌లోని 58 ప్రధాన తపాలా కార్యాలయాలతో పాటు హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలోనూ ఈ జ్ఞాపిక పత్రాలు అందుబాటులో ఉంటాయని తపాలా శాఖ వెల్లడించింది.
      » తపాలా శాఖ ప్రధాన పోస్ట్ మాస్టర్ జనరల్ బి.వి.సుధాకర్.
ఫిబ్రవరి - 13
¤ తిరుపతి శాసనసభ నియోజవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో 49.92 శాతం ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గంలో మొత్తం 2,94,781 మంది ఓటర్లు ఉండగా అందులో 1,47,153 ఓట్లు పోలయ్యాయి.      » ఈ నియోజకవర్గంలో తెదేపా ఎమ్మేల్యేగా ఉన్న వెంకటరమణ మృతితో ఉపఎన్నిక జరిగింది.
ఫిబ్రవరి - 15
¤ అంతర్జాతీయ విమాన సేవల్లో భాగంగా విశాఖపట్నం నుంచి నేరుగా మలేషియా వెళ్లేందుకు మలిందో ఎయిర్ విమాన సేవలు ప్రారంభమయ్యాయి.
ఫిబ్రవరి - 16
¤ తిరుపతి ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, దివంగత శాసనసభ్యుడు డాక్టర్ ఎం.వెంకటరమణ సతీమణి సుగుణమ్మ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి రుద్ర రాజు శ్రీదేవిపై భారీ ఆధిక్యం సాధించారు.
      » గతేడాది డిసెంబరులో స్థానిక శాసనసభ్యుడు వెంకటరమణ మరణించారు. ఆ స్థానానికి ఈ నెల 13న నిర్వహించిన ఉప ఎన్నికలో మొత్తం 2,94,781 ఓట్లకు 49.94% (1,47,216 ఓట్లు) పోలయ్యాయి. ఓట్ల లెక్కింపులో తెదేపా అభ్యర్థిని సుగుణమ్మకు 1,26,152 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవికి 9,628 ఓట్లు మాత్రమే వచ్చాయి. లోక్‌సత్తా పార్టీకి 3,819 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ సహా లోక్‌సత్తా భారతీయ జనసంఘ్, జనతాదళ్(యు) పార్టీల అభ్యర్థులకు ధరావత్తు రాలేదు. నోటా ఓట్లు 2152 నమోదయ్యాయి.
¤ ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది పొడవునా జల రవాణాకు వీలుగా నీటి లభ్యత ఉందని నీటిపారుదల శాఖ కేంద్రానికి ప్రాథమికంగా నివేదించింది. ఇందుకు రెండు నుంచి మూడు టీఎంసీలు సరిపోతాయని అంచనా వేసింది.      » కాకినాడ - పుదుచ్చేరి మధ్య 1,078 కిలోమీటర్ల మేర జల రవాణా నిర్వహణపై 'ఇన్‌లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా' అధ్యయనం చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 888, తమిళనాడులో 188, పుదుచ్చేరిలో 2 కిలోమీటర్లు ఉంది.
ఫిబ్రవరి - 18
¤ విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పడి 33 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో అయిదువేల మొక్కలు నాటారు.¤ కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.      » అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో ఏటా ఖమ్మం జిల్లా భద్రాచలం రామాలయంలో నవమి వేడుకలు జరిగేవి. రాష్ట్ర విభజన జరగడంతో భద్రాచలం తెలంగాణ పరిధిలోకి వెళ్లిపోయింది.
ఒంటిమిట్ట ఆలయ నేపథ్యం
      » ఒంటిమిట్ట రామాలయంలో శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ఏటా రామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. కళ్యాణోత్సవం రాత్రివేళ జరుగుతుంది. ఆలయ గర్భగుడి, ముఖమండపం, గాలిగోపురం వేర్వేరు సమయాల్లో నిర్మితమైనట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. గుడిలో ఒకే శిలపై సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఉంటాయి. 160 అడుగుల ఎత్తైన గాలిగోపురం, 32 స్థంభాలతో ముఖమండపం ఉంటాయి.
      » ఆలయానికి రెండు రకాల కథలు ఉన్నాయి. త్రేతా యుగంలో మృకండ మహర్షి, శృంగ మహర్షి ఈ ప్రాంతంలో యజ్ఞాలు చేస్తున్నప్పుడు రాక్షసులు ఆటంకం కలిగించారని, మహర్షులు రాముడిని ప్రార్థించగా యజ్ఞాలు ప్రశాంతంగా జరిగాయని, ఈ నేపథ్యంలో ఆలయం వెలిసిందని అంటారు. ఈ గుడి నిర్మాణ సమయానికి వనవాసంలో రాముడిని హనుమంతుడు కలవలేదని, అందువల్లే ఆలయంలో ఆంజనేయుడి విగ్రహం ఉండదని చెబుతారు. హనుమంతుడి విగ్రహంలేని ఏకైక రామాలయం ఇదే అని అంటారు.
      » జానపదుల కథ ప్రకారం ద్వాపర యుగంలో ఒంటడు, మిట్టడు అనే దారిదోపిడీ దొంగలు ఓ గుహలో సొత్తు దాచుకునే వారు. ఒకసారి ఆ గుహలో సీతారామలక్ష్మణులు విగ్రహాల రూపంలో కనిపించి దొంగలిద్దరినీ బుద్దిగా బతకాలని చెప్పడంతో వారిలో మార్పువచ్చి ఈ రామాలయాన్ని నిర్మించారు. అందుకే ఈ ప్రాంతానికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చింది.
ఫిబ్రవరి - 19
¤ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్ని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక పరిహారాన్ని ప్రకటించింది. గత ప్రభుత్వ హయాంలో రూ.1.5 లక్షలుగా ఉన్న ఈ పరిహారం మొత్తాన్ని రూ.3.5 లక్షలకు పెంచింది.      » మొత్తం రూ.5 లక్షల ఆర్థిక పరిహారంతో పాటు ఆ కుటుంబం కుదుటపడే చర్యలు కూడా ప్రభుత్వమే చేపట్టాలని నిర్ణయించింది.¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో 7.21% వృద్ధిరేటు నమోదు కానున్నట్లు ఆంధ్రప్రదేశ్ గణాంకాల శాఖ అంచనా వేసింది. దీని ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువ రూ.2,64,521 కోట్లకు చేరనుంది. 2013-14 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది రూ.17,797 కోట్లు అధికం. 'డిస్ట్రిక్ట్ ఎట్ గ్లాన్స్' పేరుతో రూపొందించిన గణాంకాల నివేదికను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆవిష్కరించారు. ప్రభుత్వం ఈ అంచనాలను 2004-05 నాటి ధరలను ప్రామాణికంగా తీసుకుని అంచనా వేసింది. తాజా ధరల ప్రకారం లెక్కిస్తే స్థూల ఉత్పత్తి విలువ రూ.5,20,030 కోట్లు ఉంటుందని అంచనా. ఇదే ధరల ప్రకారం గతేడాది స్థూల ఉత్పత్తి విలువ రూ.4,64,184 కోట్లు ఉందని, దాంతో పోలిస్తే ఈ ఏడాది 12.03% వృద్ధిరేటు నమోదైనట్లు లెక్కించింది.      » వ్యవసాయ రంగంలో ఈ ఆర్థిక సంవత్సరం 5.90% వృద్ధి నమోదు కానున్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఈ రంగం స్థూల ఉత్పత్తి విలువ రూ.63,414 కోట్లకు చేరొచ్చని పేర్కొంది.      » పారిశ్రామిక వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.25% వృద్ధి నమోదు కానున్నట్లు అంచనా. దీని స్థూల ఉత్పత్తి విలువ రూ.51,771 కోట్లు ఉండనుంది.      » సేవల రంగంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 8.48% వృద్ధిరేటుతో రూ.1,49,336 కోట్ల స్థూల ఉత్పత్తిని నమోదు చేయనున్నట్లు గణాంకాల శాఖ అంచనా వేసింది.      » 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.90,517గా నమోదు కానున్నట్లు అంచనా. 2013-14లో నమోదైన రూ.81,397తో పోలిస్తే ఇది 11.21% అధికం.¤ అనంతపురం జిల్లాలోని ఎంపిక చేసిన ఆరు ఆసుపత్రుల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద ఉచిత రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు (డయాగ్నస్టిక్ సెంటర్లు) ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద వీటిని ప్రయోగాత్మక ప్రాజెక్టులుగా ఏర్పాటు చేయనుంది.¤ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గం గుమ్మ సముద్రం చెరువులో 'నీరు-చెట్టు' కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.      » భూగర్భ జలాలను పెంచి కరవును తరిమి కొట్టాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన ప్రకటించారు.
