పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

February 25, 2015

అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలు ఏవి ?

హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు (Shakthi Peethas) అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.

పురాణ కథ 
ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.

కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది



18 అమ్మవారి శక్తి పీఠాలు మీకోసం 

1. శాంకరి  శ్రీలంక - ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.
1sankaridevi


భూప్రపంచాన్నే జంబూద్వీపం అని అంటారు. అగ్నిధృవుడనే రాజుకి అప్సరకాంతవల్ల తొమ్మండుగురు తనయులు కలిగారు. జంబూద్వీపాన్ని నవ ఖండాలుగా చేసి, తొమ్మిది మందికి పంచి ఇచ్చాడు. అందులో ఒకటి భారత ఖండం. భారత ఖండంలో సింహళం కూడా ఒక భూభాగముగా ఉండేది. నాటి సింహళ ద్వీపం,నేడు శ్రీలంకగా ప్రసిద్ధిగాంచినది. ఆంగ్లంలో సింహళమే సిలోన్ అయింది. సిలోన్ లోని ఉత్తర భాగమంతా 12వ శతాబ్దంలో తమిళరాజుల పాలనలో ఉండేది. నాటినుంచి ఉత్తర ప్రాంతము తమిళులది. దక్షిణ ప్రాంతము సింహళీయులది. ఉత్తరాన హిందూమతం, దక్షిణాన బౌద్దమతం స్నేహ సౌభ్రాతృత్వాలతో వర్థిల్లాయి.


2. కామాక్షి  కాంచీపురం, తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
2kamakshidevi

ఈ కంచి కామాక్షీ ఆలయం తమిళనాడు లోని చెన్నైకి 70 కి.మీ. దూరంలో కాంచీపురం అనగా నేటి కంచి క్షేత్రంలో నిత్యార్చన విలసితురాలై భక్తజన మనోభీష్టాలను నెరవేర్చే అమ్మగా విలసిల్లుతోంది. అంతేకాదు శ్రీ మహావిష్ణువు వరదరాజస్వామి రూపంలో మిగిలిన దేవతలంతా తమతమ నెలవులను ఏర్పరచుకొన్న కంచి, మించి సిద్ధినొసగు శ్రీ శక్తి పీఠం. అష్టాదశ శక్తి పిఠాలలో రెండవ శక్తిపీఠమైన ఈ కంచి దేవాలయంలోని బంగారు బల్లి, వెండి బల్లి రూపాలను తాకి తరించే భాగ్యం ఈ క్షేత్రాన్ని దర్శించే వారికి కలుగుతుంది.

  చెన్నైకి 70 కి.మీ. దూరంలో గల కంచిక్షేత్రాన్ని కాంచీపురం, కాంజీవరం అని కూడా పిలుస్తారు. చెన్నైనుండి తాంబరం మీదుగా కంచి చేరవచ్చు. దేవాలయాల కేంద్రంగా విశిష్ఠ విద్యాకేంద్రంగా గల ఈ కంచిపురంలో సతీదేవి “కంకాళం” పడినట్లు చరిత్రకారుల నమ్మకం.

  ఆదిశంకరులే స్వయంగా ప్రతిష్టించిన ఈ శక్తిక్షేత్ర శక్తిపీఠం వైపుకే కంచిలోని ఆలయాలన్నీ తిరిగి వుండటం ప్రత్యేక విశిష్ఠతగల అమ్మను, ఏకామ్రేశ్వర కామాక్షమ్మను దర్శించి తరించండి!


