పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

February 25, 2015

మధుమేహం వల్ల వచ్చే కిడ్నీ వ్యాధులు - కారణాలు

ఆరోగ్యమే మహాభాగ్యము.మనిషికి ఏమిటి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు . ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి . జాబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి . బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము . ఇప్పుడు -మధుమేహంతో మూత్రపిండ వ్యాధి,kidney disease with diabetes- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...రానున్న దశాబ్దకాలంలో ప్రపంచవ్యాప్తంగా వానవాళికి ముంచుకొస్తున్న ఉపద్రవం డయా బెటిస్‌. మారుతున్న జీవన శైలి, స్థూలకాయం లోపించిన దేహపరిశ్రమ, డయాబెటిస్‌ వ్యాధి పట్ల సరైన అవగాహన లేక పోవడం మెదలగు కారణాల వలన, డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య గణణీయంగా పెరుగుతోంది. కొన్ని సంవత్సరాల తరబడి డయాబెటస్‌ నియంత్రణలో లేని దుష్పలితంగా ఎక్కువ శాతం మంది మూత్ర పిండాల వైఫల్యానికి గురై, మృత్యువాత పడటం జరుగుతుంది. డయాబెటిస్‌ మూలంగా సంక్ర మించే కిడ్నీ ఫెయిల్యూర్‌ గురించి అవగాహన కల్పించడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం. దాదాపు అరవై రకాల వ్యాధులు సంక్రమించ డానికి డయాబెటిసే ప్రధాన కారణం అవుతుందని పరిశోధనలో గుర్తించడం జరిగింది. దీర్ఘకాలికంగా డయాబెటిస్‌ అనే వ్యాధితో బాధపడేవారు ఎక్కువ శాతం మంది, డయాబెటిస్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌కి గురవుతున్నారు.

మానవ శరీరంలోని విసర్జక వ్యవస్థలో, కిడ్నీలు అతి ప్రధానమైన పాత్ర పోషిస్తుంటాయి. శరీరంలోని అబ్డామిన్‌ క్యావిటీకి వెనుక భాగంలో వెన్నెముకకు ఇరువైపులా ఈ కిడ్నీలు అమరి ఉన్నాయి. ఒక్కొక్క కిడ్నీ పొడవు 11 సెం.మీ, వెడల్పు 6 సెంమీ, మందం 3 సెంమీలతో కలిగి, బరువు 150 గ్రాములు ఉంటుంది. మూత్రపిండాన్ని ప్రధానంగా మూడు భాగాలుగా విభజించవచ్చు. 1. కార్టెక్స్‌ 2. మెడుల్లా. వీటి మధ్య భాగాన్ని 3.బౌండరీ జోన్‌ అంటారు. అందు సుమారు సూక్ష్మాతి, సూక్ష్మమైన నెఫ్రాన్స్‌ అనే ఫిల్టర్స్‌ ఉన్నాయి. ఇవి అనుక్షణం, అవిశ్రాంతంగా రక్తాన్ని వడపోస్తూ, రక్తంలోని విషవ్యర్థ మలిన పదార్థాలను, మూత్రరూపంలో బయటకు పంపుతుంటాయి. ఈ రక్త వడపోత కార్యక్రమంలో అంతరాయం ఏర్పడటమే డయాబెటిక్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌ అని అంటారు.

కిడ్నీలో మూత్రం జారీ అయ్యే విధానం : కిడ్నీలో మూత్రం ఉత్పత్తి అయి బయటకు వచ్చే విధానం చాలా సంక్లిష్టమైనది. మూత్రం అనేది రక్తం ఫిల్టర్‌ అయ్యే క్రమంలో ఏర్పడుతుంది రక్తనాళం ద్వారా కిడ్నీలో ప్రవేశించిన రక్తము ఫిల్టర్‌ అవుతూ ముందుకు వెళుతుంది. ఈ రక్త వడపోత కార్యక్రమంలో శరీరానికి కావలసిన అనేక రకాలైన పదార్థాలు రీ-అబ్‌సార్బ్(reabsorb)‌ అవుతూ చివరికు మూత్రం మిగులుతుంది. ఈ వడపోత కార్యక్రమం అంతా మూడు విధాలుగా ఉంటుంది.గ్లోమోరోఎలర్‌ ఫిల్ట్రేషన్‌: 
రక్త నాళికా గుబ్బ వడపోత అని అంటారు. ప్రతి కిడ్నీలోనూ సుమారు 12 లక్షల నెఫ్రాన్స్‌ అనబడే నిర్మితులు ఉన్నాయి. ప్రతి నెఫ్రాన్‌ నందు అతి సూక్ష్మమైన రక్తనాళముల సమూహం ఉంది. దీనినే 'గ్లోమోరులై ఫిల్ట్రేషన్‌ అంటారు. రక్తం ముందు వడపోత జరిగేది ఇక్కడే.వడగట్టబడిన మిగిలిన ద్రవం తరువాత బోమన్స్‌ కాప్యూల్స్‌లోకి ప్రవేస్తుంది. 24 గంటల్లో సుమారు 180 లీటర్ల రక్తం గ్లోమెరులై నందు ఫిల్టర్‌ అవుతూ మందుకు వెళుతుంది. బోమన్స్‌కాప్యూల్స్‌ నందు కూడా ఈ వడపోత కార్యక్రమంలో కొన్ని పోషకపదార్థాలు రీ అబ్‌సార్బ్‌ అవుతూ మిగిలిన ద్రవం ముందుకి వెళుతుంది. బోమన్స్‌ కాప్యూల్స్‌దానిలో ఉండే గ్లోమెర్యులస్‌ను కలిపి ''మాల్ఫిఘిమన్‌ బాడీ "అంటారు.