ఫిబ్రవరి - 20
¤ 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.267 కోట్ల నిధుల విడుదలకు ఆర్థిక, వ్యయ సంఘం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉప్పునీటి ప్రభావిత ప్రాంతాల కింద రూ.134 కోట్లు, పంచాయితీరాజ్ సంస్థాగత పనుల కింద రూ.133 కోట్లు ఏపీకి కేటాయించారు.
ఫిబ్రవరి - 21
¤ ఆంధ్రప్రదేశ్‌లో జనన మరణాలు రెండూ తగ్గుముఖం పట్టినట్లు, అందుకే పసికందుల సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరుగుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ తాజా గణాంకాలు వెల్లడించాయి.
      » కుటుంబ నియంత్రణ, ఇతరత్రా కారణాల వల్ల 2001-11 మధ్య కాలంలో 0-4 మధ్య వయసు పిల్లల సంఖ్యలో వృద్ధి రేటు మైనస్‌లో పడిపోయింది. అదే సమయంలో 80 ఏళ్లు పైబడిన వారి సంఖ్య విపరీతంగా పెరిగింది.
      » గత పదేళ్ల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో 0-4 వయసు పిల్లల సంఖ్య 13.97% తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో 18 శాతం పెరిగింది. రెండూ కలిపి చూస్తే ఈ వయసు పిల్లల సంఖ్యలో వృద్ధి రేటు -6.85 గా నమోదైంది.      » 2001-11 మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 80 ఏళ్లు పైబడిన వారి సంఖ్యలో 44.72% పెరుగుదల కనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 34.9 శాతానికే పరిమితం కాగా, పట్టణాల్లో 80.4% పెరిగింది. 4.93 కోట్ల ఏపీ జనాభాలో 5-14 ఏళ్ల వారు అత్యధికంగా 88.08 లక్షల మంది, 80 ఏళ్లకు పైబడినవారు అత్యల్పంగా 4.15 లక్షల మంది ఉన్నారు.
      » చదరపు కిలోమీటరుకు కృష్ణా జిల్లాలో అత్యధికంగా 518 మంది జనాభా ఉంటే, కడప జిల్లాలో అత్యల్పంగా 188 మందే ఉన్నారు.
      » గత పదేళ్లలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 14.85%, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యల్పంగా 3.51% జనాభా వృద్ధి నమోదైంది.      » రాష్ట్ర మొత్తం జనాభాలో 29.47% మంది పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నరు. ఈ పదేళ్లలో గ్రామీణ జనాభా 1.49% పెరిగితే, పట్టణ జనాభా 33.35% వృద్ధి చెందింది.      » అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 52,85,824 మంది జనాభా, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 23,44,474 మంది ఉన్నారు.      » లింగ నిష్పత్తి రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 994గా ఉంటే, పట్టణాల్లో మాత్రం 1,004కి చేరింది. శ్రీకాకుళం (1015), విజయనగరం (1019), విశాఖపట్నం (1006), తూర్పు గోదావరి (1007), పశ్చిమ గోదావరి (1004) జిల్లాలో లింగనిష్పత్తి వెయ్యికి పైగా ఉంది. గుంటూరు జిల్లాలో అత్యల్పంగా ఇది 981కే పరిమితమైంది.      » 2001లో ఏపీ మొత్తం జనాబా 4,52,22,736. 2011 నాటికి ఇది 4,93,86,799కి చేరింది. వృద్ధి 9.21% గా నమోదైంది.
ఫిబ్రవరి - 22
¤ ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల స్థాయిలో తొలిసారిగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో ఇ-లెర్నింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. ఈ విధానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు ఆన్‌లైన్ ద్వారా పాఠాలను బోధించవచ్చు.

ఆర్ధిక రంగం 

ఫిబ్రవరి - 2
¤ తక్కువ మొత్తం రుణాలు ఇచ్చే చిన్న బ్యాంకులు, చెల్లింపు సేవలు అందించే చెల్లింపు బ్యాంకుల లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకునే గడువు ముగిసింది.
      »
ఈ బ్యాంకులు తమ డిపాజిట్లలో 75 శాతాన్ని ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లుల్లో పెట్టుబడి పెట్టాలి. 25 శాతాన్ని మాత్రమే లావాదేవీల నిమిత్తం వాణిజ్య బ్యాంకుల కరెంట్ ఖాతాల్లో ఉంచుకోవచ్చు. చెల్లింపు బ్యాంకు శాఖల్లో నాలుగో వంతు గ్రామాల్లో ఉండాలి. 
