పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

June 03, 2015

క్షణాల్లో తలనొప్పిని మాయం చేసే 16 ఎఫెక్టివ్ టిప్స్ !


లవంగాలు, రాళ్ళ ఉప్పు తో చేసిన పేస్ట్ :

తలనొప్పికి ఈ చిట్కా చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. మీరు చేయవలసిందల్లా లవంగాల పొడి, రాళ్ళ ఉప్పు కలిపి పేస్టులా చేసి దాన్ని పాలల్లో వేసి తాగడమే. ఈ ఉప్పు గుళికలు ఆర్ద్రాకర్షకాలు కనుక అది తలలోని ద్రవాలను పీల్చి నొప్పి తీవ్రతను తగ్గిస్తుంది.


తాజా నిమ్మరస౦, గోరువెచ్చటి నీళ్ళు :

ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీళ్ళు తీసుకుని దాంట్లో కొంచెం నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమం తాగి చూడండి, మీ నొప్పి తీవ్రత తగ్గుతుంది. ఈ వంటింటి చిట్కా చాలా తలనొప్పులకు ఉపయోగకరంగా పనిచేస్తుంది, ఎందుకంటే చాలా తలనొప్పులు కడుపులో గ్యాస్ వల్ల వస్తాయి. ఈ మిశ్రమం మీ గ్యాస్ ను, తలనొప్పిని కూడా వదిలిస్తుంది.

యూకలిప్టస్ తైలంతో మర్దనా చేయడం :

తలనొప్పిని తగ్గించుకోవడానికి మరో మంచి మార్గం మీ తలను యూకలిప్టస్ తైలంతో మర్దనా చేయడం, అది నొప్పి నివారిణి కనుక తక్షణ ఉపశమనం కలుగుతుంది.

కొంచెంకొంచెం గోరువెచ్చటి పాలు తాగండి :

పాలు, అవీ ఆవు పాలు, వెచ్చబెట్టి తాగితే మీకు తలనొప్పి తగ్గుతుంది. తరచూ మీరు తలనొప్పితో బాధపడుతుంటే మీ భోజనంలో నెయ్యి కూడా కలుపుకోవచ్చు.

దాల్చిన చెక్క పేస్టు రాసుకోండి :

తలనొప్పి తగ్గడానికి ఒక మంచి గృహ వైద్యం ఏమిటంటే.. కొంచెం దాల్చిన చెక్కను పొడి చేసి దాన్ని కొంచెం నీరు కలిపి పేస్టులా చేయండి. ఈ పేస్టును మీ తల మీద రాసుకోండి - మీకు తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

చక్కర, ధనియాల మిశ్రమం :

ధనియాలు, చక్కెర, నీళ్ళు కలిపి తాగినా మీ తలనొప్పి తగ్గుతుంది. మీకు జలుబు వల్ల వచ్చిన తలనొప్పి అయితే, ఈ వంటింటి చిట్కా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

గంధం రాసుకోండి :

కొన్ని గంధపు చెక్కలు తీసుకుని దాన్ని నీటిలో రుద్ది పేస్టులా తయారు చేసుకోండి. ఈ పేస్టును మీ నుదుటి మీద రాసుకుంటే, తలనొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.

కొబ్బరి నూనె తో మర్దనా చేసుకోండి :

తలకు కొబ్బరి నూనెతో పది, పదిహేను నిమిషాలు మర్దనా చేసుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. వేసవిలో మీరు తలనొప్పి బారిన పడితే ఈ ఇంటి చిట్కా చాలా బాగా పని చేస్తుంది, ఎందుకంటే ఇది మాడుకు చల్లదనాన్ని ఇచ్చి నొప్పి తగ్గిస్తుంది.

కొంచెం వెల్లుల్లి రసం తాగండి :

కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి, వాటి నుంచి రసం తీసి, కనీసం ఒక టీస్పూన్ వెల్లుల్లి రసం తాగండి. తాగాక వెల్లుల్లి తల ప్రాంతంలో పాకి నొప్పి నివారిణిలా పనిచేస్తుంది, కనుక మీకు తలనొప్పి తగ్గుతుంది.

మీ కాళ్ళు వేడి నీళ్ళలో వుంచండి :

మీ తలనొప్పి తగ్గించుకోవడానికి మరో మంచి ఇంటి చిట్కా ఏమిటంటే, కుర్చీలో కూర్చుని మీ కాళ్ళను వేడి నీళ్ళు నింపిన బకెట్ లో వుంచండి. నిద్ర పోయే ముందు ఇలా కనీసం పావుగంట పాటు చేయండి. మీకు దీర్ఘ కాలంగా ఉన్న తలనొప్పి, లేదా సైనస్ వల్ల వచ్చిన తలనొప్పిని నివారించుకోవచ్చు. ఇలా కనీసం రెండు నుంచి మూడు వారాల పాటు చేయండి.