3. శృంఖల  ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.
3srunkaladevi

 నేటి బెంగాల్ బంగ్లా దేశముగా, వంగ దేశముగా విడిపోయి వున్నది. హుగ్లీ జిల్లాలోని పాండుపా గ్రామంలోని దేవినే “శృంఖలాదేవి” అంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లొని హుగ్లీ జిల్లాలోగల కలకత్తా (కోల్‌కతా) పట్టణానికి సుమారు 80 కి.మీ. దూరంలో పాండవ ప్రాంతమయిన “ప్రద్యుమ్న” అనే ప్రదేశంలో ఈ శృంఖలాదేవి క్షేత్రం ఉండేదని ఆర్యుల ప్రామాణికం. దాన్ని అనుసరిస్తే కలకత్తాకు 135 కి.మీ. దూరంలో గల గంగా సాగర్ క్షేత్రం శక్తి పీఠముగా పిలువబడుతోంది.

  త్రేతాయుగంలో ‘ఋష్యశృంగ మహర్షి ‘ శృంఖలా దేవిని ప్రతిష్టించినట్లు తెలుస్తుంది.

  ఈ క్షేత్రంలో సతీదేవి కన్ను పడిందని కొందరూ, స్థనము పడిందని మరికొందరి వాదన.

   శృంఖలా దేవి శక్తిపీఠం పశ్చిమ బెంగాల్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి ఉదర భాగం పడిందని ప్రతీతి. త్రేతాయుగంలో ఋష్యశృంగమహర్షి దేవీ ఉపాసన చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాడు. ఆయన తపస్సు శృంగగిరిపై సాగింది. అక్కడ ప్రత్యక్షమైన శృంగదేవి శృంఖలా దేవిగా మారిందని ఒక గాథ. ఋష్యశృంగుని తపశ్శక్తితరంగాలను ఆది శంకరులు ఆవాహన చేసి శారదాపీఠాన్ని ఏర్పాటు చేశారు.శ్రీ చాముండేశ్వరీ దేవి… ఈ శక్తి పీఠం కర్నాటకలోని మైసూర్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి శిరోజాలు పడ్డాయి. మహిషాసురుని సంహరించిన చాముండేశ్వరి. సర్వదేవతల తేజస్సులతో ఆవిర్భవించిన శక్తి స్వరూపం. మనదేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో నాలుగోదిగా ప్రసిద్ధికెక్కిన చాముండేశ్వరి ఆలయ ప్రాంగణంలోనే గణపతి, శివలింగం, ఆంజనేయస్వాని ఉపమందిరాలు భక్తులను ఆకట్టుకుంటాయి. దేవాలయ ప్రాంగణంలోని రావిచెట్టుకు భక్తులు కుంకుమ పూజలు చేస్తుంటారు. కాళిక, దుర్గ, చాముండీమాతల కలయికగా భక్తులకు దర్శనమిచ్చే చాముండేశ్వరి అనుకున్న కార్యాలను విజయవంతం చేస్తుందని భక్తుల విశ్వాసం. మైసూరు రాజుల ఇష్టదైవమైన ఈ ఆలయంలో దసరా ఉత్సవాలను వైభవంగా చేస్తుంటారు. ఈ ఉత్సవాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు.

4. చాముండి  క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.
4chamundeswaridevi

చాముండేశ్వరి ఆలయం భక్తజన జయజయ ధ్వానాలతో నిత్యం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. క్రౌంచి పట్టణం అనగా మహిషాసురుని ప్రధాన పట్టణం. అదే ఈనాటి మైసూరు పట్టణం. కర్నాటక రాష్ట్రంలోగల మైసూరు పట్టణమందు మహిషాసుర మర్ధినిగా, చాముండేశ్వరీ మాతగా తన చల్లని దేవెనలు కురిపిస్తూ, భక్తజన మనోభీష్టాలనీడేరుస్తూ నిత్యసేవా కైంకర్యాల నందుకుంటున్న బంగారు తల్లి ఆదిపరాశక్తి చాముండేశ్వరికి నిత్యం మనః పూర్వక వందనం.