మాల్ఫిఘియన్‌ బాడీకి కనెక్ట్‌ అయినటువంటి రీనల్‌ టూబ్యులర్‌ నందు చివరి వడపోత కార్యక్రమం మొదలవుతుంది. ఈ ట్యూబులర్‌ నందు కూడా పోషక పదార్థాలు రీ అబ్‌సార్బ్‌ అవుతూ సుదీర్ఘంగా ప్రయాణించి మూత్రం బిందు క్రమంలో, యురెత్రా అనబడే మూత్ర నాళం గుండా మూత్రాశయానికి చేరుతుంది. మూత్రాశయం మూత్రంలో నిండిన తరువాత మూత్ర విసర్జన వాంచ కల్గినప్పుడు మూత్రం విసర్జించబడుతుంది. కిడ్నీలోని, నెఫ్రాన్స్‌ నందు జరిగే ఈ రక్త వడపోత కార్యక్రమంలో, గ్లోమెరులైలోకాని, బోమన్స్‌ కాప్యూల్స్‌లోకాని రీనల్‌ ట్యూబ్యూల్స్‌లోకాని, అంతరాయం ఏర్పడినా, మూత్ర వ్యవస్థలో ఏ చిన్న ఆటంకం ఏర్పడినా కిడ్నీఫెయిల్యూర్‌కి దారి తీస్తుంది.

మొదటి దశ:
కిడ్నీ ఫెయిల్యూర్‌ మెదట దశలో మూత్రంలో స్వల్ప పరిమాణంలో ఆల్బుమిన్‌ పోవడం కన్పిస్తుంది. దీనినే ''మైక్రోఆల్బు మినూరియా అని అంటారు. కిడ్నీ ఫెయిల్యూర్‌కి మొదట సూచన ఇది. దీనిని సకాలంలో గుర్తిస్తే చికిత్స ద్వారా నివారించుకోవచ్చు. మొదటదశలో సీరంక్రియాటెన్‌, బ్లడ్‌యూరియా, ఆల్బుమిన్‌ స్వల్ప పరిమాణాలు పెరుగుతాయి. ఐదు సంవత్స రాలుగా డయాబెటిస్‌ వ్యాధితో బాధపడేవారిలో ఎక్కువ శాతం మంది ఈ మైక్రో ఆల్బుమినూరియా అనే కిడ్నీ ఫెయిల్యూర్‌ మొదట దశకు గురువుతుంటారు. ఈ మొదట దశలో లక్షణాలు పెద్దగా కనిపించవు. అందువలన ప్రతి డయా బెటిక్‌ పేషంట్‌ సంవత్సరానికి ఒకటి, రెండుసార్లు కిడ్నీలకు సంబంధించి అన్ని రకాల పరీక్షలు చేయిస్తూ డాక్టర్‌ సలహా పొందుట చాలా మంచిది.

రెండవదశ:
మూత్రంలో నుండి ఆల్బుమిన్‌ కొద్ది కొద్దిగా పోవడం ప్రారంభించిన కొద్ది కాలానికి పరిస్థితి ముదిరి పెద్ద మొత్తంలో ఆల్బమిన్‌ పోవడం మొదలవుతుంది. ఈ పరిస్థితినే ''ప్రొటినూరియా అని అంటారు. ఇది కూడా డయాబెటిస్‌ వచ్చిన 10 నుండి 15 సంవత్సరాల వ్యాధిగ్రస్తులలో ఎక్కువ శాతంమందికి సంక్రమిస్తుంది. మూత్రంలో నుండి ''ప్రొటీన్‌ నిరంతరం అధిక మోతాదులో బయటకు పోతుందంటే, ఇంక ఆవ్యక్తి కిడ్నీలు పూర్తిగా పాడవడానికి సూచనగా భావించాల్సి ఉంటుంది. దీనినే కిడ్నీ ఫెయిల్యూర్‌ రెండవ దశగా గుర్తించడం జరుగుతుంది. ఈ రెందవ దశలో సీరం క్రియాటిన్‌, బ్లడ్‌ యూరియా నార్మల్‌ స్థాయి నుండి పాజిటివ్‌గా కనబడతాయి.