ఒక ఆపిల్ ముక్క తినండి :

ఉదయం నిద్ర లేవగానే ఒక యాపిల్ ముక్కకు కొంచెం ఉప్పు రాసి తినండి. మీరు యాపిల్ తినగానే కొంచెం గోరువెచ్చటి నీళ్ళు లేదా పాలు తాగండి. ఇలా పది రోజుల పాటు తాగి చూడండి, ఎప్పటి నుంచో వేధిస్తున్న తలనొప్పి కూడా తగ్గిపోతుంది.

బాదం నూనెతో మర్దనా చేయండి :

బాదం నూనె కూడా తలనొప్పి తగ్గించే మంచి చిట్కాలలో ఒకటి. మీ తలకు గోరువెచ్చని బాదం నూనెతో పావుగంట సేపు మర్దనా చేస్తే మీకు తలనొప్పి తగ్గిపోతుంది.

కొత్తిమీర, జీలకర్ర, అల్లం కలిపిన మిశ్రమం తాగండి :

కొత్తిమీర, జీలకర్ర, అల్లం కలిపి చేసిన కషాయం తాగితే మీ తలనొప్పి తేలిగ్గా, వేగంగా తగ్గిపోతుంది. కొంచెం వేడి నీళ్ళు తీసుకుని, ఈ మూడింటినీ దాంట్లో వేసి అయిదు నిమిషాల పాటు మరగనివ్వండి. దాన్ని వడ పోసి ఆ ద్రవాన్ని మీకు హాయిగా అనిపించే దాకా రోజుకు కనీసం రెండు సార్లు తాగండి.

కొన్ని తమలపాకులు నమలండి :

తమలపాకులు నొప్పి నివారణ గుణానికి ప్రసిద్ది. ఇది మీ తలనొప్పిని ప్రభావవంతంగా తగ్గిస్తుంది. మీరు చేయాల్సిందల్లా కొన్ని తమలపాకులు తీసుకుని ముద్దగా నూరి దాన్ని మీ నుదుటి మీద లేదా మీ తల మధ్య భాగంలో రాసి చూడండి - తప్పకుండా తలనొప్పి వల్ల కలిగిన బాధ నుంచి ఉపశమనం వుంటుంది.

వెన్న ఎక్కువగా తినడం తగ్గించండి :

మీరు తలనొప్పి వల్ల బాధ పడుతుంటే, వెన్న, చాక్లెట్లు, మాంసం లాంటి పదార్ధాలు మీ ఆహర౦ నుంచి పూర్తిగా తొలగించాలి. దీని బదులు విటమిన్ సి, డి, బి12, మాంసకృత్తులు, కాల్షియం ఎక్కువగా వుండే ఆహారాలు తినండి. క్యాబేజీ, కాలీఫ్లవర్, మెంతి కూర, ఇతర ఆకు కూరల్లాంటి పచ్చటి, ఆకు పదార్ధాలు మీ ఆహారంలో ఎక్కువగా వాడండి. అలాగే, మీకు తలనొప్పి రాకూడదనుకుంటే, బయట దొరికే జంక్ ఫుడ్ తినకండి

బాగా నిద్రపోండి: 

నిద్ర కోసం చిత్ర ఫలితం
ఎక్కువ మందికి తలనొప్పి రావడానికి ప్రధాన కారణం సరైన నిద్ర లేకపోవడమే. అందువల్ల, తలనొప్పి తగ్గించుకోవాలంటే, ముందు అది రాకుండా చూసుకోవాలి. అందుకని రోజుకు కనీసం 8 గంటల పాటు నిద్రపోతే తలనెప్పులు దూరం అవుతాయి.


వీటి మీద కూడా ఒక కన్నేయండి

భూమిని పోలి ఉన్న మరో మూడు గ్రహాలను ఏ అంతరిక్ష పరిశోధన సంస్థ గుర్తించింది?

వాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో చేయవలసినవి, చేయకూడనివి..

ప్రతి పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఎందుకు ఏర్పడదు?

షాజహాన్‌ అంటే అర్థం మీకు తెలుసా ? 

తెలుగులో అచ్చయిన తొలి పుస్తకం ఏది ?

హెచ్‌ఐవీని చంపే కండోమ్ వచ్చేస్తోంది…

హోం లోన్ తీసుకుంటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

పాముల పుట్టలను తొలగించి ఆ ప్రదేశంలో ఇల్లు కట్టుకోవచ్చా?


0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again