5. జోగులాంబ  ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్ - కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగ', 'భద్ర' నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో ఉన్నది.
5jogulambadevi

  కాశీలో గంగ, యమున, సరస్వతి, త్రివేణి సంగమం ఉన్న విధంగా అలంపురంలో వేదవతి, నాగావళీ నదులున్నాయి. కాశీ అధిదేవతలు విశాలాక్షీ, విశ్వేశ్వరుడు. అలంపురానికి అధిదేవతలు జోగులాంబా, బాలబ్రహ్మేశ్వరుడు. ఈ అలంపురం శక్తిక్షేత్రం శ్రీశైలానికి పశ్చిమ ద్వారమై వెలసింది. కావున ఈ అలంపురాన్ని “దక్షిణ కాశి” అంటారు.

  అలంపురం శక్తి జోగులాంబా, బాలబ్రహ్మేశ్వరాలయాలకు అటూ ఇటూ కుమార బ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, తారకబ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ అనే నవబ్రహ్మ ఆకారాలు లింగ రూపంలోనే ఉంటాయి. బాలబ్రహ్మేశ్వరుని తలపై మాత్రం చిన్నచిన్న గుంటలుంటాయి. ఈ లింగం చుట్టూ నారాయణ సాలగ్రామాలుంటాయి. ఈ బాలబ్రహ్మేశ్వర లింగంపై ఎన్ని నీళ్లు పోసినా ఆ నీళ్లు ఎటు పోతాయో తెలియదు. ఇసుకతో రూపుదిద్దిన ” రససిద్ది వినాయకుడు ” అనే పేరుతో గుడిలోని ఒక వినాయకుని తాకితే గరుకుగా ఉంటాడు. గట్టిగా అరగదీస్తే ఇసుక రాలుతుంది.

  తుంగభద్ర ఆవలి ఒడ్డున పాపనాశేశ్వర ఆలయం, పాపనాశిని తీర్థం ఉన్నాయి. ఈ తీర్థంలో ఒక్క స్నానం చేస్తే సంవత్సరం పాటు గంగానదిలో స్నానం చేసిన ఫలితం సిద్ధిస్తుంది.

6. భ్రమరాంబిక  శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ - కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లిఖార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.
6brahmarambadevi

 కాశీ క్షేత్రంలో మరణం, అరుణాచలంలో భగవన్నామస్మరణం, శ్రీశైలంలో భ్రమరాంబ మల్లేశ్వరల దర్శనం ముక్తిదాయకమని పురాణ ప్రవచనం. అందుకే “శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే” అని ఆర్యోక్తి. శ్రీశైలము అనగా వరములనిచ్చె శివ కైలాసము. సతీదేవి కంఠభాగము ఈ ప్రదేశంలో పడిందని చరిత్ర ఆదారం.

  ఒకరోజున సౌందర్యలహరి అయిన జగజ్జనని అరుణాసురుని కంటపడింది. ఓ సుందరీ ! నీకీ కానలలో పని ఏమి? నేను లోకాల నేలేటి అరుణాసురుడను. నా సామ్రాజ్ఞ్‌వై నాతో సుఖించు అని ఆమె చేయిపట్టుకోబోగా ఆమె చుట్టూ తిరుగుతున్న భ్రమరాల (తుమ్మెదలు) అరుణాసురునిపై దాడిచేసి, చంపివేసి వాడి రాజ్యంలో వున్న రక్కసులందరినీ తుదముట్టించాయి.

   కొంతకాలానికి మహిషాసురుని సంహరించేందుకు ఉగ్ర చండీరూపంతో, పద్దెనిమిది భుజములతో వెలసి వాడిని తుదముట్టించింది.రెండవసారి మహిషుడు మళ్ళీ పుట్టినప్పుడు భద్రకాళిగా ఎనిమిది చేతులతో అవతరించి వాడిని సంహరించింది. మూడవసారి మహిషుడు పుట్టి ‘అమ్మా! రేండు జన్మలలో నీచేత సంహరింపబడి నా అజ్ఞానం పొగొట్టుకున్నాను. ఇప్పటికైనా నన్ను కటాక్షించి నీ వాహనంగా నన్ను సేవచేయనీ, అని ప్రార్థించగా వాడిని తన పాదల క్రింద తొక్కి ఉంచింది భ్రమరాంబాదేవి.