ఫిబ్రవరి - 3 
¤ చిన్న, చెల్లింపు బ్యాంక్ లైసెన్సుల కోసం కనీసం 113 దరఖాస్తులు అందాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వెల్లడించింది.      » తక్కువ మొత్తం రుణాలు అందించేందుకు వీలున్న చిన్న బ్యాంకు లైసెన్స్ కోసం 72 దరఖాస్తులు, నగదు చెల్లింపు సేవలు అందించే చెల్లింపు బ్యాంకు లైసెన్సు కోసం 41 దరఖాస్తులు అందినట్లు ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్ వెల్లడించారు.      » దరఖాస్తుల పరిశీలనకు నిపుణుల కమిటీలు రెండింటిని నియమించినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. చిన్న బ్యాంకుల దరఖాస్తులను పరిశీలించే కమిటీకి ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఉషాథోరట్, చెల్లింపు బ్యాంకుల కమిటీకి ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్ నచికేత్ మోర్ నేతృత్వం వహిస్తారు. రెండు రకాల బ్యాంకుల ఏర్పాటుకు సూత్రప్రాయ అనుమతి పొందిన సంస్థలు 18 నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంటుంది.¤ ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ముంబయిలో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షను ప్రకటించారు.ముఖ్యాంశాలు ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై ఇచ్చే స్వల్పకాల రుణ రేటు (రెపో రేటు) 7.75 శాతం వద్ద యథాతథం. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) యథాతథం (4 శాతం). జనవరి 2016 కల్లా ద్రవ్యోల్బణ లక్ష్యం 6%. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విదేశాల్లో భారతీయులు వ్యక్తిగతంగా పెట్టే పెట్టుబడుల పరిమితి రెట్టింపు 2,50,000 డాలర్ల (దాదాపు రూ. 1,50,00,000)కు చేరిక. పెట్టుబడులు, వృద్ధికి ఊతమిచ్చేందుకు ఉత్పాదక రంగానికి బ్యాంకులు రుణాలివ్వాలి. సెక్యూరిటీల ధరల నిర్ణయంపై స్యేచ్ఛనివ్వడం కోసం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సరళీకరించాలని నిర్ణయం. ఎగుమతి చేయడానికి ముందు లేదా తర్వాత ఇచ్చే స్వల్పకాలిక రుణాల (ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ రీఫైనాన్స్) స్థానంలో కొత్త విధానాన్ని తెస్తారు. తదుపరి ద్వైమాసిక విధాన సమీక్షను ఏప్రిల్ 7న వెల్లడిస్తారు.
ఫిబ్రవరి - 5 
¤ ప్రజల నుంచి నిధులు సమీకరించకుండా 'అగ్రిగోల్డ్ ఫార్మ్స్ ఎస్టేట్స్ ఇండియా'ను సెబీ నిషేదించింది.
      »
ఇకపై నూతన పథకాలు ప్రవేశ పెట్టొద్దని ఆదేశించింది. అనుమతి లేకుండా అగ్రి గోల్డ్ సామూహిక పెట్టుబడుల పథకాలను నిర్వహిస్తున్నట్లు సెబీ తన ఉత్తర్వుల్లో తెలిపింది. 
ఫిబ్రవరి - 7 
¤ తొమ్మిది ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.6,990 కోట్ల మూలధనాన్ని సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.      » అంతర్జాతీయ నష్ట భయ నిబంధనలను చేరడానికి ఈ నిధులు తోడ్పడతాయి. 2014-15 బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించిన రూ.11,200 కోట్లలో ఇది తొలి విడత. ఈ నిధుల్లో ఎస్‌బీఐకి అత్యధికంగా రూ.2,970 కోట్లు అందనున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.1260 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.870 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.570 కోట్లు చొప్పున పొందనున్నాయి.      » సిండికేటు బ్యాంక్ రూ.460 కోట్లు, అలహాబాద్ బ్యాంక్ రూ.320 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.280 కోట్లు, దేనా బ్యాంక్ రూ.140 కోట్లు, ఆంధ్రాబ్యాంక్ రూ.120 కోట్లు పొందనున్నాయి. 
ఫిబ్రవరి - 9 
¤ వృద్ధి రేటును గణించేందుకు ప్రామాణిక సంవత్సరాన్ని 2004-05 నుంచి 2011-12కు సవరించడంతో పాటు అంచనాలు గణించే పద్ధతిలో మార్పులు జరిపిన నేపథ్యంలో తాజా వృద్ధిరేటు గణాంకాలను కేంద్ర గణాంకాల కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.      » ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు 7.4 శాతం ఉండవచ్చని ప్రభుత్వం ముందస్తు అంచనాల్లో పేర్కొంది. సెప్టెంబరు-డిసెంబరు త్రైమాసికంలో 7.5శాతం వృద్ధిరేటు సాధించినట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం వెల్లడించింది. సేవారంగం అధికంగా విస్తరించడం వల్లే మూడో త్రైమాసికంలో వృద్ధి గణనీయంగా పెరిగింది.      » వ్యవసాయంలో 1.1%, అటవీ మత్స్య 2.3%, గనులు 4.5%, నిర్మాణ తయారీ రంగాల్లో 6.8% వృద్ధి లభించింది.      » ప్రస్తుత ధరలను అనుసరించి 2014-15లో జీడీపీ రూ.126.54 లక్షల కోట్లకు చేరొచ్చని గణాంకాలు వెల్లడించాయి. కేంద్ర బడ్జెట్ అంచనాల కంటే ఇది కొంచెం తక్కువ. 2013-14 నాటి రూ.113.45 లక్షల కోట్ల కంటే ఇది 11.5% అధికం.      » జాతీయ స్థాయి పౌరుల తలసరి ఆదాయం 2014-15కు రూ.88,538గా పేర్కొన్నారు. 2013-14 నాటి రూ.80,500తో పోలిస్తే 10.1% అధికం. 
ఫిబ్రవరి - 10 
¤ ఐసీఐసీఐ బ్యాంకు ఒక కొత్త ఏకీకృత మొబైల్ బ్యాంకింగ్ సేవ 'పాకెట్స్' ను ప్రారంభించింది.      » దేశంలోనే తొలి డిజిటల్ బ్యాంకు (మొబైల్ ఫోన్లో) ఇదేనని ఆ బ్యాంకు ఎండీ, సీఈవో చందా కొచ్చర్ ప్రకటించారు.
ఫిబ్రవరి - 11 
¤ ప్రముఖ తెలుగు ఛానెల్స్ గ్రూప్ 'మా టీవీ'ని స్టార్ ఇండియా కొనుగోలు చేసింది.¤ మహాత్మాగాంధీ విగ్రహాన్ని లండన్‌లోని పార్లమెంట్ స్క్వేర్‌లో స్థాపించడానికి నిధులను సేకరిస్తున్న ట్రస్ట్ కొత్తగా నలుగురు ధర్మకర్తలను నియమించింది.      » వీరిలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తి (బ్రిటన్‌లో పెట్టుబడి సంస్థను నడుపుతున్నారు), ఆర్థిక నిపుణుడు కార్సెటెన్ జార్గెన్‌సెన్, బ్రిటన్ మాజీ అటార్నీ జనరల్ లార్డ్ పీటర్ గోల్డ్ స్మిత్, ప్రవాస భారతీయుడు వివేక్ చద్దా ఉన్నారు.      » గాంధీ విగ్రహ స్థాపనకు 7.5 లక్షల పౌండ్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న ట్రస్ట్ దీన్ని ఇటీవల సాధించింది. 
ఫిబ్రవరి - 13 
¤ ముడిచమురు దిగుమతులు భారం తగ్గడం వల్ల జనవరిలో భారత వాణిజ్యలోటు 11 నెలల కనిష్ఠానికి చేరింది. 2014 డిసెంబరులో 9.43 బిలియన్ డాలర్లు (రూ.56,580 కోట్లు)గా ఉన్న లోటు జనవరిలో 8.32 బి.డా.కు (రూ.49,920 కోట్లు) చేరిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వశాఖ వెల్లడించింది. గతేడాది ఇదే సమయానికి వాణిజ్య లోటు 9.45 బి.డా. (రూ.56,700 కోట్లు)గా ఉంది.      » ఎగుమతులు సైతం 11.2% తగ్గి 23.9 బి.డా. (రూ.1,43,400 కోట్లు)కు చేరాయి. 2014 జనవరిలో చమురు దిగుమతుల విలువ 13.19 బి.డా. కాగా, గత నెలలో 37.5 శాతం తగ్గి 8.25 బి.డా.కు చేరాయి. జనవరిలో చమురేతర దిగుమతులు 3.5 శాతం పెరిగి 23.96 బి.డా. గా నమోదయ్యాయి. 