యూరిన్‌లో ఆల్బుమిన్‌ 'టు ప్లస్‌' గా కూడా కనిపి స్తుంది. రెండవ దశలోని కిడ్నీ ఫెయిల్యూర్‌లో కొన్ని లక్షణాలు స్పష్టంగా కనబడతాయి.శరీరం నుండి బయటకు వెళ్ళవలసిన ద్రవాలు పూర్తిగా బయటకు వెళ్ళక పోవడంవల్ల కాళ్లు, పాదాల వాపులు కనిపిస్తాయి. రక్తంలో మార్పులు సంభవించి, వాంతులు, నిరంతరం తెమలడం, చర్మానికి దురదలు, అలసట, ఆకలి లేకపోవడం, రెస్ట్‌లెస్‌గా ఉండటం మొదలగు లక్షణాలు కిడ్నీ ఫెయిల్యూర్‌ రెందవ దశలో కనబడతాయి.

మూడవ దశ:
కిడ్నీలోని రక్తం వడపోత యూనిట్లయిన నెఫ్రాన్స్‌ పూర్తిగా దెబ్బతింటే శరీరం నుండి బయటకు వెళ్లవలసిన విషవ్యర్థమలిన పదార్థాలు, బయటకు వెళ్లకుండా,శరీరంలోనే ఉండి పోతాయి. ఇది అంతిమ స్థితి, కిడ్నీలు పూర్తిగా పాడయినటువంటి స్థితి అనికూడా అంటారు.డయాబెటిస్‌ టైప్‌ 1 వారు ఎక్కువ శాతం మంది ఈ కిడ్నీ ఫెయిల్యూర్‌కి గురవుతారు. డయాబెటిస్‌ టైప్‌ 2 వారు వీరికి అధిక రక్తపోటు కూడా ఉంటూ వీరు కూడా కిడ్నీ ఫెయిల్యూర్‌కి గురి కావచ్చు. ముఖ్యంగా డయాబెటిస్‌ వ్యాధితో 20 సంవత్సరాలపైన బడిన వారు ఎక్కువ శాతం మంది ఈ కిడ్నీ ఫెయిల్యూర్‌కి గురవుతుంటారు. మూడవ దశ కిడ్నీ ఫెయిల్యూర్‌ అత్యంత ప్రమదకరమైనది. ప్రాణాపాయ స్థితి ఎప్పుడైనా ఏర్పడవచ్చు. ఈ మూడవ దశ కిడ్నీ ఫెయిల్యూర్‌లో సీరం క్రియాటిన్‌, బ్లడ్‌ యూరియా రీడింగ్‌లు నార్మల్‌ స్థాయినుండి బాగా పెరుగుతాయి. యూరిన్‌ ఆల్బుమిన్‌ కూడా 'త్రీప్లస్‌' గా కనబడుతుంది. అధిక నీరసం, నిరంతరం వాంతులు, కళ్ళు తిరగడం, ఆకలి లేకపోవడం, శరీరం అంతా వాపులు కనబడతాయి.

కిడ్నీ ఫెయిల్యూర్‌ రకాలు: 
కిడ్నీ ఫెయిల్యూర్‌ అనేది ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది. 1. ఎక్యూట్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌ 2. క్రానిక్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌. ఈ రెండు ఫెయిల్యూర్‌కి కొంత తేడా ఉంటుంది గమనించాలి. ఎక్యూట్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌: ఏదైనా బలమైన కారణాల వలన కిడ్నీ అకస్మాత్‌గా పని చేయకపోవడాన్ని ఎక్యూట్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌ అని అంటారు. ఇది తాత్కాలికంగా సంభవించే కిడ్నీ ఫెయిల్యూర్‌. సరైన సమయంలో మంచి చికిత్స చేస్తే కిడ్నీలు త్వరగా తమ యొక్క సామర్థ్యం పుంజుకని యధావిధిగా పనిచేస్తాయి. ఎక్యూట్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌ ప్రధాన కారణాలు తీవ్రమైన 'షాక్‌'కు గురైనవారు.