  ఈ క్షేత్రమున ముందుగా వెలసినది అర్ధనారీశ్వరి అయినప్పటికీ భ్రమరాంబా దేవి వెలసిన నాటినుండి ఈమెయే ప్రధాన శక్తి స్వరూపిణి అయినది.

  శ్రీశైలానికి నాలుగు ప్రధాన ద్వారములు కలవు. అవి త్రిపురాంతకము,సిద్ధవటము, అలంపురము, ఉమామహేశము అనునవి.

  ఇక్కడి పాతాళగంగ భక్తుల పాపాలు కడిగే పావనగంగ. నల్లమలై అడవిలోపల గల “ఇష్టకామేశ్వరి” ఆలయం కాకుండా ఆరుబయటే ఆ దేవి ఉంటుంది. ఇష్టకామేశ్వరీ దేవి నొసట కుంకుమ దిద్దినపుడు మనిషి నుదురువలె మెత్తగా ఉంటుంది. ఇంకా చంద్రావతి నిర్మించిన “వృద్ధ మల్లికార్జునాలయము” అలా అడుగడుగునా అలరారే వన సౌందర్యాలు, ఔషధీ విలువలు, ఆరోగ్య ప్రశాంతతో అలరారే శ్రీశైలం నిజంగా భూతల కైలాసం.

7. మహాలక్ష్మి  కొల్హాపూర్, మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.
7mahalakshmidevi

 అష్టాదశ శక్తి పీఠములలో ముఖ్యమైన శక్తిపీఠము కొలాహపురి మహలక్ష్మీ శక్తిపీఠము. ఇక్కడ చేసిన చిన్న దానం కూడా మేరు పర్వతమంత మేలుచేస్తుందని ఆర్యోక్తి. ఈ క్షేత్రానికి పూర్వనామం “కరవీర” పట్టణం. ఈ కొలాహపూర్ సముద్ర మట్టానికి 550 అడుగుల ఎత్తులో వున్నది. క్రీ.శ.9వ శతాబ్దంలో ఈ మహాలక్ష్మి ఆలయం నిర్మించబడినదని చరిత్రకారుల భవన

 కొలాహపురి మహలక్ష్మికి నాలుగు చేతులున్నాయి. (కొలాహపుర మహాత్మ్యము) క్రింద కుడిచేతిలో మాతలుంగ ఫలం (మాదిఫలం), పైకుడి చేతిలో కిందికి దిగిఉన్న పెద్ద గద, పైన ఎడమ చేతిలో డాలు, క్రింది ఎడమ చేతిలో పానపాత్ర ఉండగా, శిరస్సుపై ఒక నాగపడగ, దానిలో శివలింగము, యోని ముద్ర ఉన్నాయి. చంద్రఘంటా దేవి కిరీటంలోని ఘంటయే లక్ష్మిదేవి కిరీటంలోని శివలింగంగా మారిందని పెద్దల ప్రవచనం. అత్రి, అనసూయల పుత్రుడైన సద్గురు దత్తాత్రేయుడు ప్రతిరోజు మద్యాహ్నం ఈ లక్ష్మీదేవి వద్దకు వచ్చి భిక్షస్వీకరించేవాడట. వింధ్య గర్వమణచిన అగస్త్యుడు కొలాహపురి క్షేత్రదర్శనంతో దేవి సాక్షాత్కారం పొందాడు.

8. ఏకవీరిక  మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.
8ekaveeradevi

 ఈ ప్రదేశంలోని 3 పర్వతాలున్నాయి. ఒక శిఖరం మీద దత్తాత్రేయ స్వామి, రేండవ పర్వతంపైన అత్రి, అనసూయల ఆలయాలు ఉన్నాయి.