ఫిబ్రవరి - 16 
¤ టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం దాదాపు అయిదున్నరేళ్ల కనిష్ఠ స్థాయికి చేరింది. మూడు నెలల వ్యవధిలో ద్రవ్యోల్బణం రెండో సారి ప్రతికూలంగా నమోదైంది.      » పెట్రోలియం, ఆహార ధరలు తగ్గడంతో జనవరిలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం -0.39 శాతానికి చేరింది. డిసెంబరులో ద్రవ్యోల్బణం 0.11 శాతంగా నమోదైంది. నవంబరులో -0.17 శాతానికి దిగివచ్చింది. (అంత క్రితం ప్రాథమికంగా సున్నాగా లెక్కగట్టారు.) జూన్ 2009లో ద్రవ్యోల్బణం -0.4 శాతానికి చేరింది.      » ఇంధన, విద్యుత్ విభాగ ద్రవ్యోల్బణం జనవరిలో -10.69 శాతంగా నమోదైంది. తయారీ ఉత్పత్తుల ధరల్లో పెరుగుదల 1.05 శాతానికి చేరింది.¤ 2జీ, 3జీ మొబైల్ సేవలకు అవసరమైన స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. 8 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి.
      »
 ప్రస్తుతం ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ టెలికాం సంస్థల అధీనంలో ఉన్న స్పెక్ట్రమ్‌లో అధిక భాగానికి గడువు 2015 - 16లో పూర్తవుతున్నందున, వేలం నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి - 18 
¤ విదేశాల నుంచి బంగారు నాణేలు, మెడళ్లు దిగుమతి చేసుకునేందుకు బ్యాంకులు, వాణిజ్య సంస్థలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనుమతిచ్చింది. అయితే బ్యాంకులు వీటిని విక్రయించకూడదు.      » కరెంటు ఖాతా లోటు పెరుగుతుండటంతో 2013 ఆగస్టులో వీటి దిగుమతిని ఆర్‌బీఐ నిషేధించింది. 
ఫిబ్రవరి - 19 
¤ దేశంలోని అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ టీసీఎస్ బ్రాండ్ విలువ ఈ ఏడాది రూ.52,200 కోట్ల (8.7 బిలియన్ డాలర్లు)కు చేరింది. ఫలితంగా ఐటీ రంగంలో అత్యధిక బ్రాండ్ బలానికి ప్రతీకగా నిలిచే ''ఏఏ+" రేటింగ్‌ను టీసీఎస్ నిలబెట్టుకుంది. దీంతోపాటు అంతర్జాతీయ అగ్రశ్రేణి నాలుగు ఐటీ సేవల సంస్థల్లో ఒకటిగా టీసీఎస్ వరుసగా ఈ ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది

అవార్డులు 
ఫిబ్రవరి - 6 
¤ 'జ్ఞానపీఠ్ అవార్డు-2014'కి ప్రముఖ మరాఠీ సాహిత్యవేత్త బాలచంద్ర నెమడే ఎంపికయ్యారు.       » రచయిత నమ్వర్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన 'జ్ఞానపీఠ్ ఎంపిక మండలి' నెమడేను జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డు కింద రూ.10 లక్షల రూపాయలు ఇచ్చి, సన్మాన పత్రంతో గౌరవిస్తారు.       » బాలచంద్ర నెమడే 1938లో జన్మించారు. 1963లో కేవలం 16 రోజుల్లో ఆయన రచించిన 'కోసల' నవల మరాఠీ సాహిత్య రంగంలో ఆయనకు పేరు ప్రఖ్యాతలను తెచ్చింది. ఆ తర్వాత జరీలా, జూల్, బిడార్, హిందూ - ఏక్ సముద్ర నవలలతో పాటు ఎన్నో కవితలను రాశారు.       » ఆయన 1991లో సాహిత్య అకాడమీ పురస్కారాన్ని, 2011లో పద్మశ్రీ పురస్కారాన్ని గెలుపొందారు.       » మరాఠీ సాహిత్య రంగంలో జ్ఞానపీఠ్ అవార్డు గెల్చుకున్న నాలుగో రచయత నెమడేనే.¤  భారత రసాయన సాంకేతిక సంస్థ (ఐఐసీటీ) ముఖ్య శాస్త్రవేత్త, లిపిడ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగ అధిపతి డాక్టర్ ఆర్.బి.ఎన్.ప్రసాద్‌కు ప్రతిష్ఠాత్మక వాస్విక్ వార్షిక పారిశ్రామిక పరిశోధన పురస్కారం లభించింది.       » కొవ్వు (లిపిడ్స్) సంబంధిత శాస్త్ర పరిశోధన విభాగంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. రైస్ బ్రాన్ ఆయిల్, కూరగాయల నుంచి ఇంధనాలు, బయో లూబ్రికెంట్లు, డీజిల్ తదితర వాటి అభివృద్ధిలో ఆయన కీలకపాత్ర నిర్వహించారు.
ఫిబ్రవరి - 9 
¤ 57వ గ్రామీ అవార్డులను అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ప్రదానం చేశారు. మన దేశానికి చెందిన రికీ కేజ్, నీలా విశ్వానీ పురస్కార గ్రహీతల్లో ఉన్నారు.       » బెంగళూరుకు చెందిన 33 ఏళ్ల రికీ కేజ్‌కు 'న్యూ ఏజ్ ఆల్బం' విభాగంలో గ్రామీ లభించింది. దక్షిణాఫ్రికా కళాకారుడు వౌటర్ కెల్లెర్మాన్‌తో కలిసి రికీ కేజ్ మహాత్మాగాంధీ స్ఫూర్తితో 'విండ్స్ ఆఫ్ సంసారా' అనే ఆల్బంను తయారు చేశారు.       » ఉత్తర కాలిఫోర్నియాలో 1981 ఆగస్టు 5న జన్మించిన రికీ ఎనిమిదేళ్ల వయుసులో బెంగళూరుకు వచ్చారు. బిషప్ కాటన్ బాలుర పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆక్స్‌ఫర్డ్ దంత వైద్య కళాశాల నుంచి పట్టా పొందారు.       » ఆయన 2003లో తొలిసారిగా 'కమ్యూనికేటివ్ ఆర్ట్ లాంజ్ ఫ్రం బాంబే' అనే మ్యూజిక్ ఆల్బంను విడుదల చేశారు. దీనికి అనూహ్య స్పందన లభించింది. ఆ తర్వాత వరుసగా మూడు ఆల్బమ్‌లు విజయవంతం కావడంతో 2008 నుంచి కొన్ని కన్నడ సినిమాలకు సంగీతాన్ని అందించారు. 'విండ్స్ ఆఫ్ సంసారా' రికీ 14వ ఆల్బమ్.       » మరో గ్రామీ పురస్కారాన్ని భారత్‌కు అందించిన నీలా విశ్వానీ వాస్తవానికి రచయిత్రి. ఆమె చిన్నకథల సంపుటాలను వెలువరించారు. పాకిస్థాన్‌లో బాలికల విద్య కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ జీవిత కథకు (ఐయాం మలాలా!) నీలా విశ్వానీ ధ్వని రూపం (ఆడియో) కల్పించారు. 'ఐయాం మలాలా' పేరుతోనే తెచ్చిన ఈ ఆల్బంలో మలాలా స్వీయ చరిత్రను ఆమె వివరించారు. 'ఉత్తమ పిల్లల ఆల్బమ్' విభాగంలో ఇది విజేతగా నిలిచింది.       » దివంగత సితార్ విద్వాంసుడు పండిట్ రవి శంకర్ కుమార్తె అనౌష్క శంకర్ ఉత్తమ ప్రపంచ సంగీత ఆల్బం విభాగంలో పోటి పడినప్పటికీ పురస్కారానికి ఎంపిక కాలేదు.       » బ్రిటన్‌కు చెందిన శాం‌స్మిత్ ఏకంగా నాలుగు గ్రామీలను గెల్చుకున్నారు.