ప్రమాదంలో గాయపడి తీవ్రమైన రక్త స్రావం జరిగినప్పుడు 'దర్డ్‌ డిగ్రీ 'బర్నింగ్‌ కేసులలో కొన్ని రకాల విషపదార్థాలు తీసుకునప్పుడు కలరా, అతిసార లాంటి విరేచనాలు అధికంగా అయిన సందర్భాలలో మొదలగు పరిస్థితుల్లో కిడ్నీలు తాత్కాలింగా వైఫల్యం చెందుతాయి. ఈ విధంగా సంభవించే కిడ్నీ ఫెయిల్యూర్‌ని 'గ్లోమెరులైనెఫ్రైటిస్‌ 'అనికూడా అంటారు. ఈ ఎక్యూట్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌ సరైన చికిత్స చేయనట్లయితే ప్రాణాపాయస్థితి ఏర్పడుతుంది.

క్రానిక్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌:
దీర్ఘకాలికంగా మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు మెదలగువాటిని నియంత్రణలో ఉంచుకోకపోవడం మూలంగానే ఎక్కువ శాతం మంది క్రానిక్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌కి గురవుతున్నారు. క్రానిక్‌ కిడ్నీ ఫెయిల్యూకి ఆధునిక వైద్య విధనంలో జీవితాంతం ''డయాలసిస్‌ చేయించేకోవడం లేదా కిడ్నీ ట్రాన్స్‌ప్లంటేషన్‌ చేయించేకోవడం తప్పనిసరి. కాని ఈ రెండు పద్ధతులు చాలా ఖర్చుతో కూడుకున్నది. ఈ పద్ధతులతో కూడిన వైద్యంలో అనేక ఇబ్బందులు కూడా ఉన్నాయి.

కారణాలు:
కిడ్నీ ఫెయిల్యూర్‌కి అనేక కారణాలున్నాయి.
పుట్టుకతో జన్యుపరంగా వచ్చే వ్యాధులు తరువాత కాలంలో కిడ్నీ ఫెయిల్యూర్‌కి దారి తీస్తాయి.
మూత్ర మండల వ్యవస్థలో ఏ అవయవానికైనా ఇన్‌ఫెక్షన్‌ సోకిప్పుడు, సరైన సమయంలో చికిత్స చేయించనట్లయితే, కిడ్నీ ఫెయిల్యూర్‌కి దారి తీయవచ్చు.
దీర్ఘకాలికంగా డయాబెటిస్‌, అధిక రక్త పోటు, గుండె జబ్బులుకి సరైన చికిత్స తీసుకోని వారిలో ఎక్కువ శాతం మంది కిడ్నీ వైఫల్యానికి గురవుతుంటారు.
మన శరీరాన్ని రక్షించాల్సిన వ్యాధి నిరోధక శక్తి మన మూత్రపిండాలపైనే దాడి చేస్తే అది దెబ్బతింటాయి. దీనినే క్రానిక్‌ గ్లోమెరులైనెఫ్రైటిస్‌ అని అంటారు.

లక్షణాలు: 
రెండు మూత్ర పిండాలు పూర్తిగా చెడిపోయిన వారిలో లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. ముఖము, పొట్టకి, కాళ్లు,పాదాలకు బాగా నీరు పడుతుంది. ఆహారం తీసుకున్న వెంటనే వాంతి వచ్చినట్లుగా ఉంటుంది. మూత్ర విసర్జనలో మార్పులు సంభవిస్తాయి. రోజుమొత్తం లో మూత్రం దాదాపు 500మి.లీ మాత్రమే జారీ అవుతుంది. ఆకలి తగ్గిపోవడం, బరువుతగ్గి పోవడం, బద్దకంగా ఉండటం, తలపొప్పి, కళ్ళు తిరగడం, ఒళ్ళంగా దురదలుగా ఉండటం,మగత మొదలైన లక్షణాలు ఉంటాయి.

వ్యాధి నిర్థారణ: 
క్రినిక్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌ని నిర్థారించడానికి పలు రకాల పరీక్షలు నర్వహించ వలసి ఉంటుంది. కిడ్నీ ఫెయిల్యూర్‌ వ్యాధి నిర్థారణకు అత్యంత ప్రాధాన్యత ఉంది.

కిడ్నీ ఫెయిల్యూర్‌కి ప్రధాన టెస్టులు
సీరం క్రియాటిన్‌,
బ్లడ్‌యూరియా,
యూరిక్‌ యాసిడ్‌,
ప్రొటీన్స్‌ మొదలైనవి నార్మల్‌ స్థాయికంటే ఎక్కువగా పెరుగుతాయి. ఆల్బుమిన్‌త్రీప్లస్‌గా ఉంటుంది.
ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌,
ఐ.వి.పి.ఎక్స్‌రే ద్వారా కూడా కిడ్నీ వైఫల్యాన్ని గుర్తించవచ్చు. రీనల్‌ బయాప్సి ద్వారా కిడ్నీ ఎంత శాతం దెబ్బతిన్నదీ, కిడ్నీ భవిష్యత్‌ అన్నీ పూర్తిగా తెలుసుకోవచ్చు.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again