  మూడవ శిఖరం సతీదేవి కుడిస్తం పడిన శ్రీ క్షేత్రం.. ఈ శిఖరంపైన గల ఆలయంలోగల ఏకవీరాదేవి విగ్రహం భయంకర రూపంలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారి పెద్ద తల మాత్రమే ఉంటుంది.

  ఆ అమ్మను బుద్ధి అనే అక్షింతల అర్చన చేస్తూ హృదయమనే కమలంలో సుస్థిరంగా నిలుపుకోవాలి. అమ్మ కోసం మనం తపిస్తే అమ్మ మనకోసం పరితపిస్తుంది.

  ఇక అమ్మ ఏకవీరికా దేవిగా వెలసిన మయూర పురం దర్శనం ఎంతో పుణ్యప్రదమైనది.

  సహ్యద్రి పర్వత శ్రేణులో ఒక శిఖరంపై గల ఈ పీఠాన్ని దర్శించేందుకు ఎందరో తాంత్రికులు, క్షుద్రోపాసకులు వచ్చి బలులు ఇచ్చి అమ్మను సంతృప్తిపరుస్తారు. దీనినే మహాగ్రామమని, తులజాపూర్ అని అంటుంటారు. ఈ క్షేత్రాన్ని ఛత్రపతి శివాజీ కూడా దర్శించాడని అంటారు.

9. మహాకాళి  ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.
9mahakalidevi

మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌కు 55 కి|| మీ|| దూరంలో క్షిప్రానదీ తీరంలో ఉజ్జయినీ క్షేత్రం ఉన్నది. ఈ ఉజ్జయిని పూర్వనామం అవంతిక. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర లింగం, మహాకాళీ శక్తి పీఠం ఉన్న శక్తి ప్రదేశమే ఉజ్జయిని. సతీదేవి మోచేయి పడిన ఈ ప్రాంతానికి అష్టాదశ శక్తి పీఠలలో ఒక విశిష్ఠ స్థానం ఉంది. అదేమిటంటే ఈ క్షేత్రాన్ని భూమికి నాభిగా పేర్కొంటారు. ప్రతి 12 సం||లకు ఒకసారి ఇక్కడ “కుంభమేళా” ఉత్సవం జరుగుతుంది.

  ఇక్కడి స్వామివారైన మహాకాళేశ్వరునకు కన్నులుండటం అనగా శివలింగానికి కన్నులుండటం విశేషం.

  ఈ ఉజ్జయిని కుశస్థలి, కనకశృంగి, పద్మావతి, కుముద్వతి, అమరావతి, విశాల అనే పేర్లతో కాల పరిస్థితులను బట్టి మారింది. సప్తమోక్ష పురలలో ఒకటి ఈ ఉజ్జయిని.

  అదిగో చూడండి ! మహాకాలుని ఎదుట మహాకాళి ఆనంద తాండవం చేస్తోంది. ఒక్కసారి ఆ ఆదిదంపతులను స్మరించి మనసుతో ఆ ఆనంద తాండవాన్ని తిలకించండి.

10. పురుహూతిక  పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.
10puruhutikadevi

 ఈ పిఠాపుర క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నుండి 60కి||మీ|| దూరంలోను మరియు కాకినాడకు 18 కి||మీ దూరంలోను ఉంది.

  భీహారులో ఉన్న ప్రదేశాన్ని “విష్ణుగయ” లేదా “శిరోగయ” అని, పాదాలు పిఠాపురంలో ఉన్నందున ఆ ప్రదేశానికి “పాదగయ” అనే పేరు వచ్చింది. అలా శివ, శక్తి, విష్ణు పీఠాలతో పవిత్రమైన ఈ పిఠాపురం మంగళప్రద మహాత్మ్యలకు ఆలవాలమై ఉన్నది.