ఇతర విజేతలు
 ఈ ఏడాది ఆల్బం - మార్నింగ్ ఫేజ్ (గాయకుడు బెక్)
 ఈ ఏడాది రికార్డ్ - స్టే విత్ మీ (గాయకుడు శాంస్మిత్)
 ఈ ఏడాది పాట - స్టే విత్ మీ (శాంస్మిత్, జిమ్మి నేప్స్, విలియం ఫిలిఫ్స్)
 కొత్త కళాకారుడు - శాంస్మిత్
 ప్రజాదరణ పొందిన ఓకల్ ఆల్బం - ఇన్ ది లోన్లీ అవర్ (శాంస్మిత్)
 కంట్రీ ఆల్బమ్ - ప్లాటినమ్ (మిరండా లాంబర్)
 రాప్ ఆల్బమ్ - ది మార్షల్ మ్యాథర్స్ ఎల్‌పీ 2 (ఎమినెమ్)
 ఆర్ అండ్ బీ ఆల్బమ్ - లవ్, మ్యారేజ్, డైవోర్స్ (టోనీ బ్రాక్స్‌టన్, బేబీ ఫేస్)
 రాక్ ఆల్బమ్ - మార్నింగ్ ఫేజ్ (బెక్)
 రాక్ సాంగ్ - అయామ్ నాట్ ఇట్ ఫైన్ (హీలీ విలియమ్స్, టేలర్ యార్క్)
 
ఫిబ్రవరి - 10 
¤  ఆర్థిక సంక్షేమానికి చేసిన కృషికి ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌కు బ్రిటన్ ఇటీవల ప్రవేశపెట్టిన 'చార్లెస్టన్ ఈఎఫ్‌జీ జాన్ మైనార్డ్ కేన్స్' అవార్డు అందుకోనున్నారు.       » ప్రముఖ బ్రిటిష్ ఆర్థికవేత్త జాన్ మైనార్డ్ కేన్స్ జ్ఞాపకార్థం ఈ అవార్డును ఏర్పాటు చేశారు.       » అవార్డు కింద 7,500 బ్రిటిష్ పౌండ్లు, ప్రశంసా పత్రం ఇస్తారు. కరవు, పేదరికం, ఆర్థిక సంక్షేమానికి కృషి లాంటి విభాగాల్లో కృషి చేస్తున్న ప్రముఖులకు ఈ అవార్డును ఇస్తున్నట్లు కమిటీ ప్రకటించింది.
ఫిబ్రవరి - 12 
¤  ప్రతిష్ఠాత్మక 'వరల్డ్ ప్రెస్ ఫోటో' పురస్కారాన్ని ఈ ఏడాది రష్యాకు చెందిన స్వలింగ సంపర్క జంట ఫోటో గెలుచుకుంది. ఆ ఫోటోను డెన్మార్క్‌కు చెందిన ఫోటోగ్రాఫర్ మాడ్స్ నిస్సేన్ తీశారు.       » రష్యాలో స్వలింగ సంపర్కులు, లింగ మార్పిడి చేయించుకున్నవారు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఆ ఫోటోను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.       » సమకాలీన సమస్య విభాగంలో సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు చెందిన స్వలింగ సంపర్క జంట ఫోటోను ఎంపిక చేశారు.       » వార్తల విభాగంలో ఇస్తాంబుల్‌లో నిరసనల సమయంలో టర్కీకి చెందిన బులెంట్ కిలిక్ తీసిన ఫోటోకు మొదటి బహుమతి దక్కింది. 
ఫిబ్రవరి - 14 
¤  'డాక్టర్ యలవర్తి నాయుడమ్మ పురస్కారం - 2014' కు డీఆర్‌డీవో అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లేబొరేటరీ డైరెక్టర్ టెస్సీ థామస్, ఇస్రో అడ్వాన్స్‌డ్ డేటా ప్రోసెసింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ గీతావరదన్ ఎంపికయ్యారు.       » తొలిసారిగా ఈ అవార్డును ఇద్దరికి ప్రకటించారు.       » అగ్ని క్షిపణి ప్రయోగంలో సేవలందించి 'అగ్ని పుత్రిక' గా, 'క్షిపణి మహిళ' గా టెస్సీ థామస్ పేరు తెచ్చుకోగా, 'అగ్రశ్రేణి ఉపగ్రహ సమాచార శాస్త్రవేత్త'గా గీతావరదన్ పేరు గడించారు.       » ఈ పురస్కారాన్ని మార్చి 1న నాయుడమ్మ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలిలో ప్రదానం చేయనున్నారు. 
ఫిబ్రవరి - 16 
¤  బొంబాయి మేనేజ్‌మెంట్ అసోషియేషన్ అవార్డుల కార్యక్రమంలో 2013 - 14కు జీవనకాల సాఫల్య పురస్కారాన్ని టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటాకు ప్రదానం చేశారు.
ఫిబ్రవరి - 17 
¤  ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుకు 'విశ్వవిఖ్యాత దర్శక బ్రహ్మ' అనే బిరుదును విశాఖపట్నంలోని టి.సుబ్బిరామి రెడ్డి కళాపీఠం ప్రదానం చేసింది. 
ఫిబ్రవరి - 23
¤ అమెరికా లాస్ ఏంజెలిస్‌లోని డాల్బీ థియేటర్‌లో 87వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.       » అలెజాండ్రో గోంజాలెజ్ ఇనారిట్టు తెరకెక్కించిన 'బర్డ్‌మ్యాన్' నాలుగు పురస్కారాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తమ చిత్రంతోపాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రహణం, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లేతో కలిపి మొత్తం 4 విభాగాల్లో అవార్డులు పొందింది.       » 'ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్' చిత్రం కూడా నాలుగు పురస్కారాలు సొంతం చేసుకుంది. సంగీతం, ప్రొడక్షన్ డిజైన్, మేకప్, కాస్ట్యూమ్ డిజైన్ విభాగాల్లో పురస్కారాలు పొందింది.       » 'విప్‌ల్యాష్' చిత్రం మూడు విభాగాల్లో (ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, ఉత్తమ సహాయ నటుడు) అవార్డులు పొందింది.       » ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జీవితం ఆధారంగా రూపొందించిన 'ది థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్‌'లో నటనకు గాను ఎడ్డి రెడ్‌మేన్‌కు ఉత్తమ నటుడు పురస్కారం దక్కింది.       » 'స్టీల్ అలైస్' సినిమాలో నటనకుగాను జూలియన్ మూర్ ఉత్తమ నటి పురస్కారం దక్కించుకుంది. ఓరకమైన మతి మరుపు వ్యాధితో బాధపడుతూ కుంటుంబాన్ని చూసుకోవడం, ఉద్యోగాన్ని కొనసాగించడంలో ఓ మహిళ పడే ఇబ్బందుల్ని చూపిన ఆమె నటనకు ఈ అవార్డు లభించింది.ఆస్కార్ విజేతలు: ఉత్తమ చిత్రం: బర్డ్‌మ్యాన్ ఉత్తమ నటుడు: ఎడ్డి రెడ్‌మేన్ (ది థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్) ఉత్తమ నటి: జూలియన్ మూర్ (స్టీల్ అలైస్) ఉత్తమ దర్శకుడు: అలెజాండ్రో గోంజాలెజ్ ఇనారిట్టు (బర్డ్‌మ్యాన్) ఉత్తమ సహాయనటుడు: జేకే సిమ్మన్స్ (విప్‌ల్యాష్) ఉత్తమ సహాయనటి: పాట్రిసియా అర్క్వెట్టే (బాయ్‌హుడ్) ఉత్తమ ఎడిటింగ్: టామ్ క్రాస్ (విప్‌ల్యాష్) ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఎమ్మాన్యూయెల్ లుబెజ్కీ (బర్డ్‌మ్యాన్) ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ఇడా (పోలెండ్ చిత్రం) ఉత్తమ రచన (ఒరిజినల్ స్క్రీన్‌ప్లే): బర్డ్‌మ్యాన్ (అలెజాండ్రో గోంజాలెజ్ ఇనారిట్టు, నికోలస్ జియాకోబెన్, అలెగ్జాండర్ డైనెలారిస్ జూనియర్, అర్మాండో బో) ఉత్తమ రచన (అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే): ది ఇమిటేషన్ గేమ్ (గ్రాహమ్ మూర్) ఉత్తమ సంగీతం (ఒరిజినల్ సాంగ్): 'గ్లోరీ...' (సెల్మా) ఉత్తమ సంగీతం (ఒరిజినల్ స్కోర్): అలగ్జాండ్రే డెస్‌ప్లాట్ (ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: ఇంటర్ స్టెల్లార్ (పాల్ ఫ్రాంక్లిన్, ఆండ్రూ లాక్‌లే, ఇయాన్ హంటర్, స్కాట్ ఫిషర్) ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: అమెరికన్ స్నైపర్ (అలెన్ రాబర్ట్ ముర్రే, బబ్ ఆస్మాన్) ఉత్తమ సౌండ్ మిక్సింగ్: విప్‌ల్యాష్ (క్రోగ్‌మన్, బెన్ విల్కిన్స్, థామస్ కర్లీ) ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ (మిలీనా కానొనెరె) ఉత్తమ మేకప్, హెయిర్ స్టైలింగ్: ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ (ఫ్రాన్సిస్ హనన్, మార్క్ కోలైర్) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ (ఆడమ్ స్టాక్ హొజెన్, అన్నా పినోక్) ఉత్తమ యానిమేటెడ్ (ఫీచర్ ఫిల్మ్): 'బిగ్ హీరో సిక్స్' ఉత్తమ లైవ్‌యాక్షన్ (షార్ట్ ఫిల్మ్): ది ఫోన్ కాల్ (మాట్ కిర్క్‌బై, జేమ్స్ లూకాస్) ఉత్తమ యానిమేటెడ్ (షార్ట్ ఫిల్మ్): ఫీస్ట్ (ప్యాట్రిక్ ఓ స్బోర్న్ కిస్టీనారీడ్) ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్: క్రైసిస్ హాట్‌లైన్: వెటెరన్స్ ప్రెస్ 1. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: సిటిజన్ ఫోర్
(యూఎస్ ప్రజలపై ప్రభుత్వ నిఘాను తెలిపే అమెరికా రక్షణ సంస్థ పత్రాలను యూఎస్ ఇంటెలిజెన్స్ మాజీ నిపుణుడు ఎడ్వర్డ్ స్నోడెన్ ఎలా లీక్ చేశాడన్నది ప్రధాన ఇతివృత్తంగా 'సిటిజన్ ఫోర్' డాక్యుమెంటరీని రూపొందించారు.)

క్రీడలు 
ఫిబ్రవరి - 1
¤ సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) - 5 ట్రోఫీ విజేతగా తెలుగు వారియర్స్ జట్టు నిలిచింది.
       » హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో తెలుగు వారియర్స్ జట్టు 7 వికెట్ల తేడాతో చెన్నై రైనోస్ జట్టును ఓడించింది
.
       » తెలుగు వారియర్స్ జట్టు ఈ ట్రోఫీని గెలవడం ఇదే తొలిసారి
.
       » ఫైనల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' సుధీర్ బాబు, తెలుగు వారియర్స్
.
       » 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌'గా సచిన్ జోషి (తెలుగు వారియర్స్) నిలిచాడు
.
       » తెలుగు వారియర్స్ జట్టు కెప్టెన్ వెంకటేష్, వైస్ కెప్టెన్ అఖిల్ అక్కినేని
.
¤ ఆస్ట్రేలియా ఓపెన్ - 2015 విజేతగా నొవాక్ జకోవిచ్ (సెర్బియా) నిలిచాడు. మెల్‌బోర్న్‌లోని రాడ్ లేవర్ ఎరీనాలో జరిగిన ఫైనల్లో జకోవిచ్ 7-6, 6-7, 6-3, 6-0తో బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రేను ఓడించాడు
.
       » జకోవిచ్‌కు ఇది అయిదో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్. ఇక్కడ ఆడిన అయిదు ఫైనల్లలోనూ జకోవిచ్ విజేతగా నిలిచాడు. మొత్తం మీద జకోవిచ్‌కు ఇది ఎనిమిదో గ్రాండ్‌స్లామ్ టైటిల్
.
       » రాయ్ ఎమర్సన్, ఆస్ట్రేలియా (6 టైటిళ్లు) తర్వాత ఎక్కువ సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఘనత జకోవిచ్‌దే
.
       » ఛాంపియన్ జకోవిచ్‌కు 31 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ.14 కోట్ల 96 లక్షలు), రన్నరప్ ఆండీ ముర్రేకు 15 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ.7 కోట్ల 48 లక్షలు) ఫ్రైజ్‌మనీగా లభించింది
.