11. గిరిజ ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా - వైతరిణీ నది తీరాన ఉన్నది.
11girijadevi

 గిరిజ అనగా గిరి (హిమవంతుడు)కి జనియించినది. జన్మించినది మొదలు జటధారిపై మనసు నిలిపి ధ్యానంతో కొలిచేది.

  విరజానది పాపులను పుణ్యలను చేసే పావన జల ప్రవాహం. ఓఢ్యాణము అనగా ఓడ్రదేశము. అదే నేటి ఒరిస్సా రాష్ట్రము. ఈ రాష్ట్రంలోని కటక్ సమీపంలో వైతరిణి నది ఉన్నది. ఈ నదీ తీరంలో వైతరిణి అనే గ్రామం కూడా ఉంది. ఇప్పటి ఒరిస్సాలోని జాజ్‌పూర్ రోడ్‌కి సుమారు 20 కి|| మీ|| దూరంలో ఉంది ఓఢ్యాణము.

12. మాణిక్యాంబ  దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.
12MANIKYAMBADEVI

 పంచ భూతాకారమైన ప్రపంచానికి పంచముఖేశ్వరుడు మించి సిద్ధినందుటకు జనులకందించిన పంచాక్షరీ ప్రణవ నాదమే “ఓం నమః శివాయ ” అన్న మంత్రం.

  దక్షప్రజాపతి యజ్ఞ చేసిన ప్రదేశం కనుక “దక్షారామం” అని మిక్కిలి ద్రాక్ష తోటలుండటం వలన “ద్రాక్షారామం” అని పేరు వచ్చింది. “ద్రాక్షారం” అనే మరోపేరు కూడా కలదు. ఇక్కడ శంకరుడు “భీమేశ్వరుడై” స్వయంభువుడై వెలిశాడు. కనుక శక్తి ఈశ్వరుల సంగమస్థానమే ఈ ద్రాక్షారామం.

  ఈ ప్రాంతాన గోదావరీ నదికి “సప్త గోదావరమని” పేరు.

13. కామరూప  హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.
13kamarupenidevi

 ఈ ఆలయం సమీపంలోగల “ఉర్బసీ కుండం”లో స్నానమాచరించి కామాఖ్యా ఆలయంలో ప్రవేశించాలి.

  మరో విశేషమేమిటంటే “అంబూషి మేళ”గా పిలువబడే సమయంలో అమ్మవారికి కట్టిన వస్త్రాలు ఎర్రబడతాయి. మృగశిరకార్తెవెళ్ళి ఆర్త్రకార్తె ప్రవేశించేవేళ, భూమి రజస్వలవుతుందని దేవీ భాగవతంలో ఉంది. ఈ సమయంలో 3 రోజులపాటు అమ్మవారి ఆలయాలను, చుట్టుపక్కల ఆలయాలను మూసివేస్తారు. నాల్గవరోజున అమ్మవారికి తలంటిపోసి ఆలయ సంప్రోక్షణ జరిపి అమ్మవారి దర్శనం కోసం ఆలయం తెరుస్తారు. కామాఖ్యాదేవి ఆలయం చుట్టుపక్కల ఏడుగురు అమ్మవార్ల ఆలయాలున్నాయి. అవి : 1. కాశి, 2. తార, 3.భువనేశ్వరి, 4.భైరవి, 5. చిన్న మస్తా, 6. భగళీ, 7.ధూమావతి ఆలయాలతోపాటు 1. కామేశ్వర, 2. సిద్ధేశ్వర, 3.కోటిలింగ, 4. అఘోర, 5. అమృతేశ్వర అనే పంచశివాలయాలున్నాయి.

  ఈ క్షేత్ర సందర్శకులకు నిత్యమూ మహిమా చూపి ఆదరిస్తున్న బంగారు తల్లి కోర్కెలు తీర్చే కామాఖ్యమాత అనడంలో ఎటువంటి సందేహం లేదని ఎందరో భక్తులు కొనియాడుతున్నారు.