       » టెన్నిస్‌లో ఓపెన్ శకం (1968 నుంచి) మొదలయ్యాక ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను అయిదోసారి నెగ్గిన తొలి క్రీడాకారుడిగా జకోవిచ్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఓపెన్ శకం ప్రారంభం కాకముందు రాయ్ ఎమర్సన్ ఈ ఘనత సాధించాడు
.
       » జకోవిచ్ గతంలో 2008, 2011, 2012, 2013ల్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచాడు. రెండుసార్లు వింబుల్డన్, ఒకసారి యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించాడు
.
       » ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను లియాండర్ పేస్ (భారత్), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ నెగ్గింది. 41 సంవత్సరాల వయసులో పేస్ మరో వెటరన్ 34 ఏళ్ల హింగిస్‌తో కలిసి ఈ విజయం సాధించడం విశేషం
.
       » పేస్ కెరీర్లో ఇది 15వ గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్
.
       » తాజా ఫైనల్లో పేస్ జోడీ 6-4, 6-3తో డానియల్ నెస్టర్ (కెనడా) - క్రిస్టినా మ్లెడనోవిచ్(ఫ్రాన్స్) జోడీని ఓడించింది
.
       » పేస్ మొత్తం మీద 7 మిక్స్‌డ్ టైటిల్స్, 8 పురుషుల డబుల్స్ టైటిల్స్ నెగ్గాడు. పేస్ ఖాతాలో ఇది మూడో ఆస్ట్రేలియన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్
.
       » లియాండర్ చివరిగా 2013లో యూఎస్ ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచాడు
.
       » పురుషుల డబుల్స్ టైటిల్‌ను సిమోనీ బోలెల్లీ, ఫ్యాబియో ఫోనిని (ఇటలీ) జోడీ నెగ్గింది
.
       » మహిళల డబుల్స్ టైటిల్‌ను బెథానీ మాటెక్ (అమెరికా), లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) జోడీ నెగ్గింది
.
¤ జాతీయ క్రీడల తొలి రోజు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు నెగ్గారు
.
       » పురుషుల 56 కిలోల విభాగంలో వల్లూరి శ్రీనివాసరావు స్వర్ణం నెగ్గాడు. స్నాచ్‌లో 106 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 137 కిలోలతో తన పేరిట ఉన్న జాతీయ క్రీడల రికార్డును బద్దలు కొట్టాడు. మొత్తం 243 కిలోలు మోశాడు
.
       » మహిళల 48 కిలోల విభాగంలో బంగారు ఉష, 53 కిలోల విభాగంలో కాతిల వెంకటలక్ష్మి కాంస్యాలు నెగ్గారు.
ఫిబ్రవరి - 4 
¤ జాతీయ క్రీడల్లో తెలంగాణ రెండు రజతాలు సాధించింది.       » టెన్నిస్‌లో తెలంగాణ పురుషులు, మహిళల జట్లు రన్నరప్‌లుగా నిలిచాయి. పురుషుల ఫైనల్లో తెలంగాణ 1-2తో తమిళనాడు చేతిలో ఓడింది. మహిళల ఫైనల్లో గుజరాత్ 2-0తో తెలంగాణపై నెగ్గింది.       » మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరుణ రాణి 69 కిలోల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గింది. మొత్తం 190 కిలోల బరువువెత్తి కాంస్యం నెగ్గింది. 
ఫిబ్రవరి - 5 
¤ తిరువనంతపురంలో జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు రెండు స్వర్ణాలు నెగ్గారు. పురుషుల సింగిల్ స్కల్‌లో 500 మీటర్ల రేసులో అస్రార్ పాటిల్ స్వర్ణం సొంతం చేసుకుని జాతీయ క్రీడల్లో తెలంగాణకు తొలి స్వర్ణం అందించాడు. పురుషుల కాక్స్‌లెస్ పెయిర్‌లో మంజీత్ సింగ్-దలిందర్ సింగ్ జోడీ స్వర్ణం నెగ్గింది.       » పురుషుల బీచ్ వాలీబాల్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తెలంగాణ జట్టుపై నెగ్గి స్వర్ణం సాధించింది.       » జిమ్నాస్టిక్స్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి మేఘనరెడ్డి ఒక స్వర్ణం, ఒక కాంస్యం నెగ్గింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో క్రీడాకారిణి అరుణ ఒక కాంస్యాన్ని నెగ్గింది. 
ఫిబ్రవరి - 9
¤ జాతీయ క్రీడల కనోయింగ్ - కయాకింగ్‌లో తెలంగాణకు స్వర్ణం లభించింది. 1000 మీటర్ల మెన్ 4 కయక్‌లో షమి శర్మ, ప్రేమ్ చంద్రసింగ్, కేశరి నందన్, లైతోంజమ్ నవోఛ లతో కూడిన జట్టు స్వర్ణం నెగ్గింది.
       » జాతీయ క్రీడల్లో ఆర్చరీలో ఝార్ఖండ్ మూడు స్వర్ణాలు దక్కించుకుంది.
ఫిబ్రవరి - 12 
¤ 2015 క్రికెట్ ప్రపంచకప్ ఆరంభ వేడుకలను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఘనంగా నిర్వహించాయి. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లోని లీఫీహాగ్లే ఓవల్ పార్క్‌లో జరిగిన వేడుకలకు ప్రేక్షకులు వేలల్లో హాజరయ్యారు. న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జాన్‌కీ, అనేక మంది ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు ఆరంభోత్సవానికి హాజరయ్యారు.       » ఐసీసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి డేవిడ్ రిచర్డ్‌సన్ ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరించారు. నాలుగు జట్ల కెప్టెన్లు (దక్షిణాఫ్రికా, శ్రీలంక, జింబాబ్వే, న్యూజిలాండ్) ఇక్కడ జరిగిన వేడుకలకు హాజయ్యారు.       » మెల్‌బోర్న్‌లోని మైయర్ మ్యూజిక్ బౌల్ మైదానంలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకలకు 10 జట్ల (ఇండియా, ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఐర్లాండ్, పాకిస్థాన్, స్కాట్లాండ్, యూఏఈ, వెస్టిండీస్) సారధులు హాజరయ్యారు. 
ఫిబ్రవరి - 13 
¤ జాతీయ క్రీడల్లో బాక్సింగ్‌లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు శ్యాంకుమార్ కాకర 49 కిలోల విభాగంలో స్వర్ణం నెగ్గాడు.       » బ్యాడ్మింటన్‌లో పురుషుల డబుల్స్ (సుమీత్ రెడ్డి - నందగోపాల్), మహిళల డబుల్స్ (సిక్కిరెడ్డి - రితుపర్ణ దాస్)లో తెలంగాణకు రెండు స్వర్ణాలు దక్కాయి. 
ఫిబ్రవరి - 14 
¤ 11వ వన్డే క్రికెట్ ప్రపంచకప్ పోటీలు ప్రారంభమయ్యాయి.       » న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్, శ్రీలంకల మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 98 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది.       » ఈ మ్యాచ్‌లో శ్రీలంక క్రికెటర్ సంగక్కర వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో (13,732 పరుగులు) రెండో స్థానానికి చేరాడు. ఈ క్రమంలో పాంటింగ్ (13,704)ను అధిగమించాడు. వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు (18,426) సచిన్ పేరిట ఉంది.       » మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 111 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.       » ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ హ్యాట్రిక్ నమోదు చేశాడు.       » 11వ ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. మొత్తం 14 జట్లు పాల్గొంటున్నాయి. 14 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తం మ్యాచ్‌ల సంఖ్య 49.       » తొలిసారిగా అఫ్ఘానిస్థాన్ ప్రపంచకప్‌లో పాల్గొంటోంది. ప్రపంచకప్ ఆడుతున్న 20వ జట్టుగా అఫ్గానిస్థాన్ నిలిచింది.       » ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌మనీ రూ.63 కోట్ల 33 లక్షలు. విజేతకు లభించే మొత్తం రూ.23 కోట్ల 60 లక్షలు. రన్నరప్‌కు లభించే మొత్తం రూ. 10.8 కోట్లు.       » సెమీస్ చేరితే లభించే మొత్తం రూ.3 కోట్ల 72 లక్షలు.       » ఈ ప్రపంచకప్‌లో ఆడుతున్న వారిలో 43 ఏళ్ల ఖుర్రమ్ ఖాన్(యూఏఈ) పెద్ద వయస్కుడు. 18 ఏళ్ల ఉస్మాన్ ఘనీ (అఫ్ఘానిస్థాన్)చిన్న వయస్కుడు.       » ఈ ప్రపంచకప్‌లో ఆడుతున్న వారిలో అత్యంత పొడగరి మొహమ్మద్ ఇర్ఫాన్ (పాకిస్థాన్ - 7 : 1 అడుగులు). పొట్టి ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ (బంగ్లాదేశ్ - 5.3 అడుగులు)
¤ కేరళలో 15 రోజుల పాటు జరిగిన జాతీయ క్రీడలు ముగిశాయి. ఆ రాష్ట్ర గవర్నర్ రిటైర్డ్ జస్టిస్ పి.సదాశివం ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ క్రీడలు ముగిశాయని ప్రకటించారు.       » ఈ క్రీడల్లో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్ఎస్‌సీబీ) 159 పతకాలతో (91 స్వర్ణాలు, 33 రజతాలు, 35 కాంస్యాలు) ఓవరాల్ విజేతగా నిలిచింది. కేరళ - 162 (54 + 48 + 60), ద్వితీయ, హరియాణా - 107 (40 + 40 + 27)తో తృతీయ స్థానాల్లో నిలిచాయి.       » తెలంగాణ 33 పతకాలతో (8 + 14 + 11) 12వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 16 పతకాలతో (6 + 3 + 7) 18వ స్థానంలో నిలిచాయి.       » 2011 రాంచీ జాతీయ క్రీడల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం 49 పతకాలు సాధించింది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు కలిపి 49 పతకాలే గెలిచాయి.       » పురుషుల విభాగంలో స్విమ్మర్ సజన్ ప్రకాష్, మహిళల విభాగంలో స్విమ్మర్ ఆకాంక్ష వోరా 'ఉత్తమ అథ్లెట్స్' పురస్కారాలను గెలుచుకున్నారు. ఈ క్రీడల్లో ప్రకాష్ 6 స్వర్ణాలు నెగ్గాడు.       » తదుపరి జాతీయ క్రీడలు 2016లో గోవాలో జరగనున్నాయి. 
ఫిబ్రవరి - 15
¤ ప్రపంచకప్‌లో భాగంగా అడిలైడ్‌లో భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ధోని సేన 76 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి ఘనంగా బోణీ కొట్టింది.       » ప్రపంచకప్ మ్యాచుల్లో పాక్‌పై భారత్‌కు ఇది వరుసగా ఆరో విజయం.       » విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో 107 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో పాక్‌పై సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడు కోహ్లీనే.       » మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: విరాట్ కోహ్లీ.
ఫిబ్రవరి - 16 
¤ ప్రపంచకప్‌లో భాగంగా నెల్సన్‌లో వెస్టిండీస్, ఐర్లాండ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ 4 వికెట్లు తేడాతో నెగ్గింది.       » మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: స్టిర్లింగ్ (ఐర్లాండ్).¤ బెంగళూరులో ఐపీఎల్ - 8 కోసం నిర్వహించిన వేలం లో యువరాజ్ సింగ్ అత్యధికంగా రూ.16 కోట్లు పలికి వార్తల్లో నిలిచాడు. ఇతడిని దిల్లీ డేర్ డెవిల్స్ దక్కించుకుంది.       » గతేడాది రూ.14 కోట్లకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌కు సొంతమై ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించిన యువరాజ్ తాజాగా తన రికార్డును తానే అధిగమించాడు. 
ఫిబ్రవరి - 17 
¤ క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌లోని డునెడిన్‌లో జరిగిన పోటీలో ఆతిధ్య న్యూజిలాండ్ 3 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌ను ఓడించింది.
ఫిబ్రవరి - 22
¤ ప్రపంచకప్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.       »  మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: శిఖర్ ధావన్.       »  శిఖర్ ఈ మ్యాచ్‌లో 137 పరుగులు చేశాడు. కెరీర్లో ఇది ఏడో వన్డే సెంచరీ. (ఇప్పటి వరకు అతడు శతకం సాధించిన అన్ని మ్యాచుల్లో భారత్ గెలిచింది).¤ ఎం.ఎస్.ధోనీ సహయజమానిగా ఉన్న రాంచీ రేస్ జట్టు హాకీ ఇండియా లీగ్-3 టైటిల్ కైవసం చేసుకుంది. దిల్లీలో జరిగిన ఫైనల్లో 3-2తో పంజాబ్ వారియర్స్‌ను ఓడించింది.
ఫిబ్రవరి - 24
¤ 2015 క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా కాన్‌బెర్రాలో జింబాబ్వేతో జిరిగిన మ్యాచ్‌లో వెస్టిండిస్ 73 పరుగుల తేడాతో విజయం సాధించింది.       » ఈ మ్యాచ్‌లో వెస్టిండిస్ ఆటగాడు క్రిస్‌గేల్ 215 పరుగులు చేశాడు. 147 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లతో ఈ స్కోరు చేశాడు. ప్రపంచకప్‌లో తొలి ద్విశతకం చేసిన ఆటగాడిగా, వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయేతర క్రికెటర్‌గా క్రిస్‌గేల్ రికార్డులకెక్కాడు. శామ్యూల్స్ (133 నౌటౌట్)తో కలిసి రెండో వికెట్‌కు 372 పరుగుల భాగస్వామ్య రికార్డును గేల్ తిరగరాశాడు.       » టెస్టుల్లో300, వన్డేల్లో 200, టీ 20ల్లో 100 పరుగులు చేసిన ఏకైక ఆటగాడు క్రిస్‌గేల్.
ఫిబ్రవరి - 26
¤ ప్రపంచకప్‌లో భాగంగా డునెడిన్‌లో స్కాట్లాండ్, అఫ్గానిస్థాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ ఒక వికెట్ తేడాతో నెగ్గింది.       » తొలిసారిగా ప్రపంచకప్ ఆడుతున్న అఫ్గాన్‌కు ఇదే తొలి విజయం.       » మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్: సమీవుల్లా షెన్వారి, అఫ్గాన్.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again