14. మాధవేశ్వరి ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో - ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.
14madhaveswaridevi

  “ప్ర” అనగా గొప్ప. “యాగ” అనగా యాగము. కావున గొప్ప యాగము చేసిన ప్రదేశమైనందు వలన ఈ ప్రదేశమునకు “ప్రయాగ” అను పేరు వచ్చినది.

 ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ఈ ప్రయాగ క్షేత్రం వుంది. సతీ దేవి హస్తాంగుళీయం ఇక్కడ పడింది.

 ఈ క్షేత్రంలో సతీదేవి చేతివేలు పడింది. కావున ఇది ఒక శక్తి క్షేత్రంగా పూజలందుకుంటోంది. 

 అక్బరు నిర్మించిన కోటలో అనాదిగా ఒక వటవృక్షం ఉంది. దాన్ని “అక్షయ వటము” అని పిలుస్తారు. ఈ వటవృక్షం శ్రీహరికి గొడుగుగా ఉంటుందని పురాణ సారం.



15. వైష్ణవి జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.
15vaishnavidevi

 ఈ ప్రాంతంలో గల “కాలధరమనే” పర్వతంపై సతీదేవి నాలుక నిలువుగా పడినందువలన ఆ ప్రదేశంలో అప్పటి నుండి ఈ నాటి వరకు “అగ్నిజ్వాల” బయటకు వస్తూనే ఉంది. 

 ఈ అగ్నిజ్వలనే జ్వాలాముఖియని, అమ్మవారిని జ్వాలాముఖీశ్వరీ దేవియని, జ్వాలాజీ అని భక్తులు పిలుస్తున్నారు, కొలుస్తున్నారు.


16. మంగళ గౌరి   భీహార్ రాష్ట్రంలోని పాట్నాకు సుమారు 74 కి||మి|| దూరంలో గల గయాక్షేత్ర శక్తి స్వరూపిణి మంగళగౌరి, సర్వమంగళ, విష్ణు సోదరియైన మాంగల్య గౌరి నిత్యానంద దాయినిగా వర ప్రదాయినిగా భక్తుల కోర్కెలు తీరుస్తోంది..
16mangalyagouridevi

1. గయ : బిహార్ రాష్ట్రంలో ఫల్గుణీ నదీ తీరంలో “శిరోగయ”గా వెలసింది.

2. జాజాపూర్: ఒరిస్సా రాష్ట్రంలో వైతరణి నదీ తీరంలో వున్న ప్రదేశంను “నాభిగయ” అని అంటారు.

3. పిఠపురం: ఆంధ్ర ప్రదేశ్‌లో గయని పాదాలుండటం వలన అవి వున్న ప్రదేశం పిఠాపురాన్ని “పాదగయ” అంటారు.

4. మాతృహయ గుజరాత్ రాష్ట్రంలో మహేషన జిల్లాలో సరస్వతీ నదీ తీరంలో గల ప్రాంతాన్ని “మాతృహయ” అని అంటారు. బిందు సరోవరమనే మరో పేరు కూడా కలదు. అహమ్మదాబాదుకు 32 కి||మి|| దూరంలో గల మాతృగయలో మాతృవంశం వారికి పిండప్రదానం మరింత ముఖ్యం. ఒరిస్సాలోని భువనేశ్వర్‌కి 33 కి||మి|| దూరంలో వున్న బిందు సరోవరం వద్ద కూడా పిండ ప్రదానాలు చేస్తారు.

5. బధరీనాథ్: ఉత్తర ప్రదేశ్‌లోని అలకనందా నదీ తీరంలో గల “బ్రహ్మకపాలం” అనే ప్రదేశాన్ని “పితృగయ” అంటారు.

  గయాక్షేత్రంలో సతీదేవి యొక్క శరీర భాగం ఒకటి పడింది. కనుక శక్తి క్షేత్రముగా, ఇక్కడి అమ్మవారు సర్వమంగళాదేవిగా దేవతల, మునులచే పూజింపబడుచున్నది.

  ఫల్గుణీ, మధుర, శ్వేత అనే 3 నదుల సంగమమై ప్రయాగ క్షేత్రంతో సమానమై ఫలం అందిస్తోంది.

  ఈ ప్రాంతానికి బుద్ధగయ అనేపేరు కూడా కలదు. జన్మకు ఒకసారైన పితృదేవతలకు గయలో పిండప్రదానం చేయాలని ప్రతి హిందువూ కోరుకుంటారు.

17. విశాలాక్షి  విశాలమైన అక్షములు (కనులు) గలది కావున విశాలాక్షి. ఆ తల్లి కొలువున్న శక్తి క్షేత్రం కాశీ. ఈ కాశీకే “వారణాసి” అను మరోపేరు కూడా కలదు. వరుణ, అసి అను రెండు నదులు కలసి ప్రవహించే ప్రదేశమే వారణాసి.
17visalakshidevi
సప్త మోక్షపురులలో కాశీ కూడా విశిష్ఠ స్థానం గల శక్తి పీఠం మరియు జ్యోతిర్లింగ క్షేత్రం అయిన కాశీని ఆనంద కాననమని, మహాశ్మశానమని, శివానందక్షేత్రమని కూడా పిలిచేవారు. ఈ కాశి క్షేత్రం శివునికి కైలాసానికన్నా ప్రియమైన ప్రదేశమని కూడా అంటారు.

 కాశీక్షేత్రం, వేద విద్యలకు నిలయం, అక్కడ నిరంతరం శిష్యగణంతో వ్యాసమహర్షి నిత్య విశ్వేశ్వర, అన్నపూర్ణాంబికను ఆరాధించేవాడు కనుక “వ్యాసకాశి” అనికూడా ఈ క్షేత్రాన్ని పిలుస్తారు.

18. సరస్వతి  ఈ సరస్వతీ దేవి ఆలయం కాశ్మీరంలో ఉందని పురాణేతిహాసాల నిర్వచనం. కానీ ఈ ఆలయం ఇప్పుడు కాశ్మీరంలో లేదు. కాని కాశ్మీర్‌లో కొంతమంది సరస్వతిని కీర్ భవానీగా కొలుస్తారు. ఆ కీర్ భవాని ఆలయం శ్రీనగర్‌కు పది కిలో మీటర్ల దూరంలో వుంది. భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన 2 సరస్వతుల ఆలయాల్లో ఒకటి కాశ్మీరం, రెండవది బాసరలో వుందని పెద్దలు చెబుతారు. సతీదేవి కుడి చెంప భాగం ఈ కాశ్మీరంలో పడిందని ఆర్యుల ఉవాచ.
18saraswathidevi
మాఘ శుద్ధ పంచమి సరస్వతీ దేవి జన్మదినం. అందుకని ఆనాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు.

  కర్ణాటక వద్ద గల శృంగేరిలో శంకరాచార్యుల వారు సరస్వతీదేవి ఆలయానికి రూపకల్పనచేసి ఒకరాతిపై శ్రీ చక్రయంత్ర స్థాపన చేసి సరస్వతి చందనపు విగ్రహ ప్రతిష్ఠ చేశారు.

  శ్రీనగర్‌లోని సరస్వతీ దేవి ఆలయానికి శతాబ్దాల చరిత్ర వుంది. హిమగిరిపై వెలసిన శారదాదేవిని “కల్వణుడు” తన “రాజతరంగిణి” అనే గ్రంథంలో ప్రస్తావించాడు. మాతంగ మహర్షి కుమారుడైన శాండిల్యముని ఈ చోటనే సరస్వతీ సాక్షాత్కారం పొందాడు.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again